బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్‌ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి! | Some Breakfast Foods Skip For Good Health | Sakshi
Sakshi News home page

బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్‌ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి..

Published Mon, Jun 12 2023 5:09 PM | Last Updated on Mon, Jun 12 2023 5:48 PM

Some Breakfast Foods Skip For Good Health - Sakshi

మీరు రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే అత్యంత ముఖ్యమైనది బ్రేక్‌ఫాస్ట్‌. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్‌, ఫైబర్‌లతో కూడిన ఆహారం తీసుకోవడమనేది అత్యంత ముఖ్యం. వీటితో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం హాయిగా గడిచేలా చేస్తోంది. లేదంటే చిరాకుగా ఉండి ఏ పని చేయాలనే ఉత్సాహం లేకుండా అయిపోతుంది. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ విషయంలో రుచికరంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు.

కానీ పొద్దుపొద్దునే అధిక చక్కెరలు, కొవ్వులు కలిగిన పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా శరీరంలో అధిక కేలరీల్లో కొవ్వుని అమాంతం పెంచేస్థాయి. తక్కువగానే ఫుడ్‌ తీసుకుంటున్నాం కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతుంటాం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటికి దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు.

బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని  ఆహారాలు ఏమిటో చూద్దామా!

చక్కెర లేదా శుద్ధి చేసిన తృణధాన్యాలు
పొద్దుపొద్దునే చక్కెర లేదా క్రంచిగా ఉంగే పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో చక్కెర ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచేస్తాయి. దీంతో చక్కెరను తగ్గించే ఇన్సులిన్‌ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకు, అసహనం ఎక్కువై తెలియకుండానే అధిక ఆకలికి దారితీస్తుంది. అదే విధంగా కార్న్‌ఫ్లెక్స్‌ వంటి తియ్యని తృణధాన్యాల్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. పైగా వాటిలో చక్కెర స్థాయిలు లేకపోయినప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అంత మంచిది కాదనే చెబుతున్నారు వైద్యులు. వీటి కారణంగా గుండె జబ్బులు, టైప్‌ 2 మధుమేహం వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందంటున్నారు.

పాన్‌కేకులు, బ్రెడ్‌
పాన్‌కేకులు, బ్రెడ్స్‌ రుచికరంగా అనిపించినప్పటికి ఉదయాన్నే అ‍ల్పహారంగా తీసుకోవడానికి పోషకమైన ఆహారం కాదనే చెబుతున్నారు నిపుణలు. వీటిలో అధిక కేలరీల్లో చక్కెర, కొవ్వులు ఉంటాయి. దీని వల్ల పోషకాహరంతో కూడిన ప్రోటీన్లు ఫైబర్లు మిస్‌ అవుతాయని అంటున్నారు ఆహార నిపుణులు. 

వెన్నతో చేసిన టోస్ట్‌
బటర్డ్‌ టోస్ట్‌ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. కానీ దీనిలో అంత స్థాయిలో ప్రోటీన్‌లు ఉండవు. ఈ బటర్డ్‌ టోస్ట్‌లో ఎక్కువ కేలరీలలో పిండి పదార్థాలు, కొవ్వులు ఉండటం వల్ల దీన్ని అల్పహారంగా పరిగణించలేమని అంటున్నారు వైద్యులు. దీని బదులుగా హోల్‌ గ్రెయిన్‌ బ్రెడ్‌(వీట్‌బ్రెడ్‌), గుడ్లు లేదా చికెన్‌, దోసకాయ, ఆకుకూరలు, కూరగాయ ముక్కలు చేరిస్తే పుష్కలంగా ప్రోటీన్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది

పూరీలు
డీప్‌ ఫ్రై చేసిన ఆహారం ఉదయమే అల్పహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి వస్తాయి. ఇది లివర్‌కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి డీఫ్‌ ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

పండ్లరసం
దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫైబర్‌ తక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని ఎంచుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు న్యూ‍ట్రీషియన్లు.

తియ్యటి పెరుగు లేదా వెన్న లేని పెరుగు
దీనిలో ప్రోటీన్‌, ప్రోబయోటిక్స్‌ ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియాలను అందిస్తుంది. కానీ ఈ పెరుగులో చక్కెర స్థాయిలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఇది మంచిదని చెప్పలేం అంటున్నారు ఆహార నిపుణులు. దీనిలో కొవ్వుల స్థాయి కూడా తక్కువగానే ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేందుకు ఉత్తమమైందని చెప్పలేం అంటున్నారు .

ఫాస్ట్​ ఫుడ్‌
దీన్ని ‍బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీటిలో ఎక్కువ కేలరీల్లో కొవ్వు, శుద్ది చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆకర్షణీయంగా రుచికరంగా అనిపించినప్పటికీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బెబుతున్నారు ఆహార నిపుణులు

కాఫీ పానీయాలు
పరగడుపునే ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇన్సులిన్‌ని స్రవించేలా చేయడమే గాక వాటి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది కూడా. 

పరాఠా
ముఖ్యంగా మైదాతో చేసిన పరాఠాలు జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రమాదరకమైనవి. ఇవి వికారం వంటి అనుభూతులకు కారణమవుతాయి. అంతగా తినాలనిపిస్తే రాగులు, గోధుమలు వంటి వాటితో చేసిన పరాఠాలు ఉత్తమం. ఇంకా పరాఠాలను కూరలతో కలిపి తీసుకుంటుంటారు. అయితే వాటిలో పనీర్‌కు బదులుగా సోయాబీన్స్‌, బ్రోకలీ, మిక్స్‌డ్‌ వెజిటేబుల్స్‌ చేసిన కర్రీలను ఉపయోగించటం మంచిది. 

మ్యాగీ న్యూడిల్స్‌
దీనిలో ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటితో ఆరోగ్య ప్రయోజాలు లేకపోగా మంచి పోషక విలువలేమి శరీరానికి అందవు. దీనిలో 46 శాతం సోడియం ఉంటుంది. అందువల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియ స్థాయిలు పెరిగి హైపర్‌నాట్రేమియా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతేగాదు 
తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది కూడా.

(చదవండి: ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement