శరీరానికి కావాల్సిన ముఖ్యమైన విటమిన్లలోఒకటి విటమిన్ డీ. డీ విటమిన్ లోపంతో ఆనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ విటమిన్ లోపం ఉందని నిర్ధారణ అయితే, వైద్యుల సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ప్రధానంగా వర్షాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. అందుకే సన్‌షైన్ విటమిన్ అని కూడా పిలువబడే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్‌డీ లోపిస్తే కాల్షియం లోపం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా మహిళలకు విటమిన్ డీ,కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
దాదాపు ఎనభై శాతం మంది పురుషుల్లో, మహిళల్లో దాదాపు తొంభై శాతం, విటమిన్ డీ లోపం ఉంటుంది. విటమిన్ డీ కాల్షియం లోపం మెలనోమా ప్రమాదాన్ని పెంచుతుంది మెలనోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉన్న మహిళలు విటమిన్ డీ సప్లిమెంట్లను తీసుకోవాలి. తగినంత విటమిన్ డీ లేకపోతే, శరీరం తగినంత కాల్షియంను గ్రహించదు. దీంతో ఎముకలు బలహీన పడతాయి. ముఖ్యంగా పెద్దవారిలో బోలు ఎముకల వ్యాధి , ఎముకలు విరిగిపోవడం లాంటి ప్రమాదాన్ని నివారించాలంటే ఇది అవసరం.
రోగనిరోధక వ్యవస్థకు మద్దతు
విటమిన్ డీ తెల్ల రక్త కణాల పోరాట ప్రభావాన్ని పెంచుతుంది. రోగనిరోధక వ్యవస్థకు మద్దతిస్తుంది. సాధారణ జలుబు, ఫ్లూ ఇన్ఫెక్షన్‌ల వంటి అనారోగ్యాలను అరికట్టడంలో పాయపడుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని విటమిన్ డీ చాలా అవసరం. విటమిన్ డీ లోపిస్తే డిప్రెషన్ వస్తుంది.
గుండె ఆరోగ్యానికి
విటమిన్ డీ రక్తపోటును నియంత్రిస్తుంది. ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరచడం ద్వారా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కండరాల పనితీరులో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది
బరువు నియంత్రణ
జీవక్రియ ,ఆకలి నియంత్రణలో సమర్థవంతంగా పనిచేస్తేంది. డీ విటమిన్ లోపిస్తే బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. విటమిన్ డి తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాధ్యత వహించే హార్మోన్ ఇన్సులిన్ సెన్సివిటీని మెరుగుపరుస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయ పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
విటమిన్ డీ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలుంటాయి. ఇది దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఆటో ఇమ్యూన్ వ్యాధులు, గుండె జబ్బులు కేన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలతో సహా అనేక ఆరోగ్య పరిస్థితుల నియంత్రణలో ఉపయోగ పడుతుంది. విటమిన్ డి గ్రాహకాలు మెదడులో ఉంటాయి. న్యూరోప్రొటెక్షన్‌లో ఇది పాత్ర పోషిస్తుంది. మతిమరపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే డీ విటమిన్ అవసరం.
చర్మ ఆరోగ్యం
విటమిన్ డి చర్మ కణాలను బాగు చేస్తుంది. పెరుగుదల. చర్మం యొక్క రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సోరియాసిస్ వంటి చర్మ పరిస్థితుల చికిత్సలో సహాయపడుతుంది. విటమిన్ డీ లోపాన్ని పరీక్షల ద్వారా నిర్ధారించుకుని, వైద్యుల పర్యవేక్షణలో సప్లిమెంట్లను తీసుకోవాలి. తద్వారా ముఖ్యమైన శారీరక విధులకు ఆటంకం లేకుండా చూసుకొని, వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment