లండన్: విటమిన్ డి మాత్రలతో ఫ్లూ, జలుబుతోపాటు శ్వాసకోస సంబంధ వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మేరకు క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు 11 వేల మందిపై పరిశోధన జరిపి ఈ అంచనాకు వచ్చారు. భారత్, లండన్, అమెరికా, జపాన్, అఫ్గనిస్తాన్, బెల్జియం, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి 14 దేశాలకు చెందినవారిపై 25 రకాల వైద్య పరీక్షలు జరిపి ఈ పరిశోధన జరిపినట్లు తెలిపారు. మానవుడి దేహంలో డి విటమిన్ స్థాయిలను పెంచడం ద్వారా ఫ్లూ, జలుబు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారిన పడకుండా నియంత్రించవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని ఆడ్రియన్ మార్టిన్యూ చెప్పారు.
సూర్యరశ్మిలో దొరికే విటమిన్ డి ఊపిరితిత్తుల్లోని యాంటీమైక్రోబియల్ పెప్టైడ్ స్థాయిలను పెంచి శ్వాసకోస సంబంధ వ్యాధులు సోకకుండా రక్షించగలదని పరిశోధకులు తెలిపారు. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్న వారు శీతాకాలం, వసంత కాలంలో ఫ్లూ, జలుబు బారిన పడుతుంటారని చెప్పారు. విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్న వారికి ఫ్లూ, జలుబు బారిన పడే అవకాశాలు పది శాతం తక్కువగా ఉంటాయని వివరించారు.
విటమిన్ డి తో జలుబు మాయం!
Published Sun, Feb 19 2017 8:10 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM
Advertisement
Advertisement