Good food
-
బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి!
మీరు రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే అత్యంత ముఖ్యమైనది బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, ఫైబర్లతో కూడిన ఆహారం తీసుకోవడమనేది అత్యంత ముఖ్యం. వీటితో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం హాయిగా గడిచేలా చేస్తోంది. లేదంటే చిరాకుగా ఉండి ఏ పని చేయాలనే ఉత్సాహం లేకుండా అయిపోతుంది. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో రుచికరంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పొద్దుపొద్దునే అధిక చక్కెరలు, కొవ్వులు కలిగిన పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా శరీరంలో అధిక కేలరీల్లో కొవ్వుని అమాంతం పెంచేస్థాయి. తక్కువగానే ఫుడ్ తీసుకుంటున్నాం కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతుంటాం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటికి దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఆహారాలు ఏమిటో చూద్దామా! చక్కెర లేదా శుద్ధి చేసిన తృణధాన్యాలు పొద్దుపొద్దునే చక్కెర లేదా క్రంచిగా ఉంగే పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో చక్కెర ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచేస్తాయి. దీంతో చక్కెరను తగ్గించే ఇన్సులిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకు, అసహనం ఎక్కువై తెలియకుండానే అధిక ఆకలికి దారితీస్తుంది. అదే విధంగా కార్న్‌ఫ్లెక్స్ వంటి తియ్యని తృణధాన్యాల్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. పైగా వాటిలో చక్కెర స్థాయిలు లేకపోయినప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అంత మంచిది కాదనే చెబుతున్నారు వైద్యులు. వీటి కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందంటున్నారు. పాన్‌కేకులు, బ్రెడ్ పాన్‌కేకులు, బ్రెడ్స్ రుచికరంగా అనిపించినప్పటికి ఉదయాన్నే అల్పహారంగా తీసుకోవడానికి పోషకమైన ఆహారం కాదనే చెబుతున్నారు నిపుణలు. వీటిలో అధిక కేలరీల్లో చక్కెర, కొవ్వులు ఉంటాయి. దీని వల్ల పోషకాహరంతో కూడిన ప్రోటీన్లు ఫైబర్లు మిస్ అవుతాయని అంటున్నారు ఆహార నిపుణులు. వెన్నతో చేసిన టోస్ట్ బటర్డ్ టోస్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. కానీ దీనిలో అంత స్థాయిలో ప్రోటీన్లు ఉండవు. ఈ బటర్డ్ టోస్ట్‌లో ఎక్కువ కేలరీలలో పిండి పదార్థాలు, కొవ్వులు ఉండటం వల్ల దీన్ని అల్పహారంగా పరిగణించలేమని అంటున్నారు వైద్యులు. దీని బదులుగా హోల్ గ్రెయిన్ బ్రెడ్(వీట్‌బ్రెడ్), గుడ్లు లేదా చికెన్, దోసకాయ, ఆకుకూరలు, కూరగాయ ముక్కలు చేరిస్తే పుష్కలంగా ప్రోటీన్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది పూరీలు డీప్ ఫ్రై చేసిన ఆహారం ఉదయమే అల్పహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి వస్తాయి. ఇది లివర్‌కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి డీఫ్ ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లరసం దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని ఎంచుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు న్యూట్రీషియన్లు. తియ్యటి పెరుగు లేదా వెన్న లేని పెరుగు దీనిలో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియాలను అందిస్తుంది. కానీ ఈ పెరుగులో చక్కెర స్థాయిలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఇది మంచిదని చెప్పలేం అంటున్నారు ఆహార నిపుణులు. దీనిలో కొవ్వుల స్థాయి కూడా తక్కువగానే ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేందుకు ఉత్తమమైందని చెప్పలేం అంటున్నారు . ఫాస్ట్ ఫుడ్ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీటిలో ఎక్కువ కేలరీల్లో కొవ్వు, శుద్ది చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆకర్షణీయంగా రుచికరంగా అనిపించినప్పటికీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బెబుతున్నారు ఆహార నిపుణులు కాఫీ పానీయాలు పరగడుపునే ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇన్సులిన్ని స్రవించేలా చేయడమే గాక వాటి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది కూడా. పరాఠా ముఖ్యంగా మైదాతో చేసిన పరాఠాలు జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రమాదరకమైనవి. ఇవి వికారం వంటి అనుభూతులకు కారణమవుతాయి. అంతగా తినాలనిపిస్తే రాగులు, గోధుమలు వంటి వాటితో చేసిన పరాఠాలు ఉత్తమం. ఇంకా పరాఠాలను కూరలతో కలిపి తీసుకుంటుంటారు. అయితే వాటిలో పనీర్‌కు బదులుగా సోయాబీన్స్, బ్రోకలీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసిన కర్రీలను ఉపయోగించటం మంచిది. మ్యాగీ న్యూడిల్స్ దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటితో ఆరోగ్య ప్రయోజాలు లేకపోగా మంచి పోషక విలువలేమి శరీరానికి అందవు. దీనిలో 46 శాతం సోడియం ఉంటుంది. అందువల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియ స్థాయిలు పెరిగి హైపర్‌నాట్రేమియా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతేగాదు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది కూడా. (చదవండి: ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..) -
సమతులాహారం... అందని ద్రాక్షే
డి.శ్రీనివాసరెడ్డి: పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్సింగ్ చేపట్టిన సంస్కరణలు సగం ఉడికిన వంటకంలా ఉన్నాయని ప్రస్తుత మంత్రి నిర్మలా సీతారామన్ ఓ సదస్సులో అన్నారు. ‘ఇంకా నయం. మోదీ సర్కారు మాదిరిగా నోట్ల రద్దు, జీఎస్టీ బాదుడు, పెట్రో వాతలతో తినడానికే వీలు కాని మాడిపోయిన వంటకమైతే మన్మోహన్ తయారు చేయలేదు’ అంటూ కాంగ్రెస్‌కే చెందిన మరో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం రిటార్టిచ్చారు. వంటకాల గోల ఎలా ఉన్నా సగటు భారతీయులు సరైన తిండి తినే భాగ్యానికి నోచుకోవడం లేదు. వారికి సమతులాహారం విలాస వస్తువుగా మారుతున్న దుస్థితి దాపురిస్తోంది...! ఆహారోత్పత్తుల ధరలు కొన్నేళ్లుగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ఆహార ధాన్యాలు, ఇంధనం ధరల పెరుగుదల, సరఫరా సమస్యలు తదితరాలు ఇందుకు కారణమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చెందిన ప్రొఫెసర్ లేఖా చక్రవర్తి చెప్పారు. ► దేశంలో ఏకంగా 71 శాతం మందికి ఆరోగ్యకరమైన ఆహారం అందుబాటులో లేదని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ), డౌన్ టు అర్త్ పత్రిక సంయుక్త నివేదిక తేల్చింది. ప్రపంచవ్యాప్త సగటు (42 శాతం) కంటే ఇది చాలా ఎక్కువ! ► సగటు భారతీయ కుటుంబపు ఆహార ఖర్చు గత పదేళ్లలో అక్షరాలా రెట్టింపైంది. ► ముగ్గురుండే కుటుంబానికి వారానికి ఐదు లీటర్ల పాలు, రెండేసి కిలోల బియ్యం, గోధుమ పిండి, టమాటాలు, ఆలుగడ్డలు, ఉల్లిపాయలు, లీటరు నూనె, పప్పు ధాన్యాలు, పండ్లు అవసరం. ► వీటన్నింటి ధరలూ ఆహార పదార్థాల ధరల సూచీ (సీఎఫ్‌పీఐ) ప్రకారమే 2014 నుంచి గత ఎనిమిదేళ్లలోనే 80 శాతం దాకా పెరిగాయి. ► గత ఏడాదిలో చూసుకున్నా దాదాపు 10 శాతం పెరిగినట్టు కేంద్ర గణాంకాలే చెబుతున్నాయి. ధరాభారంతో బెంబేలు ఆదాయం మూరెడు పెరిగితే ధరలు బారెడు పెరుగుతూ బెంబేలెత్తిస్తున్నాయి. దాంతో సగటు పౌరునికి పౌష్టికాహారం నానాటికీ తగ్గిపోతూ వస్తోంది. కుటుంబ ఆదాయంలో ఆహార వ్యయం 63 శాతానికి మించితే వారికి పౌష్టికాహారం దూరమైనట్టేనని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెబుతోంది. ► ఫలితంగా 21 ఏళ్ల వ్యక్తి రోజుకు 200 గ్రాముల పండ్లకు బదులు 35.8 గ్రాములతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ► 300 గ్రాముల కూరగాయలకు బదులు 168.7 గ్రాములే అందుతున్నాయి. ► ఈ పౌష్టికాహార లోపం ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహంతో పాటు క్యాన్సర్, గుండె సమస్యలకు దారితీస్తోందని గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్టు హెచ్చరిస్తోంది. మన థాలి ఖరీదెంత? సగటు భారతీయుడు తినే థాలి (సమగ్ర భోజనం) ఖరీదును తొలిసారిగా 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2020–21లోనూ మరో ప్రయత్నం చేశారు. వాటిలో తేలిందేమిటంటే... ► శాకాహార భోజనం ఖరీదు అండమాన్‌లో అతి ఎక్కువగా రూ. 38.7 , యూపీలో అతి తక్కువగా 23.1 రూపాయలు. ► ఐదుగురున్న కుటుంబపు నెలవారీ భోజన ఖర్చు 2015లో రూ.4,700 ఉంటే ఇప్పుడు రూ.6,700కు పెరిగింది. ► ఓ మాదిరి వ్యక్తి రెండు పూటల ఇంటి భోజనానికి 2015లో సగటున రూ.32 ఖర్చయితే ఇప్పుడు రూ.44కు పెరిగింది. -
సకుటుంబ ప్రకృతి సేద్యం!
‘ఎంత చదువుకొని ఎంత డబ్బు గడిస్తున్నా, తిరిగి మూలాలు వెతుక్కుంటూ రావాల్సిందే.. పొలంలోకి దిగాల్సిందే.. మన ఆరోగ్యం కోసం, మన పంటను మన చేతులతో పండించుకోవాల్సిందే..’ అంటున్నారు బూనేటి కిరణ్ గౌడ్. మంచి ఆహారం తినాలనుకుంటే సొంతంగా సహజ పద్ధతుల్లో పండించుకోవడమే ఉత్తమమని అంటున్నారు. మా ఆహారాన్ని మేమే పండించుకుంటాం అంటున్న కిరణ్ కుటుంబం ఇంట్లో పెద్దలు, పిల్లలందరూ కలిసి స్వయంగా వరి నాట్లు వేసుకోవడం, ఆరోగ్యదాయకమైన, రుచికరమైన దేశీ రకాలను మాత్రమే పండించడం విశేషం. దేశవాళీ వరి, మిర్చి, వంగ, టమాటో, సొర తదితర కూరగాయలు పండించుకుంటూ.. తాము తింటూ అమృతాహారం తింటూ తోడబుట్టిన వారికి, దగ్గరి బంధుమిత్రుల కుటుంబాలకూ రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను అందిస్తూ్త ఆదర్శప్రాయంగా నిలుస్తోంది కిరణ్ కుటుంబం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని పెద్దగొల్లపల్లిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కిరణ్ ఉన్నత చదువులు చదువుకొని కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తీరిక లేని ఉరుకులు పరుగుల జీవితం గడిపారు. ‘2006లో ఈ–పేపర్ సాంకేతికతను దేశంలోనే తొట్టతొలిగా అందించిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మాది.. అప్పట్లో ఆహారం గురించి ఆలోచించే తీరిక ఉండేది కాదు. అసలు ఆ ఆలోచనే లేదు. ఇక చాలనుకొని 2014లో విరమించుకున్నాను..’ అంటారాయన. పొలం పనుల్లో చిన్నారులు నగరంలో అముల్ డెయిరీ డీలర్‌షిప్‌ను నిర్వహిస్తూనే తమ స్వగ్రామంలోని భూమిలో గత రెండున్నరేళ్లుగా దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యం చేస్తూ కుటుంబం కోసం అమృతాహారాన్ని పండిస్తున్నారు. తల్లి వినోదిని, భార్య అర్చన, కుమారు దేవ్రత్గౌడ్(10), కుమార్తె స్కంద(7)తోపాటు కిరణ్ ఇటీవల రబీ పంటగా దేశీ రకం సన్నజీర నారుతో నాట్లు వేశారు. ‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే రుచికరమైన, ఆరోగ్యదాయకమైన దేశీ వరి, కూరగాయలను పండిస్తున్నాను. మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం. నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం. ప్రస్తుతం పెద్దగొల్లపల్లి, మహేశ్వరం మండలం హర్షగూడలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరేడు ఎకరాల్లో బాజ్ భోగ్, నవార, సన్నజీర తదితర రకాల వరి, కూరగాయలు పండిస్తూ మా దగ్గరి బంధుమిత్రులకు మాత్రమే ఇస్తున్నాం. అనుభవం గడించిన తర్వాత వందకు పైగా ఎకరాలను కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు కూడా అమృతాహారాన్ని అందించాలన్నదే తన అభిమతమని కిరణ్ వివరించారు. వంట నూనెలు కూడా కలుషితమైపోయినందున ఎద్దు గానుగ కూడా పెట్టాలనుకుంటున్నాను. అయితే, కూలీల సమస్య అతిపెద్ద సవాలుగా ఉందన్నారు. ‘దేశీ రకాలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న రైతులు అపురూపంగా పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన మార్కెటింగ్ సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా, మార్కెట్లో వ్యాపారులు ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విపరీతమైన ఎక్కువ ధరకు అమ్ముతుండటంతో ఈ ఉత్పత్తుల విలువ తెలిసి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఉదాహరణకు.. నవార బియ్యం కిలో రూ. వందకు రైతు అమ్ముతుంటే వ్యాపారులు ఆన్లైన్లో రూ. 350 వరకు అమ్ముతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి శంషాబాద్‌లో ప్రకృతి వ్యవసాయదారుల మార్కెట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఎంపికచేసి ఈ మార్కెట్లో చోటు ఇస్తాం. నేరుగా వినియోగదారులే వచ్చి రైతు ధరకే కొనుక్కుంటారు. నేను కూడా ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు అమ్ముతా. అప్పటి వరకు మా కుటుంబం, దగ్గరి బంధువుల కోసమే పండిస్తా. డబ్బు కోసం కాదు, మా ఆరోగ్యం కోసం..’ అని కిరణ్ అంటున్నారు. మహానగరంలో నివాసం ఉంటూనే మూలాలు వెతుక్కుంటూ పల్లెకు వెళ్లి, మట్టిని మక్కువతో గుండెలకు హత్తుకుంటున్న కొత్త తరం అన్నదాతలకు ప్రతినిధి కిరణ్ గౌడ్(98856 33353). ఈ కొత్త తరం ప్రకృతి వ్యవసాయదారులు పంటల సాగులోనే కాదు మార్కెటింగ్‌లోనూ తమదైన ముద్ర వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల పండుగ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త తరం అన్నదాతలకు జేజేలు పలుకుదాం! ‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం. నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం..’ బాజ్ బోగ్ వరి పంట (ఫైల్) ఫొటోలు: ఎస్ఎస్ ఠాగూర్, సీనియర్ ఫొటోగ్రాఫర్ -
పోషకాల పవర్‌హౌజ్!
చాలా చవకగా ఆరోగ్యాన్ని సంపాదించుకోడానికి జామపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలకు కొదవే లేదు. అందుకే ఈ పండును ‘పోషకాల పవర్‌హౌజ్’ అంటారు. వంద గ్రాముల జామపండులో 68 క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు... ఇందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, పొటాషియమ్ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. జామలో విటమిన్–సి చాలా ఎక్కువ. ఇది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్ కావడంతో ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. ఒంటికి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తుంది. జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. జామ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. అందుకే డయాబెటిస్ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. పీచుపదార్థాలు చాలా ఎక్కువ కావడం వల్ల ఇందులో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పీచుపదార్థాలే ఒంట్లో చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. అందువల్ల కూడా ఇది డయాబెటిస్ ఉన్నవారికి ఉపయుక్తమైన పండుగా పేరొందింది. దీనిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని సమర్థంగా నివారిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుంది. జామలో పొటాషియమ్ కూడా ఎక్కువే. పొటాషియమ్ రక్తపోటును అదుపు చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే హైబీపీ నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. జామపండు ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) వంటి వాటిని అదుపు చేయడంతో పాటు, ఒంటికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి తోడ్పడుతుంది. జామలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల పటిష్టపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. జామపండులో విటమిన్–బి6, విటమిన్ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మెదడులోని న్యూరాన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల జామపండు తినేవారిలో మెదడు చురుగ్గా ఉంటుంది. డిమెన్షియా, అలై్జమర్స్ వంటి జబ్బులను నివారించడానికి కూడా జామ తోడ్పడుతుంది. జామపండ్లను తినేవారిలో పంటి, చిగుర్లకు సంబంధించిన వ్యాధులు చాలా తక్కువ. ఇందులో ఫోలిక్‌యాసిడ్ పుష్కలంగా ఉండటం వల్ల డాక్టర్లు దీన్ని గర్భిణులకు సిఫార్సు చేస్తుంటారు. కడుపులోని బిడ్డ తాలూకు నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా అభివృద్ధి అయ్యేందుకు జామ తోడ్పడుతుంది. ఆరోగ్యకరమైన, నిగారింపుతో కూడిన మెరిసే చర్మం కోసం జామ బాగా ఉపయోగపడుతుంది. ఏజింగ్ ప్రక్రియనూ ఆలస్యం చేస్తుంది. బరువు తగ్గాలనుకునేవారికి జామ అనేక విధాల తోడ్పడుతుంది. ఇందులోని తక్కువ చక్కెర పాళ్లు, పీచు వంటి అంశాలు వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి. -
ఆరోగ్య ఫలం గుడ్ ఫుడ్
పనస లేదా దానిమ్మ వంటి పండ్లలోని భాగాలను తొనలు అంటారు. కానీ చిత్రమేమిటంటే.. సీతాఫలంలోని గింజలకు చుట్టుకొని ఉండే కమ్మని, తియ్యని తినే భాగాల్ని కండ్లు అంటారు. సీతాఫలాలను తింటే కళ్లకు మేలు. అందులో పుష్కలంగా ఉండే విటమిన్–ఏ కంటి చూపు చాలాకాలం పదిలంగా ఉంచుతుంది. ఈ కారణంతో పాటు, కళ్లను పోలిన గింజల వల్లనే వాటిని కళ్లు అంటారేమో! అయితే ఒక్క చూపును పదిలంగా ఉంచడం మాత్రమే కాదు.. ఈ పండుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిల్లో ఇవి కొన్ని. సీతాఫలాల్లోని విటమిన్–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. సీతాఫలంలో పొటాషియమ్ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత (అనీమియా)ను సమర్థంగా అరికడతాయి. సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్ కలిసి మలబద్ధకం వంటి సమస్యను నివారిస్తాయి. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా సీతాఫలం ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని మెగ్నీషియమ్ కారణంగా రక్తప్రవాహం మెరుగుపడటం వల్ల గుండె ఆరోగ్యం కూడా చాలాకాలం పదిలంగా ఉంటుంది. సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్)నూ, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది. సీతాఫలం డిప్రెషన్‌కు స్వాభావిక ఔషధంగా పనిచేస్తుంది. -
పోషకాహారంతోనే ఆరోగ్యం
∙ఐసీడీఎస్ ఆర్జేడీ చక్రధర్‌రావు గూడూరు : గర్భిణులు, బాలింతలు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ ఆర్జేడీ చక్రధర్‌రావు అన్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక బాలసదనంలో ఐసీడీఎస్ సీడీపీఓ పావని అధ్యక్షతన బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో ఆర్జేడీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ శిశువు దశలో పౌష్టికాహారం అందజేసినప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. సర్పంచ్ వాంకుడోతు మోతీలాల్‌నాయక్, పీహెచ్సీ వైద్యుడు అంబరీష్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలసదనం సూపరింటెండెంట్ కన్న రాధ, సూపర్వైజర్లు తేజాబాయి, కళావతి, శారద, సంధ్య, లలిత, రాంలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మంచి ఆహారంతోనే ఆరోగ్యం
శిల్పాశెట్టి ముంబై: ఆరోగ్యం అనేది మంచి ఆహారం తీసుకోవడం వల్లే సాధ్యమవుతుందని బాలీవుడ్ నటి శిల్పా శెట్టి స్పష్టం చేస్తోంది. ‘ఫిట్నెస్’ మీద పట్టున్న శిల్పాశెట్టి యోగాలో మంచి ప్రావీణ్యం సంపాదించింది. కాగా, ఆమె ఇప్పుడు ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలనే విషయంపై పుస్తకం రాస్తోంది. దీని కోసం గత 7 నెలలుగా ఆమె కష్టపడుతోంది. ‘మంచి ఆరోగ్యం కోసం క్రమశిక్షణతో కూడిన వ్యాయామంతోపాటు క్రమపద్ధతిలో పౌష్టకాహారాన్ని తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. నేను కొన్నేళ్లుగా నేర్చుకున్న, ఆచరిస్తున్న విషయాలను ఇప్పుడు పుస్తకంపై పెట్టబోతున్నాను. ప్రతిదీ మన మనసుపై ఆధారపడి ఉంటుంది. మనం బరువు తగ్గాలి అనే విషయాన్ని మనసుకు ఎక్కించాలి.. ఆశావహ దృక్పథంతో ముందుకు వెళితే ఏ పనైనా సాధ్యమవుతుంది.. నేను నిజజీవితంలో అదే విషయాన్ని చేసి చూపిస్తున్నా..’ అని 39 యేళ్ల ఈ బ్యూటీ సెలవిస్తోంది. తనతోపాటు తన భర్త రాజ్ కుంద్రా, రెండేళ్ల కొడుకు వియాన్‌ను కూడా అదే మార్గంలో నడిపిస్తున్నట్లు శిల్ప చెప్పింది. ‘పౌష్టికాహారం అంటే చాలామందికి అర్థం తెలీదు.. చాలా మంది తల్లులు తమ పిల్లలను ఎక్కువగా తినమని బలవంతం పెడుతుంటారు. అది కరెక్టు కాదు.. నేను పుస్తకం రాస్తోంది ఒక తల్లిగా కూడా. నేను, నా కొడుకు కూడా నెయ్యి తింటాం.. నాకు ఈ డైటింగ్, ఉపవాసాలు మీద నమ్మకం లేదు..’ అని స్పష్టం చేసింది. అలాగే మహిళలు గర్భిణీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి కూడా వివరంగా రాస్తున్నట్లు చెప్పింది. కాగా, పుస్తకానికి సంబంధించి చాలా భాగం పూర్తయ్యిందని వివరించింది. ఈ పుస్తకం వచ్చే ఏడాది ఇంగ్లిష్‌లో ప్రచురితమవుతోంది. ఇదిలా ఉండగా, ‘బాజీగర్’ సినిమా ద్వారా బాలీవుడ్ తెరకు పరిచయమైన ఈ పొడుగు కాళ్ల సుందరి పలు విజయవంతమైన చిత్రాల్లో హీరోయిన్గా నటించింది.. నటిస్తోంది.