Health Tips: Know Vitamin D Benefits, Importance And Deficiency Problems In Telugu - Sakshi
Sakshi News home page

Vitamin D Deficiency: విటమిన్‌- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్‌ ఉత్పత్తికి ఇది అవసరం!

Published Sat, Jun 4 2022 9:51 AM | Last Updated on Sat, Jun 4 2022 11:11 AM

Health Tips In Telugu: Vitamin D Importance And Deficiency Problems - Sakshi

శరీరానికి అన్నిరకాల విటమిన్లు అందితేనే ఆరోగ్యంగా ఉండగలం. ఏ విటమిన్‌ తగ్గినా.. అనారోగ్యాలు దాడి చేసేందుకు సిద్ధమవుతాయి. ముఖ్యంగా శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్‌–డి లోపిస్తే.. నరకం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో డి విటమిన్‌ లోపం వల్ల తలెత్తే సమస్యలు తెలుసుకుందాం. 

విటమిన్‌–డి అనేది కొవ్వులో కరిగే ముఖ్యమైన విటమిన్‌. ఇది ఆహారం ద్వారా లభిస్తుంది. లేదా శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది.
విటమిన్‌–డి లోపం.. శరీర కండరాల పనితీరును ప్రభావితం చేస్తుంది.
కండరాల నొప్పి, నీరసం, ఎముక సాంద్రత, పిల్లల్లో రికెట్స్‌ సమస్యలు ఏర్పడతాయి.
ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించే విటమిన్‌–డి అధిక మొత్తంలో శరీరానికి అందడం చాలా ముఖ్యం.
కొన్ని అధ్యయనాల్లో విటమిన్‌–డి అధిక స్థాయిలో ఉండే వ్యక్తులు ఎంతో ఆరోగ్యంగా... చురుగ్గా ఉన్నట్లు వెల్లడి అయింది.  

విటమిన్‌ డి ఎందుకు అవసరం?
విటమిన్‌–డి ఎముకల జీవక్రియకు అవసరమైన హార్మోన్‌ ఉత్పత్తికి, కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అవసరం.
రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది.
శరీర కణజాలాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
చర్మానికి సూర్యరశ్మి తగిలినప్పుడు ‘సన్‌షైన్‌ విటమిన్‌’ ఉత్పత్తి అవుతుంది. ఇది ఆరోగ్యాన్ని అందిస్తుంది.
శీతాకాలంలో శరీరానికి విటమిన్‌ ఈ లభించాలంటే కనీసం 10–30 నిమిషాలు సూర్యరశ్మి తగలాలి.

లోపిస్తే ఏమవుతుంది?
విటమిన్‌–డి లోపిస్తే.. పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.
పిల్లల్లో ఎముకల వృద్ధికి ఆటంకం ఏర్పడుతుంది.
పెద్దవారిలో ‘ఆస్టియోమలాసియా’ ఏర్పడుతుంది.
కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్‌ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్‌ బైపాస్‌ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి–విటమిన్‌ లోపాన్ని ఎదుర్కొంటారు.
ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం లేదా శరీరానికి సూర్యరశ్మి తగినంతగా అందకపోవడం వల్ల ఈ లోపం ఏర్పడుతుంది.

చదవండి👉🏾 Vitamin C Deficiency: విటమిన్‌ ‘సి’ లోపిస్తే జరిగేది ఇదే.. ఇవి తింటే మేలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement