తేలికగా జీర్ణమయ్యే ఇడ్లీని పలుచోట్ల వివిధ రకాల పేర్లుతో పిలవడం గురించి విన్నాం. కానీ మరీ ఇలా ఓ ప్రముఖ నటి పేరుమీదుగా బ్రేక్‌ఫాస్ట్‌ని పిలవడం గురించి విని ఉండరు. ఈ ఇడ్లీ తమిళనాట బాగా ఫేమస్. కోలివుడ్ చెందిన ప్రముఖ నటి ఖుష్బు పేరు మీదుగా అక్కడ ఇడ్లీ వంటకం ఉంది. అసలు ఆ బ్రేక్‌ఫాస్ట్‌కి ఆ పేరు ఎలా వచ్చింది..? దీని వెనుక దాగున్న స్టోరీ ఏంటంటే..?.
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి ఇడ్లీలు. ఇవి అత్యంత మృదువుగా మెత్తటి ఇడ్లీలా ఉంటాయి. సింపుల్‌గా చేసే ఈ అల్పాహారాన్ని దక్షిణ భారతదేశంలో ఓ గిన్నె సాంబార్, చట్టితో సర్వ్ చేస్తారు. దక్షిణ భారత సాంప్రదాయ వంటకమే ఈ ఇడ్లీ. అయితే తమిళనాట పేరుగాంచిన 'ఖుష్బూ ఇడ్లీ' తయారీ మాత్ర డిఫెరెంట్‌గా ఉంటుంది. ఇది మిగతా ఇడ్లీల కంటే పువ్వులా కోమలంగా తెల్లటి మల్లెమొగ్గల్లా అందంగా ఉంటాయి. నోట్లే వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతాయి. అంతలా సుకుమారంగా ఉంటాయి ఈ ఇడ్లీలు.
అదీగాక తమిళనాడులో ఒకప్పుడూ అత్యంత అందమైన హీరోయిన్‌గా ఖుష్బు ఓ వెలుగు వెలిగింది. ఆమె కూడా బొద్దుగా అందంగా ఉంటుంది. ఈ ఇడ్లీలు కూడా చక్కగా ప్లవ్వీగా మల్లెపువ్వులా ఆకర్షణీయంగా ఉండటంతో ఆ నటి పేరు మీదగా వాళ్లంతా ఈ ఇడ్లీని పిల్చుకుంటున్నారు. దీన్ని వాళ్లు మల్లిగే ఇడ్లీ లేదా మల్లిగై పూ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. తమిళంలో మల్లిగె, మల్లిగై అంటే 'మల్లెపువ్వు' అని అర్థం. మల్లె పువ్వులా చాలా కోమలంగా ఈ ఇడ్లీలు ఉంటాయి. ఐతే ఈ ఇడ్లీ 'ఖుష్బూ ఇడ్లీ' పేరు మీదగానే ఎక్కువ ప్రజాధరణ పొందింది.
ఎవరు తయారు చేశారంటే..?
నాలుగు దశాబ్దాల క్రితం, ధనభాగ్యం అమ్మ ప్రస్తుత కరుంకలపాళయం ఈ ఖుష్బు ఇడ్లీలను తయారు చేయడం ప్రారంభించిందని చెబుతారు. ఈ అసాధారణమైన మృదువైన ఇడ్లీలు రాను రాను ఆహార ప్రియులకు ప్రీతికరమైనవిగా మారిపోయాయి. పెరుగుతున్న డిమాండ్లకు అనుగుణంగా ఆమె తన రెసిపీ తయారీ గురించి 20 కుటుంబాలకు తెలియజేసింది.
వాళ్లంతా ఆమెకు సహాయం చేయడానికి వీలుకల్పించారు. అలా లగ్జరీ హోటళ్ల నుంచి చెఫ్‌లు కూడా ధనభాగ్యం అమ్మ చేసిన ప్రత్యేక ఇడ్లీల తయారీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలా నేడు రోజుకు దాదాపు 10 వేలకు పైగా ఇడ్లీలు అమ్ముడవుతున్నాయి. ఖుష్బు ఇడ్లీ విలక్షణమైన ఆకృతి దాని పదార్థాల నుంచి వస్తుంది. ముఖ్యంగా సబుదానా, బియ్యం, మినప్పులతో ఈ ఇడ్లీని తయారు చేస్తారు. దీన్ని పులియబెట్టడం వల్ల మృదువుగా స్పాంజ్‌లా వస్తాయి.
(చదవండి: ఆ ఏజ్‌లోనే వృద్ధాప్యం వేగవంతం అవుతుందట! పరిశోధనలో వెల్లడి)
Comments
Please login to add a commentAdd a comment