ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్‌లోపంతో బాధపడుతుండటం డేంజర్‌బెల్స్‌ను మోగిస్తోంది.
డీ విటమినల్ లోపం
డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది.
భయపెడుతున్న అల్జీమర్స్
విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా.
మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది.
నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్‌తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment