తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే! | kids are body builders if her mother tooks vitamin D | Sakshi
Sakshi News home page

తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే!

Published Wed, Jan 8 2014 12:14 AM | Last Updated on Tue, Nov 6 2018 4:55 PM

తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే! - Sakshi

తల్లులు విటమిన్ డి తీసుకొంటే.. పిల్లలు బాడీ బిల్డర్‌లే!

 సమ్‌థింగ్ స్పెషల్

 తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.
 
 ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆరు పలకల దేహాల కు క్రేజ్ ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ పరిశోధన ఆసక్తికరంగా మారింది. అబ్బాయిల సిక్స్‌ప్యాక్‌ను తీర్చిదిద్దే శక్తి తల్లులకే ఉందని ఈ పరిశోధన తేల్చింది. కేవలం బాడీబిల్డింగ్ కే కాదు, కాబోయే అమ్మలు విటమిన్ డి ఎక్కువగా తీసుకొంటే పిల్లల్లో శారీరక సత్తా పెరిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు వివరించారు. చర్మానికి సూర్యకాంతి తగిలినప్పుడు శరీరంలో విటమిన్ డి జనిస్తుంది. చేపలను తినడం ద్వారా కూడా ప్రెగ్నెంట్ లేడీస్ విటమిన్ డి ని వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement