Vitamin D
-
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
సూర్యుడి శీతకన్ను : డీ విటమిన్ లోపిస్తే నష్టమే
శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలోఒకటి విటమిన్ డీ. డీ విటమిన్ లోపంతో ఆనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ లోపం ఉందని నిర్ధారణ అయితే, వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందుకే సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్‌డీ లోపిస్తే కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు విటమిన్ డీ,కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.దాదాపు ఎనభై శాతం మంది పురుషుల్లో, మహిళల్లో దాదాపు తొంభై శాతం, విటమిన్ డీ లోపం ఉంటుంది. విటమిన్ డీ కాల్షియం లోపం మెలనోమా ప్రమాదాన్ని పెంచుతుంది మెలనోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్న మహిళలు విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవాలి. తగినంత విటమిన్ డీ లేకపోతే, శరీరం తగినంత కాల్షియంను గ్రహించదు. దీంతో ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి , ఎముకలు విరిగిపోవడం లాంటి ప్రమాదాన్ని నివారించాలంటే ఇది అవసరం.రోగనిరోధక వ్యవస్థకు మద్దతువిటమిన్ డీ తెల్ల రక్త కణాల పోరాట ప్రభావాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ల వంటి అనారోగ్యాలను అరికట్టడంలో పాయపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ లోపిస్తే డిప్రెషన్ వస్తుంది.గుండె ఆరోగ్యానికివిటమిన్ డీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాల పనితీరులో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుందిబరువు నియంత్రణజీవక్రియ ,ఆకలి నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తేంది. డీ విటమిన్ లోపిస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బులు కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నియంత్రణలో ఉపయోగ పడుతుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడులో ఉంటాయి. న్యూరోప్రొటెక్షన్లో ఇది పాత్ర పోషిస్తుంది. మతిమరపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే డీ విటమిన్ అవసరం.చర్మ ఆరోగ్యంవిటమిన్ డి చర్మ కణాలను బాగు చేస్తుంది. పెరుగుదల. చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, వైద్యుల పర్యవేక్షణలో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా ముఖ్యమైన శారీరక విధులకు ఆటంకం లేకుండా చూసుకొని, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలి. -
డి ఉంటేనే ఢీ!
లబ్బీపేట(విజయవాడతూర్పు): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలా అవసరం. సూర్యకిరణాల నుంచి సహజంగా లభించే ‘విటమిన్ డి’కి దూరమైతే మధుమేహం, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకే అవకాశం ఉంది. అందుకే బద్ధకం వీడి ఉదయాన్నే లేవండి. కాస్త ఎండన పడండి, ఆరోగ్యంతో జీవించండి అంటూ వైద్యులు సూచిస్తున్నారు. మారిన లైఫ్‌స్టైల్.. మారుతున్న కాలానుగుణంగా చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలతో మనిషి జీవితం నిరంతరం బిజీ బిజీగా మారుతోంది. ఉదయం 8 గంటలైనా లేవక పోవడం, రాత్రి 12 దాటినా మేల్కొని ఉండటం, నగర వాసులకు నిత్యకృత్యమైంది. చాలా మంది నగర వాసులకు సూర్యోదయమే తెలియకుండా పోతోంది. తద్వారా డి విటమిన్‌కు దూరమై అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఒకప్పుడు తెల్లవారు జామున 5 గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాల్లో నిమగ్నమయ్యే వారు. కానీ రోజులు మారాయి. సిటీ జనులు మాత్రం చాలా మంది ఉదయం 8 గంటల తర్వాతనే నిద్రలేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు చక్కబెట్టుకుని రోడ్డు మీదకు వచ్చేటప్పటికీ ఎండ మండుతోంది. దీంతో ఉదయపు వేళల్లో సూర్యరశ్మి కారణంగా శరీరానికి అందే విటమిన్ డి పొందలేక పోతున్నారు. ఇటీవల కాలంలో వైద్యుల వద్దకు విటమిన్ డి లోపం సమస్యలతో వస్తున్న వారి సంఖ్య పెరిగింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతుంది. అందులో విటమిన్ డి చాలా ప్రధానమైంది. కండరాలు, ఎముకలు, ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పనిసరి. నవజాత శిశువులకు అవసరమే.. ఒకప్పుడు పుట్టిన బిడ్డని కాసేపు ఎండలో ఉంచేవారు. తద్వారా చిన్నారులకు డి విటమిన్ సమృద్ధిగా లభించేది. కానీ ప్రస్తుతం పిల్లలను ఎండలో తిప్పితే నల్లబడి పోతారని, ఇంటి నుంచి బయటకు తీసుకురావడమే లేదు. దీంతో చిన్నారులకు నేరుగా సూర్యరశ్మి అందే అవకాశం లేకుండా పోతోంది. విటమిన్ డి చిన్నారులకు సమృద్ధిగా అందితే బరువు పెరగడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతున్నారు. నీడపట్టున ఉద్యోగం అనుకుంటే.. నీడపట్టున కూర్చుని పనిచేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనారోగ్యానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హాయిగా ఏసీ గదిలో కూర్చుని పనిచేసే వారికి విటమిన్ డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్కు విటమిన్ డి లోపం ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. విటమిన్ డి తక్కువైతే.. శరీరంలో విటమిన్ డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు, జట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం ఉంటుంది. వ్యాధి నిరోధకశక్తి తగ్గుతుంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చుకాకపోవడంతో సుగర్ వస్తుంది. మహిళల్లో మోనోపాజ్ తర్వాత సహజంగా కాల్షియం తగ్గుతుంది. కాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. విటమిన్ డి అవసరం.. శరీరానికి డి విటమిన్ ఎంతో అవసరం. విటమిన్ డి లోపంతో కండరాల, ఎముకలు బలహీన పడతాయి. ప్రతి ఒక్కరూ వ్యాధి నిరోధకశక్తిని పెంచుకునేందుకు విటమిన్ డి అవసరం. ఇది సహజంగా సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే డి విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. ఇటీవల కాలంలో విటమిన్ డి లోపం ఉన్న వారిని ఎక్కువగా చూస్తున్నాం. – డాక్టర్ కె. సుధాకర్, ఆర్థోపెడిక్ నిపుణుడు, జీజీహెచ్వీటిల్లో విటమిన్ డి పుష్కలం.. చేపలు, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, పాలు, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చులేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. – గర్రే హరిత, నూట్రీíÙయన్ -
డీ విటమిన్ డోస్ ఎక్కువైతే.. యమడేంజర్!
మన శరీరానికి విటమిన్-డి ఎంత కీలకమో అందరికీ తెలుసు. కానీ మన శరీరంలో అదే డీ విటమిన్ ఎక్కువైతే చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. ఒక్కోసారి ప్రాణంకూడా పోవచ్చు. యూకేకు చెందిన 89 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నిపుణులు పలు హెచ్చరికలు జారీ చేశారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం రిటైర్డ్ వ్యాపారవేత్త డేవిడ్ మిచెనర్ హైపర్ కాల్సీమియాతో బాధపడుతున్నారు. దీంతో అతను గత ఏడాది మేలో ఆసుపత్రిలో చేరాడు. విటమిన్ డీ ఎక్కువగా తీసుకోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు ఎక్కువైనాయని వైద్యులు గుర్తించారు. పది రోజుల తర్వాత అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తరువాత, స్థానిక వైద్య సంఘం సభ్యులు అప్రమత్తమై ఒక నివేదికను రూపొందించారు. అలాగే విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల కలిగే నష్టాల గురించి ప్రజలకు హెచ్చరికలు జారీచేశారు. మిచెనర్ పోస్ట్‌మార్టం నివేదిక అతని విటమిన్ డీ స్థాయిలు 380 వద్ద ఉన్నట్టు తేలింది. దీంతో పెద్దల్లో విటమిన్ డీ-30 వద్ద ఉంటే చాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. అలాగే పెద్దలకు 600 అంతర్జాతీయ యూనిట్లు (IUలు) డోసేజ్ చాలని చెప్పారు. మితిమీరిన వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి విటమిన్ డీ సప్లిమెంట్ ప్యాకెట్లపై స్పష్టమైన హెచ్చరికలను తప్పనిసరి చేయాలని నియంత్రణ సంస్థలను కోరుతూ సర్రే అసిస్టెంట్ కరోనర్ నివేదికను విడుదల చేశారు. విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కలిగే నిర్దిష్ట నష్టాలు లేదా దుష్ప్రభావాల గురించి వివరించే ప్యాకేజింగ్‌లో లేదా ప్యాకేజింగ్‌లో ఎటువంటి హెచ్చరిక లేదని కరోనర్ జోనాథన్ స్టీవెన్స్ తన అధికారిక నివేదికలో రాశారు. ఇకనైనా దీనిపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని మరణాలు సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. -
విటమిన్ ‘డి’ లోపం: ఆదిలోనే గుర్తించకపోతే.. డేంజరే!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్లోపంతో బాధపడుతుండటం డేంజర్బెల్స్ను మోగిస్తోంది. డీ విటమినల్ లోపం డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. భయపెడుతున్న అల్జీమర్స్ విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది. -
మన శరీరానికి విటమిన్ డి యొక్క ప్రాముఖ్యత ఏంటి..?
-
వర్షాకాలంలో విటమిన్-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. దీన్ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ కంటే సూర్యకాంతిలో విటమిన్-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం. ►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్-డి ఉంటుంది. పాలలో విటమిన్-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి నారింజలో విటమిన్-సితో పాటు విటమని్-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్-డి ఎంత మొత్తం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్-డి అవసరం. పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. -
విటమిన్ D లోపం వల్ల ఇన్ని రోగాలు వస్తాయా..!
-
ఆ విటమిన్ లోపిస్తే తినాలనే ఆసక్తి కోల్పోతాం!
శరీరానికి అన్ని విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ లోపించిన దాని దుష్ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందులోనూ మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే విటమిన్ల విషయంలో అజాగ్రత్త వహిస్తే ఆ పరిస్థితి మరి దారుణంగా ఉంటుంది. విటమిన్లలో సహజసిద్ధంగా లభించే విటమిన్ డీ. ఇది మనకు సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. ఆ విటమిన్ లోపం కారణంగా తినబుద్ది కాదని, పూర్తిగా నీరసించి దారుణమైన స్థితికి వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు న్యూట్రిషియన్లు. ఐతే విటమిన్ డీ లోపించిదని ఇచ్చే సంకేతాలు, లక్షణాలు ఏంటో చూద్దామా! డీ విటమిన్ లోపం గురించి ఇచ్చే పది సంకేతాలు ఏంటంటే.. అలసిపోవడం మాటిమాటికి అలసట వస్తున్నా లేదా ఎక్కువ సేపు ఏ పనిచేయక మునుపే తొందరగా అలసటతో కూర్చుండిపోతే డి విటమిన్ లోపించిందని అర్థం. ఇది డీ విటమిన్ లోపానికి సంబంధించిన బలమైన సంకేతంలో ప్రధానమైంది నిద్ర పట్టకపోవడం టైంకి పడుకున్నా కూడా నిద్ర పట్టకపోతే అది డీ విటమిన లోపమే కారణం. మెలటోనిన్ అనే హార్మోన్ మానవ సిర్కాడియన్ లయలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా నిద్ర పట్టకపోవడం అనే సమస్య ఎదురవుతుంది. ఈ డీ విటమిన్ శరీరంలో నిద్ర వచ్చే హార్మోన్‌ని ఉత్పత్తి అయ్యేలా చేసి కంటి నిండా నిద్రపోయేలా చేస్తుంది. కీళ్లపై ప్రభావం దీర్ఘకాలిక కండరాల అసౌకర్యం, బలహీనతకు మూలం విటమిన్ డీ. కాల్షియం శోషణలో సహయపడుతుంది. ఇది లేకపోవడం వల్ల కీళ్లపై ప్రభావం చూపుతుంది. డిప్రెషన్ లేదా విచారం డిప్రెషన్‌కి డీ విటమిన్‌తో ఎలాంటి సంబంధం లేనప్పటికి..పరిశోధనల్లో అలటస కారణంగా మానసికంగా బలం కీణించి అనేక రుగ్మతలకు లోనై డిప్రెషన్‌కి గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం డీ విటమిన్ లోపిస్తే జుట్టు రాలడం, జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపడం వంటివి జరగుతాయి. కొన్ని సందర్భాల్లో ఆ లోపం ఎక్కువగా ఉంటే అలోపేసియాకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. దీంతో తలపై జుట్టు తోపాటు, శరీరంపై ఉండే వెంట్రుకలన్నింటిని పూర్తిగా కోల్పోయేలా ప్రమాదం ఉంది. కండరాల బలహీనత విటమిన డీ ఆరోగ్యకరమైన కండరాల పెరుగుదల, అభివృద్ధికి తోడ్పడుతుంది. అలాగే కండరాల సంకోచాన్ని నియంత్రించడానికి కీలకం కూడా. శరీరంలో తక్కువ డీ విటమిన్ స్థాయిలు వివిధ రకాల కండరాల కణాల పనితీరుని ప్రభావితం చేసినట్లు పలు పరిశోధనల్లో తేలింది. డార్క్ సర్కిల్స్ కళ్లు బూడిద రంగులోకి మారడం, కళ్ల కింద ఉన్న చర్మం ఉబ్బడం లేదా మృదువుగా లేనట్లు ఉన్నట్లయితే ఎక్కువసేపు ఎండలో గడపాలని అర్థం. ఆకలి లేకపోవడం ఆహారం పట్ల ఆకస్మికంగా విరక్తి ఏర్పడటం, ఆకలి అనే అనూభూతి లేకపోవడం వంటివి జరుగుతాయి. తరుచుగా అనారోగ్యం రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉండి, తరుచుగా అనారోగ్యానికి గురవ్వడం జరుగుతుంది. చర్మం పాలిపోవడం ఆరోగ్యకరమైన చర్మ కణాల ఉత్పత్తికి విటమిన్ డీ అవసరం. కాబట్టి చర్మం పాలిపోయినట్లుగా ఉంటే విటమిన్ డీ లోపం ఉన్నట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. కావున ఆయా వ్యక్తులు సూర్యరశ్మీలో గడపడం అత్యంత ముఖ్యం. అంతేగాదు అధిక రక్తపోటు, మధుమేహం, ఫైబ్రోమైయాల్జియా,మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి నాడీ సంబంధిత పరిస్థితులు విటమిన్ డీ లోపంతో సంబంధం కలిగి ఉంటాయి. ఏం చేయాలంటే.. విటమిన్ డీ కి చక్కని సోర్స్ సూర్య రశ్మే. ఆ తరువాత స్థానంలో చేపలు, కాడ్‌లివర్ ఆయిల్, గుడ్డు పచ్చ సొన, ష్రింప్, ఫోర్టిఫైడ్ మిల్క్, ఫోర్టిఫైడ్ బ్రేక్ ఫాస్ట్ సెరియల్, ఫోర్టిఫైడ్ యోగర్ట్, ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ఉంటాయి. (చదవండి: 1990లలో అపహరించిన జీప్ అనూహ్యంగా ఎలా బయటపడిందంటే) -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే...
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్నిపాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకి ఏం చేయాలో తెలుసుకుందాం.... తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, బెండకాయ, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడాలి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నింటికీ మించి నువ్వులలో క్యాల్షియం చాలా అధికమొత్తంలో ఉంటుంది కాబట్టి పిల్లలు రోజూ ఒక స్పూను నువ్వులు తినేలా చూస్తే చాలు... తప్పకుండా ఉండాలండి కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనికే విటమిన్ డి 3 అని కూడా పేరు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ►నవజాత శిశువులకు కూడా విటమిన్ డి అవసరం. అందుకోసం వారి ఒంటికి నువ్వుల నూనె రాసి, లేలేత సూర్యకిరణాలు తగిలేలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ స్నానం చేయించాలి. ఈ విటమిన్లు కూడా ► శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉంటే విటమిన్ డి సమృద్ధిగా ఉన్నట్లే. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి. శీతల పానీయాలు వద్దే వద్దు... పిల్లలు ఎంత మారాం చేసినా వారిని శీతల పానీయాలు తాగనివ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అయితే ఫరవాలేదు కానీ తరచూ ఇవి తాగడం పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ డ్రింక్‌లను తాగించండి. దీనివల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. -
Super Tomatoes: ఇవి మామూలు టొమాటోలు కావు.. కోడిగుడ్డు కంటే ఎక్కువే!
టొమాటోలు సహజసిద్ధంగానే కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. టొమాటోల్లోని పోషకాలు మరింత సమర్థంగా పనిచేసేలా బ్రిటిష్ శాస్త్రవేత్తలు జన్యుమార్పిడి ద్వారా రూపొందించారు. జన్యుమార్పిడి ద్వారా పండించిన ఈ టొమాటోలను వారు ‘సూపర్ టొమాటోలు’ అని అంటున్నారు. 👉🏾ఈ సూపర్ టొమాటోల విశేషమేమిటంటే, వీటిలో కోడిగుడ్ల కంటే రెట్టింపు స్థాయిలో విటమిన్–డి3 ఉంటుంది. 👉🏾సాధారణ టొమాటోల్లో ఉండే ‘ప్రో విటమిన్’ కొంత కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందుతుంది. 👉🏾‘సీఆర్ఐఎస్పీఆర్’ అనే జీన్ ఎడిటింగ్ పద్ధతిలో, ‘ప్రో విటమిన్’ కొలెస్ట్రాల్‌గా రూపాంతరం చెందేలా చేసే జన్యువులో మార్పు తీసుకొచ్చారు. 👉🏾ఫలితంగా ‘ప్రోవిటమిన్’ మరింత విటమిన్–డి3గా మారేలా చేశారు. 👉🏾నార్విచ్‌లోని జాన్ ఇన్నెస్ సెంటర్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. 👉🏾విటమిన్–డి3 పుష్కలంగా ఉండే ఈ టొమాటోలు డెమెన్షియా, పార్కిన్సన్, కేన్సర్ వంటి వ్యాధులను సమర్థంగా నివారించగలవని వారు చెబుతున్నారు. చదవండి👉🏾Heart Can Repair Itself: భారీ హార్ట్ ఎటాక్ సమయంలో గుండె కండరం చచ్చుబడిపోతుంది.. కానీ ఈ ప్రొటిన్ వల్ల చదవండి👉🏾Hypertension: పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె సమస్యలు.. అందుకే ‘టెన్షన్’ వద్దు! ఇవి తినండి! -
Health Tips: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. విటమిన్- డి పుష్కలం!
మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి! వీటిలో విటమిన్- డి పుష్కలం. ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’ ►పుట్టగొడుగుల్లో ‘విటమిన్–డి’ ఎక్కువగా ఉంటుంది. ►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్–డి’ లభిస్తుంది. ►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి. ►ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్–డి సమృద్ధిగా ఉంటుంది. ►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్–డి’కి మంచి వనరులు. ►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు! -
Health Tips: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక.. నరకం కనిపిస్తుంది!
శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్ తగ్గినా.. అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధమవుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్–డి లోపిస్తే.. నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుందాం. ►విటమిన్–డి అనేది కొవ్వులో కరిగే ముఖ్యమైన విటమిన్. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. లేదా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది. ►విటమిన్–డి లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది. ►కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్ సమస్యలు ఏర్పడతాయి. ►ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్–డి అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం. ►కొన్ని అధ్యయనాల్లో విటమిన్–డి అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా... చురుగ్గా ఉన్నట్లు వెల్లడి అయింది. విటమిన్ డి ఎందుకు అవసరం? ►విటమిన్–డి ఎముకల జీవక్రియకు అవసరమైన హార్మోన్ ఉత్పత్తికి, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం. ►రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. ►శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ►చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ‘సన్‌షైన్ విటమిన్’ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది. ►శీతాకాలంలో శరీరానికి విటమిన్ ఈ లభించాలంటే కనీసం 10–30 నిమిషాలు సూర్యరశ్మి తగలాలి. లోపిస్తే ఏమవుతుంది? ►విటమిన్–డి లోపిస్తే.. పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. ►పిల్లల్లో ఎముకల వృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది. ►పెద్దవారిలో ‘ఆస్టియోమలాసియా’ ఏర్పడుతుంది. ►కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి–విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటారు. ►ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది. చదవండి👉🏾 Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇదే.. ఇవి తింటే మేలు! -
చలికాలంలో చుండ్రు బాధా? జుట్టు మెరవాలంటే ఏం చేయాలి?
చలికాలంలో గాలిలోని తేమ తక్కువ. ఈ కారణంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. మరీ ఎక్కువ ఇబ్బందిపెట్టే సమస్య జుట్టు రాలడం సమస్య . విపరీతైమన చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. హెయిర్ అంతా పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతుంది. సో... ఈ వింటర్లో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది తెలుసా? మరి జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి? వింటర్లో అందరినీ వేధించే సమస్య హెయిర్‌లాస్, విపరీతమైన చుండ్రు. దీంతోపాటు జుట్టుచిట్టిపోవడం, పొడిగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసిందే. చర్మంగానీ, జుట్టుకానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కానీ చలికాలంలో చాలా తక్కువ నీటిని తాగుతాం ఈ కారణంగా సమస్యలు మరింత విజృంభిస్తాయి. తల పొడిబారిపోతుంది. తేమలేక జుట్టు రాలి పోతుంటుంది. చుండ్రు చేరుతుంది. ఆ ఇరిటేషన్, దురద బాగా వేధిస్తుంది. మరి చుండ్రును ఎదుర్కోవాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే పోషకాహారంతో పాటు, తాజా కూరలు, పండ్లు, తీసుకోవాలి. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనవి విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి. అంతేకాదు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగినంత న్యూటియంట్స్ శరీరానికి అందవు. ఫలితంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీంతో సహజమైన, మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జంక్ ఫుడ్‌కి నో చెప్పాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డీ, నూట్రిషనల్ ఈస్ట్, బ్రస్సెల్ మొలకలు, బయోటిన్, అవకాడో, సీఫుడ్ ద్వారా లభించే సిలీనియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అవసరం. విటమిటన్ డీ ఎంత పుష్కలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు. విటమిన్ డీ ని డైరెక్టు సన్ ద్వారా గానీ, సప్లిమెంట్ రూపంలో గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ తీసుకోవాలి. మరోవైపు జుట్టు, చర్మం కాంతివంతంగా ఉండటంలో విటమిన్ డి- బయోటిన్ ది కీలకమైన పాత్ర. కార్బోహైడ్రేట్, లిపిడ్ జీవక్రియలో ప్రత్యేక పాత్ర విటమిన్ హెచ్ లేదా బయోటిన్ది అని చెప్పొచ్చు. బయోటిన్ లోపిస్తే జుట్టు, గోర్లు, చర్మం కాంతి విహీనంగా మారిపోతాయి. జుట్టు పెళుసుగా మారుతుంది, గోర్లు ఎక్స్ఫోలియేట్ అవుతాయి. చలికి తట్టుకోలేక వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటాం. నిజానికి ఇది చాలా పెద్దపొరపాటు. వేడి నీటితో జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు హడావిడిగా దువ్వుకూడదు. తడిగా ఉన్నజుట్టు బలహీనంగా ఉండి, సులువుగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు. పల్చటి, మెత్తటి కాటన్ క్లాత్‌తో జుట్టును ఆర బెట్టుకోవడం మంచిది. దీంతోపాటు ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. తల స్నానానికిముందు శుద్ధమైన కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే కుదుళ్లు గట్టిపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ మిశ్రమం, అలోవేరా, ఉల్లిపాయ రసం, కరివేపాకులు వేసి మరగించిన నూనె, బియ్యం గంజి, మందార ఆకుల మిశ్రమాన్ని స్కాల్ఫ్‌కి పట్టేలా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఈజీగా దొరికే రైస్ వాటర్‌లో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు జుట్టుకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఉండే షాంపూలకు దూరంగా ఉండండి. ఆర్గానిక్, లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. -
విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విటమిన్ ‘డీ’.. ఎముకల ఎదుగుదల, కండరాల పటుత్వానికి అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇది దోహదపడుతుంది. ఈ కారణంగానే కరోనా పరిస్థితుల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, సప్లిమెంట్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. కానీ దేశంలో పదేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు అంటే ఎదిగే పిల్లలు చాలామందిలో ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉంది. మానసిక, శారీరక ఎదుగుదలకు కీలకమైన వయసులో డీ విటమిన్ లోపం పిల్లల్లో ఎన్నోరకాల దుష్ప్రభావాలను కలిగిస్తోంది. దేశంలో 19 ఏళ్లలోపు పిల్లల్లో విటమిన్ డీ స్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సహకారంతో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించింది. ఏ వయస్సు వారిలో ఎంత? జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 23.9 శాతం మంది, అంటే దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఇక నాలుగేళ్లలోపు చిన్నారులు 13.8% మందిలో ఈ విటమిన్ లోపం గుర్తించగా, 18.2% మంది 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కూడా డీ లోపం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ డీ లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! 15 నిమిషాలు ఎండలో ఉండాలి శరీరానికి సరిపడా విటమిన్ డీ సూర్యరశ్మి నుంచే సహజంగా వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియంను కండరాలు, ఎముకలకు అందించడంలో ‘డీ’పాత్ర అత్యంత కీలకం. రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉంటే విటమిన్ ‘డీ’సమతుల్యత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇక పెద్దల్లో ఎముకల అరుగుదల వేగంగా ఉంటుంది. దీని ప్రభావంతో కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో పాటు నిద్రలేమి, అలసత్వం, డిప్రెషన్, ఒంటినొప్పులు వరుసగా వస్తుంటాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే విటమిన్ల అసమతుల్యత, అధిక బరువు, రోగనిరోధక శక్తి క్షీణత లాంటివి ఉత్పన్నమవుతాయి. మారుతున్న జీవనశైలి కూడా విటమిన్ల అసమతుల్యతకు దారితీస్తోంది. చదవండి: Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి! తెలంగాణలో కాస్త మెరుగే తెలంగాణలో మాత్రం విటమిన్ డీ స్థాయి కాస్త సంతృప్తికరంగానే ఉంది. నాలుగేళ్లలోపు చిన్నారులు 9.6 శాతం మందిలో, 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 5.5 శాతం మందిలో, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 8.8 శాతం మందిలో మాత్రమే లోపం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ‘డీ’లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, మణిపూర్, హరియాణ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో ఈ లోపం అతితక్కువగా ఉంది. చదవండి: Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే! వైద్యుల సలహా మేరకే ‘రెడీమేడ్’ తీసుకోవాలి సూర్యరశ్మి ఎక్కువగా సోకకపోవడం డీ విటమిన్ లోపానికి కారణమని చెప్పొచ్చు. ఇక సరైన ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా విటమిన్ల సమస్య తలెత్తుతుంది. సముద్రపు ఆహారంలో ‘డీ’పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని రకాల పోషకాహారాలకు కూడా ‘డీ’ని అదనంగా జతచేసి అందిస్తున్నారు. ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నా తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. – డాక్టర్ కీర్తి మునగపాటి, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ -
బియ్యం, గోధుమల్లో ‘డి’ విటమిన్!
ప్రకృతి సిద్ధంగా కొన్ని ఆహారోత్పత్తుల్లో కొన్ని రకాల విటమిన్లు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే, అంతర్జాతీయంగా శాస్త్రవేత్తలు, పలు సంస్థలు జన్యుమార్పిడి ప్రక్రియ ద్వారా ఆశించిన విటమిన్‌ను ఏదో ఒక ‘వంగడం’లోకి చొప్పించి, ఆ వ్యవసాయోత్పత్తిలో ఆ విటమిన్ వచ్చేలా చేయడానికి వ్యయ ప్రయాసలకోర్చి ‘జన్యుమార్పిడి’ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు వాడకుండా, జన్యుమార్పిడి వంటి సంక్లిష్ట ప్రక్రియ అవసరం లేకుండానే.. పంట ఏదైనా సరే.. మనకు అవసరమైన విటమిన్లను వ్యవసాయోత్పత్తుల్లో పుష్కలంగా రాబట్టుకునే సహజ సేద్య మెళకువలను తాను రూపొందించానని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన తన ఇంటి ముందే వున్న 60 సెంట్ల భూమిని (ఇందులోనే డి విటమిన్ వచ్చేలా గోధుమ పంటను సాగు చేస్తున్నారు), కీసర సమీపంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని ప్రయోగశాలలుగా మార్చారు. వరి, గోధుమ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే క్రమంలో కొన్ని సహజ మిశ్రమాలను వినియోగించడం ద్వారా వరి బియ్యం, గోధుమల్లో గతంలో విటమిన్ ఎ, సి, తాజాగా విటమిన్ ‘డి’ని రాబట్టానని ఆయన ప్రకటించారు. తన పొలంలో నుంచే పై మట్టిని, (4–6 అడుగుల) లోపలి మట్టిని సేకరించి ఎండబెట్టి.. ఈ మట్టిని పంటలకు సేంద్రియ ఎరువుగా, సేంద్రియ పురుగుమందుగా వాడటంపై వెంకటరెడ్డి గతంలో చేసిన ఆవిష్కరణలు పత్రికలు, టీవీ ఛానల్స్, యూ ట్యూబ్ వీడియోల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల రైతులక్కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఎడారి మిడతల దండు పంట ను ఆశించకుండా చేయడానికి కూడా మట్టి ద్రావణం దోహదపడిందని ఆయన చెప్పటం మనకు తెలుసు. ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ ఆవిష్కరణల పరంపరను దిగ్విజయంగా కొనసాగిస్తున్న చింతల వెంకటరెడ్డి వ్యవసాయోత్పత్తుల్లో విటమిన్ ఎ., సి.లతో పాటు ‘డి’ రాబట్టుకునే సాగు పద్ధతులపై అనేక ఏళ్ల పాటు విస్తృత ప్రయోగాలు చేసి నిర్థారణకు వచ్చారు. ఈ ప్రయోగాల ఫలితాలను క్రమపద్ధతిలో రాసి పేటెంట్ కోసం ధరఖాస్తు పంపారు. పేటెంట్ పొందటానికి దీర్ఘకాలం పడుతుంది. మొదట మన దేశంలో పేటెంట్ కోసం 2019 ఆగస్టు 02న ధరఖాస్తు పంపారు (దీనిపై ఇంకా పేటెంట్ మంజూరు కాలేదు). ఆ తర్వాత, 2020 ఆగస్టు 1న ‘అంతర్జాతీయ మేధోహక్కుల సంస్థ (డబ్ల్యూ.ఐ.పి.ఓ.– వైపో)కు ధరఖాస్తు పంపారు. ఈ ధరఖాస్తుపై స్పందించిన వైపో ఈ నెల 11న చింతల వెంకటరెడ్డి ‘మొక్కల్లో పోషక విలువలను పెంపొందించే మిశ్రమం’ గురించి తన వెబ్సైట్లో పబ్లికేషన్ విడుదల చేసింది (ఇంటర్నేషనల్ పబ్లికేషన్ నంబర్: డబ్ల్యూ.ఓ. 2021/024143 ఎ1). ‘వైపో’ ఇచ్చిన పబ్లికేషన్ పేటెంట్ కాదు. అయితే, చింతల వెంకటరెడ్డి మాదిరిగా రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి చేయకుండా ఒక సేంద్రియ మిశ్రమం ద్వారా వ్యవసాయోత్పత్తుల్లో డి విటమిన్ తదితర విటమిన్లను పొందటానికి ఉపయోగడపడే మిశ్రమం గురించి గతంలో ఏ దేశంలోనూ ఎవరికీ మేధో హక్కులు ఇవ్వలేదని వైపో పేర్కొంది. 130 దేశాల్లోని జాతీయ స్థాయి పేటెంట్ కార్యాలయాలకు ధరఖాస్తు చేసుకొని పేటెంట్ హక్కులు పొందవచ్చిన వైపో పబ్లికేషన్ మార్గాన్ని సుగమం చేసింది. కాల్షియంను దేహం గ్రహించాలన్నా, ఎముక పుష్టి కలగాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా డి విటమిన్ ఆవశ్యకత చాలా ఉంది. పెద్దలకు రోజుకు 1,000 ఇంటర్నేషనల్ యూనిట్(ఐ.యు.)లు, పిల్లలకు 400 ఐ.యు.లు అవసరం. డి విటమిన్ తక్కువగా ఉన్న వారికి, ప్రత్యేక ఆరోగ్య సమస్యలున్న వారికి ఇంకా ఎక్కువ మోతాదులో డి విటమిన్ అవసరం ఉంటుంది. సూర్యరశ్మిలో డి విటమిన్ ఉంటుంది. ఎండలో తిరగని వారు పుట్టగొడుగులు (ఎండబెట్టినవి) తిని విటమిన్ డి కొరతను తగ్గించుకోవచ్చు. అయితే, అదేదో రోజువారీగా తినే ఆహార ధాన్యాల్లోనే వుంటే మరింత మేలు కదా! ఏ పంట అయినా సరే.. ఏ పంట దిగుబడులోనైనా డి., ఎ., సి. విటమిన్లు వచ్చేలా చేయవచ్చని నా అనుభవంలో రుజువైంది. వరి, గోధుమ, జొన్న, కొర్ర తదితర ధాన్యాలు.. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, దుంపల్లో వేటిలోనైనా ఈ విటమిన్లు వచ్చేలా చేయవచ్చు. జన్యుమార్పిడి అవసరం లేదు. ప్రత్యేక రసాయనాలు వాడనకవసరం లేదు. ప్రకృతిలో అందరికీ ఎక్కడపడితే అక్కడ దొరికే ఆహారోత్పత్తులనే వాడి కావల్సిన విటమిన్లను పంట దిగుబడుల్లో వచ్చేలా చేయవచ్చు. ఈ ఆవిష్కరణకు ‘వైపో’ ఇంటర్నేషనల్ పబ్లికేషన్ వెలువడటం సంతోషదాయకం. భారత పేటెంట్ కోసం వేచి చూస్తున్నాను. క్యారట్, మొక్కజొన్న పిండి, చిలగడ దుంపలను వాడి రైతులు ఎవరైనా తమ పంట ఉత్పత్తుల్లో విటమిన్ డి రాబట్టుకోవచ్చు. ఆరోగ్యదాయకమైన ఆహారోత్పత్తులను పండించి, తిని రైతులు సుభిక్షంగా ఉండాలన్నదే నా లక్ష్యం. ఈ టెక్నిక్‌తో పండించిన ఆహారోత్పత్తులను దేశవిదేశాల్లో వాణిజ్య పరంగా విక్రయించాలనుకునే వ్యక్తులు/సంస్థలు మాత్రం ముందుగా నాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. – పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకటరెడ్డి, ప్రముఖ రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ ఆల్వాల్, సికింద్రాబాద్ మిశ్రమ ద్రావణం ఎంత మోతాదులో వెయ్యాలి? ఎకరానికి ఒక విడత సరిపడా ద్రావణాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు.. 2 కిలోల క్యారట్లు, 2 కిలోల చిలగడ దుంపలు, 2 కిలోల మొక్కజొన్న గింజల పిండిని ఉపయోగించాలి. క్యారట్లు, చిలగడదుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టి, ఒక లీటరు నీరు కలిపి మిక్సీలో వేసి.. ద్రవ రూపంలోకి మార్చాలి. ఆ తర్వాత మొక్కజొన్న పిండిని ఇందులో కలపాలి. ఈ ద్రావణాన్ని 200 లీటర డ్రమ్ము నీటిలో కలిపి పంటకు అందించాలి. వరి, గోధుమ వంటి ధాన్యపు పంటల్లో అయితే, బిర్రు పొట్ట దశ నుంచి గింజ గట్టి పడే దశ వరకు సుమారు నెల రోజుల వ్యవధిలో 4–5 సార్లు ఈ ద్రావణాన్ని అందించాలి. కూరగాయ, పండ్లు తదితర పంటల్లో అయితే, పూత, పిందె దశలో 4–5 సార్లు పంటకు ఈ ద్రావణాన్ని ఇవ్వటం ద్వారా డి విటమిన్ ను పొందవచ్చు అని వెంకటరెడ్డి తెలిపారు. ఎ, సి విటమిన్ల కోసం ఏం చేయాలి? ‘ఎ’ విటమిన్ పంట ఉత్పత్తుల్లో రావాలని మనం అనుకుంటే.. చిలకడదుంప లేదా పాలకూర లేదా క్యారెట్లు 2 కేజీలు తీసుకొని ఉడికించి మిక్సీ పట్టించి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి, ఎకరం విస్తీర్ణంలో పంటలకు అందించాలి. ‘సి’ విటమిన్ రావాలి అనుకుంటే.. టమాటా లేదా ఉసిరి లేదా నారింజ లేదా బత్తాయి, నిమ్మ కాయలను 2 కిలోలు తీసుకొని ముక్కలు కోసి రసం తీసి, 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ఒక ఎకరానికి అందించాలి అని వెంకటరెడ్డి వివరించారు. పొలానికి కాలువల ద్వారా పారించే నీటిలో ఈ ద్రావణాన్ని కలపటం కన్నా.. రెయిన్ డ్రిప్ ద్వారా అందిస్తే.. మొదట మొక్కలకు, తర్వాత నేలకు రెండు విధాలా కూడా పోషకాలు అందుతాయి. పంట పొలంలో 3 అడుగుల ఎత్తున ఇనుప సెంట్రింగ్ ఫ్రేమ్ పైన ‘రెయిన్ డ్రిప్’ ప్లాస్టిక్ ట్యూబ్‌లను అమర్చి, పంటకు 1 కేజీ ప్రెజర్‌తో వెంకటరెడ్డి నీరు అందిస్తున్నారు. క్యారెట్, చిలగడ దుంప,మొక్కజొన్న పిండితో మిశ్రమం.. ‘డి’ విటమిన్ కోసం ప్రత్యేకించి వరి, గోధుమలను వెంకటరెడ్డి సాగు చేస్తూ వచ్చారు. తన టెక్నిక్‌ను పాటిస్తే.. ధాన్యాల్లోనే కాదు, కూరగాయలు, దుంప పంటలు, ఆకుకూరలు, క్యాబే జీ వంటి పూల జాతి కూరగాయల్లో కూడా విటమిన్ డి పొందవచ్చని ఆయన స్పష్టం చేశారు. క్యారెట్, చిలగడ దుంప, మొక్కజొన్నల మెత్తని పిండి.. వీటితో తయారు చేసిన మిశ్రమ ద్రావణాన్ని 200 లీటర్ల బ్యారెల్ నీటిలో కలిపి ‘రెయిన్ డ్రిప్’ ద్వారా వరి, గోధుమ పంటలకు పిచికారీ చేశామని ఆయన తెలిపారు. పంట పొట్ట దశలో ఉన్పప్పుడు నెల రోజుల్లో 4–5 దఫాలు ఈ ద్రావణాన్ని నీటితోపాటు పంటకు అందించాలని ఆయన తెలిపారు. వీటిలోని కెరొటినాయిడ్స్‌ను పంట మొక్కలు గ్రహించడం ద్వారా విటమిన్ ‘డి’ ఆ పంట దిగుబడుల్లో కనిపించిందని ఆయన తెలిపారు. వరి, గోధుమల్లో విటమిన్ డి తెప్పించడం కోసం 2011 నుంచి ప్రయోగాలు చేస్తున్నానని, 2018లో సక్సెస్ అయ్యానని, తదుపరి కూడా అనేక పంటలు పండించి నిర్థారణకు వచ్చానని చింతల వెంకటరెడ్డి తెలిపారు. ఓల్డ్ ఆల్వల్లో ప్రస్తుతం తన ఇంటి ఎదుట పొలంలో కూడా గోధుమ పంటను డి విటమిన్ కోసం పండిస్తున్నారు. 15 ఏళ్లుగా సేంద్రియ పద్ధతుల్లోనే ఆయన ద్రాక్ష, వరి, గోధుమ తదితర పంటలు పండిస్తున్నారు. ఎకరానికి ఏటా 5–6 క్వింటాళ్ల ఆముదం పిండి వేస్తుంటారు. పంటలపై పైమట్టి, లోపలి మట్టి పిచికారీ చేస్తుంటారు. గోధుమ మొలకలు, వరి మొలకలను మరపట్టించి, ద్రావణంగా తయారు చేసి పంటలపై పిచికారీ చేస్తుంటారు. డి విటమిన్ బియ్యం, గోధుమలను చూపుతున్న వెంకటరెడ్డి ఏ పంటలో ‘డి’ విటమిన్ ఎంత? క్యారెట్, మొక్కజొన్న పిండి, చిలగడదుంపలతో తయారు చేసిన మిశ్రమాన్ని వాడటం వల్ల వరి బియ్యంలో కన్నా, గోధుమల్లో అధిక పాళ్లలో డి విటమిన్ వస్తున్నట్లు చింతల వెంకటరెడ్డి గుర్తించారు. 2019 రబీ పంటలో పండించిన గోధుమల్లో(దిగుబడి హెక్టారుకు 4.68 టన్నులు) 100 గ్రాములకు 1,606 ఇంటర్నేషనల్ యూనిట్లు (ఐ.యు.లు) డి విటమిన్ ఉండగా, 2020 ఖరీఫ్‌లో పండించిన పంటలో 100 గ్రాములకు 1,803 ఐ.యు.ల మేరకు డి విటమిన్ ఉన్నట్లు విమ్తా లాబ్‌లో చేయించిన పరీక్షల్లో తేలిందని వెంకటరెడ్డి తెలిపారు. 2019 రబీలో పండించిన వరి బియ్యంలో 100 గ్రాములకు 136 ఐ.యు.ల మేరకు, 2019 ఖరీఫ్‌లో పండించిన వరి బియ్యం (దిగుబడి హెక్టారుకు 9.68 టన్నులు)లో 100 గ్రాములకు 102.70 ఐ.యు.ల మేరకు విటమిన్ డి వచ్చిందని ఆయన వివరించారు. -
డీ విటమిన్ బియ్యానికి పేటెంట్
సాక్షి, హైదరాబాద్: మట్టి సేద్యంతో ప్రసిద్ధి పొంది గత ఏడాది పద్మశ్రీ పురస్కారం అందుకున్న తెలంగాణ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సేంద్రియ పద్ధతుల్లో సాగుచేసే బియ్యం, గోధుమల్లో డీ విటమిన్ గణనీయమైన మోతాదులో ఉండేలా వినూత్న ఫార్ములాను రూపొందించారు. సాధారణంగా బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ అంతగా ఉండదు. అయితే వెంకటరెడ్డి ఫార్ములా ప్రకారం రూపొందించిన ద్రావణాలను పంటపై పిచికారీ చేస్తే బియ్యం, గోధుమల్లో విటమిన్ డీ గణనీయమైన మోతాదులో వస్తుందని ఆయన చెబుతున్నారు. తన ఫార్ములాపై అంతర్జాతీయంగా పేటెంట్ కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా, తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. వెంకటరెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్ష రైతు. ఆ యన గతంలో ఆవిష్కరించిన ‘మట్టి సేద్యం’ఫార్ములాను దేశవ్యాప్తంగా సేంద్రియ/ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఉపయోగించుకుంటూ లబ్ధి పొందుతున్నారు. మట్టిని ఎరువుగా, పురుగులమందుగా, పంటనాణ్యతను పెంచేవిధంగా వాడుకోవటం ఎలాగో కనుగొన్నారు. దానికి చాలా ఏళ్ల క్రితమే 130 దేశాల్లో పేటెంట్ హక్కులు పొందారు. రసాయనాలు వాడకుండా, జన్యుమార్పిడి వంటి ఖరీదైన సాంకేతికతలు వాడనవసరం లేకుండానే ధాన్యం, గోధుమ పంటల్లో ఎక్కువ మోతాదులో విటమిన్ డి వచ్చేలా వెంకటరెడ్డి విజయం సాధించారు. బియ్యంలో విటమిన్ డీ సాధించిన ఫార్ములాకు పేటెంట్ హక్కు పొందడానికి అంతర్జాతీయ మేధో హక్కుల సంస్థ(డబ్లు్యఐపీవో) తాజాగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేటెంట్ కోఆపరేషన్ ట్రీటీ (పీసీటీ) ధ్రువీకరణ ఇచ్చింది. అతని ఫార్ములాపై 130 దేశాల పేటెంట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకొని జాతీయస్థాయి పేటెంట్ హక్కులు పొందడానికి అవకాశం ఏర్పడింది. రైతులకు అవగాహన కల్పిస్తా... వరి సాగు సందర్భంగా ‘విటమిన్ ఏ’ను కలపడం, తద్వారా సూర్యరశ్మి దానికి తోడవడంతో ‘విటమిన్న్డీ’తో కూడిన వరి ధాన్యం ఉత్పత్తి అయిందని చింతల వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సీ విటమిన్¯తో కూడిన వరి, గోధుమలను ఉత్పత్తి చేయాలన్నా తన వద్ద అందుకు సంబంధించిన ఫార్ములా ఉందన్నారు. పోషకాలు, విటమిన్లు కలిగిన వరి, గోధుమలను పండించే ఫార్ములా తన వద్ద ఉందని, రైతులు వ్యక్తిగత అవసరాల కోసం కోరితే ఎలా పండించాలో చెప్తానని, వ్యాపార అవసరాల కోసమైతే తన వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు పండించిన డీ విటమిన్ బియ్యాన్ని అనేకమంది తీసుకెళ్లారని, కరోనా కాలంలో ఈ బియ్యానికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. సూర్యరశ్మి అందక పట్టణ, నగరవాసులు విటమిన్ డీ లోపానికి గురవుతున్నారు. దీంతో అనేకమంది జబ్బుల బారిన పడుతున్నారని, డీ విటమిన్ లోపం తెలుసుకొని కొందరు మాత్రలు వాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కోరితే ఇస్తా ‘కేంద్ర ప్రభుత్వం దీన్ని రైతులకు ఇవ్వాలనుకుంటే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను’అని వెంకటరెడ్డి తెలిపారు. ప్రభుత్వానికి ఆసక్తి లేకపోతే, బహుళజాతి కంపెనీలకు ఇస్తానని చెప్పారు. వెంకటరెడ్డి వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగించరు. సేంద్రియ వ్యవసాయం పద్ధతులు పాటించినందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకున్నారు. రాష్ట్రంలో అనేకసార్లు మోడల్ రైతుగా అవార్డు పొందారు. 2001లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, 2006లో జార్జ్బుష్లు హైదరాబాద్ సందర్శించినప్పుడు తన వ్యవసాయ పద్ధతులను వారి ముందు ప్రదర్శించారు. విత్తనరహిత ద్రాక్షలను ఆ ఇద్దరికీ బహుమతిగా ఇచ్చారు. 2003లో అతను వరి, గోధుమలపై ప్రత్యేక సాంకేతికతను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. సాధారణ పంట దిగుబడిని రెట్టింపు చేశారు. అతను సేంద్రియ ద్రాక్ష రకాన్ని బ్లాక్ బ్యూటీ సీడ్లెస్ ద్రాక్ష అని పిలుస్తారు. అల్వాల్‌లోని అతని ఐదు ఎకరాల ద్రాక్ష తోటలో 20 నుండి 25 టన్నుల దిగుబడి తీసుకొచ్చారు. -
కరోనా: పెరుగుతున్న విటమిన్ల వాడకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజంభన వల్ల ప్రపంచ దేశాల్లో విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిపోయింది. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కావలసిన రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నేడు ప్రజలు విటమిన్లు ఎక్కువగా తీసుకుంటున్నారు. రొమ్ము, అండాశయం తదితర క్యాన్సర్ల నుంచి బయట పడేందుకు ఏసీఈ విటమిన్లు దోహదం చేయడం కూడా విటమిన్ల వాడకాన్ని పెంచింది. గతేడాదితో పోలిస్తే ఒక్క బ్రిటన్‌లోనే విటమిన్ల వినియోగం ఏకంగా 17.3 శాతం పెరిగింది. నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 12 రకాల మొక్కలు, ఐదు రకాల జంతువుల నుంచి వస్తోన్న ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకనే ఇంకా విటమిన్లు, పోషక పదార్థాల కోసం ఇతర మార్గాలు వెతుక్కోవాల్సి వస్తోంది. బంగాళా దుంపలో సీ విటమిన్‌తోపాటు బీ 6 విటమిన్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని ఎదుర్కోవడంలో కీలక పాత్ర వహించే డీ విటమిన్ లోపాన్ని ప్రజలు ఎదుర్కొంటున్నారు. అందుకు ఆధునిక జీవన విధానంతోపాటు వాణిజ్య ప్రపంచీకరణ కూడా కారణమే. క్యాన్సర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంలో కూడా డీ విటమిన్ బాగా పని చేస్తోందని తాజా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. సూర్య రశ్మి ద్వారా వచ్చే డీ విటమిన్ కోసం కూడా నేడు ప్రజలు సప్లిమెంట్లపై ఆధార పడాల్సి వస్తోంది. (చదవండి: భారత్‌లో తగ్గుతున్న ‘కరోనా మరణాలు’) శరీరంలోని ‘యాంటీ ఆక్సిడెంట్లు’ తగ్గించడంలో ఏ, ఈ విటమిన్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఏ, ఈ విటమిన్లు ఎక్కువగా ఉండే సప్లిమెంట్ల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి బదులుగా ఈ రెండు విటమిన్లు సహజంగా దొరికే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఇక ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కూడా జీర్ణ శక్తి బాగా మెరగుపర్చడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు. కే1, కే2 విటమిన్లు రక్త ప్రసరణలో ప్రముఖ పాత్ర వహిస్తాయని ఓ తాజా అధ్యయనంలో తేలింది. పాలకూర, బీట్రూట్, క్యాబేజీ, బీన్స్, కోడిగుడ్లు, బెర్రీస్, గ్రేప్స్, దానిమ్మ కాయల్లో ఈ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. (చదవండి: కరోనాను 'ఢీ'కొట్టండి) -
కరోనాను 'ఢీ'కొట్టండి
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడుతున్నవారిలో 80 శాతం మంది డీ విటమిన్ లోపం కలిగి ఉన్నారని తేలింది. ఈ విషయంపై జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) అధ్యయనం చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు విటమిన్ డీ లోపం ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువున్నట్లు గుర్తించారు. విటమిన్ డీ వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. ఈ లోపం ఉన్న వారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోవడంతో కరోనా సోకే అవకాశమెక్కువ. విటమిన్ డీ మందుల వల్ల శ్వాసకోçశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని తేల్చారు. కరోనా చికిత్సలో విటమిన్ డీ మాత్రలు విటమిన్ డీ లోపం సర్వసాధారణం. ఇది దాదాపు సగం జనాభాను ప్రభావితం చేస్తుంది. సూర్యరశ్మి తగ్గిన వ్యక్తులలో అధికంగా ఈ లోపం ఉంటుంది. ఇళ్లలో ఉండేవారు, వైద్య సిబ్బంది సహా ఎండ తగలకుండా ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారిలో విట మిన్ డీ లోపం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత మొదలై ఇన్నాళ్లైనా ఇంతవరకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కానీ మందులు కానీ అందుబాటులోకి రాలేదు. అం దుకే వైరస్ బారినపడిన వారికి డాక్టర్లు రోగనిరోధకశక్తి పెంచే విట మిన్లు, బలవర్ధ్థకమైన ఆహారం ఇవ్వడం ద్వారా చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడనివారు ముందు జాగ్రత్తగా విటమిన్ డీ, సీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. అవి లభించే ప్రత్యేక ఆహారం తీసుకుంటున్నారు. విటమిన్ డీ చికిత్స కరోనాను నివారించడానికి, చికిత్సకు ఒక వ్యూహంగా నిపుణులు గుర్తించారు. విటమిన్ డీ.. వైరల్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని వారు కనుగొన్నారు. మరికొన్ని ముఖ్యాంశాలు ►కరోనా పరీక్షలప్పుడు విటమిన్ డీ తక్కువుండే వారికి పాజిటివ్ వచ్చే చాన్స్ ఎక్కువ. ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్యాల కారణంగా విటమిన్ డీ లోపం పెరిగే చాన్స్ ఉంది. ►వైరల్ ఇన్ఫెక్షన్లను విటమిన్ డీ తగ్గించగలదు. వీటిలో కరోనా కూడా ఒకటి. ►విటమిన్ డీ రోగనిరోధకశక్తిని కల్పిస్తుంది. కాబట్టి కరోనా సంక్రమణను తగ్గిస్తుంది. ►విటమిన్ డీ డెన్డ్రిటిక్ కణాలు టీ కణాలపై ప్రభావం చూపడం వల్ల రోగనిరోధక పనితీరును మాడ్యులేట్ చేస్తుంది. తద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు. -
విటమిన్ ‘డి’ని కాపాడుకోవాల్సిందే
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందాక విటమిన్ల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా వైరస్‌ను తట్టుకోవాలంటే ఎలాంటి విటమిన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి, ఏఏ మాత్రలు వాడాలి అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కరోనా సమయంలో ముఖ్యంగాశరీరంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్–డి ఇమ్యూనిటీ వ్యవస్థను మెరుగు పరుస్తుంది కాబట్టి కరోనా వైరస్ సోకినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఉంటుందని వారు చెబుతున్నారు. విటమిన్ డి ఎందుకు అవసరం అంటే.. ► విటమిన్ డి ఇమ్యూనిటీ (వ్యాధి నిరోధక శక్తి) వ్యవస్థను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ► ఎముకల సాంద్రతకు ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ► నాడీ, మెదడు వ్యవస్థలు పనిచేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ► ఊపిరితిత్తుల పనితీరులోనూ, గుండె జబ్బుల నియంత్రణలోనూ ఎంతగానో ఉపయోగపడుతుంది. ► శరీరంలో కాల్షియం, ఫాస్పరస్ నిల్వలను నియంత్రిస్తుంది. ► విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా వస్తుంది. మాత్రలు తీసుకోవడం ద్వారానూ దీన్ని పెంపొందించుకోవచ్చు. కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుత కరోనా సమయంలో విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి. విటమిన్ డి శరీరాన్ని నీరసపడకుండా చూస్తుంది. ఇది లోపిస్తే చాలా ప్రతికూలతలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తపరీక్షలు చేయించుకోవడం ద్వారా విటమిన్ డి లోపాలు తెలుసుకోవచ్చు. – డా.బొబ్బా రవికిరణ్, క్యాన్సర్ వైద్య నిపుణులు -
కాస్తా ఎండన పడండి!
పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిది ఉరుకుల పరుగుల జీవితం. సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని కూడా చూడలేకపోతున్నారు. చూడ లేకపోతే పోయేది ఏముందిలే అనుకోకండి. వైద్యులు చెబుతున్న వాస్తవాలు వింటే భయపడి పోవాల్సిందే. సూర్యుడి కిరణాలకు చిక్కకుండా చాలా మంది తప్పించుకుని తిరుగుతూ అనారోగ్యాల బారిన పడుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా విటమిన్–డి చాలా అవసరం. సూర్య కిరణాల నుంచి సహజంగా లభించే విటమిన్–డికి దూరమైతే మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే బద్ధకం వీడి ‘ఉదయాన్నే లేవండి.. కాస్తా ఎండన పడండి.. ఆరోగ్యంతో జీవించండి..’ అని వైద్యులు సూచిస్తున్నారు. సాక్షి, నెల్లూరు(బారకాసు): చుర చురమనే ఎండ అంటే.. అందరికి దడే. ఆ ఎండ కిరణాలు శరీరాన్ని తాకకపోతే కూడా ప్రమాదమేనని వైద్యులు చెబుతున్న విషయాలు వింటే దడ పుడుతోంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు అందించాలి. ఏ ఒక్క విటమిన్ తక్కువైనా శరీరం అనారోగ్యానికి గురవుతోంది. ఇందులో విటమిన్–డి చాలా ప్రధానమైనది. డి విటమిన్ శరీరానికి, ఆరోగ్యానికి చాలా అవసరం. కండరాలు, ఎముకలు ప్రతి ఒక్క భాగం ఆరోగ్యంగా ఉండాలంటే డి విటమిన్ తప్పని సరి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం, లేచాక చదువులు/ఉద్యోగాలకు పరుగులు తీయడం అనివార్యంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పలు సర్వేల్లో అత్యధికంగా భారతీయుల్లోనే విటమిన్–డి కొరత ఏర్పడుతోందని తేలింది. 10 శాతం మందికి విటమిన్ డి లోపం జిల్లా జనాభాలో 10 శాతం మందికి విటమిన్–డి లోపం ఉందని ఇటీవల పరీక్షల్లో తెలినట్లు వైద్య సర్వేలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో డి విటమిన్ లోపిస్తున్న వారు అధికమవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్ల్లోని జనరల్ ఫిజీషియన్లు, ఆర్థోపెడిక్, న్యూరాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టుల వద్దకు వెళ్లే రోగుల్లో 10 శాతం మంది విటమిన్–డి లోపంతో బాధపడున్నట్లు నిర్ధారణ అవుతోంది. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య నానాటికి పెరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఎముకలకు కావాల్సిన కాల్షియంను శోషించడానికి, కండరాలు బలహీనంగా కాకుండా రక్షించడానికి విటమిన్–డి తోడ్పడుతోంది. డి విటమిన్‌ను సూర్యకాంతి ద్వారా సులభంగా లభిస్తుంది. లేకపోతే డాక్టర్ సూచనతో విటమిన్–డి సప్లిమెంట్లు (మాత్రలు) తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్–డి తక్కువైతే.. శరీరంలో విటమిన్–డి తక్కువైతే తీవ్రమైన అలసట, బలహీనత, నీరసం, నడుంనొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచన శక్తి తగ్గిపోవడం, డిప్రెషన్, మానసిక స్థితిలో తేడా కనిపిస్తుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. తరచూగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడంతో పాటు జుట్టు రాలడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మెదడు పని తీరుపైనా తీవ్ర ప్రభావం ఉటుంది. శరీర నిరోధకశక్తి తగ్గుతోంది. పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తంలోని గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాకపోవడంతో షుగర్ వస్తుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాతా సహజంగా క్యాల్షియం తగ్గుతుంది. క్యాల్షియం తగ్గితే కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. విటమిన్–డి ప్రయోజనాలు ప్రతి వ్యక్తి శరీరంలో కోలి కాల్సిఫెరాల్ అనే యాసిడ్ ఒకటి ఉంటుంది. అది లోపిస్తే చాలా సమస్యల బారిన పడతారు. ఉదయాన్నే ఎండలో కాసేపు ఉంటే విటమిన్–డి శరీరానికి లభిస్తుంది. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్–బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్–డిని తయారు చేసుకుంటాయి. తద్వారా కాలేయం, మూత్ర పిండాల్లో విటమిన్–డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం శరీరం దానిని ఉపయోగించుకుంటుంది. అలా సూర్యకాంతి ద్వారా తయారైన విటమిన్–డి శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తోంది. శరీరకంగా దారుఢ్యంగా ఉండాలన్నా, ఎముకలు పటిష్టంగా మారాలన్నా విటమిన్–డి తప్పనిసరి. దీంతో పాటు పలు అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే నిత్యం మనకు తగిన మోతాదులో విటమిన్–డి అవసరం. నీడ పట్టు ఉద్యోగం అనుకుంటే.. నీడ పట్టున కూర్చుని పని చేసే ఉద్యోగం అంటే చాలా లగ్జరీగా భావిస్తారు. కానీ ఇదే వారి అనార్యోగానికి కారణం అవుతోంది. ఎండ బారిన పడకుండా హయిగా నీడన కూర్చుని పని చేసే వారికి విటమిన్–డి లోపం అధికంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ గదుల్లోనే ఉండే ఉద్యోగులు, షిఫ్ట్ ఉద్యోగులు, హెల్త్ కేర్ వర్కర్స్కు విటమిన్–డి లోపం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఏమి తినాలంటే... చేపలు, బీఫ్, లివర్, కాడ్‌లివర్ ఆయిల్, కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్స్, ఆయిల్స్, పాలు, ఛీజ్, పన్నీరు, నెయ్యి, వెన్న, పుట్టగొడుగుల్లో విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో ఈ పదార్థాలను తప్పక చేర్చుకోవాలి. తరచూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారం కంటే ముఖ్యంగా పైసా ఖర్చు లేకుండా ఉదయం ఎండలో కాసేపు గడిపితే విటమిన్–డి పుష్కలంగా ఉంటుంది. కాసేపు ఎండలో ఉండటం మంచిది ఎండలో కాసేపు గడపక పోవడం వల్ల విటమిన్–డి లోపం కలుగుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో నడక చాలా మంచిది. ఈ లోపం ప్రధానంగా 40 ఏళ్లకు పైగా ఉన్న వారిలో కనిపిస్తుంది. పరీక్షల ద్వారా లోపం బయట పడుతుంది. ఎండలో కొద్దిసేపు గడపడంతో పాటు వైద్యుల సూచనలు పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు. – డాక్టర్ ఎన్.విజయభాస్కర్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు, జిల్లా ప్రభుత్వాస్పత్రి, ఆత్మకూరు క్యాల్షియం లోపం కారణంగా రక్తంలో విటమిన్–డి ఉంటే ఆహారంలోని క్యాల్షియంను శరీరం తీసుకుంటుంది. అది లోపిస్తే ఎముకలు మెత్తబడుతాయి. ప్రస్తుతం ఎండలో పనిచేసే వారు లేకపోవడంతో విటమిన్–డి లోపిస్తోంది. ఈ లోపం ఉన్న వారు క్యాల్షియం తీసుకోవాలి. తొలి సంధ్య వేళ సూర్యకాంతి తగిలేలా చూడాలి. – డాక్టర్ మస్తాన్‌బాషా, ఎముకలు, కీళ్లు నరాల ప్రభుత్వ వైద్యుడు, సర్వజన ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు -
ఆమె ఆరోగ్యం
సాక్షి మహిళలను జాగృతం చేయడానికిమహిళల్లో ఉన్న శక్తిని సమాజానికే కాదు... వారికీ తెలిసేలా చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేస్తూనే ఉంది. కాపాడుకోవడం... పరిరక్షించుకోవడం... సమాధాన పరచడం... పరామర్శించడంఇవి కాదు మహిళలకు కావల్సింది. వారిలో ఉన్న శక్తికి అద్దం పట్టాలి.‘నువ్వే శక్తి’ అని మహిళలకు సాక్షి గుర్తు చేస్తోంది.మహిళ అంటే మాకు గౌరవం... మాకు స్ఫూర్తి!మా అక్షరానికి శక్తి... జై స్త్రీ శక్తి!! ఆకుకూరలు... ఇందులో ఉండే మెగ్నీషియం, విటమిన్ కె, విటమిన్ సి, ఫైటో న్యూట్రియెంట్స్ వల్ల ఎముకలు దృఢంగా, బలంగా పెరుగుతాయి. తృణధాన్యాలు... బ్రౌన్ రైస్, కినోవా జీర్ణశక్తిని బలపరుస్తాయి. జీర్ణకోశం స్వచ్ఛంగా ఉంటే, మలబద్దకాన్ని, కోలన్ క్యాన్సర్‌ని నివారించుకోవచ్చు. నట్స్... శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇవి ఎముకలను బలంగా చేస్తాయి. బాదం పప్పులలో ఎముకలను దృఢపరిచే గుణాలు ఉన్నాయి. పిస్తాలలో మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6లు ఎక్కువగా ఉన్నాయి. కోడిగుడ్లు... ఇందులో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఉల్లిపాయలు... ఉల్లిపాయలలో ఎముకలకు బలాన్ని కలిగించే శక్తి ఎక్కువ. రోజుకో ఉల్లిపాయ తినడం వల్ల ఎముకలలో రోజుకి ఐదు శాతం చొప్పున శక్తి సమకూరుతుంది. 50 సంవత్సరాలు దాటిన మహిళల మీద .జరిపిన పరీక్షలో తుంటి ఎముక విరగడం అనేది 20 శాతం తక్కువ కనిపిస్తోంది. పెరుగు... పెరుగు లేదా మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలని ప్రాచీన కాలం నుంచి చెబుతున్నారు. ఇందులో ఉండే ప్రోబయాటిక్ బ్యాక్టీరియా... జీర్ణక్రియను సవ్యంగా సాగేలా చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూస్తుంది. టొమాటోలు... టొమాటోలు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. పాలు... ఇందులో ఉండే క్యాల్షియం, పొటాషియం, విటమిన్ బి 12 వంటివి ఉంటాయి. ఇవి ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తాయి. బ్రెస్ట్ క్యాన్సర్, కాలన్ క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అరటిపళ్లు... ఇందులో ఉంటే పొటాషియం, శరీర వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది. -
‘విటమిన్ – డి’ తో మధుమేహ నివారణ!
సూర్యుడి నుంచి ఉచితంగా అందే విటమిన్ – డి శరీరానికి చేసే ఉపయోగాలు ఎన్నో. బ్రెజిల్‌లోని ద నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ శాస్త్రవేత్తలు చేసిన తాజా పరిశోధనలు, విటమిన్ – డి ద్వారా మధుమేహం రాకుండా చూసుకోవచ్చు అని చెబుతున్నాయి! కొన్ని ఇతర పరిశోధనలు కూడా విటమిన్ – డి ద్వారా రక్తంలోని గ్లూకోజ్ మోతాదులను నియంత్రించుకోవచ్చునని చెబుతూండటం విశేషం. విటమిన్ – డి లేమి రక్తంలోని గ్లూకోజ్ మోతాదులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు బ్రెజిల్ శాస్త్రవేత్తలు దాదాపు 680 మంది మహిళలపై పరిశోధన చేశారు. దాదాపు 34 శాతం మంది డి – విటమిన్‌ను వాడుతూండగా.. వారిలో గ్లూకోజ్ మోతాదులు తగు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. మాత్రల రూపంలో కాకుండా.. అప్పుడప్పుడూ ఎండలో గడిపిన వాళ్లలోనూ ఇవే రకమైన ఫలితాలు కనిపించాయని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ జో ఆన్ పింకెర్టన్ తెలిపారు. విటమిన్ – డి తక్కువగా ఉంటే రక్తంలో గ్లూకోజ్ మోతాదులు ఎక్కువగా ఉన్నట్లు తమ అధ్యయనం ద్వారా తేలిందని చెప్పారు. మరికొన్ని విస్తృత పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకుంటే మధుమేహ నియంత్రణకు చౌకైన కొత్తమార్గం లభిస్తుందని వివరించారు. -
ఆరోగ్య ఫలం గుడ్ ఫుడ్
పనస లేదా దానిమ్మ వంటి పండ్లలోని భాగాలను తొనలు అంటారు. కానీ చిత్రమేమిటంటే.. సీతాఫలంలోని గింజలకు చుట్టుకొని ఉండే కమ్మని, తియ్యని తినే భాగాల్ని కండ్లు అంటారు. సీతాఫలాలను తింటే కళ్లకు మేలు. అందులో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ కంటి చూపు చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. ఈ కారణంతో పాటు, కళ్లను పోలిన గింజల వల్లనే వాటిని కళ్లు అంటారేమో! అయితే ఒక్క చూపును పదిలంగా ఉంచడం మాత్రమే కాదు.. ఈ పండుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఇవి కొన్ని. సీతాఫలాల్లోని విటమిన్–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. సీతాఫలంలో పొటాషియమ్ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత (అనీమియా)ను సమర్థంగా అరికడతాయి. సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్ కలిసి మలబద్ధకం వంటి సమస్యను నివారిస్తాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా సీతాఫలం ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని మెగ్నీషియమ్ కారణంగా రక్తప్రవాహం మెరుగుపడటం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలాకాలం పదిలంగా ఉంటుంది. సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్)నూ, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది. సీతాఫలం డిప్రెషన్‌కు స్వాభావిక ఔషధంగా పనిచేస్తుంది.