herbal
-
ఔషధ మొక్కల వ్యాపారంపై శిక్షణ
సుగంధ మొక్కల వ్యాపార అవకాశాలపై 10 రోజుల ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుజరాత్ ఆనంద్‌లోని ఐసిఎఆర్ సంస్థ అయిన డైరెక్టరేట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమేటిక్ లాంట్స్ రీసెర్చ్‌కు చెందిన మెడి–హబ్ ఆగస్టు 1 నుంచి 12వ తేదీ వరకు రోజుకు జరుగుతుంది. రెండు విడతలుగా మొత్తం 5.30 గంటలపాటు ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. ఉ. 10 గం. నుంచి మ. 12.30 వరకు, మ. 2 గం. నుంచి సా. 5.30 వరకు ఇంగ్లీష్/హిందీలో జూమ్ ద్వారా శిక్షణ ఇస్తారు. వివరాలకు.. డా. స్నేహల్కుమార్ ఎ పటేల్, వాట్సాప్: 99098 52552. ఆసక్తి ఉన్న వారు ఈ గుగుల్ ఫామ్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలి -
సౌందర్యమైన ‘బ్లూ టీ’ తో ఆరోగ్య ప్రయోజనాలెన్నో! ఎలా చేసుకోవాలి?
ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్‌టీ పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి. పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.బ్లూటీ తయారీనాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి. నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని హనీ, లేదా పంచదార, నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు. ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు. -
కొలెస్ట్రాల్ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!
ఊబకాయం, లేదా ఒబెసిటీ అనేక రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్ లాజ్ జర్నీ అనుకున్నంత ఈజీకాదు. దీనికి పట్టుదల, జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం తప్పనిసరి. ఈ క్రమంలో చెడు కొలెస్ట్రాల్‌కి చెక్ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్ గురించి తెలుసుకుందాం. కరివేపాకు: ప్రతి వంటలోనూ కరివేపాకును ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా కడగాలి. చీడపీడలు లేని ఆకులను తీసుకోవాలి. కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు. కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు. కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. నేరేడు ఆకులు : మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది. జామున్ ఆకులను శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు. మెంతి ఆకులు: మెంతి కూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. తులసి ఆకులు : తులసి పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం. జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా చాలా మంచిది. అలోవెరా: కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ ఇది చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అలోవెరా గుజ్జును తీసుకుంటే కొలెస్ట్రాల్ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు కూడా ఇది దివ్యౌషధం. పైన పేర్కొన్న వాటి అన్నింటిలో కావాలంటే కొత్తిగా తేనెను యాడ్ చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
ఇంగువతో ఇన్ని లాభాలా? బరువును తగ్గించే మ్యాజిక్ డ్రింక్
అసాఫెటిడా, హింగ్ లేదా ఇంగువగా ప్రసిద్ధి చెందింది. రుచి , ఘాటైన వాసనతో ఉండే భారతీయ వంటకాల్లో వాడే కీలకమైన సుగంధ ద్రవ్యం. పూర్వకాలం నుంచే భారతీయులు సుగంధ ద్రవ్యాలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇంగువను ప్రతిరోజు వంటకాలలో ఉపయోగిస్తే శరీరానికి మంచిదని ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు, దుష్ప్రభావాలు గురించి తెలుసుకుందాం. సాంబారు, పప్పు, పులుసుకూరలు, పచ్చడి తాలింపులలో మాత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే. మంచి వాసన, రుచితోపాటు, ఇంగువ అనేక రకాల ఆరోగ్య సమస్యలను నయం చేస్తుంది. ఇంగువ ఆరోగ్య ప్రయోజనాలు బరువు తగ్గడానికిమ్యాజిక్ డ్రింక్: ఇంగువ నీరు తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇంగువ నీరు మ్యాజిక్‌లా పనిచేస్తుందని చెబుతారు. ♦జీర్ణక్రియనుమెరుగుపరుస్తుంది గ్యాస్, ఉబ్బరం, అపానవాయువు వంటి కడుపు రుగ్మతల నివారణలో ఉపయోగపడుతుంది. కడుపు పూత,కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడేవారు ఇంగువ వాడి, దీన్ని అధిగమించవచ్చు. ఛాతీపై పూయడం వల్ల ఆస్తమా, కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ యాంటీవైరల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న కారణంగా ఇది ఉబ్బసం, బ్రోన్కైటిస్, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తుంది. ♦ ఇంగువ సహజ యాంటిడిప్రెసెంట్.ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడేవారికి ఇంగువ మంచి మందు. ♦లైంగిక సమస్యలకు: నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇది బాగా సహాయపడుతుంది. అకాల స్కలన సమస్యకు కూడా బాగా పనిచేస్తుందని అని నిపుణులు చెబుతున్నారు. స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుందట కేన్సర్ ప్రమాదం: కేన్సర్ కణితి, పరిమాణాన్ని తగ్గించడంలో ఇంగువ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. కేన్సర్ వ్యాప్తిని అరికడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్ కణాలతో పోరాడుతాయి. ♦ఊపిరితిత్తులు, కాలేయం ,మూత్రపిండాలలో మెటాస్టాసిస్ నివారణలో పనిచేస్తుంది. మెదడులోని రక్త నాళాలలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయ పడుతుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. ♦ యాంటీ ఏజింగ్: చర్మం ముడతలు, కళ్ల క్రింద నల్లటి వలయాలు ముఖంపై ముడతలను కూడా తొలగిస్తుంది. ఇందులోని టైరోసిన్ నిస్తేజమైన చర్మానికి మెరుపునిస్తుంది. ♦ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది కీళ్ల నొప్పి, వాపు తగ్గించే అనాల్జేసిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ,రిలాక్సింగ్ లక్షణాలను కలిగి ఇంగులో ఉన్నాయి. ♦ పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి లేదా తిమ్మిరితో బాధపడుతుంటే ఇంగువ దివ్యవౌషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే మూలకాలు బహిష్టు సమయంలో నొప్పిని తగ్గించడంతో పాటు ఇతర సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడతాయి. ♦ పంటి నొప్పికి కూడా ఇంగువ మంచి ఫలితాలనిస్తుంది.ఇంగువలో నొప్పి నివారణ గుణాలు అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి నొప్పి తగ్గించి ఉపశమనాన్ని అందిస్తాయి. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
ముఖం ముత్యంలా కాంతిగా మెరిసిపోవాలంటే ఇలా చేయండి!
పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేకుండా ఇంట్లో దొరికే వాటితోనే ముఖాన్ని ముత్యంలా మెరిసేలా చెయ్యొచ్చు. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇంతకీ ఆ హెర్బల్ ఫేస్‌ప్యాక్‌లు ఏంటో చూద్దామా!. ఇంట్లో రోజూ వాడే వాటితోనే చేసుకోగలిగిన ట్రీట్మెంట్లు. ఇక్కడ ఇచ్చినవన్నీ ఎటువంటి సైడ్ఎఫెక్ట్స్ లేని హెర్బల్ ఫేస్‌ప్యాక్‌లు. చందనం ముఖం మీద ఉన్న నల్లటి మచ్చలను తొలగించడంతోపాటు మొటిమలు, యాక్నేతోపాటు వేడితో చర్మం పొంగినప్పుడు వచ్చిన ఎర్రటి మచ్చలను కూడా తొలగిస్తుంది. చందనంలో పన్నీరు కలిపి ప్యాక్ వేస్తుంటే మంచి ఫలితాన్నిస్తుంది. ఎండకాలంలో ఈ ప్యాక్ వేస్తుంటే శరీరానికి చల్లదనాన్నిస్తుంది. బొప్పాయి చెక్కు, అరటి తొక్కలు కూడా సౌందర్య సాధనాలే. వీటిని లోపలి వైపు (గుజ్జు ఉండే వైపు) చర్మానికి అంటేలా రుద్ది పది నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తుంటే క్రమంగా ముఖం స్వచ్ఛంగా ముత్యంలా మెరుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టీ స్పూన్ పాలపొడి కాని తాజా పాలు కాని కలిపి ముఖానికి అప్లయ్ చేసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజూ చేస్తుంటే రెండు వారాలకు ఇనుమడించిన చర్మకాంతి స్పష్టంగా కనిపిస్తుంది. చర్మాన్ని నునుపుగా కాంతివంతంగా చేయడంలో కమలా, బత్తాయిపండ్లు బాగా పని చేస్తాయి. ఈ రెండింటిలో ఏదో ఒక రసాన్ని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ముఖానికి రాసి ఐదు నిమిషాల సేపు మర్దన చేయాలి. ఇవి ముఖాన్ని క్లియర్‌గా చేయడంతోపాటు స్కిన్ టోనర్‌గా కూడా పనిచేస్తాయి. (చదవండి: పండ్లపై స్టిక్కర్లు ఎందుకు అంటిస్తారో తెలుసా?) -
చెప్పేది నాటువైద్యం, చేసేది దోపిడీలు
సాక్షి, బనశంకరి: ఆయుర్వేద మూలికలతో చికిత్స చేస్తామని చెప్పుకుంటూ ప్రజలవద్ద నుంచి డబ్బు దండుకుని వంచనకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం బెంగళూరు విల్సన్ గార్డెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు మహమ్మద్ సమీన్ అలియాస్ డాక్టర్ మల్లిక్, సైఫ్ అలీ, మహ్మద్ రహీస్. ఇంటికెళ్లి రూ.8.8 లక్షలతో పరారు వివరాలు... నెలమంగల వద్ద టెంట్లు వేసుకుని నాటు మూలికలు ప్రదర్శిస్తూ మొండి రోగాలను నయం చేస్తామని ప్రజలను నమ్మించేవారు. శాంతినగర బసప్పరోడ్డు నివాసి పంకజ్‌ఠాకూర్ తన తల్లికి కాలి నొప్పికి చికిత్స చేయాలని వీరిని గత నెల 16 తేదీన ఇంటికి తీసుకెళ్లాడు. చికిత్స చేయడానికి ఖర్చవుతుందని వారిని మాటల్లో పెట్టి రూ.8.8 లక్షలు తీసుకుని ఉడాయించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో డీసీపీ శ్రీనివాసగౌడ, ఏసీపీ నారాయణస్వామి ఆధ్వర్యంలో ముఠాను గాలించి పట్టుకున్నారు. వారి నుంచి నాలుగుకార్లు, మూడు ద్విచక్రవాహనాలు రూ.3.50 లక్షలు నగదు, నాటు మూలికలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా వైద్యం పేరుతో ఎంతోమందిని మోసగించినట్లు అనుమానాలున్నాయి. (చదవండి: స్నేహితురాలి ఇంటికే కన్నం..మహిళకు ఆరేళ్లు జైలు శిక్ష) -
దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధం వాసా తులసి ప్లస్ ప్రవేశపెట్టింది. వైద్యపరంగా నిరూపితమైన వాము పువ్వు, ప్రిమ్ రోజ్, తాలీస పత్రం, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనా ఇందులో వాడారు. కఫాన్ని తొలగించడానికి వస, వాము సాయపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ఆస్తమా, దగ్గు-జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సైనసైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు. ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ -
షుగర్, అధికబరువుకు చెక్ చెప్పండిలా!
-
Kondagattu: ఔషధాల ‘కొండగట్టు’
కొండగట్టు(చొప్పదండి): ఉత్తర తెలంగాణలోనే ప్రసిద్ధ ఆధ్యాత్మిక నిలయం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయం. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని కొండపై ఈ క్షేత్రం ఉంది. సంవత్సరం పొడవునా ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఆరోగ్యం బాగోలేకపోయినా, మతిస్థిమితం సరిగా లేకపోయినా కొద్దిరోజులు కొండపై నిద్రచేస్తే నయం అవుతుందని భక్తుల విశ్వాసం. అయితే కొండపై ఆధ్యాత్మికతతో పాటు ఔషధ మూలికలు ఉన్నాయని ఇటీవల శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర ఆచార్యుల పరిశోధనలో వెల్లడైంది. 333 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండపై 300 రకాల ఔషధ మూలికల చెట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ చెట్టుపేరు కుమ్మరిపోనికి. ఇలాంటి మొక్కలు, చెట్లు కొండపై వందల సంఖ్యలో ఉన్నాయి. తెలుపు రంగులో ఉంటుంది. ప్రత్యేకంగా నిర్మల్ కొయ్యబొమ్మల తయారీలో వాడుకోవచ్చు. ఈ మొక్కలను వెటర్నరీ మందుల తయారీకి కూడా వాడుకోవచ్చని, మొత్తంగా కొండగట్టు అటవీ ప్రాంతాన్ని ‘కుమ్మరిపోనికి’ ఫారెస్టుగా కూడా పిలుస్తారని శాతవాహనయూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి వెల్లడించారు. 333 ఎకరాలు.. 300 రకాల మొక్కలు కొండగట్టు గుట్ట విస్తీర్ణం 333 ఎకరాల్లో ఉంటుంది. కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ దాటాక కొండపైకి చేరుకునే మార్గంలో, ఘాట్‌రోడ్డు మార్గంలో, ఆలయం ఆవరణలో 300 రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని ఇటీవల నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. గతంలోనూ కొండగట్టు అటవీప్రాంతంపై ఎస్సారార్ కళాశాల అధ్యాపకులు పరిశోధన చేశారు. మళ్లీ కొన్నేళ్లతరువాత శాతవాహన యూనివర్సిటీ వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు నరసింహమూర్తి, విద్యార్థి బాణవత్ సురేశ్ నాయక్ పరిశోధనలు చేయగా.. ఔషధమొక్కల గురించి తెలిసింది. జీవవైవిధ్యపరంగా ఇవి చాలా ముఖ్యమైనవని, వస్తువుల తయారీ, మనుషులు, జంతువుల మందుల తయారీలో ఉపయోగపడతాయని వారు వెల్లడించారు. మొక్కలు.. లాభాలు కొండగట్టు ప్రాంతంలో ఉన్నవి గిరి అడవులు(హిల్ఫారెస్ట్). ఎక్కువగా కుమ్మరిపోనికి చెట్లు ఉంటాయి. ఇవీ తెలుపు రంగులో ఉంటాయి. వృక్షశాస్త్ర పరంగా కైరోకార్పస్ అమెరికాన్స్గా పిలవబడతాయి. ప్రధానంగా ఎడ్లపాల, పాలకొడిసె, బిల్లుడు, తపసి, ఎర్రబోరుగా, నల్లకోడిసా, అందుకు, నల్లగా, ఎక్కువశాతం కుమ్మరిపోనికి, బ్యూటియా మోనోస్పెర్మ, టేకు, పోంగా, మియాపిన్, ఏటా కానుగు, తెల్లపోనికి, టేకు, నల్లాకోడిషా చెట్లతో పాటు వందల సంఖ్యలో ఔషధమొక్కలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా మొత్తంగా కొండగట్టులోనే ఇలాంటి ఔషధమొక్కలు ఉన్నాయి. ఇవీ కొండపై ఆక్సిజన్ కలుషితం కాకుండా చేస్తాయి. వివిధ రకాల రోగాలు నయమయ్యేందుకు పనిచేస్తాయి. వర్షపాతం నమోదుకు దోహదపడి వర్షాలు పడేందుకు ప్రధానభూమిక పోషిస్తాయి. రామగిరి గుట్టల్లోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయి. ఇతిహాసం చెబుతోందిదే..! ఇతిహాసంలో రామరావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడి ప్రాణానికి అపాయం ఏర్పడినప్పుడు హనుమంతుడు సంజీవనిని తీసుకెళ్తున్న క్రమంలో కొండనుంచి ఓ రాయి పడి.. కొండగట్టుగా వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వందలాది ఔషధమొక్కలు కొండపై పెరిగాయని, అవన్నీ ప్రాణాపాయంలో, దీర్ఘకాలికవ్యాధులతో బాధపడేవారికి సంజీవనిగా పనిచేస్తాయని, అందుకే చాలామంది అనారోగ్యంతో బాధపడేవారు కొండపై నిద్రచేస్తే, రోగాలు నయం అవుతున్నాయని భక్తుల విశ్వాసం. అడవి రక్షణ మనబాధ్యత వందలాది ఔషధమొక్కలున్న కొండప్రాంతంలోని అడవిని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఇప్పటికే ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. రోడ్డు, రైలుమార్గంతో ప్రజారవాణా పెరుగుతోంది. కొండపైకి వచ్చే భక్తులు విలువైన చెట్లను వంటచెరుకుగా వినియోగించడంతో అడవులు అంతరించిపోతున్నాయి. కొండగట్టు జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు మార్గాలు సిద్ధం చేశాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవవైవిధ్యమండలికి అందిస్తాం. రాబోయేకాలంలో గుట్టపై సీట్బాల్ విసిరేలా సర్కారును కోరుతాం. కొండగట్టు పరిసర ప్రాంతాల వారు, వచ్చే భక్తులకు ఈ విషయంలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తాం. మా పరిశోధన కూడా ఇంకా పూర్తికాలేదు... కొనసాగిస్తాం. – డాక్టర్ ఎలగొండ నరసింహమూర్తి, శాతవాహన విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్ర సహాయక ఆచార్యుడు మొక్కల సంరక్షణకు కృషి చెట్లతోనే మానవ మనుగడ. అవిలేకుంటే మనమూ లేము. కొండపై ఉన్న విలువైన ఔషధమొక్కల సంరక్షణ కోసం తోటమాలిని ఏర్పాటు చేశాం. ప్రతీ మొక్కకి నిత్యం నీరు పట్టడమే కాకుండా, నిత్యం సంరక్షిస్తున్నాం. కొండకు వచ్చే భక్తులకు చెట్ల ద్వారా ప్రశాంత వాతవరణం అందుబాటులో ఉంటోంది. నిత్యం నేనూ మై లైఫ్.. మై ట్రీస్ అనే విధంగా ఉంటా. – వెంకటేశ్, ఈవో, కొండగట్టు -
Health Tips: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా..
ఓ వైపు కోవిడ్, మరోవైను డెంగ్యూ, ఫ్లూ, చికెన్‌గున్యా.. రోగాలు. ఎటునుంచి ఓ వ్యాధి సోకుతుందో తెలియని సందిగ్ధం. అదేంటో కొందరు దేనినైనా తట్టుకుని దృఢంగా నిలబడతారు. మరికొంతమందేమో చిన్న పాటి జలుబుకు కూడా బెంబేలెత్తిస్తారు. ఇమ్యునిటీ సిస్టంలో వ్యత్యాసాలే ఇందుకు బలమైన కారణం. వంటగదిలో దొరికే తేలికపాటి పదార్ధాలతో సింపుల్‌గా తయారు చేసుకునే ఈ హెర్బల్ టీ తో మీ రోగనిరోధకతను పెంచుకోవచ్చని డా. అంజలి శర్మ చెబుతున్నారు. దాన్ని తయారుచేసుకునే విధానం మీ కోసం.. కావల్సిన పదార్ధాలు ►2 కప్పుల నీళ్లు ►గళ్ల ఉప్పు (తగినంత) ►1/4 టీ స్పూన్ వాము (కరోమ్ సీడ్స్ లేదా అజ్వైన్) ►1/4 టీ స్పూన్ జీలకర్ర ►1/4 టీ స్పూన్ పసుపు ►లవంగం ఒకటి ►ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ►అర టీస్పూన్ సోంపు గింజలు తయారీ విధానం ఒక గిన్నెలో నీళ్లు పోసి బాగా మరగనియ్యాలి. తర్వాత అన్నింటినీ మరిగే నీళ్లలో వేసి మూత పెట్టి 3 నుంచి 4 నిముషాలపాటు మరగనియ్యాలి. తర్వాత వేడి వేడిగా తాగాలి. ప్రయోజనాలు.. ఈ హెర్బల్ టీలోని వాము, జీలకర్ర, సోంపు గింజలు మీ రోగనిరోధకతను పెంచడమేకాకుండా జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్థాయి. తాపాన్ని నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే పసుపు శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడి రక్షణ నిస్తుంది. ఈ టీ ప్రతి ఉదయం తాగితే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు డా. అంజలి శర్మ సూచిస్తున్నారు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
ఆమె వైద్యురాలు, అతడు నైజీరియన్: రూ.41 లక్షలు ఇచ్చేసింది
సాక్షి, హిమాయత్‌నగర్: హెర్బల్ మందుల వ్యాపారం పేరుతో మెహదీపట్నంకు చెందిన ఓ వైద్యురాలిని నట్టేట ముంచిన నిందితుడిని సిటీ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న పలు బ్యాంకులకు చెందిన డెబిట్, క్రెడిట్ కార్డులను స్వాదీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించారు. నైజీరియాకు చెందిన మెస్సీ డాన్ హో మూడళ్ల క్రితం విజిటింగ్ వీసాపై భారత్‌కు వచ్చాడు. వీసా గడువు ముగియడంతో ఢిల్లీలో అనధికారికంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మెహదీపట్నంకు చెందిన హెర్బల్ వైద్యురాలితో ఫేస్బుక్ ద్వారా ఇటలీ వాసినంటూ పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ల పరిచయంలో ఇటీవల హెర్బల్ ఫార్మూలా, మెడిసిన్స్ పంపిస్తే తమ దేశంలో వ్యాపారం చేసుకుంటానని, ఇందుకు రూ.5 కోట్లు చెల్లిస్తానడంతో వైద్యురాలు నమ్మింది. తనపై నమ్మకం వచ్చేలా ఓ ఎకౌంట్‌కు చెందిన డెబిట్ కార్డును పంపగా..రూ.4వేలు డ్రా చేసిన వైద్యురాలికి ఢిల్లీ కస్టమ్స్ అంటూ ఫోన్ కాల్ వచ్చింది. మీకు వచ్చిన రూ.5కోట్లు తీసుకోవాలంటూ మెస్సీ డాన్ హో నమ్మించారు. ఇందుకు గాను పలు దఫాలుగా రూ.20లక్షలు బదిలీ చేశారు .ఆ తర్వాత తనతో వచ్చిన కుమార్తె కూడా చనిపోయిందనే నాటకం ఆడటంతో మరో రూ.21లక్షలు బదిలీ చేశారు. డాక్టర్ ఇంకా పంపుతూనే ఉండటంతో..ఆమె కుమార్తెకు అనుమానం వచ్చి జూన్ 29న సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు నైజీరియన్ది అంతా డ్రామా, ఇతను ఇటలీ వాసి కాదని, ఇప్పటికే పలువురిని మెసం చేశాడనే విషయాలను రాబట్టి ఢిల్లీలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక ల్యాప్‌టాప్, మూడు సెల్ఫోన్లు, 37 డెబిట్, క్రెడిట్ కార్డులు, 13 బ్యాంకు పాస్‌బుక్స్, 12 బ్యాంక్ చెక్కులు, పలు సిమ్ములు స్వాధీనం చేసుకున్నారు. నగరవాసిపై సైబర్‌నేరస్తుల వల హిమాయత్‌నగర్: లాభాల ఆశ చూపించి 19 మంది నుంచి రూ.12.30 లక్షలు స్వాహా చేశాడో సైబర్ నేరస్తుడు. సికింద్రాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, వారి బంధువులు 13 కలిసి యాప్‌లలో పెట్టుబడి పెట్టేందుకు ప్రయతి్నంచారు. వీరికి ఓ వ్యక్తి పరిచయమై తొలుత రూ.10వేలు కట్టాలన్నాడు. అవినాష్ రూ.10వేలు కట్టగా లాభం రూ.1లక్ష వచ్చింది. దీంతో అందరూ కట్టారు. ఇలా 12.30 లక్షలు చెల్లించారు. లాభం రాకపోవడంతో బాధితులు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూగుల్‌లో విమాన టికెట్ల కోసం వెతికిన బోయినపల్లి వాసి మౌనికకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ప్రయాణ ఆఫర్లు ఉన్నాయని నమ్మించి రూ.1.08 లక్షలు స్వాహా చేశాడు.ఇంజనీరింగ్ పూర్తిచేసిన సనత్‌నగర్ వాసి అనురాధ తన రెజ్యూమ్‌ను క్విక్కర్ డాట్‌కామ్‌లో పోస్ట్ చేసింది. కన్సల్టెన్సీ పేరుతో ఓ వ్యక్తి కాల్ చేశాడు. వివిధ ఫీజుల పేర్లతో రూ.96వేల 500కాజేశాడు. -
హెర్బల్ మిక్చర్‌తో పశువులకు పుష్టి!
సృష్టిలో ఏ ప్రాణికైనా ఆరోగ్యం, దేహదారుఢ్యం ప్రధానంగా 5 క్రియలపై ఆధారపడి ఉంటుంది. అవి: 1. ఉచ్ఛ్వాస 2. నిశ్చ్వాస 3. సేవనం 4.పచనం 5. విసర్జనం. పశువులలో ఈ 5 క్రియలను దృష్టిలో పెట్టుకొని కొన్ని దినుసులతో ఈ రోజు మనం అమృత తుల్యమైన హెర్బల్ మిక్చర్‌ను తయారు చేసుకుందాం. మినరల్ మిక్చర్, కాల్షియంలకు బదులుగా ఈ హెర్బల్ మిక్చర్ ఉపయోగపడుతుంది. ఈ హెర్బల్ మిక్చర్ జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. తద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. దీన్ని తిన్న పశువులు ఎండు/పచ్చి గడ్డి ఎక్కువ తింటాయి. కాబట్టి, ఆ మేరకు దాణాను తగ్గించుకోవచ్చు. గోసంరక్షణ శాలలకు దానాలు ఇచ్చే వారు ఈ హెర్బల్ మిక్చర్‌ను స్వయంగా తయారు చేయించి దానం చేస్తే మేలు జరుగుతుంది. హెర్బల్ మిక్చర్‌కు కావలసిన దినుసులు 1. సొంఠి – 200 గ్రా.: దీన్ని ఆయుర్వేదంలో మహా ఔషధంగా పిలుస్తారు. వాత, పిత్త, కఫ దోషాలను సమతూకం చేయగలదు. ప్రధానంగా ఆమ వాత రోగాన్ని నిర్మూలిస్తుంది. 2. మిరియాలు – 150 గ్రా. : మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ వంటి మినరల్స్ అధికంగా కలిగి ఉండి జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. 3. పిప్పళ్లు – 50 గ్రా. : దీన్ని రసాయన గుణకారిణి అంటారు. అరుగుదలకు బాగా ఉపయోగపడటమే కాకుండా గర్భాశయ శుద్ధికి దోహదపడుతుంది. రక్తాన్ని పెంపొందిస్తుంది. 4. వాములయు మిరియాలు – 50 గ్రా.: దీన్నే వాయు విడంగాలు అని కూడా పిలుస్తారు. జీర్ణవ్యవస్థలో ఉండే పలు రకాల రుగ్మతలను తొలగించడంతో పాటు మంచి డీవార్మింగ్ దినుసుగా ఉపయోగపడుతుంది. 5. తోక మిరియాలు – 50 గ్రా. : వీటిని చలువ మిరియాలు అంటారు. శరీరానికి చలువ చేస్తూ గుండె రక్త ప్రసరణ బాగా జరిగేటట్లు నాలుకపై రుచి గ్రంథుల వృద్ధికి, మూత్ర వ్యవస్థ శుద్ధికి చాలా ఉపయోగకారిణి. 6. వాము – 200 గ్రా.: మనుషులు వామును ఎక్కువగా జీర్ణాశయ సమస్యలకు ఉపయోగిస్తారు. కానీ, పశువుల్లో పాల స్రావాన్ని మెరుగుపరిచే చను గ్రంథులకు శ్రీరామరక్షగా వాము ఉపయోగపడుతుంది. 7. పాల ఇంగువ – 100 గ్రా.: ఇది ఒక యాంటీ మైక్రోబియల్ దినుసు. సుఖ విరేచనకారి గాను, నరాల ఉత్తేజకారిణిగాను ఉపయోగ పడుతుంది. 8. వెల్లుల్లి – 300 గ్రా. : ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అనే నానుడి ఉండనే ఉంది. వెల్లుల్లి కూడా అంతే. ఇది ప్రధానంగా పరాన్న భుక్కులను సమూలంగా నశింపజేస్తుంది. 9. మెంతులు – 150 గ్రా.: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వలన పశువులో పొదుగు వాపు దరిచేరనీయక పాల రుచిని బాగా పెంచుతుంది. 10. మోదుగుపువ్వు – 300 గ్రా.: శివునికి ఇష్టమైన పువ్వు. ఇవి కడుపులోని బద్దె పురుగుల నివారణకు, చర్మ వ్యాధుల వలన వచ్చే దురదలను అలాగే విషతుల్యాల నుంచి రక్షణ కల్పిస్తాయి. 11. దాల్చిన చెక్క – 50 గ్రా.: ఇందులోని 41 సమ్మేళనాలు అనేక రుగ్మతలపై విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పుల నివారిణిగా, మెదడుకు రక్షణ కారిణిగా పనిచేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. 12. నల్లనువ్వులు లేదా వేరు పిసరాకు – 1.5 గ్రా.: జింక్, థయామిన్, ఐరన్, కాల్షియం, విటమిన్–ఇ సమృద్ధిగా ఉండటం వలన వీటిని ఆంగ్లంలో పవర్ హౌజ్ అని పిలుస్తారు. పశువులను ముఖ్యంగా యువి కిరణాల నుంచి నల్ల నువ్వులు రక్షిస్తాయి. నోటి పూతల నివారణకు ఉపయోగపడుతుంది. నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు వేరు పిసర ఆకులో కూడా ఉంటాయి. కాబట్టి ఈ రెండింటిలో దేనినైనా వాడుకోవచ్చు. 13. ఉలవలు 1.5 కిలోలు : వీటిలో పోషక విలువల అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో విశేషంగా పనిచేస్తాయి. 14. తాటి బెల్లం – 1.5 కిలోలు : ఐరన్ అధికంగా ఉంటుంది. జీర్థాశయ ఎంజైముల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. పేగుల్లో ఉన్న విషతుల్యాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. 15. యాలకులు – 50 గ్రా. : యాలకులలో టర్పనైన్, లియోనెన్, టెర్ఫినోల్ లాంటి రసాయనాలు ఉన్నాయి. ఉదర సంబంధమైన అజీర్తి, మలబద్ధకాన్నే కాకుండా అల్సర్‌ను సైతం నివారిస్తాయి. 16. లవంగాలు – 100 గ్రా. : ఇవి రక్తాన్ని గడ్డకట్టడంలోనూ, నొప్పులు, వాపులు నియంత్రించడంలోనూ, రక్త ప్రసరణలోనూ, సంతాన ఉత్పత్తిలోనూ పశువులలో చక్కగా పనిచేస్తాయి. పైన ఉదహరించిన దినుసులను దంచి మిశ్రమంగా చేసుకొని తగు పాళ్లలో ఆవ నూనె (750 ఎం.ఎల్. నుంచి ఒక లీటరు వరకు) కలుపుకొని తడి తగలకుండా 2 నెలల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. వాడే విధానం : పెద్ద పశువులకు రోజుకోసారి 50 గ్రా. మోతాదులో, దూడలకు రెండు నెలలు దాటిన దగ్గర నుంచి 5–20 గ్రాముల మోతాదులో తినిపించాలి. ప్రతి రోజూ అక్కర్లేదు. వరుసగా నెలకు 10–15 రోజులకు తగ్గకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంతో పశువులను అనేక రుగ్మతల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాకుండా దుకాణాల్లో దొరికే మినరల్ మిక్చర్, కాల్షియం వాడకంతో పని లేకుండా అనేక సమస్యలకు ఇది ఒక మంచి పరిష్కారం. పైన చెప్పిన మోతాదులో తయారుచేసుకున్న హెర్బల్ మిక్చర్ 10 పెద్ద పశువులకు, 5 దూడలకు (10 రోజులు) సరిపోతుంది. – వల్లూరు రవి కుమార్ (90300 17892), సురభి గోశాల వ్యవస్థాపకులు,పేరకలపాడు, కంచికచర్ల మం., కృష్ణా జిల్లా, ఏపీ ప్రభుత్వ గోపుష్టి ప్రాజెక్టు సలహాదారు, డా.వైఎస్సార్ జీవన సాఫల్య పురస్కార గ్రహీత. -
ఆనందయ్య మందు: జగపతి బాబుపై బాబు గోగినేని సెటైర్లు
ఒకపక్క కరోనాకు విరుగుడుగా, సంజీవనిగా ఆనందయ్య మందును లక్షలమంది భావిస్తుంటే.. మరోవైపు హేతువాది బాబు గోగినేని మొదటి నుంచి మందు శాస్త్రీయతపై వెటకారం ప్రదర్శిస్తూ వస్తున్నాడు. అయితే ఆనందయ్య మందుకు టాలీవుడ్ నటుడు జగపతి బాబు సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగపతి బాబును టార్గెట్ చేస్తూ బాబు గోగినేని వ్యంగ్యంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశాడు. ‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్ పెట్టారు బాబు గోగినేని. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ, జూబ్లిహిల్స్‌లో ఆస్పత్రి తెరవబోతున్నారంటూ ఓ లోకల్ ఇంగ్లీష్ వెబ్ సైట్లో వార్త వచ్చింది. ఆ వార్తను ఆధారంగా చేసుకుని ఇలా జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని. మరి దీనిపై జగపతి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి. అయితే ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా అంటూ గతంలో జగపతి బాబు ఆనందయ్య మందుకు సంపూర్ణ మద్దతు ప్రకటించాడు. ‘ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. ప్రకృతి, భూదేవి తప్పు చేయవు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది. ఈ ప్రపంచాన్ని కాపాడుతుందని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వదించాలి అంటూ ఈ సీనియర్ నటుడు వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆనందయ్య గారి మందు శాస్త్రీయంగా అనుమతి పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. చదవండి: గుర్తుపెట్టుకోండి ఇది వార్నింగ్ మాత్రమే! Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS — Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021 -
హెర్బల్ ఆయిల్ పేరుతో రూ. 52 లక్షలకు టోకరా
సాక్షి, సిటీబ్యూరో : హెర్బల్ ఆయిల్ సరఫరా చేస్తామంటూ హైదరాబాద్‌కు చెందిన ఒకరి నుండి సైబర్ మోసగాళ్లు రూ. 52 లక్షలు స్వాహా చేశారు. ఎస్ఆర్ నగర్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన కె. కొండల్ రెడ్డి వీఎస్ఏ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలను అవసరమైన సామగ్రిని సరఫరా చేసేవాడు. ఆయనకు ఆన్లైన్ ద్వారా జుమాక్ ఫార్మాస్యుటికల్స్ ప్రతినిధిగా చెప్పుకున్న జాన్ డానియల్‌తో పరిచయం ఏర్పడింది. ఆక్సోనో హెర్బల్ ఆయిల్ లిక్విడ్ కావాలని అతను కొండల్‌రెడ్డిని కోరాడు. అయితే జుమాక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా చెప్పుకున్న మరో వ్యక్తితో లావాదేవీలు నిర్వహించిన కొండల్ రెడ్డి సదరు ఆయిల్ కొటేషన్‌ను అతనికి పంపాడు. తర్వాత వారు తమకు తొలివిడతగా 500 లీటర్ల ఆక్సోనో హెర్బల్ ఆయిల్ కావాలని కొండల్‌రెడ్డికి ఆర్డర్ చేశాడు. జుమాక్ సంస్థ ప్రతినిధులు సూచించిన విధంగా ఈ ఆయిల్ కోసం కొండల్ రెడ్డి మణిపూర్‌లోని ఆర్కే ఎంటర్ప్రైజెస్ ప్రతినిధిగా చెప్పుకున్న రాకేష్ కుమార్‌ను సంప్రదించారు. ఆయిల్ సరఫరా కోసం రూ. 42.63 లక్షలను రాకేష్ చెప్పిన ఖాతాలకు పంపాడు. అయినా వారు ఆయిల్‌ను పంపలేదు. ఈలోగా ఆర్కే ఎంటర్ప్రైజెస్ ప్రతినిధిగా చెప్పకున్న హరిప్రీత్... కొండల్ రెడ్డికి ఫోన్ చేసి మరో రూ. 10 లక్షలు పంపాలని లేని పక్షంలో ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని చెప్పాడు. దీంతో వారు చెప్పినట్టుగానే రూ.10 లక్షలు పంపినా ఆయిల్ రాకపోగా... ఆర్కే ఎంటర్ప్రైజెస్ ప్రతినిధిలుగా చెప్పుకున్న రాకేష్ కుమార్, హరిప్రీత్‌ల ఫోన్లు స్విచాఫ్ అయ్యాయి. మోసపోయానని గ్రహించిన బాధితుడు కొండల్‌రెడ్డి మంగళవారం ఎస్ఆర్నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అజయ్‌కుమార్ తెలిపారు. -
మరో వింత.. ఈ చీరతో కరోనాకు చెక్?!
భోపాల్: కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో ప్రస్తుతం దేశంలో ప్రతి ఒక్కరు రోగనిరోధక శక్తి(ఇమ్యూనిటీ) పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం వెరైటీగా రోగనిరోధకత పెంచే చీరలు వచ్చాయి. మీరు చదివింది వాస్తవమే.. రోగనిరోధక శక్తి పెంచే చీరలను ‘ఆయుర్‌వస్త్రా’ పేరుతో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు తెలుపుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని. ఫలితంగా కరోనా వైరస్ మన దరిచేరదంటున్నారు కార్పొరేషన్ అధికారులు. (ఇమ్యూనిటీ బూస్టర్: వాస్తవమెంత?) యాలకులు, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్‌కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమన్నారు మాలేవర్. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు. వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి.. దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్, ఇతర దుస్తులు తయారు చేస్తారు. ఈ పద్దతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6రోజులు పడుతుందని తెలిపారు. (కరోనా పేరిట కొత్త వ్యాపారాలు) రెండు నెలలు శ్రమించి ఈ పద్దతి కనుగొన్నాం.. ఈ సందర్భంగా వినోద్ మాలేవర్ మాట్లాడుతూ.. ‘ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్దతి. ఈ బట్టల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది. ఈ దుస్తులను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ రకం దుస్తులను తయారు చేయడానికి దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్దతిని కనుగొన్నాము. ఈ దుస్తులలో రోగనిరోధక శక్తి పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుంది’ అని తెలిపారు మాలేవర్. మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ..‘ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని పెంచే పురాతన వస్త్రాల తయారీ విధానాన్ని పునరుద్ధరించడానికి మాకు అవకాశం లభించింది. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి సమయంలో మేం జనాలకు మేలు చేసే హెర్బల్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చాం. ప్రస్తుతం రోగనిరోధకత పెంచే ఈ చీర ధర 3 వేల రూపాయలు’ అన్నారు. (వామ్మో.. చై'నో'..) అంతేకాక ‘ప్రస్తుతం మేము ఈ చీరలను భోపాల్, ఇండోర్లలో విక్రయిస్తున్నాము. రాబోయే రోజుల్లో, ఈ చీరలను దేశవ్యాప్తంగా ఉన్న మా 36 షోరూమ్‌లలో విక్రయిస్తాము’ అని తెలిపారు రాజీవ్ శర్మ. అయితే ఈ చీరలు, మాస్క్‌లు ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించడానికి ఎలాంటి వైద్య ఆధారాలు లేవు. ముఖ్యంగా ఈ దుస్తులు కరోనా వైరస్ సంక్రమించకుండా కాపాడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధాలు లేకపోవడం గమనార్హం. -
చౌకగా ఎండబెట్టేద్దాం!
ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రైతులు ఆ రోజుకారోజే తక్కువ ధరకు తెగనమ్మేసుకుంటూ నష్టపోతూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు, పుట్టగొడుగులను నిల్వ పెట్టుకునే సదుపాయాల్లేకపోవడమే ఇందుకు కారణం. అయితే, వీటిని పల్చటి ముక్కలుగా కోసి సోలార్ డ్రయ్యర్ల సాయంతో నాణ్యత, పోషకాల సాంద్రత ఏమాత్రం నష్టపోకుండా ఎండబెట్టి దాచుకోవచ్చు. ఎటువంటి రసాయనాలు కలపకుండానే ఏడాది వరకు నిశ్చింతగా గాలి చొరబడని డబ్బాల్లో నిల్వచేసుకోవచ్చు. వీలువెంబడి అమ్ముకోవచ్చు, ఏడాది పొడవునా తమ ఇంటి అవసరాలకూ వాడుకోవచ్చు.అయితే, సోలార్డ్రయ్యర్లు మార్కెట్లో చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఈ దిశగా రైతులు ఆకర్షితులు కావడం లేదు. సోలార్ డ్రయ్యర్ల ధరలు ఎక్కువగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు, కింది మధ్యతరగతి ప్రజలకు ఇవి అందుబాటులో లేవు. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు. 5 కిలోల డ్రయ్యర్ వెల రూ. 5,500 టన్నెల్ సోలార్ డ్రయ్యర్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రావడం ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వరుణ్ రహేజా అనే యువ ఇంజినీర్ ఇందుకు శ్రీకారం చుట్టాడు. గృహస్తులు, చిన్న రైతులకు అందుబాటులో ఉండే ధరలకే సోలార్ డ్రయ్యర్లను అందిస్తున్నాడు. 5 కిలోల పండ్లు, కూరగాయలను రెండు రోజుల్లో నాణ్యత, పోషకాలు చెడకుండా ఎండబెట్టే చిన్న డ్రయ్యర్‌ను రూ. 5,500లకు, 20 కిలోల సామర్థ్యం ఉండే డ్రయ్యర్‌ను రూ. 14,500కు అందిస్తున్నాడు. అవసరాన్ని బట్టి పారిశ్రామిక అవసరాల కోసం ఎంత పెద్ద సోలార్ డ్రయ్యర్లనయినా తయారు చేసి ఇస్తానని చెబుతున్నాడు వరుణ్. గత ఏడాది నుంచి ఇప్పటికి 90 డ్రయ్యర్లను అందించానని తెలిపాడు. బీహార్‌లో గ్రామీణులకు పుట్టగొడుగుల ఒరుగులు తయారు చేయడానికి, ఉత్తరాఖండ్‌లో ఔషధ మొక్కలను నాణ్యత చెడకుండా ఎండబెట్టడానికి ప్రభుత్వాల సహకారంతో సరఫరా చేశామని వరుణ్ ‘సాగుబడి’ ప్రతినిధితో చెప్పారు. పొడవాటి గుడారం మాదిరిగా ఉండే డ్రయ్యర్లో గాలి ఎండ వల్ల వేడెక్కుతుంది. ఆ వేడి గాలి సోకడంతో పంట ఉత్పత్తుల ముక్కల్లోని తేమ త్వరగా ఆరిపోతుంది. చిన్న ఫ్యాన్ ఈ ఆవిరిని డ్రయ్యర్లో నుంచి బయటకు పంపుతుంది. లోకాస్ట్ డ్రయ్యర్ల ప్రత్యేకతలు కూరగాయలు, పండ్లు, ఉల్లి, వెల్లుల్లి.. ఏ వ్యవసాయోత్పత్తినైనా సోలార్ డ్రయ్యర్లతో పరిశుభ్రంగా, తక్కువ సమయంలో ఎండబెట్టవచ్చు. ఉదాహరణకు, టమాటాల ముక్కలను మామూలుగా ఎండలో పెడితే 7–8 రోజులకు గానీ పూర్తిగా ఎండవు. సోలార్ డ్రయ్యర్లో అయితే, కేవలం రెండు రోజులు చాలు. ఎండిన తర్వాత కూడా వీటిలో పోషక విలువలు, రుచి, రంగు, సువాసన ఉన్నవి ఉన్నట్టే ఉంటాయి. ఎండే క్రమంలో దుమ్ము ధూళి పడకుండా ఉంటుంది. పురుగులు, పక్షుల, జంతువులు వల్ల కూడా పాడుకావు. వర్షం, మంచులో తడిసినా కూడా ఇబ్బందేమీ ఉండదు. తమ డ్రయ్యర్లను సులువుగా బిగించుకోవచ్చని, సులువుగా విడదీసుకొని తీసుకువెళ్లవచ్చని వరుణ్ తెలిపారు. ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఏడాదిలో 300 రోజులు సౌర విద్యుత్తుతో పనిచేసేలా వీటిని రూపొందించామన్నారు. ఎండబెట్టిన ఉత్పత్తులకు మార్కెట్ ఉంది.. సోలార్ డ్రయ్యర్ల ద్వారా పరిశుభ్రమైన, నాణ్యమైన రీతిలో ఎండబెట్టిన ఒరుగులు, వాటి పొడులకు మార్కెట్లో డిమాండ్‌కు కొరత లేదని వరుణ్ చెబుతున్నారు. సోలార్ డ్రయ్యర్లతో తమ ఉత్పత్తులను ఎండబెట్టుకొని ఎటువంటి రసాయనాలను కలపకుండా భ్రదంగా నిల్వ చేసే చిన్న, సన్నకారు రైతులకు వీటిని కొనుగోలు చేసే ఆహార శుద్ధి కర్మాగారాలను పరిచయం చేస్తున్నామని వరుణ్ తెలిపారు. ఒకటి, రెండు డ్రయ్యర్లను కొనుగోలు చేసే వారికి దాన్ని ఎలా బిగించుకోవాలో తెలిపే మాన్యువల్‌ను, వీడియో సీడీని ఇస్తామని, ఫోన్ ద్వారా సూచనలిస్తామన్నారు. తమ డ్రయ్యర్లను ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసే రైతులకు పంట దిగుబడులతో నాణ్యమైన ఎండు ఆహారోత్పత్తుల తయారీలో 3 రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు. పంట దిగుబడులను శుభ్రపరిచి ముక్కలు తరిగే పద్ధతి, నాణ్యత చెడిపోకుండా ఎండబెట్టుకోవడం, గాలి చొరబడని ప్లాస్టిక్/గాజు డబ్బాల్లో ఎండు ఉత్పత్తులను నిల్వ చేసుకోవడంలో శిక్షణ ఇస్తామన్నారు. దీనితోపాటు మార్కెట్ సమాచారాన్ని కూడా అందించడం ద్వారా చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులు వృథాను అరికట్టడం, వారి ఆదాయాన్ని పెంపొందించడం సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన లక్ష్యమని వివేక్ అంటున్నారు. యు.ఎన్.ఈ.పి. ప్రశంస తక్కువ ఖర్చుతో వరుణ్ రూపొందించిన సోలార్ డ్రయ్యర్ల పనితనాన్ని ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం(యు.ఎన్.ఈ.పి.) మెచ్చుకోవడం విశేషం. ‘వరుణ్ తయారు చేసిన సోలార్ డ్రయ్యర్ల వంటి స్వల్పఖర్చుతో కూడిన ఆవిష్కరణలు రైతుల ఆదాయాన్ని పెంచడం ద్వారా పెద్ద మార్పునకు దోహదపడతాయి. అంతేకాకుండా కోత అనంతర నష్టాలను గణనీయంగా తగ్గిస్తాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇదెంతో అవసరం’ అని యు.ఎన్.ఈ.పి.లోని సుస్థిర వ్యవసాయ విభాగం ప్రోగ్రామ్ ఆఫీసర్ క్లెమెంటైన్ ఓ కాన్నర్ అన్నారు. వరుణ్‌ను ఈ–మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. solar.rsfp@gmail.com ‘నానబెట్టిన సిరిధాన్యాలు ఒక్క రోజులో ఎండుతున్నాయి’ వరుణ్ దగ్గర నుంచి 5 కిలోల సామర్థ్యం కలిగిన చిన్న సోలార్ డ్రయ్యర్(రూ.5,500)ను హైదరాబాద్‌కు చెందిన సూర్యప్రకాశ్‌రెడ్డి కొద్ది నెలల క్రితం కొరియర్లో తెప్పించుకున్నారు. సోలార్ డ్రయ్యర్ విడిభాగాలను వరుణ్ సూచించిన ప్రకారం తానే బిగించుకున్నారు. సిరిధాన్యాల బియ్యం నానబెట్టి ఎండబెట్టిన తర్వాత పిండి పట్టించి వినియోగదారులకు విక్రయిస్తూ ఉండే ఆయన సోలార్ డ్రయ్యర్ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నానబెట్టిన సిరిధాన్యాలను సోలార్ డ్రయ్యర్లో ఒక్క రోజులోనే బాగా ఎండుతున్నాయని తెలిపారు. దుమ్ము, పక్షులు, మంచు, వర్షం బెడద లేకుండా కూరగాయలు, పండ్లు వంటివి ఏవైనా నాణ్యత, రంగు చెడకుండా ఎండబెట్టుకోవచ్చని చిరువ్యాపారి సూర్యప్రకాశ్‌రెడ్డి (72999 97993) చెబుతున్నారు. 5 కిలోల సామర్థ్యం గల లోకాస్ట్ సోలార్ డ్రయ్యర్ మామిడి ఒరుగులు, ఎండిన పుట్టగొడుగులు, ఎండిన ఆపిల్ ముక్కలు, అరటి ఒరుగులు -
ఈ సమయంలో హెర్బల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
నా కూతురు ఎక్కువగా హెర్బల్–సప్లిమెంట్లు తీసుకుంటుంది. తాను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఈ సమయంలో హెర్బల్– సప్లిమెంట్లు తీసుకోవచ్చా? విటమిన్స్ తప్పనిసరి అంటారు కదా.... ఇవి సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయగలరు. హెర్బల్ సప్లిమెంట్లు, గర్భంలో ఉన్నప్పుడు తీసుకోకపోవడం మంచిది. వీటికి ప్రభుత్వ ఆమోదం లేదు. మామూలు సమయంలో తీసుకుంటే ఫర్వాలేదు కాని గర్భిణులు ఇవి తీసుకోవటం వల్ల, వాటిలో కొన్ని పదార్థాల వల్ల అబార్షన్లు, నెలలు నిండకుండా కాన్పులు, బ్లీడింగ్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ.కాబట్టి ప్రెగ్నెన్సీలో వాటిని తీసుకోకపోవడం మంచిది.ఫోలిక్ యాసిడ్ అనేది బి కాంప్లెక్స్ జాతికి చెందిన ఒక విటమిన్. దీన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవడం వల్ల, బిడ్డ పెరుగుదలకు, అవయవాలు సరిగా ఏర్పడటానికి, నాడీవ్యవస్థలో లోపాలను చాలావరకు నివారించడానికి ఉపయోగపడుతుంది. ఇది 5ఎంజీ మాత్ర రూపంలో దొరుకుతుంది. ఫోలిక్ యాసిడ్ తాజా ఆకుకూరలు, పప్పులు, బఠానీలు, బీన్స్, పండ్లలో ఎక్కువగా లభిస్తుంది. పైన చెప్పిన ఆహారంతో పాటు, ఫోలిక్ యాసిడ్ మాత్ర కూడా ప్రెగ్నెన్సీ రాకముందు మూడునెలల నుంచే వాడటం మంచిది. అలానే మొదటి మూడునెలలు తప్పనిసరిగా వాడటం వల్ల పిండం సరిగా పెరిగి శిశువుగా రూపాంతరం చెందుతుంది. నాకు జనాంగాల మీద పొక్కులు వస్తున్నాయి. మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు. స్కేబీస్, ఫ్యూబిక్ లైస్ వంటి లైంగికంగా సంక్రమించే వ్యాధుల వల్ల పొక్కులు వస్తాయని ఎక్కడో చదివాను. ఇది నిజమేనా? వివరంగా తెలియజేయగలరు. జనాంగాల మీద పొక్కులు అనేక రకాల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిలో సిఫిలిస్, స్కేబిస్, çప్యూబిక్లెన్ హెర్పిస్, వార్ట్స్ వంటి ఎన్నో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిలో చాలావరకు లైంగిక వ్యాధుల వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి.ఒక్కొక్క ఇన్ఫెక్షన్ని బట్టి జననాంగాల మీద రకరకాల పొక్కులులాగా, నీటిగుల్లలులాగా, చిన్న చీముగడ్డలులాగా ఉండవచ్చు.లైంగికంగా సంక్రమించే వ్యాధులను అరికట్టడానికి కండోమ్స్ వాడుకోవడం మంచిది.అలాగే రక్తహీనత, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా, తొందరగా సంక్రమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి, జననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం, వ్యాయామాలు చెయ్యడం వంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను అరికట్టవచ్చు, ఎక్కువగా వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే పొక్కులు ఎటువంటి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందో పరీక్ష చేసి, నిర్ధారణ చేసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అవి ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉంటాయి. ప్రసవమయ్యాక బాలింతల రొమ్ముల ఆకృతిలో మార్పులు వస్తాయని, వాపు వస్తుందని, ఇబ్బందిగా ఉంటుందని విన్నాను. ఇలా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? ప్రసవమయ్యాక కంటే గర్భవతిగా ఉన్నప్పటి నుంచే శరీరంలో మార్పులలాగే, రొమ్ములలో కూడా పాలు తయారుకావటానికి అనుగుణంగా మార్పులు మొదలవుతాయి. ఇందులో భాగంగా రొమ్ములు సైజు పెరుగుతాయి. నిపుల్ చుట్టూ వలయాకారం నల్లగా ఏర్పడుతుంది. కొందరిలో నల్లగా లేక ఎర్రగా రొమ్ముపైన స్ట్రెచ్‌మార్క్స్ ఏర్పడుతాయి.కాన్పు తర్వాత పాలు పడటం మొదలయ్యి, రొమ్ములు నిండుగా సౌష్టవంగా తయారవుతాయి. పాలు సరిపడా ఉండి, బిడ్డ సరిగా పాలు తీసుకుంటే రొమ్ములో వాపు, ఇబ్బంది, నొప్పి ఏమీ ఉండవు.కొన్నిసార్లు బిడ్డ సరిగా పాలు తాగకపోవటం, పాలు ఎక్కువగా స్రవించడం వంటి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే రొమ్ములు పాలతో గట్టిపడి వాపు, ఇబ్బంది, నొప్పి వస్తాయి. అప్పటికీ సరిగా పట్టించుకోకపోతే, చీము పట్టడం, జ్వరం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు.కాబట్టి బిడ్డ పుట్టిన తరువాత పాలు పడినా పడకపోయినా, రొమ్ము పట్టించి చీకేలా చేయాలి. మూడుగంటలకొకసారి పాలు పట్టాలి. పాలు ఎక్కువగా అనిపిస్తే వాటిని పిండి తీసివేయాలి. అలానే ఉంటే పైన చెప్పిన ఇబ్బందులు రావచ్చు. రొమ్ముల్లో వాపు ఇబ్బంది అనిపిస్తే డాక్టర్ని సంప్రదించాలి. సహజంగా రొమ్ములో వచ్చే మార్పులను అన్నీ నివారించలేము. అవి గర్భంతో ఉన్నప్పుడు శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులకు అనుగుణంగా ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు లభించే పోషకాలు, ఇతర లాభాలతో పోలిస్తే ఈ మార్పుల గురించి భయపడటం తగదు. ఈ ప్రయోజనాలు వెలకట్టలేనివి. డా‘‘ వేనాటి శోభబర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ -
టమాటా నిల్వ సామర్థ్యం రెట్టింపు!
పండు టమాటాలు ఫ్రిజ్‌లో పెట్టకుండా (గది ఉష్ణోగ్రతలో) ఉంచితే సాధారణంగా వారం గడిచేటప్పటికి ముడతలు వచ్చి కుళ్లిపోవడం ప్రారంభమవుతుంది. అయితే, విశాఖపట్నానికి చెందిన శ్రీమతి దూబ రాజు అనే గృహిణి తయారు చేసిన హెర్బల్ ద్రావణంలో ముంచి తీసి నిల్వ చేసిన టమాటోలు మాత్రం రెండు వారాలకు పైగానే తాజాగా ఉంటున్నాయి. టమాటోల సీజన్లో మార్కెట్లో ధర తక్కువగా ఉన్నప్పుడు 10–15 రోజులు రైతులు నిల్వ చేసుకోగలిగితే వారి నికరాదాయం బాగా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ఆకుకూరల రసాలను ఉపయోగించి శ్రీమతి రాజు తన సొంత ఆలోచనతో ఒక హెర్బల్ ద్రావణాన్ని రెండేళ్ల క్రితం తయారు చేశారు. లీటరు నీటికి 10 ఎం.ఎల్. ద్రావణం ఈ ద్రావణం 10 ఎం.ఎల్.ను లీటరు నీటిలో కలిపి.. ఆ నీటిలో టమాటోలను 10 నిమిషాలు నానబెట్టి.. బయటకు తీసి ట్రేలలో నిల్వ చేసుకుంటే సాధారణం కన్నా రెట్టింపు రోజులు నిల్వ ఉంటున్నాయని ఆమె తెలిపారు. రాగి, వెండి, ఇత్తడి తదితర పాత్రలు, వస్తువులను సమర్థవంతంగా శుభ్రం చేయగల హెర్బల్ ద్రావణాన్ని శ్రీమతి రాజు గతంలో తయారు చేశారు. అనేక దేవాలయాల్లో వెండి, బంగారం, రాగి, ఇత్తడి పాత్రలను సురక్షితంగా శుభ్రం చేయడానికి వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టమాటో రైతులకు ఉపయోగపడేలా ఈ ద్రావణాన్ని తయారు చేశానని ఆమె తెలిపారు. రైతు బజారులో కొనుగోలు చేసి తెచ్చిన టమాటోలను.. ఈ ద్రావణంలో ముంచి తీసి.. వాటిని ప్లాస్టిక్ ట్రేలలో నింపి, వాటిపైన గోనె సంచి లేదా పాత నూలు చీరను పైన కప్పానని ఆమె తెలిపారు. నెల రోజుల వరకు కుళ్లిపోకుండా ఉన్నాయన్నారు. నూటికి నూరు శాతం ఆకుకూరల రసాలతోనే దీన్ని తయారు చేశానని అంటూ.. ఈ ద్రావణంలో ముంచిన టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపవుతుందే తప్ప వాటిని తిన్న వారి ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఆమె అంటున్నారు. కృషి విజ్ఞాన కేంద్రంలో అధ్యయనం విశాఖపట్నం జిల్లాలోని భాగవతుల చారిటబుల్ ట్రస్టు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ ద్రావణాన్ని ఉపయోగించి టమాటోల నిల్వ సామర్థ్యంపై 2017 ఎండాకాలంలో అధ్యయనం జరిగింది. సెంచూరియన్ యూనివర్సిటీ వ్యవసాయ విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ ద్రావణాన్ని పరీక్షించి చూడగా.. పండు టమాటోల నిల్వ సామర్థ్యం రెట్టింపైందని కేవీకే అధిపతి డాక్టర్ కుర్రా శైలజ తెలిపారు. పండిన, కరపచ్చిగా ఉన్న, పచ్చిగా ఉన్న టమాటాలను మూడేసి చొప్పున తీసుకొని నెల రోజులపాటు పరిశీలించారు. ద్రావణంలో ముంచి తీసిన టమాటోలతోపాటు సాధారణ టమాటోలను గది ఉష్ణోగ్రతలోను, వరండాలోను ట్రేలలో నిల్వ చేశారు. గదిలో ఉంచిన పండిన టమాటాలు మామూలువి 8–10 రోజులు మార్కెట్లో అమ్మదగినంత తాజాగా ఉండగా, ద్రావణంలో ముంచినవి 16–20 రోజులు తాజాదనాన్ని కోల్పోకుండా ఉన్నాయని డాక్టర్ శైలజ తెలిపారు. దోరగా ఉన్న టమాటోలు మామూలువి 12–14 రోజులు అమ్మదగినంత బాగుంటే.. ద్రావణంలో ముంచినవి 22–24 రోజుల పాటు నిల్వ ఉన్నాయి. గది వెలువల వరండాలో నిల్వ చేసిన టమాటోలు 4 రోజుల ముందే వడలిపోయాయని ఆమె తెలిపారు. కొద్ది పరిమాణంలో టమాటోలనే నిల్వ చేసి చూశామని, భారీ పరిమాణంలో నిల్వ చేసినప్పుడు ఫలితం ఎలా ఉండేదీ పరీక్షించాల్సి ఉందని డా. శైలజ వివరించారు. శ్రీమతి రాజు భర్త కనకారావు తోడ్పాటుతో ఈ ద్రావణాన్ని తయారు చేసి అర లీటరు రూ. వందకు విక్రయిస్తున్నారు. ఈ ద్రావణం టమాటో రైతులతోపాటు వినియోగదారులు కూడా ఉపయోగించుకోవచ్చని శ్రీమతి రాజు(96421 13002, 95738 19031) అంటున్నారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, పల్లెసృజన సంస్థల ద్వారా శాస్త్రీయ పరీక్షలు జరిపించి, పేటెంట్‌కు దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఆమె వివరించారు. శ్రీమతి దూబ రాజు -
హెర్బల్, నేచురల్ సిగరెట్లతోనూ ప్రమాదమే..!
పొగరాయుళ్ళకు మరో షాక్... ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా... అందుకు బానిసలైనవారు మాత్రం మానలేకపోతుంటారు. కొందరు మానేందుకు ప్రయత్నించే మార్గంలో ఇతర అలవాట్లను చేసుకుంటే, కొందరు హెర్బల్ సిగరెట్లు, బీడీల వంటి ప్రత్యామ్నాయాలను ఆశ్రయిస్తుంటారు. అయితే సిగరెట్ ఎలాంటిదైనా ప్రమాదమే అంటున్నారు వైద్య నిపుణులు. ధూమపానం... స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, కొరోనరీ ఆర్టరీ వంటి వ్యాధులకు కారణమౌతుందని, క్లోవ్ (లవంగం) సిగరెట్లను కూడ టుబాకోతో కలిపే తయారు చేస్తారని చెప్తున్నారు. మారుమూల గ్రామాల్లోనూ, పల్లెల్లోనూ వాడే బీడీల అలవాటుకూడ ఆరోగ్యానికి హాని చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. సిగరెట్లలో ఉండే నికోటిన్ మనుషులను బానిసలుగా మారుస్తుంది. అంతేకాక గుండె జబ్బులు, కొరోనరీ ఆర్టెరీ వ్యాధులకు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణమౌతుంది. ఈ నేపథ్యంలో ధూమపానాన్ని మానుకోలేని వారు సాధారణ సిగరెట్లకు ప్రత్యామ్నాయంగా హెర్బల్, నేచురల్ సిగరెట్లను ఆశ్రయిస్తుంటారు. కొంతలో కొంత ఈ సిగరెట్లు ఆరోగ్యానికి హాని కలిగించవని నమ్ముతారు. అయితే ఈ హెర్బల్, నేచురల్ సిగరెట్లవల్ల కూడ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం అన్న విషయాన్ని గుర్తించక, మంచివే అన్న భ్రమలో రోగాలను కొనితెచ్చుకుంటారు. హెర్బల్ పదార్థాలు కూడ కాలుతున్నపుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికారక టాక్సిన్స్ ను విడుదల చేస్తాయి. అటువంటి హెర్బల్ సిగరెట్ల పొగను పీల్చుకున్నపుడు శ్వాస ద్వారా టాక్సిన్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. అందుకే ఫెడరల్ ట్రేడ్ కమిషన్ లెక్కల ప్రకారం హెర్బల్ సిగరెట్లపై కూడ ఆరోగ్యానికి హానికరం అన్న హెచ్చరిక ఇవ్వాల్సి ఉంది. హెర్బల్ సిగెరెట్లు కూడ సాధారణ సిగరెట్లలాగే ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలుగ జేస్తాయన్న విషయం పొగరాయుళ్ళకు షాక్ కలిగించవచ్చు. అయితే వీటిలో అభిరుచి పుష్పం, మొక్కజొన్న పట్టు, గులాబీ రేకులు, తామర ఆకు , లికోరైస్ వేరు , మల్లెపూవు, గిన్సెంగ్, ఎర్ర లవంగ పూలను వాడుతుంటారు. కాగా లవంగాల వంటివి వాడే హెర్బల్ సిగరెట్ల లాగానే బీడీలు కూడ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లవంగం సిగరెట్లలో 60 నుంచి 70 శాతం టుబాకోతో పాటు.. 30 నుంచి 40 శాతం మాత్రమే లవంగాలను వాడతారు. దీంతో ఈ ప్రత్యామ్నాయ సిగరెట్టలో పొగాకు ఉత్పత్తులకంటే ఎక్కువగా నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ ఉంటుందని, ఇది కూడ ధూమపానంకంటే ఆరోగ్యానికి అధిక హాని కలిగిస్తుందని పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ పొందిన బీడీల్లో కూడ శుద్ధి చేయని, వడకట్టని టుబాకో వాడతారని, సిగరెట్లకన్నా తక్కువ ధర ఉండటంతో వీటిని గ్రామాల్లో ఎక్కువగా వాడుతుంటారని, వీటిలో ఉండే నికోటిన్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తుందని చెప్తున్నారు. -
అమ్మాయి కావాలా? లేక అబ్బాయా?
చైనాలోని ఓ గ్రామంలో మేధావులకు సైతం అంతుచిక్కని విషయం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ మధ్యే సడలించిన సింగిల్ చైల్డ్ పాలసీతో గత మూడు దశాబ్దాలుగా చైనా జనాభా నియంత్రణను పాటించిన విషయం తెలిసిందే. చైనాలోని మైనారిటీ తెగల వారికి సింగిల్ చైల్డ్ పాలసీ వర్తించదు. దక్షిణ చైనాలోని జాన్లీ అనే గ్రామంలోని ప్రజలు మాత్రం ఆరు వందల సంవత్సరాల నుండి ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడంలో ముందున్నారు. ఆ గ్రామ జనాభాలో సగం మంది మహిళలు ఉండగా మిగిలిన సగం పురుషులు ఉన్నారు. జాన్లీ గ్రామంలో స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి మారకుండా ఎప్పుడూ ఒకేలా ఉండటం విశేషం. జాన్లీ గ్రామంలోని ప్రతీ కుటుంబంలో ఒక మగ, ఒక ఆడ శిశువు ఉండేలా ముందే జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే అదేదో స్కానింగ్‌లు గట్రా చేసి ముందుగానే లింగ నిర్ధారణ చేస్తారేమోననే అనుమానం కలగొచ్చు కానీ అలా జరగదు. అక్కడ వారసత్వంగా వస్తున్నటువంటి చెట్ల రసాలతో తయారైన ఓ పానియం ద్వారా ఇది సాధ్యమవుతున్నట్లు తెలుస్తోంది. దంపతులకు ముందుగా మగ శిశువు పుట్టినట్లయితే తరువాత వారికి ఆడబిడ్డ జన్మించేలా పానియం ఇస్తారు. అలాగే ముందుగా ఆడబిడ్డ జన్మించిన వారికి తరువాత ప్రసవంలో మగశిశువు జన్మించేలా పానియం ఇస్తారు. ఈ తెగలో మరొక ఆచారం ఏమిటంటే కేవలం ఊరిలో వారి మధ్యే వివాహాలు జరిపిస్తారు. బయటి ఊరి సంబంధాలు చేసుకోరు. ఈ విధంగా శతాబ్దాల పాటు స్త్రీ, పురుష నిష్పత్తిని సమానంగా పాటించేలా చేస్తున్న వారి పానియం దేనితో తయారవుతుందో అని ఆసక్తిపరులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ గ్రామంలో వారసత్వంగా వస్తున్నటువంటి రెండు బావుల ద్వారా సేకరించిన జలాలతో ఈ పానియాన్ని తయారు చేస్తున్నట్లు తెలిసింది. మగ బిడ్డకోసం ఒక బావిలోని నీటితో తయారు చేసిన ద్రావణం, ఆడబిడ్డ కోసం మరొక బావిలోని నీటితో చేసిన ద్రావణం వాడుతున్నారు. అయితే ఇదే మందు గర్భనిరోధానికి, గర్భం దాల్చడానికి కూడా దానిని వాడే విధానాన్ని బట్టి పనిచేస్తుండటం గమనార్హం. జాన్లీలో ఉన్నటువంటి 98 శాతం కుటుంబాలలో ఒక మగ, ఒక ఆడ సంతానం ఉండటంపై చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ శాస్త్రవేత్త జింగ్లియాంగ్ మాట్లాడుతూ ఇక్కడి తెగకు సంబంధించిన మానవజాతి మూలాలతో పాటు, అత్యాధునికి వైద్య పరిశోధనల ద్వారా ఈ రహస్యాన్ని వెల్లడి చేయాల్సి ఉందన్నారు.