How Do You Get Vitamin D in Rainy Season - Sakshi
Sakshi News home page

Vitamin D: వర్షాకాలంలో విటమిన్‌-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చా?

Published Thu, Jul 20 2023 2:43 PM | Last Updated on Thu, Jul 27 2023 4:38 PM

How Do You Get Vitamin D in Rainy Season - Sakshi

మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్‌-డి ఒకటి. దీన్ని  ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్‌-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.

న రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్‌-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్‌ కంటే సూర్యకాంతిలో విటమిన్‌-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్‌-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం.


భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్‌-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 


విటమిన్‌-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

  • ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్‌-డి ఉంటుంది. 
  • పాలలో విటమిన్‌-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి
  • పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్‌-డి లోపాన్ని అధిగమించవచ్చు. 
  • ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్‌, ట్యూనా వంటి చేపలు తినాలి
  • నారింజలో విటమిన్‌-సితో పాటు విటమని్‌-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. 
  • ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.


విటమిన్‌-డి ఎంత మొత్తం తీసుకోవాలి

  • ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్‌ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్‌-డి అవసరం.
  • పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 
  • 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. 
  • ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. 
  • సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement