మాట్లాడుతున్న ప్రముఖ ఆరోగ్య సలహాదారుడు వీరమాచినేని రామకృష్ణారావు, హాజరైన ప్రజలు
మహబూబాబాద్ : మన ఆరోగ్యం మన చేతిలో ఉందని ప్రముఖ ఆరోగ్య సలహాదారుడు వీరమాచినేని రామకృష్ణారావు అన్నారు. స్థానిక గాంధీపార్క్‌లో ఆదివారం రాత్రి ‘మీ ఆరోగ్యం మీ చేతిలోనే..’ అనే అంశంపై ఉచిత అవగాహన సదస్సు జరిగింది. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఆరోగ్య జాగ్రత్తల గురించి తెలిసినా నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ఆహార పదార్థాల్లో ఉన్న పోషకాలు, విటమిన్లపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. విటమిన్ డీ కలిగిన బలవర్ధకమైన ఆహారం గుడ్డు తినాలన్నారు. ఎమ్మెల్యే భానోత్ శంకర్‌నాయక్ మాట్లాడుతూ కోట్లాది రూపాయల ఆస్తుల కన్నా ఆరోగ్యం మిన్నా అన్నారు. కార్యక్రమంలో ఘనపురపు అంజయ్య, పి.పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ డోలి సత్యనారాయణ, రామసాయం వెంకట్‌రెడ్డి, పిల్లి సతీష్, పిల్లి సుధాకర్, వద్దుల సరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, బోడ్డుపెల్లి ఉపేందర్, వడ్డెబోయిన శ్రీనివాస్, కేదాస్ వాసుదేవ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment