Health Tips: ఈ హెర్బల్‌ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. | Health Tips Build Your Immunity With This Ajwain Jeera Herbal Tea | Sakshi
Sakshi News home page

ఈ హెర్బల్‌ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా..

Published Fri, Oct 8 2021 9:57 AM | Last Updated on Fri, Oct 8 2021 7:49 PM

Health Tips Build Your Immunity With This Ajwain Jeera Herbal Tea - Sakshi

ఓ వైపు కోవిడ్‌, మరోవైను డెంగ్యూ, ఫ్లూ, చికెన్‌గున్యా.. రోగాలు. ​ఎటునుంచి ఓ వ్యాధి సోకుతుందో తెలియని సందిగ్ధం. అదేంటో కొందరు దేనినైనా తట్టుకుని దృఢంగా నిలబడతారు. మరికొంతమందేమో చిన్న పాటి జలుబుకు కూడా బెంబేలెత్తిస్తారు. ఇమ్యునిటీ సిస్టంలో వ్యత్యాసాలే ఇందుకు బలమైన కారణం. వంటగదిలో దొరికే తేలికపాటి పదార్ధాలతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ హెర్బల్‌ టీ తో మీ రోగనిరోధకతను పెంచుకోవచ్చని డా. అంజలి శర్మ చెబుతున్నారు. దాన్ని తయారుచేసుకునే విధానం మీ కోసం..

కావల్సిన పదార్ధాలు
►2 కప్పుల నీళ్లు
►గళ్ల ఉప్పు (తగినంత)
►1/4 టీ స్పూన్‌ వాము (కరోమ్‌ సీడ్స్‌ లేదా అజ్వైన్‌)
►1/4 టీ స్పూన్‌ జీలకర్ర
►1/4 టీ స్పూన్‌ పసుపు
►లవంగం ఒకటి
►ఒక టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి
►అర టీస్పూన్‌ సోంపు గింజలు

తయారీ విధానం
ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి. తర్వాత అన్నింటినీ మరిగే నీళ్లలో వేసి మూత పెట్టి 3 నుంచి 4 నిముషాలపాటు మరగనియ్యాలి. తర్వాత వేడి వేడిగా తాగాలి.

ప్రయోజనాలు..
ఈ హెర్బల్‌ టీలోని వాము, జీలకర్ర, సోంపు గింజలు మీ రోగనిరోధకతను పెంచడమేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి. తాపాన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే పసుపు శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడి రక్షణ నిస్తుంది. ఈ టీ ప్రతి ఉదయం తాగితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు డా. అంజలి శర్మ సూచిస్తున్నారు.

చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్‌ ‘ఎ’ ఆహారం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement