పనస లేదా దానిమ్మ వంటి పండ్లలోని భాగాలను తొనలు అంటారు. కానీ చిత్రమేమిటంటే.. సీతాఫలంలోని గింజలకు చుట్టుకొని ఉండే కమ్మని, తియ్యని తినే భాగాల్ని కండ్లు అంటారు. సీతాఫలాలను తింటే కళ్లకు మేలు. అందులో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ కంటి చూపు చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. ఈ కారణంతో పాటు, కళ్లను పోలిన గింజల వల్లనే వాటిని కళ్లు అంటారేమో! అయితే ఒక్క చూపును పదిలంగా ఉంచడం మాత్రమే కాదు.. ఈ పండుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఇవి కొన్ని.
సీతాఫలాల్లోని విటమిన్–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. సీతాఫలంలో పొటాషియమ్ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత (అనీమియా)ను సమర్థంగా అరికడతాయి. సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్ కలిసి మలబద్ధకం వంటి సమస్యను నివారిస్తాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా సీతాఫలం ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని మెగ్నీషియమ్ కారణంగా రక్తప్రవాహం మెరుగుపడటం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలాకాలం పదిలంగా ఉంటుంది. సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్)నూ, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది. సీతాఫలం డిప్రెషన్‌కు స్వాభావిక ఔషధంగా పనిచేస్తుంది.
ఆరోగ్య ఫలం గుడ్ ఫుడ్
Published Mon, Oct 8 2018 12:12 AM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment