శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ.
ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా!
డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే..
అలసిపోవడం
మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది
నిద్ర పట్టకపోవడం
టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది.
కీళ్లపై ప్రభావం
దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది.
డిప్రెషన్ లేదా విచారం
డిప్రెషన్‌కి డీ విటమిన్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
జుట్టు రాలడం
డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది.
కండరాల బలహీనత
విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది.
డార్క్ సర్కిల్స్
కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం.
ఆకలి లేకపోవడం
ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి.
తరుచుగా అనారోగ్యం
రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది.
చర్మం పాలిపోవడం
ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి.
ఏం చేయాలంటే..
విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్‌లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment