Vitamin D supplements
-
సూర్యుడి శీతకన్ను : డీ విటమిన్ లోపిస్తే నష్టమే
శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలోఒకటి విటమిన్ డీ. డీ విటమిన్ లోపంతో ఆనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ లోపం ఉందని నిర్ధారణ అయితే, వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందుకే సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్‌డీ లోపిస్తే కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు విటమిన్ డీ,కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.దాదాపు ఎనభై శాతం మంది పురుషుల్లో, మహిళల్లో దాదాపు తొంభై శాతం, విటమిన్ డీ లోపం ఉంటుంది. విటమిన్ డీ కాల్షియం లోపం మెలనోమా ప్రమాదాన్ని పెంచుతుంది మెలనోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్న మహిళలు విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవాలి. తగినంత విటమిన్ డీ లేకపోతే, శరీరం తగినంత కాల్షియంను గ్రహించదు. దీంతో ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి , ఎముకలు విరిగిపోవడం లాంటి ప్రమాదాన్ని నివారించాలంటే ఇది అవసరం.రోగనిరోధక వ్యవస్థకు మద్దతువిటమిన్ డీ తెల్ల రక్త కణాల పోరాట ప్రభావాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్ల వంటి అనారోగ్యాలను అరికట్టడంలో పాయపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ లోపిస్తే డిప్రెషన్ వస్తుంది.గుండె ఆరోగ్యానికివిటమిన్ డీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాల పనితీరులో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుందిబరువు నియంత్రణజీవక్రియ ,ఆకలి నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తేంది. డీ విటమిన్ లోపిస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ డీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బులు కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నియంత్రణలో ఉపయోగ పడుతుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడులో ఉంటాయి. న్యూరోప్రొటెక్షన్లో ఇది పాత్ర పోషిస్తుంది. మతిమరపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే డీ విటమిన్ అవసరం.చర్మ ఆరోగ్యంవిటమిన్ డి చర్మ కణాలను బాగు చేస్తుంది. పెరుగుదల. చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, వైద్యుల పర్యవేక్షణలో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా ముఖ్యమైన శారీరక విధులకు ఆటంకం లేకుండా చూసుకొని, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలి. -
విటమిన్ ‘డి’ లోపం: ఆదిలోనే గుర్తించకపోతే.. డేంజరే!
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని వేధిస్తున్న డీ విటమిన్ టోపం. నిజానికి చాలా సులువుగా అతి చౌకగా లభించే విటమిన్ ఇది. సూర్యకిరణాల ద్వారా మనకు విటమిన్ డీ ఎక్కువగా లభిస్తుంది. కానీ ఎండలు ఎక్కువగా మన దేశంలో 70-80 శాతం మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అమెరికాలో దాదాపు 42శాతం మంది పెద్దలకు విటమిన్ డి లోపం ఉంది ఆఫ్రికన్ అమెరికన్ పెద్దలలో 82శాతం మంది ఈ డీ విటమిన్లోపంతో బాధపడుతుండటం డేంజర్బెల్స్ను మోగిస్తోంది. డీ విటమినల్ లోపం డీ విటమిన్ లోపిస్తే.. అలసట, తరచుగా అనారోగ్యం, ఆందోళన, ఎముకల నొప్పులు, గాయాలు తొందరగా మానకపోవడం, నిద్ర లేమి లాంటి సమస్యలొస్తాయి. ఇంకా హైపర్ టెన్షన్, డిప్రెషన్, టైప్-2 మధుమేహం, గుండె, ఊపిరితిత్తుల సమసల్యకు దారి తీస్తుంది. అలాగే తీవ్రమైన జుట్టు రాలడానికి కూడా విటమిన్ డీ లోపం కారణమని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. భయపెడుతున్న అల్జీమర్స్ విటమిన్ డి లోపం భవిష్యత్తులో అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అందరికీ తెలుసు. ఫ్రాన్స్‌లో జరిపిన ఒక అధ్యయనంలో, 50 nmol/L కంటే తక్కువ విటమిన్ డీ అల్జీమర్స్ వచ్చే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువ. యూకేలో అరవై శాతానికి పైగా ప్రజల్లో దీని కంటే తక్కువ స్థాయిని కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో ఈ అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధిగ్రస్తులు ప్రమాదకరస్థాయిలో పెరుగుతున్నట్లు అల్జీమర్స్ అసోసియేషన్ ప్రచురించిన ఓ జర్నల్ లో పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 150 మిలియన్ల మంది ఈ రోగం బారిన పడే అవకాశం ఉన్నట్లు అంచనా. మన శరీరంలో డీ విటమిన్ స్థాయి ఉంటే ఎనర్జీ లెవల్స్, మూడ్‌ని నిర్ణయిస్తాయి. ముఖ్యంగా డీ విటమిన్ లోపిస్తే జ్ఞాపకశక్తి తగ్గిపోయి, అది క్రమంగా అల్జీమర్స్, డిమెన్షియాకు లేదా తీవ్రమైన మతిమరపునకు దారితీస్తుంది. తొలుత జ్ఞాపకశక్తి కోల్పోవడం, చలనశీలత సమస్యలు ముదిరి కాలక్రమేణా డిమెన్షియాకు దారితీస్తుంది. ఫలితంగా మనిషి ఆలోచనా శక్తి నాశనమై పోయి, ఒక్కోసారి తన దైనందిన పనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. తమ సమీప బంధువులకు మర్చిపోతారు. చివరికి తమను తాము, తమ ఇంటిని కూడా గుర్తుపట్టలేరు. ఈ పరిస్థితి బాధితుడితోపాటు సంబంధిత కుటుంబానికి కూడా పెద్ద సమస్యగా మారుతుంది. నిపుణులు ప్రకారం విటమిన్ డీ పుష్కలంగా ఉంటే మెదడు చురుకుగా మారుతుంది. ఉదయం సమయంలో ఎండలో నిలబడితే శరీరానికి అవసరమైనంత మొత్తంలో పుష్కలంగా దొరుకుతుంది. అలాగే డీ విటమిన్ సప్లిమెంట్స్తోపాటు, విటమిన్ డీ అధికంగా ఉండే ఆహారం పాలు, పెరుగు, గుడ్లు, సోయాబీన్, బీన్స్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎముకలు, దంతాలు ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి విటమిన్ డీ చాలా అవసరం. ఇది కొవ్వులో కరిగే విటమిన్. ఇది ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తిని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు కేన్సర్ నివారణలో సాయపడుతుంది. -
విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: విటమిన్ ‘డీ’.. ఎముకల ఎదుగుదల, కండరాల పటుత్వానికి అత్యంత కీలకం. రోగనిరోధక శక్తి పెంపుదలకు ఇది దోహదపడుతుంది. ఈ కారణంగానే కరోనా పరిస్థితుల్లో డీ విటమిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, సప్లిమెంట్లు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. కానీ దేశంలో పదేళ్ల నుంచి పంతొమ్మిదేళ్ల మధ్య వయసున్న పిల్లలు అంటే ఎదిగే పిల్లలు చాలామందిలో ఈ విటమిన్ లోపం తీవ్రంగా ఉంది. మానసిక, శారీరక ఎదుగుదలకు కీలకమైన వయసులో డీ విటమిన్ లోపం పిల్లల్లో ఎన్నోరకాల దుష్ప్రభావాలను కలిగిస్తోంది. దేశంలో 19 ఏళ్లలోపు పిల్లల్లో విటమిన్ డీ స్థితిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్ సహకారంతో పరిశీలన చేపట్టింది. పరిశీలనలో తేలిన అంశాలతో నివేదికను తాజాగా పార్లమెంటుకు సమర్పించింది. ఏ వయస్సు వారిలో ఎంత? జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో 23.9 శాతం మంది, అంటే దాదాపుగా ప్రతి నలుగురిలో ఒకరు విటమిన్ డీ లోపంతో బాధపడుతున్నారు. ఇక నాలుగేళ్లలోపు చిన్నారులు 13.8% మందిలో ఈ విటమిన్ లోపం గుర్తించగా, 18.2% మంది 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లల్లో కూడా డీ లోపం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ డీ లోపం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! 15 నిమిషాలు ఎండలో ఉండాలి శరీరానికి సరిపడా విటమిన్ డీ సూర్యరశ్మి నుంచే సహజంగా వస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లోని కాల్షియంను కండరాలు, ఎముకలకు అందించడంలో ‘డీ’పాత్ర అత్యంత కీలకం. రోజుకు కనీసం పదిహేను నిమిషాలైనా ఎండలో ఉంటే విటమిన్ ‘డీ’సమతుల్యత ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇక పెద్దల్లో ఎముకల అరుగుదల వేగంగా ఉంటుంది. దీని ప్రభావంతో కీళ్ల నొప్పులు వస్తాయి. దీంతో పాటు నిద్రలేమి, అలసత్వం, డిప్రెషన్, ఒంటినొప్పులు వరుసగా వస్తుంటాయి. ఈ లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితే విటమిన్ల అసమతుల్యత, అధిక బరువు, రోగనిరోధక శక్తి క్షీణత లాంటివి ఉత్పన్నమవుతాయి. మారుతున్న జీవనశైలి కూడా విటమిన్ల అసమతుల్యతకు దారితీస్తోంది. చదవండి: Belly Fat: క్యారెట్, మెంతులు, జామ, బెర్రీస్.. కొవ్వు, బరువు రెండూ తగ్గుతాయి! తెలంగాణలో కాస్త మెరుగే తెలంగాణలో మాత్రం విటమిన్ డీ స్థాయి కాస్త సంతృప్తికరంగానే ఉంది. నాలుగేళ్లలోపు చిన్నారులు 9.6 శాతం మందిలో, 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 5.5 శాతం మందిలో, 10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 8.8 శాతం మందిలో మాత్రమే లోపం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ‘డీ’లోపం అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్మూ కశ్మీర్, మణిపూర్, హరియాణ, ఉత్తరాఖండ్, బిహార్ రాష్ట్రాలున్నాయి. తమిళనాడులో ఈ లోపం అతితక్కువగా ఉంది. చదవండి: Weight Loss Tips: బాదం, చేపలు, చెర్రీలు తరచుగా తింటే! వైద్యుల సలహా మేరకే ‘రెడీమేడ్’ తీసుకోవాలి సూర్యరశ్మి ఎక్కువగా సోకకపోవడం డీ విటమిన్ లోపానికి కారణమని చెప్పొచ్చు. ఇక సరైన ఆహార పదార్థాలను సరైన మోతాదులో తీసుకోకపోవడం వల్ల కూడా విటమిన్ల సమస్య తలెత్తుతుంది. సముద్రపు ఆహారంలో ‘డీ’పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం కొన్ని రకాల పోషకాహారాలకు కూడా ‘డీ’ని అదనంగా జతచేసి అందిస్తున్నారు. ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నా తప్పనిసరిగా వైద్యుల సలహా మేరకే తీసుకోవాలి. – డాక్టర్ కీర్తి మునగపాటి, కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ -
విటమిన్-డి సప్లిమెంట్స్‌తో గుండెకు మేలు..!
పరి పరిశోధన గుండె పనితీరు సరిగా లేని ‘హార్ట్ ఫెయిల్యూర్’ రోగులకు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇవ్వడం... వాళ్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుందని ఒక బ్రిటిష్ అధ్యయనంలో తేలింది. ‘హార్ట్ ఫెయిల్యూర్’ సమస్య తలెత్తిన కొందరిని బ్రిటన్‌కు చెందిన నిపుణులు ఎంపిక చేసుకున్నారు. వీళ్లలో బీటాబ్లాకర్స్, ఏసీఈ ఇన్హిబిటార్స్ వంటి మందులు వాడతున్నవారు కొందరు ఉన్నారు. మరికొందరు తమ శరీరంలో పేస్‌మేకర్ వంటి పరికరాన్ని తమ అమర్చుకున్నవారు. వీళ్లలో సగం మందికి డాక్టర్లు విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చారు. మిగతా సగానికి కేవలం రోగి సంతృప్తి కోసం వాడేందుకు ఉపయోగించే మందులేని టాబ్లెట్లను ఇచ్చారు. ఇలా రోగి సంతృప్తి కోసం మాత్రమే ఇచ్చే మందు లేని టాబ్లెట్స్‌ను ‘ప్లాసెబో పిల్స్’ అంటారు. వాటిని రోజుకు ఒకసారి చొప్పున ఏడాది పాటు వాడారు. ఏడాది తర్వాత వాళ్లకు గుండెకు సంబంధించిన అల్ట్రాసౌండ్ స్కాన్ పరీక్ష నిర్వహించారు. విటమిన్-డి సప్లిమెంట్స్ ఇచ్చిన వారిలో గుండె పనితీరు 26 శాతం నుంచి 34 శాతం మెరుగయ్యిందని ఆ పరీక్షల్లో తేలింది. ‘‘గుండె పనితీరు మరింత దిగజారిపోయి ‘ఇంప్లాంటబుల్ కార్డియోవాస్క్యులార్ డీ-ఫిబ్రిలేటర్(ఐసీడీ)’ వంటి ఉపకరణాలను వాడాల్సిన పరిస్థితిని విటమిన్-డి3 సప్లిమెంట్స్ నివారించాయి’’ అని అధ్యయన ఫలితాలను వెల్లడించిన నిపుణులు వెల్లడించారు. ‘‘ఐసీడీ ఇంప్లాంట్స్ వాడటం ఖర్చుతో కూడిన పని. పైగా ఆపరేషన్ అవసరం. విటమిన్-డి సప్లిమెంట్స్ ఆ పరిస్థితిని నివారించాయంటే... ఆ మేరకు రోగులకు కలిసి వచ్చినట్టే కదా’’ అని అధ్యయనవేత్తలు పేర్కొన్నారు. ఈ అధ్యయన ఫలితాలను ఇటీవల అమెరికాలోని షికాగోలో నిర్వహించిన 65వ వార్షిక సదస్సులో (ఏన్యువల్ సైంటిఫిక్ సెషన్లో) బ్రిటన్‌కు చెందిన అధ్యయనవేత్తలు తెలిపారు.