signs
-
కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?
మనిషికి ఆత్మనూన్యతకు మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకటి లేదు. కొందరూ దీన్ని అధిగమించేలా తమ సామర్థ్యం, తెలివితేటలతో ఆకర్షిస్తారు. కానీ చాలామంది చింతిస్తూ కూర్చొండిపోతారు. తమలోని లోపాలనే పెద్దవిగా చూసుకుని బాధపడితుంటారు. నిజానికి వాటిని ఇతరులు కూడా గుర్తించకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం తాము అందరికంటే విభిన్నంగా, అసహ్యంగా ఉన్నానే భావనలో ఉండిపోతారు. ఇలాంటి ఆత్మనూన్యతకు సంబంధించిన రుగ్మతను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్. అతడు ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో ఏమంటారంటే..కరణ్ జోహర్ ఎదుర్కొన్న పరిస్థితిని బాడీ డిస్మోర్ఫియా అంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ రూపాన్ని పదే పదే అద్దంలో చూసుకుని కుంగిపోతుంటారు. అందంగా ఉండేందుకు మంచి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ ఏదో లోపం ఉందనుకుంటూ బాధపడిపోతుంటారు. ఇక్కడ కరణ్ జోహార్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. ఇతరులు ఎవ్వరూ తన శరీరాన్ని గమనించకూడదనుకునేవాడట. దీని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏంటీ బాడీ డిస్మోర్ఫియా? అందుకు గల కారణాలు గురించి సవివరంగా చూద్దాం.బాడీ డిస్మోర్ఫియా అంటే ఏమిటి?నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లేదా బీడీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈలోపాలు ఎదుటివాళ్లకు కనిపించవు లేదా గుర్తించబవు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుందట. అంతేగాదు పెద్దలలో 2.4% మందిని ప్రభావితం చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా యుక్తవయసు, వయోజన వయసులో ఈ విధమైన భావన మొదలవుతుందని చెబుతున్నారు. చాలా వరకు ఈ విధమైన పరిస్థితి 18 ఏళ్ల కంటే ముందునుంచి వారిలో చిన్నగా వారిపై వారికి అభద్రతా భావం కలగడం మొదలవ్వుతుందని తెలిపారు వైద్యులు.ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు..శరీరంలో లోపాల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపడం, ఇతరులకు అది ముఖ్యమైనది కాదని లేదా గనించనప్పటికీ.రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటంహెయిర్స్టైల్, బట్టల మార్పు వంటివి తరుచుగా మర్చేయడంతరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడంవారి శరీరం లేదా స్వరూపంలో నచ్చని దాన్నే ఇతరులు తదేకంగా చూస్తున్నారని లేదా ఎగతాళి చేస్తున్నారని భావించడంతమ శరీరంపై అసహ్యం లేదా సిగ్గుతో కుంగిపోవడంవస్త్రాధారణకు సరిపోనని భావించడంఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యలుతో గడపడం, వంటివి చేస్తే స్వీయ హాని లేదా ఆత్మహత్య వంటి ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు. ఎందువల్ల అంటే..జెనిటిక్ సమస్యతల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఈ పరిస్థితితో బాధపడుతుంటే..మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలు, కార్యాచరణ వ్యత్యాసాలుబాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడంపరిణామాలు..బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్యో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆందోళన రుగ్మతలుడిప్రెషన్, ఒత్తిడితినే రుగ్మతలుఅబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
ఆ విటమిన్ లోపిస్తే తినాలనే ఆసక్తి కోల్పోతాం!
శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ. ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా! డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే.. అలసిపోవడం మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది నిద్ర పట్టకపోవడం టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. కీళ్లపై ప్రభావం దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లేదా విచారం డిప్రెషన్‌కి డీ విటమిన్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది. కండరాల బలహీనత విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది. డార్క్ సర్కిల్స్ కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం. ఆకలి లేకపోవడం ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి. తరుచుగా అనారోగ్యం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. చర్మం పాలిపోవడం ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే.. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్‌లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి. (చదవండి: 1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే) -
ఎగ్జాన్‌మొబిల్‌తో ఓఎన్జీసీ జత
న్యూఢిల్లీ: గ్లోబల్ చమురు దిగ్గజం ఎగ్జాన్‌మొబిల్‌తో ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్జీసీ చేతులు కలిపింది. తద్వారా దేశ తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల సముద్రగర్భం నుంచి చమురు, గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఒక ప్రకటనలో ఓఎన్జీసీ పేర్కొంది. తూర్పు తీరప్రాంతంలో కృష్ణా గోదావరి, కావేరీ బేసిన్లపై దృష్టి సారించనున్నాయి. ఇదేవిధంగా పశ్చిమ తీరప్రాంతంలో కచ్–ముంబై వద్ద కార్యకలాపాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఓఎన్జీసీ వెల్లడించింది. అయితే భాగస్వామ్య ఒప్పందంపై వివరాలు తెలియచేయలేదు. కంపెనీకి గల బ్లాకులలో ఎగ్జాన్‌మొబిల్ వాటాలు తీసుకుంటుందా తదితర వివరాలు వెల్లడికాలేదు. ఎగ్జాన్‌మొబిల్‌తో జత కట్టడం వ్యూహాత్మకంగా మేలు చేస్తుందని, దేశ తూర్పు, పశ్చిమ తీరప్రాంతాలలో కంపెనీకి గల అనుభవం ఇందుకు సహకరిస్తుందని ఓఎన్జీసీ ఈ సందర్భంగా పేర్కొంది. దేశీయంగా చమురు అవసరాల కోసం 85 శాతంవరకూ దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో విదేశీ ఇంధన దిగ్గజాల నుంచి దేశీ సంస్థలు సాంకేతిక, ఆర్థికపరమైన మద్దతును ఆశిస్తున్నాయి. తద్వారా కొత్త వనరుల నుంచి దేశీయంగా ఇంధన ఉత్పత్తిని పెంచాలని ఆశిస్తున్నాయి. కాగా.. గత కొన్నేళ్ల చర్చల ప్రభావంతో 2019లో ఎగ్జాన్‌మొబిల్, ఓఎన్జీసీ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా భవిష్యత్ వేలంలో రెండు కంపెనీలు సంయుక్త పరిశోధన, సంయుక్త బిడ్డింగ్ వంటివి చేపట్టేందుకు నిర్ణయించాయి. -
బీఎస్ఎన్ఎల్- ఐటీఐ పైలట్‌కు ప్రభుత్వ నిధులు
న్యూఢిల్లీ: 4జీ, 5జీ, ఈ-బ్యాండ్ స్పెక్ట్రమ్ సర్వీసులకు కావాల్సిన సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసేందుకు బీఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. టీసీఎస్-తేజస్ నెట్‌వర్క్‌ల సహకారంతో తొలిసారిగా మేడ్–ఇన్–ఇండియా 4జీ, 5జీ టెలికం నెట్వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ టెలికం పరిశోధన సంస్థ సీ-డాట్ కూడా పాల్గొంటోంది. ఒక్కో పైలట్ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ రూ.10 కోట్లు అందిస్తోంది. -
రాజాంలో ఆదిమానవుల ఆనవాళ్లు
రాజాం సిటీ: శ్రీకాకుళం జిల్లా రాజాం మండల పరిధి రాజయ్యపేట గ్రామంలో నవీన శిలాయుగ ఆనవాళ్లు లభించాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకులు గార రంగనాథం తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాజాం చరిత్ర రచనలో భాగంగా రాజయ్యపేట వెళ్లానన్నారు. అక్కడ మంచినీటి కోనేరు దక్షిణ గట్టున ఉన్న తుప్పల మధ్య బండరాతి మీద లోతుగా చెక్కినట్టు ఉన్న గుర్తులను గమనించానని, అవి క్రీస్తు పూర్వం నాలుగువేల సంవత్సరాల నాటివని తెలిపారు. ఆదిమానవుడు ఆధునికుడయ్యే క్రమంలో రాతి బండలమీద, కొండలమీద నల్ల శానపు రాళ్లను అరగదీసి పనిముట్లుగా మార్చుకునేవాడని, ఆ విధంగా ఏర్పడినవే ఆ రాతి గోతులని వివరించారు. ఈ విషయాన్ని విజయవాడ ఆర్కియాలజీ సాంకేతిక నిపుణులు లీలా సుబ్రహ్మణ్యంతో సంప్రదించి ధ్రువీకరించామని వెల్లడించారు. రాజాంలో పురావస్తు శాఖ వారు పరిశీలిస్తే చాలా విషయాలు బయటపడతాయని అన్నారు. -
అనిల్ అంబానీ భారీ డీల్
ముంబై: అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన , టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్ విక్రయంలో విజయం సాధించింది. మొబైల్ ఫోన్ టవర్ వ్యాపారంలో వాటాను బ్రూక్ ఫీల్డ్ కు విక్రయించింది. ఈ మేరకు కెనడా కు చెందిన బ్రూక్‌ఫీల్డ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఒక ఒప్పందంపై కుదుర్చుకుంది. టవర్ల విభాగాన్ని కొనుగోలు చేసేందుకు బ్రూక్‌ఫీల్డ్ సంస్థతో తప్పనిసరి (రెండు వైపులా బైండింగ్) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం తెలియజేసింది. దీంతో బ్రూక్‌ఫీల్డ్ నుంచి ముందస్తు చెల్లింపుగా రూ. 11,000 కోట్లను అందుకోనున్నట్లు వెల్లడించింది. ఈ బైండింగ్ ఒప్పందం ప్రకారం టవర్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీయనుంది. ఈ తాజా ఒప్పందం ద్వారా తన రుణ భారాన్ని తగ్గించుకోనుంది. మరోవైపు అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన మరో సంస్థ రిలయన్స్ కేపిటల్ కూడా నిధుల సమీకరణ చేపట్టే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది.హోమ్ ఫైనాన్స్ ద్వారా అన్సెక్యూర్డ్ ఎన్సీడీల జారీ ద్వారా రూ, 1,000 కోట్లను(14.7 మిలియన్ డాలర్లు) సమీకరించనున్నట్లు తెలిపింది. కాగా ఆర్ కాం మొబైల్ టవర్ వ్యాపార వాటా విక్రయానికి ఇటీవల ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చివరికి కెనడా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో మార్కెట్లో ఆర్‌కామ్ షేరు దాదాపు 8 శాతానిపై దూసుకెళ్లింది. -
ఆ డీల్ విలువ 4.42లక్షల కోట్లు
జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో డీల్ కు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ పడింది. విత్తనాలు, క్రిమిసంహారకాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థలుగా ఉన్న బహుళజాతి దిగ్గజం మోన్సాంటో విలీనానికి అంగీకరించినట్టు బేయర్ తెలిపింది. 66 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 4.42 లక్షల కోట్లు) ఈ ఒప్పందం జరిగినట్టు తెలిపింది. దీంతో ప్రపంచ ఫర్టిలైజర్స్ పరిశ్రమలో అతిపెద్ద డీల్ కుదిరినట్టయింది. మాన్ శాంటో షేర్ హోల్డర్స్, యాంటీ ట్రస్ట్ రెగ్యులేటర్ ఆమోదంతో ఈ విలీన ప్రక్రియ పూర్తికానుంది. అన్ని నగదు పరిశీలనలో తమ వాటాదారుల అత్యధిక నిర్బంధిత విలువ ప్రాతినిధ్యం ఆధారంగా ఈ ఒప్పందం చేసుకున్నట్టు మోన్ శాంటో కంపెనీ ఛైర్మన్ , సీఈవో హ్యూ గ్రాంట్ ప్రకటించారు. ప్రస్తుత మాన్ శాంటో ఉత్తర అమెరికన్ వ్యాపార ప్రధాన కార్యాలయం సెయింట్ లూయిస్, మిస్సోరి నుంచే తమ వ్యవసాయ ఆధార విత్తనాలు వ్యాపారాన్ని నిర్వహించనున్నట్టు చెప్పారు. గతకొంతకాలంగా అమెరికా కేంద్రంగా ఉన్న మోన్సాంటోను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న బేయర్ సంస్థ ఒక్కో మాన్ శాంటో ఈక్విటీ షేరుకు 128 డాలర్లను అందించనుంది. గతంలో 122 డాలర్లను ఆఫర్ చేసిన సంస్థ చివరికి128 డాలర్లకు అంగీకారం తెలపడం విశేషం. ఇది మే 9 నాటి మాన్ శాంటో షేరుకు 44 శాతం ప్రీమియమని బేయర్ వర్గాలు వెల్లడించాయి. మాండేటరీ కన్వర్టిబుల్ బాండ్, అండ్ రైట్స్ ఇష్యూ తో సహా రుణ ఈక్విటీ కింద 19 బిలియన్ డాలర్ల నగదును జారీ చేయనున్నట్టు తెలిపింది. -
యూటీఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ
చిలుకూరు: యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని పలు పాఠశాల్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షెన్ స్కీం) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయిలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుండూరి ప్రసాద్‌రావు, జిల్లా, మండల నాయకులు ఖాదర్‌పాషా, బావసింగ్, రమేష్‌బాబు, మూర్తి, కడారు సైదులు, టీఎల్ నరసింహరావు, ఆరె బాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
మీడియా సంస్థలతో ఫేస్ బుక్ డీల్..!
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్... ప్రముఖ మీడియా సంస్థలతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంది. వందల కోట్ల విలువచేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. మీడియాలో ప్రత్యక్ష ప్రసారాల వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫేస్ బుక్ ప్రత్యక్షప్రసారంలో అందించే సేవలకోసం ఈ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అందుకోసం ఫేస్ బుక్ యాజమాన్యం పలు మీడియా సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకుంది. సుమారు 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసింది. దీనిద్వారా సామాజిక మాధ్యమంగా ఎంతో పేరు తెచ్చుకున్న ఫేస్ బుక్ లో వినియోగదారులకు అందుబాటులో ప్రత్యక్ష ప్రసారాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అందించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బజ్ ఫీడ్, ఎన్ వైటీ, సీఎన్ఎన్ వంటి సంస్థలకు అత్యధికంగా 67 కోట్ల, 32 లక్షల రూపాయల వరకూ చెల్లించినట్లు తెలుస్తోంది. -
తలాక్ పద్ధతిపై ముస్లిం మహిళల పోరాటం!
న్యూఢిల్లీః తలాక్ సిస్టమ్ ను తొలగించాలంటూ దేశంలోని ఏభై వేలకుపైగా ముస్లిం మహిళలు పోరాటం ప్రారంభించారు. మూడుసార్లు తలాక్ చెప్తే విడాకులు ఇచ్చినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా లోని ఆచారానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు. ముస్లిం మతంలో ఉన్న తలాక్ విడాకుల పద్ధతిని నిషేధించాలని కోరుతూ దాఖలు చేసే పిటిషన్ కోసం ఇప్పటివరకూ సుమారు 50 వేల సంతకాలు సేకరించారు. భారతీయ ముస్లిం మహిళల (బీఎంఎంఏ) సంఘం తలాక్ పద్ధతిని నిషేధించాలని కోరుతూ పోరాటం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా తాము వేయబోయే పిటిషన్ కు మద్దతివ్వాలని కోరుతున్న సంఘం.. జాతీయ మహిళా కమిషన్ కూడ తమకు సహకరించాలని, ముస్లిం మతంలో ఉన్న తలాక్ పద్ధతి నిషేధించడంలో జోక్యం చేసుకోవాలని కోరుతోంది. తమ పిటిషన్ కు మద్దతుకోసం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు బీఎంఎంఏ సహ వ్యవస్థాపకులు జికియా సోమన్ తెలిపారు. ఇప్పటివరకూ ఏభై వేల సంతకాలు సేకరించామని, మతంలోని కొందరు పురుషులు సైతం తమకు మద్దతిస్తున్నారని అన్నారు. ముస్లిం మతంలోని తలాక్ పద్ధతిపై చేపట్టిన సర్వేలో 90 శాతం పైగా మహిళలు తలాక్ విడాకుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో తమకు మద్దతునిచ్చేవారినుంచి మరిన్ని సంతకాలు సేకరించి పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంస్థ సభ్యురాలు నూర్జహా సాఫియా తెలిపారు. ఖురాన్ లో కూడ ఎక్కడా ఇటువంటి తలాక్ పద్ధతి అమల్లో ఉన్న దాఖలాలు లేవని, నేషనల్ ఉమెన్ కమిషన్ ఛైర్ పర్సన్ లలిత కుమార మంగళమ్ కు పంపించే లేఖలో కూడ బీఎంఎంఏ పేర్కొంది. ఈ విషయంలో ముస్టిం మత పెద్దలను, అధికారులను సైతం కలసి, దేశంలో ఇతర మహిళలకు అమలౌతున్న న్యాయమైన నిబంధనలే తమకు అమలయ్యేట్లు కోరుతామని బీఎంఎంఏ పేర్కొంది. అయితే ముస్లిం పర్సనల్ లా ను పూర్తిగా మార్చాలంటే సమయం పడుతుందని, కానీ ట్రిపుల్ తలాక్ విషయంలో లక్షలమంది ముస్టిం మహిళలకు ఉపశమనం లభిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే తమ పోరాటాన్ని కొందరు మత గురువులు వ్యతిరేకిస్తున్నారని, వారు తలాక్ ను అల్లా విధించిన చట్టంగా నమ్ముతారని మహిళలు అంటున్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడ ఈ విషయాన్ని వ్యతిరేకించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. -
సెన్సెక్స్ కీలక స్థాయి 25,300 పాయింట్లు
మార్కెట్ పంచాంగం అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు ప్రతి నెల బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవహింపజేసే నిధుల్ని (ఉద్దీపన ప్యాకేజీ) నిలిపివేయనున్నట్లు 2013 ప్రథమార్థంలో సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో ఈ సంకేతాలకు ప్రపంచ స్టాక్ మార్కెట్లన్ని కొద్ది వారాలు పాటు క్షీణించాయి. దాదాపు అదే తరహాలో ఇప్పటి డౌన్‌ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సెప్టెంబర్ 17 నాటి ఫెడ్ సమావేశంలో వ డ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని తీసుకోవచ్చనే భయాలతో ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లు పడుతున్నాయి. ఒకరకంగా ఇది ఫెడ్‌కు మార్కెట్ శక్తుల బెదిరింపు అస్త్రం కావచ్చు. 2013లో డౌన్‌ట్రెండ్ దెబ్బకు ఉద్దీపన ప్యాకేజ్ ఉపసంహరణను కొద్ది నెలలపాటు ఫెడ్ వాయిదా వేసింది. ఈ దఫా వడ్డీరేట్ల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకే ఇప్పటి ఈక్విటీల పతనమన్న విశ్లేషణలను అత్యధిక మార్కెట్ నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. ఇక భారత్ సూచీల సాంకేతికాంశాలకు వస్తే... సెన్సెక్స్ సాంకేతికాంశాలు సెప్టెంబర్ 4తో ముగిసిన వారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 4.5 శాతం నష్టపోయి 25,202 వద్ద ముగిసింది. ఈ క్రమంలో గత మార్కెట్ పంచాంగంలో దీర్ఘకాలిక మద్దతుగా ప్రస్తావించిన 25,300 పాయింట్ల స్థాయి దిగువున ముగిసింది. గతేడాది ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించిన రోజైన మే 16 నాటి గరిష్ట స్థాయే ఈ 25,300 పాయింట్ల స్థాయి. రానున్న రోజుల్లో సెన్సెక్స్ మరింత పతనమైన తిరిగి వేగంగా ఈ స్థాయి పైకి వచ్చి స్థిరపడగలిగితే కొద్ది వారాల్లో అప్ట్రెండ్లోకి మళ్లే వీలుంటుంది. లేకపోతే కొద్ది నెలలపాటు మార్కెట్ బేర్ కక్ష్యలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌కు అనుగుణంగా ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే 24,745 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు పొందవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 24,420-24,160 పాయింట్ల శ్రేణి వద్దకు పతనం కావచ్చు. ప్రస్తుత స్థాయి నుంచి లేదా పైన ప్రస్తావించిన తొలి మద్దతు నుంచి సెన్సెక్స్ కోలుకుంటే 25,550 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఆపైన స్థిరపడితే 25,840 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. అటుపైన 26,140 పాయింట్ల వరకు ర్యాలీ జరిపే అవకాశం ఉంటుంది. నిఫ్టీ మద్దతు 7,563-నిరోధం 7,750 క్రితం వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 347 పాయింట్ల నష్టంతో 7,655 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 16 నాటి గరిష్ట స్థాయిని సెన్సెక్స్ కోల్పోయినా, నిఫ్టీ ఇంకా ఆ స్థాయిని (7,563 పాయింట్లు) పరీక్షించలేదు. ఈ కారణంగా నిఫ్టీకి ఇదే తక్షణ మద్దతు స్థాయి. ఈ మద్దతును కోల్పోతే 7,380 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈలోపున 7,200-7,118 పాయింట్ల మద్దతు శ్రేణికి పతనం కావచ్చు. ఈ వారం తొలి రెండు మద్దతు స్థాయిల్లో ఏదోఒక స్థాయి నుంచి నిఫ్టీ పెరిగితే 7,750 పాయింట్ల నిరోధ స్థాయిని చేరవచ్చు. ఈ స్థాయిని అధిగమించి స్థిరపడితే 7,845 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే 7,930 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చు. -
జలసిరి ఆవిరి
మండే ఎండలకు త గ్గిపోతున్న నీటినిల్వలు తీవ్ర మవుతున్న పానీపరేషాన్ శివార్లకు తప్పని క‘న్నీటి’ కష్టాలు జూలై చివరి వరకు ఢోకా లేదంటున్న జలమండలి సాక్షి, సిటీబ్యూరో : మండుటెండలకు గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జలాశయాలు ఆవిరవుతున్నాయి. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం ఉష్ణోగ్రత తీవ్రతను బట్టి ఐదు నుంచి పది శాతానికి క్రమంగా పెరుగుతోందని జలమండలి వర్గాలు అంచనా వేస్తున్నాయి. భ విష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జలమండలి పొదుపు మంత్రం పాటిస్తూ.. అరకొరగా మంచినీటిని సరఫరా చేస్తుండటంతో శివార్లలోని పలు ప్రాంతాలకు వారం పదిరోజులకోమారు సరఫరా అందుతోంది. ఇప్పటికిప్పుడు నగరంలో తాగునీటికి ఇబ్బంది లేకపోయినా ఎండ ల తీవ్రత, కరెంటు కోతలు పెరిగితే పానీపరేషాన్ మరింత పెరగక తప్పదన్న సంకేతాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గ్రేటర్ దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాల్లో నీటినిల్వలు శరవేగంగా పడిపోతున్నాయని జలమండలి తాజా నివేదిక వెల్లడించింది. వివిధ జలాశయాల్లో పడిపోతున్న నీటి మట్టాలు గతేడాదితో పోలిస్తే అధికంగా ఉన్నట్లు పేర్కొంది. ఇవీ క‘న్నీటి’ కష్టాలు గ్రేటర్ పరిధిలో జలమండలి మంచినీటి సరఫరా 180 మిలియన్ గ్యాలన్లకు మించడం లేదు. ఈ నీటినే మహానగరం పరిధిలోని 8 లక్షల కుళాయిలకు సరిపెడుతున్నారు. సుమా రు 4 లక్షల కుళాయిలకు రెండురోజులకోమారు అరకొరగా నీళ్లందుతున్నా.. మరో నాలుగు లక్షల కుళాయిలకు వారం, పదిరోజులకోమారు మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదీ పట్టుమని పది బిందెల నీళ్లు పట్టుకోకముందే కుళాయి ఆగిపోతోంది. దీంతో శివారు జనానికి పానీపరేషాన్ తీవ్రమౌతోంది. ట్యాంకర్ నీళ్లు, ఫిల్టర్ ప్లాంట్లను ఆశ్రయించక తప్పని దుస్థితి తలెత్తింది. పదకొండు శివారు మున్సిపాల్టీల పరిధిలోని 870 కాలనీలు, బస్తీలకు కన్నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జూలై చివరి వరకు భయం లేదు.. ప్రస్తుతం ఆయా జలాశయాల్లో ఆవిరయ్యే నీటి శాతం సాధారణంగా నిత్యం ఐదు శాతం మేర... ఎండ తీవ్రత పెరిగిన రోజుల్లో పదిశాతానికి పెరుగుతోందని జలమండలి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై చివరి నాటి వరకు నగర అవసరాలకు సరిపోతాయని భరోసా ఇస్తున్నాయి. అప్పటివరకు వర్షాలు కురవని పక్షంలో నీటి కష్టాలు మరింత పెరగడం తథ్యమని స్పష్టం చేస్తున్నాయి. రుతుపవనాలు కరుణించి సకాలంలో వర్షాలు కురిస్తే జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నాయి. -
అనంతపురంలో స్వైన్‌ప్లూ కలకలం