![Unbelievable Health Benefits Of blue tea with Butterfly Pea Flower](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/07/5/butterflypea_bluetea.jpg.webp?itok=FlF80Bmv)
ఆధునిక కాలంలో ఆరోగ్యంపై అవగాహన బాగా పెరిగింది. పోషకాలతో నిండిన ఆహారం, పానీయాలు, హెర్బల్‌టీ పై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా, బరువును అదుపులోఉంచుకునే హెర్బల్ టీల గురించి తెలుసుకుంటున్నారు. మరి అపరాజిత పువ్వులు, ఈ పువ్వులతో తయారు చేసుకునే ‘బ్లూ టీ’ ప్రయోజనాలు గురించి తెలుసా? తెలుసుకుందాం రండి!
అపరాజిత, వీటినే శంఖుపుష్కాలు , బటర్‌ఫ్లై పీ అని కూడా అంటారు. తెలుగు, నీలం, ముదురు నీలం రంగుల్లో ఈ పూలు పూస్తాయి. ఈ పువ్వులతో తయారు చేసిన టీని తాగితే దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ‘బ్లూ టీ’ గా పాపులర్ అయిన ఈ టీతో యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా లభిస్తాయి.
పలు వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అపరాజిత ప్రస్తావన ఉంది. బ్లూ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. లక్షణాలతో రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఊబకాయంతో బాధపడుతున్న వారు ఈ టీతాగడం బరువు తగ్గినట్టు అధ్యయనాల్లో రుజువైంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది. జుట్టు, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
యాంటీ-డయాబెటిక్, యాంటీ-కేన్సర్ లక్షణాలుకూడా ఉన్నాయి. అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. ఈ టీలోని యాంటిథ్రాంబోటిక్ లక్షణం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బ్లూటీ తయారీ
నాలుగు నీలిరంగు అపరాజిత పువ్వులను తీసుకొని ఒక కప్పు నీళ్లలో బాగా మరిగించాలి. నీళ్లు నీలం రంగులోకి మారతాయి. తరువాత, దీన్ని ఒక కప్పులోకి ఫిల్టర్ చేసుకొని హనీ, లేదా పంచదార, నిమ్మకాయ కలపుకుని తాగవచ్చు. ఇందులో తురిమిన అల్లం కూడా వేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment