న్యూఢిల్లీ: 4జీ, 5జీ, ఈ-బ్యాండ్ స్పెక్ట్రమ్ సర్వీసులకు కావాల్సిన సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసేందుకు బీఎస్‌ఎన్‌ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. టీసీఎస్-తేజస్ నెట్‌వర్క్‌ల సహకారంతో తొలిసారిగా మేడ్–ఇన్–ఇండియా 4జీ, 5జీ టెలికం నెట్‌వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ టెలికం పరిశోధన సంస్థ సీ-డాట్ కూడా పాల్గొంటోంది. ఒక్కో పైలట్ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ రూ.10 కోట్లు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment