హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. దగ్గు నివారణకు ఆయుర్వేద ఔషధం వాసా తులసి ప్లస్ ప్రవేశపెట్టింది. వైద్యపరంగా నిరూపితమైన వాము పువ్వు, ప్రిమ్ రోజ్, తాలీస పత్రం, వస, తులసి, శొంఠి, దుష్టపు తీగ, అతి మధురం, పిప్పళ్లు, దాల్చిన చెక్క, లవంగం, నల్ల మిరియాలు, పుదీనా ఇందులో వాడారు.
కఫాన్ని తొలగించడానికి వస, వాము సాయపడతాయి. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తుందని లీ హెల్త్ డొమెయిన్ డైరెక్టర్ లీలా రాణి తెలిపారు. ఆస్తమా, దగ్గు-జలుబు, కోరింత దగ్గు, ఈసినోఫీలియా, గొంతు నొప్పి, బొంగురు గొంతు, సైనసైటిస్ నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు.
ఇదీ చదవండి: ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ
Comments
Please login to add a commentAdd a comment