Queen Mary University of London
-
మరో సూర్ ఎర్త్!
లండన్: ఖగోళ శాస్త్రవేత్తలు తాజాగా సూర్యుడికి పొరుగునే మరో గ్రహాన్ని (సూపర్ ఎర్త్) కనుగొన్నారు. ఇది నివాసయోగ్యంగా ఉండే అవకాశం ఉందని ఊహిస్తున్నారు. సూర్యుడికి 6 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బర్నార్డ్స్ నక్షత్రం చుట్టూ ఈ సూపర్ ఎర్త్ తిరుగుతున్నట్లు గుర్తించారు. బ్రిటన్‌లోని క్వీన్ మేరీ వర్సిటీ ఖగోళ శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. భూమికి కేవలం 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం భూమికన్నా మూడు రెట్లు పెద్దగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై మైనస్ 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉందని, బర్నార్డ్స్ చుట్టూ పరిభ్రమించడానికి దీనికి 233 రోజులు పడుతుందని అంచనా వేశారు. రాళ్లు, మంచుతో కూడిన ఈ గ్రహంపై నీటి వనరులు పుష్కలమని, కానీ, కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే నివాసానికి అనుకూలంగా ఉండేదని ఖగోళ శాస్త్రవేత్త గుల్లెమ్ అంగ్లడ ఎస్కుడే పేర్కొన్నారు. కనుగొనడానకి ముందు శాస్త్రవేత్తలు ఈ గ్రహానికి సంబంధించి 20 ఏళ్లుగా చేస్తున్న సర్వేలు, పరిశోధనల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. తొలిసారి రేడియల్ వెలాసిటీ పద్ధతి సాయంతో ఈ గ్రహాన్ని గుర్తించారు. -
విటమిన్ డి తో జలుబు మాయం!
లండన్: విటమిన్ డి మాత్రలతో ఫ్లూ, జలుబుతోపాటు శ్వాసకోస సంబంధ వ్యాధుల బారిన పడకుండా రక్షణ పొందవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మేరకు క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్‌కు చెందిన పరిశోధకులు 11 వేల మందిపై పరిశోధన జరిపి ఈ అంచనాకు వచ్చారు. భారత్, లండన్, అమెరికా, జపాన్, అఫ్గనిస్తాన్, బెల్జియం, ఇటలీ, ఆస్ట్రేలియా, కెనడా వంటి 14 దేశాలకు చెందినవారిపై 25 రకాల వైద్య పరీక్షలు జరిపి ఈ పరిశోధన జరిపినట్లు తెలిపారు. మానవుడి దేహంలో డి విటమిన్ స్థాయిలను పెంచడం ద్వారా ఫ్లూ, జలుబు, శ్వాసకోస సంబంధ వ్యాధుల బారిన పడకుండా నియంత్రించవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని ఆడ్రియన్ మార్టిన్యూ చెప్పారు. సూర్యరశ్మిలో దొరికే విటమిన్ డి ఊపిరితిత్తుల్లోని యాంటీమైక్రోబియల్ పెప్టైడ్ స్థాయిలను పెంచి శ్వాసకోస సంబంధ వ్యాధులు సోకకుండా రక్షించగలదని పరిశోధకులు తెలిపారు. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్న వారు శీతాకాలం, వసంత కాలంలో ఫ్లూ, జలుబు బారిన పడుతుంటారని చెప్పారు. విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉన్న వారికి ఫ్లూ, జలుబు బారిన పడే అవకాశాలు పది శాతం తక్కువగా ఉంటాయని వివరించారు.