vitamin d deficiency
-
విటమిన్ డి లోపం.. మహిళల్లో ఈ సమస్యలకు కారణమవుతోందా?
భారతదేశంలో ప్రతీ 10 మంది మహిళల్లో 9 మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారనీ, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివ కృష్ణమూర్తి తెలిపారు. ఇది ఎముకలను బలహీనపరిచడం, బోలు ఎముకల వ్యాధి వంటి తీవ్రమైన పరిస్థితులకు కూడా దారి తీస్తుందనీ, ఈ నేపథ్యంలోనే ఎముకల ఆరోగ్యం గురించి డ్రైవింగ్ అవగాహన తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు. అపోలో హెల్త్ అండ్ లైఫ్ట్ స్టైల్ లిమిటెడ్ ద్వారా.. వరుసగా నాలుగో ఏడాది కూడా 30ఏళ్లకు పైబడిన మహిళల్లో ఎముకల ఆరోగ్య అవగాహనను కల్పించడం , పరీక్ష చేయించుకునేలా వారిని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 49.9శాతం మంది స్త్రీలు ఆస్టియోపెనియా , 18.3శాతం మంది బోలు ఎముకల వ్యాధితో బాధపడుతున్నారన్నారు. మహిళలు తాత్కాలిక అనాల్జెసిక్స్పై ఆధారపడకుండా,అపోలో డయాగ్నోస్టిక్స్, హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ ద్వారా విటమిన్ డీ , కాల్షింయ లోపంపై అవగాహన కల్పించి, విటమిన్ డి స్క్రీనింగ్‌ను సరసమైన ధరలో అందుబాటులోకి తెచ్చామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్.. నటి తాప్సీ పన్నూ సైతం పాల్గొన్నారు.అపోలో హెల్త్ & లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌తో ,హార్లిక్స్ ఉమెన్స్ ప్లస్ భారతదేశంలోని మహిళలకు డీ విటమిన్ టెస్టులను మరోసారి సరసమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు ఇప్పుడు రూ. 1850కు బదులుగా కేవలం రూ. 199 కే విటమిన్ D పరీక్షను పొందవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. 2023 నాటి మాంప్రెస్సో అధ్యయనం ప్రకారం.. భారతదేశంలో 98శాతంమంది మహిళలు ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వీరిలో 87శాతం మందికి ఈ పెయిన్స్, ఎముకల ఆరోగ్యం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోలేరు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ డీ ఒక ముఖ్యమైన పోషకం. ఈ లోపాన్ని గుర్తించడానికి క్రమం తప్పకుండా పర్యవేక్షణ అవసరం. -
సూర్యుడి శీతకన్ను : డీ విటమిన్ లోపిస్తే నష్టమే
శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలోఒకటి విటమిన్ డీ. డీ విటమిన్ లోపంతో ఆనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ లోపం ఉందని నిర్ధారణ అయితే, వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందుకే సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్‌డీ లోపిస్తే కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు విటమిన్ డీ,కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.దాదాపు ఎనభై శాతం మంది పురుషుల్లో, మహిళల్లో దాదాపు తొంభై శాతం, విటమిన్ డీ లోపం ఉంటుంది. విటమిన్ డీ కాల్షియం లోపం మెలనోమా ప్రమాదాన్ని పెంచుతుంది మెలనోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్న మహిళలు విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవాలి. తగినంత విటమిన్ డీ లేకపోతే, శరీరం తగినంత కాల్షియంను గ్రహించదు. దీంతో ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి , ఎముకలు విరిగిపోవడం లాంటి ప్రమాదాన్ని నివారించాలంటే ఇది అవసరం.రోగనిరోధక వ్యవస్థకు మద్దతువిటమిన్ డీ తెల్ల రక్త కణాల పోరాట ప్రభావాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ల వంటి అనారోగ్యాలను అరికట్టడంలో పాయపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ లోపిస్తే డిప్రెషన్ వస్తుంది.గుండె ఆరోగ్యానికివిటమిన్ డీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాల పనితీరులో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుందిబరువు నియంత్రణజీవక్రియ ,ఆకలి నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తేంది. డీ విటమిన్ లోపిస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బులు కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నియంత్రణలో ఉపయోగ పడుతుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడులో ఉంటాయి. న్యూరోప్రొటెక్షన్లో ఇది పాత్ర పోషిస్తుంది. మతిమరపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే డీ విటమిన్ అవసరం.చర్మ ఆరోగ్యంవిటమిన్ డి చర్మ కణాలను బాగు చేస్తుంది. పెరుగుదల. చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, వైద్యుల పర్యవేక్షణలో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా ముఖ్యమైన శారీరక విధులకు ఆటంకం లేకుండా చూసుకొని, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలి. -
విటమిన్ ‘డి’ లోపం: ఆదిలోనే గుర్తించకపోతే.. డేంజరే!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్లోపంతో బాధపడుతుండటం డేంజర్బెల్స్ను మోగిస్తోంది. డీ విటమినల్ లోపం డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. భయపెడుతున్న అల్జీమర్స్ విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది. -
వర్షాకాలంలో విటమిన్-డి తీసుకోవడం ఎలా? సప్లిమెంట్స్ తీసుకోవచ్చా?
మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్లలో విటమిన్-డి ఒకటి. దీన్ని ‘సన్‌షైన్’ విటమిన్ అని కూడా పిలుస్తారు. శరీరీనాకి కాల్షియం అందించడంలో విటమిన్-డి ఎంతో ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరానికి సరైన మోతాదులో విటమిన్-డి లభించకపోతే ఎముకలు బలహీనపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. సప్లిమెంట్స్ కంటే సూర్యకాంతిలో విటమిన్-డి సమృద్దిగా దొరుకుతుంది. మరి ఈ వర్షాకాలంలో విటమిన్-డిని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టోరీలో చూసేద్దాం. ►భారతీయుల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. ఇటీవల ఓ సర్వేలో దాదాపు 76 శాతం మంది విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారని తేలింది. ముఖ్యంగా 25ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు ఎక్కువగా విటమిన్-డి లోపంతో బాధపడుతున్నట్లు తేలింది. విటమిన్-డి పొందాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రతిరోజూ గుడ్డు తీసుకోవాలి. గుడ్డులోని పచ్చసోనలో విటమిన్-డి ఉంటుంది. పాలలో విటమిన్-డితో పాటు పోషకాలు అధికంగా ఉంటాయి. రోజూ పాలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి పుట్టగొడుగులు తినడం వల్ల విటమిన్-డి లోపాన్ని అధిగమించవచ్చు. ప్రతిరోజూ ఆహారంలో చేపలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపలు తినాలి నారింజలో విటమిన్-సితో పాటు విటమని్-డి కూడా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆకుకూరలు, సోయా పాలు ప్రతిరోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. విటమిన్-డి ఎంత మొత్తం తీసుకోవాలి ఆరోగ్యకరమైన ఎముకలు, కాల్షియం, మెటబాలిజం మెయింటేన్ చేయాలంటే తగిన మోతాదులో విటమిన్-డి అవసరం. పిల్లలు, యుక్తవయస్సు వాళ్ళు 600 IU లేదా 15 మైక్రోగ్రాములు తీసుకోవాలి. 70 ఏళ్లు పైబడిన వారిలో 800 ఐయూ (20 ఎంసీజీ) అవసరం. ఇక గర్భిణీలు, పాలిచ్చే మహిళలకి కూడా 600 IU లేదా 15 మైక్రో గ్రాముల విటమిన్ డి అవసరం. సప్లిమెంట్ల రూపంలో తీసుకునే వాళ్ళు వైద్యుల సిఫార్సు మేరకు వారానికి ఒకటి మాత్రమే తీసుకోవాలి. -
షాకింగ్.. హైదరాబాద్ వాసుల్లో విటమిన్ 'డీ' లోపం..
‘డీ’ మన శరీరంలో ఉండాల్సిన ముఖ్యమైన విటమిన్లలో ఒకటి. ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, ఫాస్పరస్ వంటి ఇతర పోషకాలను శరీరం గ్రహించడంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది. మన ఎముకలలో 99% ఉన్న కాల్షియంను పునరుద్ధరించడానికి, సరిగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కండరాల కదలికకు, మెదడు.. నరాల అనుసంధానానికి దోహదపడుతుంది. అంటువ్యాధులు, క్యాన్సర్, హృదయ, శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, చిత్తవైకల్యం వంటి వ్యాధుల బారిన పడకుండా కూడా తోడ్పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక రోగనిరోధక వ్యవస్థ సక్రమ పనితీరుకు ఇది చాలా ముఖ్యమైనది. కరోనా కాలంలో ఇతరత్రా ఔషధాలతో పాటు డీ విటమిన్‌ను వైద్యులు సిఫారసు చేయడం గమనార్హం. ఇంతటి కీలకమైన విటమిన్ ‘డీ’లోపం హైదరాబాద్ నగరవాసుల్లో తీవ్ర స్థాయిలో ఉందని టాటా ఐఎంజీ లాబ్స్ అధ్యయనం వెల్లడించింది. దాదాపు 75 శాతానికి పైగా ప్రజలు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్న నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటని తేల్చింది. హైదరాబాద్‌లో 76% మంది ప్రజలు ‘డీ’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని తెలిపింది. నగరాల్లో.. యువతలో.. అధ్యయనం ప్రకారం.. వదోదర (89%), సూరత్ (88%) అహ్మదాబాద్ (85%) నగరాలకు చెందిన ప్రజలు అత్యధికుల్లో విటమిన్ డీ లోపం ఉంది. అంతేకాదు పెద్దవారితో పోలిస్తే యువతలో ఈ లోపం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లలోపు వారు 84% మందిలో, 25–40 ఏళ్ల మధ్య వయస్కుల్లో 81% మందిలో ‘డీ’ విటమిన్ సరిగా లేదని అధ్యయనం తేలి్చంది. నేటి తరం పిల్లలు, యువకులు ఎండ తగలకుండా ఎక్కువ సమయం ఇళ్లు, కార్యాలయాల్లోపలే గడుపుతుండడం, సరైన ఆహార నియమాలు పాటించక పోవడమే ఇందుకు కారణమని ఆరోగ్యరంగ నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో అత్యధికులు కరోనా కారణంగా చాలాకాలం పాటు నాలుగ్గోడల మధ్యే గడిపారు. అంటే విటమిన్ డీ లోపానికి పరోక్షంగా కరోనా కూడా కారణమైంది. ఇటీవల పెద్ద సంఖ్యలో యువకులు తీవ్రమైన ఒళ్లు నొప్పులు, నిస్సత్తువతో ఆసుపత్రులకు వస్తున్నారని, వీరిలో ఎక్కువమంది అవుట్ డోర్ యాక్టివిటీ తగ్గిపోయినవారేనని వైద్య నిపుణులు చెబుతుండటం గమనార్హం. విటమిన్ డీ లోపం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గిపోయి బోలు ఎముకల వ్యాధికి లేదా ఆ్రస్టియోపోరోసిస్‌కు దారి తీస్తోందని, ఇది ఇటీవలి సంవత్సరాలలో వయసులకు అతీతంగా కనిపిస్తోందని పేర్కొంటున్నారు. మానసిక ఆరోగ్య సమస్యలు, జీవనశైలి వ్యాధుల భారాన్ని విటమిన్ డీ లోపం రెట్టింపు జేస్తుందని వివరిస్తున్నారు. కీళ్ల నొప్పులకు, రక్తంలో చక్కెర శాతం పెరగడానికి కూడా కారణమవుతోందని అంటున్నారు. సహజసిద్ధంగానే భర్తీ చేసుకోవాలి వీలైనంత వరకు సహజమైన పద్ధతుల్లోనే విటమిన్ డీ లోటును భర్తీ చేసుకోవాలి. కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. సమస్య పరిష్కారం కాకపోతే వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. – డా.గౌరీశంకర్ బాపనపల్లి, మెడికల్ డైరెక్టర్ ఎస్ఎల్జీ ఆసుపత్రి, హైదరాబాద్ ఇంకెలా పొందగలం? కొన్ని రకాల ఆహార ఉత్పత్తుల ద్వారా స్వల్పంగా విటమిన్ డీని పొందవచ్చు. పాలకూర వంటి ఆకుకూరలు, సోయా బీన్స్, వైట్ బీన్స్, సాల్మన్, రెయిన్బో వంటి కొవ్వుతో కూడిన చేపలు, నారింజ రసం, ఓట్ మీల్ వంటి వాటితో విటమిన్ డీ లభిస్తుంది. అలాగే విటమిన్ డీలో కీలకమైన డీ3, డీ2లు సప్లిమెంట్స్ (టాబ్లెట్లు) రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండూ విటమిన్ డీ లోపాన్ని సరిచేయడంలో సహాయపడతాయి, అయితే ప్రభావంతంగా పని చేస్తుందని వైద్యులు ఎక్కువగా డీ3ని సిఫారసు చేస్తారు రెండు దశల జీవ రసాయన ప్రక్రియ కీలకం సూర్యరశ్మి లేదా సప్లిమెంట్ నుంచి విటమిన్ డీని పొందిన తర్వాత దానిని క్రియాశీల విటమిన్ డీగా మార్చడానికి రెండు దశల జీవ రసాయన ప్రక్రియ దోహదపడుతుంది. ఇది కాలేయం నుంచి మొదలై మూత్రపిండాల్లో ముగుస్తుంది. మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు అడ్వాన్స్ దశలో ఉన్న వారు ఇది గమనంలో ఉంచుకోవాలి. శరీరం విటమిన్ డీని సరిగా సంగ్రహించలేనప్పుడు దాని లోపం ఏర్పడుతుంది. తగినంత విటమిన్ డీ లేకపోతే శరీరం ఆహారం నుంచి కాల్షియంను గ్రహించదు. సగటు ఆరోగ్యవంతమైన వ్యక్తి ఎముకల నుంచి ప్రతిరోజూ 500 మిల్లీగ్రాముల కాల్షియంను కోల్పోతాడు అదే మొత్తాన్ని డీ విటమిన్ ద్వారా ఉత్పత్తి చేసుకున్న కాల్షియంతో భర్తీ చేసుకుంటాడు. విటమిన్ డీ లోపం ఉన్నప్పుడు కాల్షియం తగినంతగా భర్తీ కాదు. ఇది ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారడానికి దారితీస్తుంది. చదవండి: ఆహా ఏమి రుచి.. అంకాపూర్ దేశీ కోడి కూరకు 50 ఏళ్లకు.. -
Health Tips: ట్యూనా, సాల్మన్, గుడ్లు, పాలు.. విటమిన్- డి పుష్కలం!
మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన విటమిన్లలో.. విటమిన్- డి కూడా ఒకటి. ఈ ‘సన్‌షైన్ విటమిన్’ లోపిస్తే ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లల్లో రికెట్స్ వంటి సమస్యలు వస్తాయి. మరి ఈ లోపాలను అధిగమించేందుకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే సరి! వీటిలో విటమిన్- డి పుష్కలం. ఈ ఆహారాల్లో లభిస్తుందం’డి’ ►పుట్టగొడుగుల్లో ‘విటమిన్–డి’ ఎక్కువగా ఉంటుంది. ►గుడ్లను ఆహారంగా తీసుకుంటే ‘విటమిన్–డి’ లభిస్తుంది. ►పాలు, సోయా పాలు లేదా నారింజ రసంలో సైతం విటమిన్లు, ఖనిజాలు సమద్ధిగా ఉంటాయి. ►ట్యూనా, సాల్మన్ చేపలు వంటి సముద్రపు ఆహారంలో కూడా విటమిన్–డి సమృద్ధిగా ఉంటుంది. ►జున్ను, పాలు, టోఫు, పెరుగు, గుడ్లు వంటి పాల ఉత్పత్తులు ‘విటమిన్–డి’కి మంచి వనరులు. ►చలికాలంలో వీలైనంత ఎక్కువసేపు ఎండలో ఉన్నట్లయితే శరీరానికి కావలసినంత విటమిన్ డి లభిస్తుంది. ►అలాగని ఎండాకాలంలో ఎప్పుడూ ఏసీగదుల్లోనే ఉండిపోకుండా అప్పుడప్పుడు శరీరానికి ఎండ తగలనివ్వడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఎండలోనే ఉందండీ మరి! చదవండి👉🏾Vitamin D Deficiency: విటమిన్- డి లోపిస్తే అంతే ఇక..! ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే జరిగేది ఇది.. ఇవి తింటే మేలు! -
Health Tips: ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?
సుకుమారంగా ఉండే వారిని ఎండ కన్నెరగరని వారంటారు. సౌకుమార్యం విషయంలో చెప్పుకోవడానికి ఈ పోలిక బాగున్నా, నిజానికి శరీరానికి ఎండ తగలకపోతే రకరకాల వ్యాధుల బారిన పడటం ఖాయమని కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే శరీరానికి సూర్యరశ్మి తాకితే విటమిన్ డీ ఉత్పత్తవుతుంది. ఇది ఎముకలు గట్టిపడటానికి అవసరమైనది. అలా అని గంటల తరబడి ఎండలో గడపటం, ఎండలో తిరగడం వల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి, మనకు సూర్యరశ్మి ఎంత అవసరం? శరీరంలోని ఎముకలకే కాకుండా, శరీర రోగ నిరోధక వ్యవస్థకు కూడా సూర్యరశ్మి చాలా అవసరం. ఉత్తర భారతదేశానికి చెందిన 69 శాతం మంది మహిళల్లో విటమిన్–డి లోపం ఉంది. వారి శరీరానికి సూర్యరశ్మి సరైన మోతాదులో అందకపోవడం అందుకు ఒక కారణం. ఎండ వల్ల శరీరంలో ఉత్తేజాన్ని పెంచే సెరోటోనిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తవుతుందని ఓ అధ్యయనం తెలిపింది. తగినంత సూర్యరశ్మిని ఎలా పొందాలి? ►ఎంతసేపు ఎండలో ఉండాలి? అన్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు. ఏ కాలం, ఏ రోజు, ఏ సమయం అనేది ఆయా వ్యక్తుల చర్మం తీరు లాంటి అనేక విషయాలపై అది ఆధారపడి ఉంటుంది. ►ఏ ఎండకాగొడుగు అన్నట్టు ఏ ఎండ పడితే ఆ ఎండ వంటికి మంచిది కాదు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఉండే సూర్యరశ్మి ఆరోగ్యకరమంటారు. ►ఒక్కో వ్యక్తికి ఒక్కో మోతాదు సూర్యరశ్మి అవసరమవుతుంది. ఎండతో వచ్చే సమస్యల తీవ్రత కూడా ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ►చర్మం పలుచగా ఉంటే, వేసవి కాలంలో రోజూ ఓ 20 నిమిషాలు ఎండలో ఉంటే సరిపోతుందని కొందరు వైద్యులు చెబుతున్నారు. చదవండి: చర్మసౌందర్యానికి మరింత మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఆహారం.. -
డీ విటమిన్ లోపంతో క్యాన్సర్
సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్ల మానవ జీవన శైలి ఎంతో మారింది. ఎండావానల్లో ఆడుకునే పిల్లలు ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. సరదాగా ఆడుకోవాలనిపిస్తే వీడియో గేమ్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇక ఉద్యోగస్థులకు పగలు రాత్రయింది, రాత్రి పగలయింది. దీనివల్ల అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపం వల్ల చాలా తీవ్రమైన జబ్బులు వస్తాయన్న విషయం ఇటీవలనే తేలింది. డీ విటమిన్ లోపం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహ వ్యాధి, మానసిక రుగ్మతలు, రకరకాల కీళ్ల నొప్పులు వస్తాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. వీటి వివరాలను అమెరికా క్లినికల్ ఆంకాలజీ జర్నల్‌లో వివరంగా ప్రచురించారు. రక్త పరీక్ష ద్వారా డీ విటమిన్ లోపాన్ని కనుగొనవచ్చు. సప్లిమెంట్లు వాడడం వల్ల ఈ లోపం వల్ల కలిగే అనర్థాల నుంచి తాత్కాలికంగా సులభంగానే బయడపడవచ్చు. కానీ సహజసిద్ధంగానే.. అంటే ఎండ ద్వారానే డీ విటమిన్‌ను సమకూర్చుకోవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. మానవ జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగానే భారత్‌లాంటి దేశాల్లో డీ విటమిన్ లోపం ఎక్కువగా పెరిగిపోతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవడం వల్ల శరీరానికి ప్రకతిసిద్ధంగా డీ విటమిన్ లభిస్తుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ఎండపొడకు కనీసం అరగంటైనా బాడీ ఎక్స్పోజ్ అవడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తూ పొద్దెక్కేవరకు నిద్రలేవని వారు, వద్ధాప్యం కారణంగా ఇంటిలోపలే ఉండిపోయేవారు చేపలు తినడం, డీ విటమిన్ కలిగిన మాంసకృత్తులు, పండ్లు తీసుకోవడం ఉత్తమ మార్గమని ఫ్లోరిడా విశ్వవిద్యాలయం వైద్యులు సూచిస్తున్నారు.