good health
-
Funday Cover Story: నవ్వు.. నవ్వు.. నవ్వు..
పాజిటివిటీకి ప్రతీక నవ్వు. ప్రతి కదలికలోనూ ఆ నవ్వు ఉంటే చాలు.. జీవితం సరికొత్తగా సాగిపోతుంది. అందుకే.. ‘ఓ గంటసేపు నవ్వితే అమృతపానం చేసినంత ఫలితం’ అంటుంటారు. ‘స్మితం, హసితం, విహసితం, ఉపహసితం, అపహసితం, అతిహసితం’ అని నవ్వును ఆరు రకాలుగా వర్గీకరించారు మన పెద్దలు. స్మితం, హసితం ఉత్తమమైన నవ్వులు. విహసితం, ఉపహసితం మధ్యమమైన నవ్వులు. అపహసితం, అతిహసితం అధమమైన నవ్వులు అంటూ లెక్కలు కూడా చెప్పారు. అందుకే చాలామంది ‘మర్యాద మరువకుండా, దూషణ లక్ష్యంగా పెట్టుకోకుండా, శ్రుతి మించనీయకుండా చేసే హాస్యమే నిజమైన హాస్యం’ అని చెబుతుంటారు. నవ్వేటప్పుడు కేకలు, కూతలు, అరుపులు, చప్పట్లు, బాదుళ్లు, పక్కవాళ్లను గిచ్చుళ్లు ఇవన్నీ సహజం. ఎగరడాలు, మెలికలు తిరగడాలు, కళ్లనీళ్లు తుడుచుకోవడాలు ఇవన్నీ నవ్వులో తారస్థాయికి చిహ్నాలు. అయితే ‘మనసారా నవ్వే నవ్వుకు ఆయువు ఎక్కువ’ అంటున్నారు వైద్యులు. ‘స్నానం.. దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం.. బుద్ధిని సరి చేస్తుంది.ఉపవాసం.. ఆరోగ్యాన్ని అందిస్తుంది.హాస్యం.. మనిషినే ఉబ్బితబ్బిబ్బు చేస్తుంది, మనసును ఉర్రూతలూగిస్తుంది. అంతకుమించి.. ఆలోచనల్ని ఉత్తేజపరుస్తుంది’ అంటుంటారు ప్రవచనకర్తలు. అందుకే, వాసన లేని పువ్వులా.. పరిహాసం లేని ప్రసంగం వ్యర్థమని చెబుతుంటారు. నవ్వవు జంతువుల్ నరుడె నవ్వును నవ్వులె చిత్తవృత్తికిం దివ్వెలు కొన్నినవ్వు లెటు తేలవు కొన్ని విషప్రయుక్తముల్ పువ్వులవోలె ప్రేమరసముం గురిపించు విశుద్ధమైన లే నవ్వులు సర్వదుఃఖదమనంబులు వ్యాధులకున్ మహౌషధుల్ ‘ఈ లోకంలో మనిషి తప్ప ఏ జీవీ నవ్వలేదు. నవ్వులు మనిషి మనోవికాసానికి దివ్వెలు. అయితే కొన్ని విషపునవ్వులు ఉంటాయి. అలాంటివి కాకుండా.. పువ్వుల్లా ప్రేమరసాన్ని కురిపించే విశుద్ధమైన లేతనవ్వులు లోకంలోని సమస్త దుఃఖాల్ని పోగొడతాయి. అవి వ్యాధులకు ఔషధాలుగా పనిచేస్తాయి’ అని మహాకవి జాషువా ఎప్పుడో చెప్పారు. నవ్వితే బీపీ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే.. నవ్వుతో గుండె లయ పెరిగి.. శ్వాసలో వేగం పుంజుకుంటుంది. కండరాలు రిలాక్స్ అవుతాయి. ఆ తర్వాత హాట్ బీట్ నెమ్మదించి.. బీపీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి కూడా నవ్వే ఔషధం. తరచూ ఒత్తిడిలో ఉండేవారికి రక్తంలో స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలా కాకుండా ఒత్తిడిని తగ్గించే న్యూరోపెపై్టడ్స్ అనే చిన్న మాలిక్యూల్స్ విడుదల కావాలంటే.. ఎక్కువగా నవ్వుతూ ఉండాలి. ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండేవారు యాక్టివ్‌గా కనిపిస్తారు. అలాంటి వారితో స్నేహం చేయడానికి అంతా ఇష్టపడతారు. దాంతో స్నేహితులు కూడా పెరుగుతారు. స్మైలీ ఫేస్ ఉండేవారితో స్నేహం చేయడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆ నవ్వుల్లో మర్మం తెలుసుకుని మెలగడం ఉత్తమం. నిత్యం మూడీగా ఉండేవాళ్లు.. ఎప్పటికప్పుడు బ్రెయిన్‌కి స్మైలీ సంకేతాలు ఇస్తూ ఉండాలి. లేదంటే ఆ దిగులు మరింత పెరిగిపోయి డిప్రెషన్ లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు.. అహ్లాదకరమైన వాతావరణాల్లో తిరగడం.. స్నేహితుల మధ్య ఉండటం చాలా అవసరం. అప్పుడే మూడ్ మారుతుంది. నవ్వితే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఆరోగ్యానికి.. రోగనిరోధకశక్తికి ఎంతో అవసరమైన యాంటీ బాడీస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. దాంతో అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. చిరునవ్వు ఎందరిలో ఉన్నా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గానే నిలుస్తుంది. నవ్వుతో చెప్పే మాటకు విలువ ఎక్కువగా ఉంటుంది. అందుకే నవ్వేవారికి నలుగురిలో త్వరగా గుర్తింపు లభిస్తుంది. నవ్వు జీవితంపై సానుకూలప్రభావాన్ని కలిగిస్తుంది. దాంతో భవిష్యత్ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగే నవ్వు ఆరోగ్యాన్ని, ఆయుష్షుని కూడా పెంచుతుందని సైంటిఫిక్‌గా నిరూపితమైంది. నవ్వు బాడీలో ఆక్సిజన్ స్థాయిని పెంచి.. శ్వాస వ్యాయామానికి ఒక మార్గంగా నిలుస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యం మెరుగుపరస్తుంది. కాసేపు మనసారా నవ్వుకుంటే చాలు ఆ రోజంతా తెలియని ఎనర్జీని అందుకోవచ్చు. లాఫింగ్ థెరపీతో ఎన్నో సమస్యలు దూరం అవుతాయని సర్వేలు చెబుతున్నాయి. అలాగే ఈ నవ్వు.. శరీరం బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. నవ్వు.. మానసిక స్థితిని మెరుగుపరచడంతో పాటు.. ఆందోళనను పూర్తిగా తగ్గిస్తుంది. నవ్వినప్పుడు ఎండార్ఫిన్ లు ఉత్పత్తి అవుతాయి. ఈ హార్మోన్స్ మంచి అనుభూతిని కలిగిస్తాయి. దాంతో ప్రతికూల భావోద్వేగాలు దూరం అవుతాయి. మోబియస్ సిండ్రోమ్ మోబియస్ సిండ్రోమ్ అనేది పుట్టుకతో వచ్చే ఒక అరుదైన లోపం. ఈ జబ్బున్నవాళ్ల ముఖంలో ఎలాంటి కవళికలు పలికించలేరు. వీళ్లు నవ్వలేరు, ఆవులించలేరు, కనుబొమలను పైకెత్తలేరు. ఇది ఒకరకమైన నాడీ సమస్య. ఫేక్ స్మైల్స్ సర్వేలు కాల్ సెంటర్స్ వంటి పబ్లిక్ సర్వీస్‌లో ఉండే వాళ్లు 24 గంటలు ముఖంపై చిరునవ్వు మెయింటేన్ చేస్తుంటారు. వారి ఉద్యోగంలో అది ఒక ముఖ్యమైన విధి. కానీ అది వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు తేల్చేశారు. ఇలా నకిలీ నవ్వు నవ్వే వాళ్లు తమ వ్యక్తిగత ఫీలింగ్స్‌ను మనసులోనే దాచి వేస్తారని.. దీని వల్ల మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది ఆక్యుపేషనల్ హెల్త్ సైకాలజీ పరిశోధనలో తేలింది. దీని ప్రకారం.. ఇష్టంలేని వారి ముందు.. తప్పని పరిస్థితుల్లో నవ్వే నకిలీ నవ్వులు ఏమాత్రం మంచివి కావని తేలింది. పైగా ఇలాంటి నవ్వుల వల్ల.. ఫీలింగ్స్‌లో మిశ్రమమైన స్పందనకు మెదడు కన్ఫ్యూజ్ అవుతుంది. అది మరింత ప్రమాదమని శాస్త్రవేత్తలు అంటున్నారు. నవ్వుకు కాస్త సమయం వీలు చిక్కినప్పుడల్లా కామెడీ సినిమాలు, కామెడీ ప్రోగ్రామ్స్ (హెల్దీ జోక్స్) చూస్తూండాలి · నలుగురిలో ఉన్నప్పుడు అహ్లాదకరమైన గత హాస్య స్మృతులను వివరిస్తూ.. నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుండాలి. కామెడీని పండించగల స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతూండాలి. గ్రూప్ ఎంటర్టైనింగ్ గేమ్స్‌లో పాల్గొనే వీలుంటే.. తప్పకుండా అందులో భాగస్వాములు కావాలి. కుటుంబ సభ్యులతో చిన్ననాటి చిలిపి సంగతులను చర్చించడం.. అప్పటికే మీకు ఎదురుపడిన కామెడీ సన్నివేశాల గురించి వారితో షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి · కొన్నిసార్లు ఎదుటివారిపైన పంచులు వేసినా.. మరి కొన్నిసార్లు ఎదుటివారు మన మీద వేసే పంచులకు ఫీల్ అవ్వకుండా ఉండగలగాలి. -
చిన్న చిన్న మార్పులు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!
-
బరువు తగ్గాలనుకుంటే..బ్రేక్ ఫాస్ట్‌లో వాటిని దగ్గరకు రానియ్యకండి!
మీరు రోజుని ఆరోగ్యంగా ప్రారంభించాలంటే అత్యంత ముఖ్యమైనది బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్, ఫైబర్లతో కూడిన ఆహారం తీసుకోవడమనేది అత్యంత ముఖ్యం. వీటితో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఆ రోజు మొత్తం హాయిగా గడిచేలా చేస్తోంది. లేదంటే చిరాకుగా ఉండి ఏ పని చేయాలనే ఉత్సాహం లేకుండా అయిపోతుంది. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో రుచికరంగా ఉండే వాటికే ప్రాధాన్యత ఇస్తారు. కానీ పొద్దుపొద్దునే అధిక చక్కెరలు, కొవ్వులు కలిగిన పిండి పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు తెలియకుండా శరీరంలో అధిక కేలరీల్లో కొవ్వుని అమాంతం పెంచేస్థాయి. తక్కువగానే ఫుడ్ తీసుకుంటున్నాం కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే బరువు పెరిగిపోతుంటాం. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, మంచి ఆరోగ్యం కావాలనుకునేవారు బ్రేక్‌ఫాస్ట్‌లో వీటికి దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోకూడని ఆహారాలు ఏమిటో చూద్దామా! చక్కెర లేదా శుద్ధి చేసిన తృణధాన్యాలు పొద్దుపొద్దునే చక్కెర లేదా క్రంచిగా ఉంగే పదార్థాలను తీసుకోవడం అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. సాధారణంగా వీటిలో చక్కెర ఉండటంతో రక్తంలో షుగర్ లెవల్స్ ను వేగంగా పెంచేస్తాయి. దీంతో చక్కెరను తగ్గించే ఇన్సులిన్ హార్మోన్‌పై ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకు, అసహనం ఎక్కువై తెలియకుండానే అధిక ఆకలికి దారితీస్తుంది. అదే విధంగా కార్న్‌ఫ్లెక్స్ వంటి తియ్యని తృణధాన్యాల్లో ప్రోటీన్లు తక్కువగా ఉంటాయి. పైగా వాటిలో చక్కెర స్థాయిలు లేకపోయినప్పటికీ బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అంత మంచిది కాదనే చెబుతున్నారు వైద్యులు. వీటి కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం వంటి వ్యాధుల బారినపడే అవకాశం ఉందంటున్నారు. పాన్‌కేకులు, బ్రెడ్ పాన్‌కేకులు, బ్రెడ్స్ రుచికరంగా అనిపించినప్పటికి ఉదయాన్నే అల్పహారంగా తీసుకోవడానికి పోషకమైన ఆహారం కాదనే చెబుతున్నారు నిపుణలు. వీటిలో అధిక కేలరీల్లో చక్కెర, కొవ్వులు ఉంటాయి. దీని వల్ల పోషకాహరంతో కూడిన ప్రోటీన్లు ఫైబర్లు మిస్ అవుతాయని అంటున్నారు ఆహార నిపుణులు. వెన్నతో చేసిన టోస్ట్ బటర్డ్ టోస్ట్ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటి. కానీ దీనిలో అంత స్థాయిలో ప్రోటీన్లు ఉండవు. ఈ బటర్డ్ టోస్ట్‌లో ఎక్కువ కేలరీలలో పిండి పదార్థాలు, కొవ్వులు ఉండటం వల్ల దీన్ని అల్పహారంగా పరిగణించలేమని అంటున్నారు వైద్యులు. దీని బదులుగా హోల్ గ్రెయిన్ బ్రెడ్(వీట్‌బ్రెడ్), గుడ్లు లేదా చికెన్, దోసకాయ, ఆకుకూరలు, కూరగాయ ముక్కలు చేరిస్తే పుష్కలంగా ప్రోటీన్లు లభ్యమయ్యే అవకాశం ఉంటుంది పూరీలు డీప్ ఫ్రై చేసిన ఆహారం ఉదయమే అల్పహారంగా తీసుకోవడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వంటివి వస్తాయి. ఇది లివర్‌కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి డీఫ్ ఫ్రై చేసిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పండ్లరసం దీనిలో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నప్పటికీ చక్కెర ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల బ్రేక్‌ఫాస్ట్‌గా దీన్ని ఎంచుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు న్యూట్రీషియన్లు. తియ్యటి పెరుగు లేదా వెన్న లేని పెరుగు దీనిలో ప్రోటీన్, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది మీ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరిచే మంచి బ్యాక్టీరియాలను అందిస్తుంది. కానీ ఈ పెరుగులో చక్కెర స్థాయిలు ఉండటంతో పూర్తి స్థాయిలో ఇది మంచిదని చెప్పలేం అంటున్నారు ఆహార నిపుణులు. దీనిలో కొవ్వుల స్థాయి కూడా తక్కువగానే ఉన్నా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునేందుకు ఉత్తమమైందని చెప్పలేం అంటున్నారు . ఫాస్ట్ ఫుడ్ దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. వీటిలో ఎక్కువ కేలరీల్లో కొవ్వు, శుద్ది చేసిన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి ఆకర్షణీయంగా రుచికరంగా అనిపించినప్పటికీ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని బెబుతున్నారు ఆహార నిపుణులు కాఫీ పానీయాలు పరగడుపునే ఇవి తీసుకోవడం వల్ల ఒక్కసారిగా రక్తంలో చక్కెర స్థాయిలు త్వరగా పెరుగుతాయి. ఇన్సులిన్ని స్రవించేలా చేయడమే గాక వాటి స్థాయిలను తగ్గిస్తుంది. ఇది బరువు పెరిగేందుకు దారి తీస్తుంది కూడా. పరాఠా ముఖ్యంగా మైదాతో చేసిన పరాఠాలు జీర్ణవ్యవస్థకు అత్యంత ప్రమాదరకమైనవి. ఇవి వికారం వంటి అనుభూతులకు కారణమవుతాయి. అంతగా తినాలనిపిస్తే రాగులు, గోధుమలు వంటి వాటితో చేసిన పరాఠాలు ఉత్తమం. ఇంకా పరాఠాలను కూరలతో కలిపి తీసుకుంటుంటారు. అయితే వాటిలో పనీర్‌కు బదులుగా సోయాబీన్స్, బ్రోకలీ, మిక్స్డ్ వెజిటేబుల్స్ చేసిన కర్రీలను ఉపయోగించటం మంచిది. మ్యాగీ న్యూడిల్స్ దీనిలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి చెడు కొలస్ట్రాల్‌ని పెంచుతాయి. వీటితో ఆరోగ్య ప్రయోజాలు లేకపోగా మంచి పోషక విలువలేమి శరీరానికి అందవు. దీనిలో 46 శాతం సోడియం ఉంటుంది. అందువల్ల దీన్ని రోజు తీసుకోవడం వల్ల శరీరంలో సోడియ స్థాయిలు పెరిగి హైపర్‌నాట్రేమియా వంటి పరిస్థితులు తలెత్తుతాయి. అంతేగాదు తీవ్రమైన ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తుంది కూడా. (చదవండి: ఊపిరితిత్తులు సాగే గుణం కోల్పోతే? పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు.. అయితే..) -
10 కే స్టెప్స్.. ఇలా నడిస్తే ఎన్నో లాభాలు
కోవిడ్ వచ్చింది. మొదటి వేవ్, రెండో వేవ్, మూడో వేవ్... డెల్టాలు ఒమిక్రాన్‌లు... అన్నీ కలిసి మనిషి ఆరోగ్యంతోపాటు జీవనశైలిని కూడా తమ గుప్పిట్లోకి తీసుకున్నాయి. ఆన్లైన్ పాఠాలు, వర్క్ ఫ్రమ్ హోమ్‌లు షురూ అయిపోయాయి. డెస్క్ వర్క్ చేసేవారికి మామూలు రోజుల్లో కూడా కంఫర్టబుల్ లైఫ్ స్టైల్లో తగినంత నడక లేక దేహానికి ఎప్పుడూ ఏదో ఒక సవాల్ ఉండేది. ఇప్పుడైతే ఇంటి నుంచి ఆఫీసుకు వెళ్లే వ్యాయామం కూడా ఉండడం లేదు. దాంతో అనారోగ్యం అవకాశం కోసం పొంచి ఉన్న శత్రువులాగ ఉందనే చెప్పాలి. ఇందుకు టెన్ ఓ స్టెప్స్ సొల్యూషన్‌ను సూచిస్తున్నారు వైద్య నిపుణులు. 10 కే అంటే పది కిలోమీటర్ల దూరం కాదు, పది వేల అడుగులు. ►పదివేల అడుగుల లెక్క కోసం ప్రతి అడుగునూ లెక్కపెట్టుకోవాల్సిన పని లేదు. సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరం నడిస్తే పదివేల అడుగులు పూర్తవుతాయని ఆరోగ్య జాగ్రత్తలతోపాటు అడుగుల లెక్క కూడా చెబుతోంది స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. పదివేల అడుగుల్లో ఏడు వేల అడుగులు మామూలు నడక, మూడు వేల అడుగులు మాత్రం బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ చేయాలి. బ్రిస్క్ వాక్ చేసేటప్పుడు దేహం పక్కన ఫొటోలో ఉన్నట్లు నిటారుగా ఉంచి కింది పొట్ట, హిప్ కండరాలను బిగపట్టి, భుజాలను జారవేయకుండా వెనక్కు తీసుకుని ఛాతీని విశాలంగా ఉంచి నడవాలి. ►నడక ద్వారా మెదడు ఉత్తేజితమవుతుంది. కొత్త ఆలోచనల ప్రవాహం మొదలవుతుంది. మెదడులో అల్లిబిల్లిగా తిరుగుతూ చికాకు పెడుతున్న అనవసరపు విషయాలు పక్కకు వెళ్లిపోతాయి. సృజనాత్మకత మెరుగవుతుంది. క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్లు నడకను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. ►మంచి నడక మంచి నిద్రకు దారి తీస్తుంది. మంచి నిద్ర దేహానికి పునఃశక్తినిస్తుంది. ►వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే మానసిక ఆందోళన, నిరాశపూరిత ఆలోచనలు దూరమవుతాయి. అయితే ఈ ఫలితం కోసం నడిచే నడక మామూలుగా ఉండకూడదు. క్విక్ వాక్ చేయాలి. ఇది దాదాపుగా పరుగును తలపిస్తుంది. ఈ నడకలో ఒకపాదం నేల మీద ఉంటే మరోపాదం దాదాపుగా గాల్లోనే ఉంటుంది. అలాగే నడక మీదనే ధ్యాస ఉంచాలి. పది నిమిషాల సేపు ఇలా నడిస్తే దేహం సాంత్వన ఫీలవుతుంది. యాస్పిరిన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు కలిగేటువంటి భావన అన్నమాట. ఇది ఎక్కువ గంటలు కొనసాగదు. కానీ రోజూ ఈ స్థితికి చేరడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ►నడకతో బ్లడ్ ప్రెజర్ క్రమబద్ధమవుతుంది. రక్తం రక్తనాళాల ద్వారా దేహంలోని అన్ని భాగాలకూ సక్రమంగా ప్రవహిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటే రక్తాన్ని పంప్ చేయడం అనే పనిని సులువుగా నిర్వర్తిస్తుంది. గుండె పని తీరు మందగిస్తే రక్తప్రసరణ వేగం కూడా తగ్గిపోతుంది. నడక గుండె కొట్టుకునే వేగాన్ని, లయను కూడా నిర్ధారిస్తుంది. ►నడిచేటప్పుడు దేహం ఎక్కువ శక్తిని వినియోగించుకుంటుంది. అంటే ఎక్కువ గ్లూకోజ్‌ను ఉపయోగించుకుంటుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయులు తగ్గుతాయి. దేహంలో అనవసరమైన గ్లూకోజ్ నిల్వలు చేరవు. కాబట్టి అధికబరువు, ఒబేసిటీ సమస్యలకు కూడా నడకే ఔషధం. ►కరోనా కాలం ప్రతిఒక్కరినీ మానసికంగా ఆందోళనకు గురిచేసింది. ఇంట్లోనే ఉండి పని చేస్తున్నారనే కానీ, ఒంట్లో ప్రతి భాగమూ పరీక్షకు లోనవుతోంది. పరోక్షంగా గుండెను ప్రమాదంలో పడేస్తాయి. నడక ద్వారా కార్డియోవాస్కులర్ వ్యాధులు దరి చేరవనే విషయాన్ని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు నిరూపించాయి కూడా. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్లు దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడే వాళ్లు అందరూ నిరభ్యంతరంగా చేయగలిగిన వ్యాయామం నడక. ‘వాచ్’ చేస్తుంది శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనే రెండు రకాల ప్రయోజనాలనిచ్చే నడక కోసం ఇక మీనమేషాలు లెక్కపెట్టవద్దు. నడవడానికి పాదానికి అనువైన షూస్ ధరించండి. పదివేల అడుగులకు దూరాన్ని ఎక్కడ నుంచి ఎక్కడికి మార్కు చేసుకోవడం అని ఆలోచించాల్సిన పని లేదు. సెండెంటరీ లైఫ్ స్టయిల్‌ను సవాల్ చేస్తూ వచ్చింది యాపిల్ వాచ్. మన కదలికలను లెక్క వేస్తుంటుంది. అడుగుల లెక్క చూపిస్తుంది. ఎన్ని కేలరీలు కరిగాయో కచ్చితంగా చెప్తుంది. మనకు కరభూషణంగా మారిన స్మార్ట్ ఫోన్లు కూడా ఈ పని చేస్తున్నాయి. -
కంటిని కాపాడుకోవాలంటే.. ఇలా చేయాల్సిందే..
ఒకప్పుడు చత్వారం అంటే నలభై ఏళ్లు దాటిన తర్వాత మొదలయ్యేది. హ్రస్వదృష్టి, దూరదృష్టి వంటి సమస్యలకు కళ్లద్దాలు వాడాల్సి వచ్చేది. ఇప్పుడు చిన్న వయసులోనే కంటి సమస్యలు మొదలవుతున్నాయి. నూటికి పదిమంది కళ్లద్దాల అవసరం ఉన్న రోజుల స్థానంలో నూటికి యాభై మందికి కళ్లజోళ్లు దేహంలో భాగమైపోతున్నాయి. పిల్లలకు ప్రైమరీ స్కూల్లో ఉండగానే కళ్లజోళ్లు వచ్చేస్తున్నాయి. అప్పుడు తప్పించుకున్న పిల్లలకు కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్య కళ్లద్దాల అవసరాన్ని కల్పిస్తోంది. ఈ పరిస్థితికి ప్రధాన కారణం పోషకాహారలోపం, కంటికి వ్యాయామం లేకపోవడమే. సైట్ వచ్చిన తరువాత బాధపడడం కన్నా రాకుండా కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. సైట్ వచ్చిన వారికి, భవిష్యత్తులో సైట్ రాకుండా కళ్ళను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. కళ్లను కాపాడుకుందాం. వ్యాయామం ఇలా.. వ్యాయామం శరీరానికి ఎంత అవసరమో కంటికి కూడా అంతే అవసరం. రోజూ కొద్ది సేపు కంటి వ్యాయామాలు చేయడం వలన కంటి చూపు వృద్ధి చెందుతుంది. పక్కనున్న ఫొటోను పరిశీలించండి. 1. తలను, మెడను నిటారుగా ఉంచి... కుడివైపుకు, ఎడమవైపుకు చూడాలి. 2. ఇంటి పై కప్పును, నేలను చూడాలి. ఇలా చేస్తున్నప్పుడు కనుగుడ్డు మాత్రమే కదలాలి. తలను పైకెత్తకూడదు, కిందకు దించకూడదు. 3. వలయాకారంగా క్లాక్‌వైజ్, యాంటీ క్లాక్‌వైజ్‌గా తిప్పాలి. 4. దూరంగా ఉన్న వస్తువు మీద పది సెకన్లపాటు దృష్టి కేంద్రీకరించాలి. 5. ఆ తర్వాత ఐ మూలగానూ, దానికి వ్యతిరేక దిశలోనూ చూడాలి. 6. ముక్కు కొనను చూడాలి. ఈ ప్రక్రియ మొత్తానికి రెండు నిమిషాలు కూడా పట్టదు. ఇలా రోజులో ఎన్నిసార్లయినా చేయవచ్చు. ముఖ్యంగా కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువ సేపు చూసేవాళ్లు గంటకోసారి చేయవచ్చు. వీటిని తిందాం! మన శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగిందంటే దానికి ముఖ్య కారణం పోషకాల లోపం కూడా కారణం అవ్వచ్చు. అలాగే ఈ కంటి చూపుకు కూడా. కావలసినన్ని విటమిన్లు, పోషకాలు అందకపోతే కంటి చూపు మందగిస్తుంది. కాబట్టి కంటి చూపును మెరుగుపరిచే ఆహారాలను తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సులువుగా దొరికేవే. మునగ ఆకులలో విటమిన్ – ఎ, కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటి ఆకులను పప్పుతో కలిపి వండుకుని తింటే చాలా మంచిది. ఇతర ఆకుకూరల్లో పొన్నగంటి, మెంతికూర, తోటకూరలను వారంలో కనీసం రెండుసార్లయినా తీసుకోవాలి. విటమిన్ – సి ఎక్కువగా ఉండే నిమ్మ, నారింజ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ బాగా తీసుకోవాలి. ఇవి కంటికి మాత్రమే కాదు చర్మానికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటుగా చేపలు, గుడ్లు, బాదం పప్పు, పాలు, పాల ఉత్పత్తులు, క్యారెట్లు, చిలకడదుంపలు వీటన్నిటిలోను విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. -
రేగి పండు.. పోషకాలు మెండు..
చలికాలంలో లభించే పండ్ల్లలో రేగిపండు ఒకటి. రేగుచెట్టు ముళ్లు ఎంత పదునుగా ఉంటాయో పళ్లు అంతే రుచిగా ఉంటాయి. కండరాలు, నాడీవ్యవస్థ, చర్మానికి కావాల్సిన అనేక పోషకాలు దీనిలో మెండుగా ఉంటాయి. రుచికి కాస్త వగరుగా, తియ్యగా ఉండే రేగి పండులో విటమిన్ ఎ,సిలు ఇతర ఖనిజ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దక్షిణాసియా దేశాల్లో రేగు విరివిగా పండుతుంది. వీటికి, డేట్స్‌కు కాస్త దగ్గర పోలికలు ఉండడంతో చైనీస్ డేట్, కొరియన్ డేట్, ఇండియన్ డేట్ అని కూడా పిలుస్తారు. ► పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, జింక్‌లు అధిక మొత్తంలో ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ఐరన్ హిమోగ్లోబిన్ స్థాయులను క్రమబద్ధీకరిస్తూ్త రక్తహీనతను తగ్గిస్తుంది. ► ఖనిజ పోషకాలు శరీరంలో రక్తప్రసరణను సక్రమంగా జరిగేలా చేసి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఏజెంట్స్‌గా పనిచేస్తాయి. శరీర కణాలకు ఎటువంటి నష్టం జరగకుండా సంరక్షించి వృద్ధా్దప్య ఛాయలను కనిపించకుండా చేస్తాయి. ► ఇక విటమిన్ సి జీవం కోల్పోయిన మేనిచాయను మెరుగుపరిచి, మొటిమలు లేని అందమైన ముఖవర్ఛస్సును ఇనుమడింపచేస్తుంది. ► ఎండబెట్టిన రేగుపళ్లలో అధిక మొత్తంలో క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ► ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి రేగుపండ్లు ఎంతో ఉపశాంతిని కలిగిస్తాయి. వీటిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జాయింట్ల వద్ద ఏర్పడే వాపును తగ్గించి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పీచు పదార్థం అధికమొత్తంలో ఉండడం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ►రేగుపండు సులభంగా జీర్ణం అవ్వడం వల్ల మలబద్దకం సమస్యను నివారిస్తుంది. అజీర్తి సమస్యతో బాధపడేవారు వేరే స్నాక్స్‌కు బదులుగా రేగుపండును తీసుకుంటే దీర్ఘకాలిక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ►ఈ రోజుల్లో నిద్రలేమితో బాధపడే వారు అనేకమంది ఉన్నారు. రేగులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ఫైటో కెమికల్స్, పాలీశాకరైడ్స్, ప్లేవనాయిడ్స్, సపోనిన్స్ వంటివి మంచి నిద్రకు తోడ్పడతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ గాభరాను తగ్గించి నరాలను శాంతపరచి గాఢనిద్రకు ఉపక్రమించేలా ప్రేరేపిస్తాయి. ► దీనిలో క్యాలరీలు స్వల్పంగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారమని చెప్పవచ్చు. అయితే ఇన్ని పోషకాలు ఉన్నాయి కదా అని మోతాదుకు మించి తింటే విరేచనాలు అవుతాయి. అందువల్ల మితంగా తీసుకుంటేనే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చన్న సంగతి మర్చిపోకూడదు. -
శరీరాన్ని కష్టపెట్టకండి
‘ఫిట్నెస్ అనేది మానసిక మరియు శారీరక ప్రయాణం. ఫిట్నెస్ కోసం చేసే వర్కవుట్స్‌ని ఆనందంగా చేయాలి కానీ ఏదో సాధించాలనే తాపత్రయంతో శరీరాన్ని ఇబ్బందిపెట్టకూడదు’’ అంటున్నారు కత్రినా కైఫ్. బాలీవుడ్లో ఫిట్‌గా ఉండే హీరోయిన్స్‌లో కత్రినా ఒకరు. పదిహేనేళ్ల క్రితం కెరీర్ ప్రారంభించినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే కనిపిస్తున్నారామె. ఫిట్నెస్ గురించి తన ఆలోచనలు పంచుకుంటూ –‘‘ఫిట్‌నెస్‌లో ముఖ్యమైన విషయం బ్యాలెన్స్. విపరీతంగా వర్కవుట్ చేస్తే నష్టమే. అందుకే బ్యాలెన్డ్స్‌గా ఉండాలి. జాగింగ్ అయినా రన్నింగ్ అయినా ఏ వ్యాయామం అయినా ఆస్వాదిస్తూ చేయాలి. క్రమం తప్పని పద్ధతిని ఫాలో అవ్వాలి. మనం ఆనందిస్తూ, ఆస్వాదిస్తూ చేసినప్పుడు ఏదీ కష్టం కాదు. అలాగే తమ శరీరాకృతిని మార్చుకోవడానికి కొందరు శరీరాన్ని బాగా కష్టపెడతారు. అది మంచిది కాదు. సినిమా స్టార్స్ అంటే ఫిట్‌గా కనిపించాలి, క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి.. మనకెందుకు? అని కొంతమంది అనుకుంటారు. అయితే మనం చేస్తున్న వృత్తికి, ఫిట్నెస్కి సంబంధం లేదు. మనం ఏ వృత్తిలో ఉన్నా ఫిట్‌గా ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఫిట్‌నెస్‌ని సీరియస్‌గా తీసుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి’’ అన్నారు కత్రినా కైఫ్. -
ఎస్పీ బాలు లేచి కూర్చొని మాట్లాడుతున్నారు
సాక్షి, చెన్నై: తన తండ్రి మరింత వేగంగా కోలుకుంటున్నారని, ఎంతో హుషారుగా వ్యవహరిస్తున్నారని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తెలిపారు. బాలు ఆరోగ్యం గురించి సోమవారం సాయంత్రం ఆయన వీడియో విడుదల చేశారు. అందులో ఆయన ‘నేను ఈనెల 10న మీడియాతో మాట్లాడాను. ఈ నాలుగు రోజుల్లో నాన్న ఆరోగ్యంలో గణనీయ మార్పు వచ్చింది. ఫిజియోథెరపీ కొనసాగుతోంది. వైద్యులు కూర్చోబెట్టగా 15–20 నిమిషాల వరకు వారితో మాట్లాడుతున్నారు. ఊపిరితిత్తుల సమస్య కూడా నయం అవుతోంది. ఆరోగ్యంలో మరింత పురోగతి కనపడుతోంది. మీ అందరి ప్రార్థనలు ఫలించాయి. మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి చిట్టి చిట్కాలు
న్యూఢిల్లీ : కూర్చోవాలన్నా, లేవాలన్నా, మెట్లు ఎక్కాలన్నా, దిగాలన్నా మోకాలి నొప్పులు రాకుండా, ఛాతిలో నొప్పి లేకుండా ఉండాలన్నా, మొత్తంగా మెదడు ప్రశాంతంగా హాయిగా ఉండాలన్నా కొన్ని వైద్య చిట్కాలు చాలని లండన్‌కు చెందిన ప్రముఖ వైద్యులు సలహా ఇస్తున్నారు. రోజు ఉదయం, సాయంత్రం ఇరవై బింగీలు తీయాలి. దానివల్ల తొడలు, పిరుదులు బలపడడంతోపాటు మోకాలి నొప్పులు తగ్గుతాయని ‘ఈస్ట్ కెంట్ హాస్పిటల్స్ యూనివర్శిటీ ఫౌండేషన్ ట్రస్ట్’లోని న్యూరోలాజికల్ రీహాబిలిటేషన్ సర్వీస్‌లో పనిచేస్తున్న ఫిజియోథెరపిస్ట్ అలెక్స్ ఆమ్‌స్ట్రాంగ్ తెలిపారు. ఆకుపచ్చ అరటి పండ్లు తినడం. అందులోని ఫైబర్ వల్ల జీర్ణవ్యవస్థ బాగుంటుందని, అందులోని పొటాషియం వల్ల ఎముకలు బలపడతాయని బ్రిటీష్ డయాబెటిక్ అసోసియేషన్‌కు చెందిన డైటీషియన్ లారా టిల్ట్ చెప్పారు. అరటి పండ్లు పసుపు పచ్చగా మారినట్లయితే అందులోని ఫైబర్ నశించి పోతుందని ఆయన అన్నారు. ఆన్లైన్లో విరివిగా దొరుకుతున్న కాళ్ల మడమల వద్ద బరువు పట్టీలను ధరించాలి. ఖాళీ సమయాల్లో కాకపోతే టీవీ చూస్తున్నప్పుడు రెండు కాళ్లకు వీటిని ధరించి ఒక కాలు తర్వాత ఒక కాలును గాలిలోకి లేపి కాసేపు ఉంచి, దించాలి. ఇలా ఐదారు సార్లు చేసినట్లయితే కండరాలు బలపడి కాళ్ల నొప్పులు తగ్గుతాయని ‘రాయల్ లివర్ పూల్ హాస్పటల్స్’ ఆర్థోపెడిక్ సర్జన్ జార్జ్ ఆమ్పత్ తెలిపారు. నేలపై కూర్చొని ముందుకు కాళ్లను చాపి ఓ మోకాలి కింది బాగం నేలకు తాకేలా చేయాలి, ఆ తర్వాత మరో కాలితో అలాగే చేయాలి. ఆ తర్వాత మోకాళ్లపై లేచి అలాగే కొద్ది సేపు నిలబడాలి. దానివల్ల మోకాళ్లు బలపడతాయి. మెట్లు మునికాళ్ల మీద ఎక్కాలి. దానివల్ల మోకాలు కింద వెనక బాగానుండే కండరాలు బలపడతాయని స్టాక్‌పోర్ట్‌లోని బ్రిన్నింగ్టన్ సర్జరీ డాక్టర్ జేమ్స్ హిగిన్స్ తెలిపారు. ఉదయం బ్రెష్ చేసుకునేటప్పుడు ఓ కాలును వెనక్కి మడచి ఒంటి కాలిపై కాసేపు నిలబడి, కాలు మార్చి మరో కాలిపై కాసేపు నిలబడినట్లయితే కండరాల మధ్య స్నాయువుల ప్రభావం పెరిగి శరీరం బ్యాలెన్స్‌ను నిలబెడుతుందని ఆయన చెప్పారు. రోజుకోసారి కొన్ని పాత్రలను చేతులతో కడగాలి. ఆ తర్వాత కొద్దిసేపు గోరు వెచ్చని నీళ్లలో రెండు అరచేతులను కాసేపు ఉంచి, ఆ తర్వాత చేతులు కడుక్కోవాలి, తుడుచుకోవాలి, అరచేతులను ముడుచుకోవాలి, విప్పాలి, విదిలించాలి. దాని వల్ల చేతుల వేళ్లు బలపడతాయని, క్రమంగా వేళ్ల నొప్పులు తగ్గుతాయని ‘విల్ట్‌షైర్ అండ్ స్విండన్ హెల్త్ కేర్’ హాండ్స్ ఫిజియోథెరపీలో నిపుణులు మిషెల్లీ లారెన్స్ తెలిపారు. కీళ్ల నొప్పులకు పెయిన్ కిల్లర్ ‘బ్రూఫిన్’కు బదులు పారాసిటమాల్ తీసుకోవడం మంచిదని, చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించేందుకు స్టాటిన్స్గానీ, ఆస్ప్రిన్ ట్యాబ్లెట్లను రాత్రికి బదులు ఉదయమే తీసుకోవాలని ఇడిన్బర్గ్ యూనివర్శిటీ కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్ డాక్టర్ మార్క్ డ్వీక్ సూచించారు. బ్రూఫిన్ సాధారణ నొప్పులకు మాత్రమే పనిచేస్తుందని, మోకాలు నొప్పులకు పనిచేయదని, పైగా దాని వల్ల ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని డాక్టర్ హెచ్చరించారు. వారానికి ఒకటి రెండు సార్లు టిఫిన్, లంచ్‌ను వదిలేయాలి. అంటే ఆ రోజు ఉదయం నుంచి 16 గంటలపాటు ఏమీ తినకుండ ఉన్నట్లయితే మంచిది. డయాబెటిక్ రోగులకు ఇది మరీ మంచిది. దీనివల్ల గుండె పదిలంగా ఉండడమే కాకుండా కాస్త లావు తగ్గుతారని లండన్‌లోని వెల్బెక్ హార్ట్ హెల్త్ క్లినిక్ కన్సల్టెంట్ కార్డియోలజిస్ట్ డాక్టర్ ఇక్బాల్ మాలిక్ తెలిపారు. రోజు కొంత దూరం నడవాలని, సమయం లేకపోతే ఆఫీసుకు ఓ స్టాప్ ముందు దిగి ఆఫీసు వరకు నడిచిపోవాలని, అది కూడా గుండెకు మంచిదని ఆయన చెప్పారు. ప్రతి రోజు ఒకసారి బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగడం కూడా మంచిదని ఆయన తెలిపారు. రోజువారి తిండిలో ఉప్పును సాధ్యమైనంతగా తగ్గించాలని, మొదట్లో ఇబ్బందిగా ఉన్నా నాలుగైదు వారాల్లో ‘టేస్ట్ బడ్స్’ సర్దుకుంటాయని హృద్రోగ నిపుణులు తెలియజేస్తున్నారు. వారానికి రెండు సార్లైనా షాపింగ్ చేయాలని, రెండు నుంచి ఐదారు కిలోల బరువుండే బ్యాగులను చేతులతో మోసుకరావడం వల్ల కూడా చేతులు బలపడుతాయని నిపుణులు సూచించారు. -
మన ఆరోగ్యం.. మన చేతుల్లో
సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించే వారు. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యదాయక క్రియ దాగి ఉండేది. కానీ తాత, ముత్తాతల నుంచి వస్తున్న సంప్రదాయ పద్ధతులు క్రమంగా కనుమరుగవుతున్నాయి. గతంలో నిత్య జీవితంలో కచ్చితంగా ఆచరించి ఆరోగ్యంగా ఉండేవారు. నేడు ఆధునిక పోకడలతో వాటిని విస్మరించి రుగ్మతలను కొని తెచ్చుకుంటున్నారు. చిరుతిళ్లకు అలవాటు పడి రోడ్డు పక్క తిండి తిని చేజేతులారా ఆరోగ్యాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. అవగాహన లేని విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఆరోగ్య సూత్రాలు పాటించకపోవడంతో అనేక రుగ్మతలతో బాధపడుతున్నట్టు ఏటా అనేక సర్వేలు చెబుతున్నాయి. కుటుంబ పెద్దలు ఆరోగ్యకరమైన అలవాట్లను ఆచరించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. ఆచారం ఆరోగ్యానికి సోపానమని, అంతా అటువైపు అడుగులేస్తే పిల్లలకు సంప్రదాయ పద్ధతులపై అవగాహనతో పాటు చక్కని ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయ వ్యాయామంతో మేలు నేటి పోటీ ప్రపంచంలో ఉరుకులు, పరుగులతో దినచర్య ప్రారంభమవుతోంది. ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాల దృష్ట్యా రాత్రి ఇంటికి ఆలస్యంగా చేరుతున్న వాళ్లే అధికం. కొందరు మిత్రులతో పార్టీలంటూ అర్థరాత్రి వరకు నిద్రపోవడం లేదు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. వేకువ జామున నిద్ర లేచి కొంత సమయం నడవడం శ్రేయస్కరం. చిన్నతనం నుంచి పిల్లలను ఉదయాన్నే నిద్ర లేపి వ్యాయామం, «ధ్యానం చేయించడం అలవాటు చేయాలి. క్రమం తప్పకుండా చేయిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. న్యూరో సైన్సు ప్రకారం ఉదయం నడకతో పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. కింద కూర్చొని భోజనం చేస్తే.. ఇటీవల కాలంలో డైనింగ్ టేబుల్, మంచం కుర్చీలు, సోఫాలపై కూర్చొని భోజనం చేయడం పరిపాటైంది. వయసుతో సంబంధం లేకుండా ఎవరూ నేలపై కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. ఇది ఆరోగ్య రీత్యా మంచి మంచిది కాదన్న వాస్తవం తెలుసుకోవడం లేదు. నేలపై కూర్చుని తినాలి నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల మోకాళ్లు, పొట్టకు తగిన వ్యాయామం లభిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. భోజనం చేసే సమయంలో నడుం చుట్టూ ఉన్న కండరాలపై ఒత్తిడి పడి ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. భోజన సమయంలో నీళ్లు తాగొద్దు భోజనం పూర్తయ్యేవరకు మధ్యలో నీళ్లు తాగకూడదని పూర్వీకులు పదే పదే చెప్పేవాళ్లు. పెద్దల మాటను పెడచెవిన పెడుతూ చాలామంది భోజనం చేస్తున్న సమయంలో ఎక్కువ నీళ్లు తాగుతున్నారు. దీనివల్ల తిన్నది సరిగ్గా జీర్ణం కాదు. అసిడిటీ వంటి ఇబ్బందులు వస్తాయి. ఇలా చేస్తే మంచిది.. భోజనానికి ముందు, తర్వాత అర్ధగంట వ్యవధిలో నీళ్లు తాగాలి. తినే సమయంలో ఇబ్బందిగా ఉంటే కొద్దిగా తీసుకోవచ్చు. ఇలాగైతే పొట్ట పెరగదు. ఊబకాయం బారిన పడకుండా ఉండవచ్చు. భోజనం తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. రాత్రిపూట నిద్రపోయే ముందు బ్రష్ చేయడం మేలు. చన్నీటి స్నానంతో ఆహ్లాదం పూర్వకాలంలో సంధ్య వేళల్లో చన్నీటి స్నానానికి పెద్దలు ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు. వేడి నీటితో స్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు ఊడిపోవడం, మృదుత్వం కోల్పోవడం, బలహీనంగా మారేందుకు అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానంతో శరీరం సమ ఉష్ణోగ్రతలో ఉంటుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. కాళ్లూ, చేతులు కడుక్కోవాలి బయటికెళ్లి ఇంటికి తిరిగి వచ్చాక కాళ్లు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్లడం మంచి సంప్రదాయం. దేన్ని తాకాలో.. దేన్ని తాకరాదో పిల్లలకు అవగాహన ఉండదు. ఆకర్షించే ప్రతి దాన్ని తాకుతారు. బుగ్గిలో ఆడటం వల్ల చేతులు, కాళ్ళకు బాక్టీరియా అంటుతుంది. ఇంటికి చేరగానే చేతులు, కాళ్లను శుభ్రం చేసుకుంటే సూక్ష్మక్రిములు పోతాయి. చక్కని ఆరోగ్యానికి అవకాశం ఉంటుంది. భోజనానికి ముందు చేతుల శుభ్రత అన్ని విధాల మేలు. ఏకాగ్రతకు భక్తి దోహదం చిన్నతనం నుంచే భక్తితో దేవున్ని ప్రార్థించేలా నేర్పించాలి. పెద్దలు ఆచరిస్తే పిల్లలకు అలవాటవుతుంది. దీపారాధన, ధ్యానం, మంత్రాల ఉచ్ఛారణ వంటివి ఏకాగ్రతకు దోహదపడతాయి. ఒత్తిడిని జయించేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. -
ఆ 10గంటలు మీ బరువును తగ్గిస్తాయి..
కాలిఫోర్నియా : బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి గంటల తరబడి వ్యాయామాలు చేయక్కర్లేదు. మన జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన శరీరం కోసం మనం చేయాల్సిందల్లా ఒక రోజులో మనం తీసుకునే ఆహారాన్ని 10గంటల లోపుగా అంటే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తీసుకునే ఆహారాన్ని పదిగంటల సమయంలోపే తీసుకుంటే బరువు అదుపులో ఉండటమే కాకుండా జీవక్రియకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి సైతం విముక్తి పొందవచ్చు. కాలిఫోర్నియాకు చెందిన ‘షాల్క్ ఇన్స్టిట్యూట్ ’వెలువరిచిన ‘‘సెల్ మెటబాలిజం’’ జర్నల్‌లో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మనలో చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించి 14-15గంటల తర్వాత రాత్రి చిరుతిళ్లతో రోజును ముగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పనిగంటల కారణంగా ఆహారం తీసుకునే వేళల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అలా కాకుండా 24గంటలు కలిగిన ఒక రోజులో మనం తీసుకునే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర, రాత్రి ఆహారాలను కేవలం 10 గంటల కాలంలో తీసుకుని మిగిలిన 14 గంటలు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించటమే కాకుండా అంతర్గత మరమ్మత్తులకు అవకాశం ఉంటుంది. తద్వారా బరువు అదుపులో ఉండటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. -
ఈ బీరుతో మంచి ఆరోగ్యం
సింగపూర్: బీరు ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అంటే బీరు ప్రియులు మాత్రం ఆరోగ్యానికి మంచిదే అని గట్టిగా చెబుతారు. ఇప్పటివరకు ఏమోకానీ ఇకపై ఆరోగ్యానికి మంచి చేసే బీరును సింగపూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తాము తయారు చేసిన బీరు తాగడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడడం తోపాటు రోగనిరోధక శక్తీ పెరుగుతుందని సింగపూర్ నేషనల్ వర్సిటీకి చెందిన పరిశోధకులు వెల్లడించారు. జీవించి ఉన్న బ్యాక్టీరియా (ప్రొబయోటిక్స్) లాక్టోబా సిల్లస్ పారాకేసేయ్ అనే బ్యాక్టీరియా మనిషి పేగుల్లో ఉంటూ.. శరీరంలోని టాక్సిన్లు, వైరస్‌లను తొలగించ డంతోపాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపారు. ఈ తరహా బ్యాక్టీరియాతోనే తాము బీరును తయారు చేసినట్లు వివరించారు. సాధారణంగా ఆహా రం, పానీయాల్లో జీవించి ఉన్న బ్యాక్టీరియాలు ఆరోగ్యా నికి మంచి చేస్తాయని అధ్యయనాల్లో వెల్లడైంది. -
వ్యాయామంతో వ్యాధులు దూరం
ఎవరెస్ట్ అధిరోహకురాలు నీలిమ బ్రెస్ట్ కాన్సర్పై అవగాహన పెంచేందుకు పింక్‌థాన్ విజయవాడ నుంచి విశాఖకు పరుగు తొండంగి : ఒకనాడు ప్రపంచంలో అత్యున్నతమైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, తెలుగు వారి కీర్తిని ఇనుమడింపజేసిన పాదాలు.. నేడు అనేక మంది మహిళలకు మృత్యుశాసనాన్ని రాస్తున్న మహమ్మారిపై అవగాహన కల్పించేందుకు పరుగుతీస్తున్నాయి. గుంటూరుకు చెందిన ఎవరెస్ట్ అధిరోహకురాలు పూదోట నీలిమ మహిళలకు బ్రెస్ట్ కేన్సర్‌పై అవగాహన కల్పించాలన్న సంకల్పంతో విజయవాడ నుంచి విశాఖకు చేపట్టిన పింక్«థాన్‌పరుగు బుధవారం మండలంలోని బెండపూడి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో కాసేపు ముచ్చటించారు. మహిళల్లో అనేకులు బ్రెస్ట్ క్యాన్సర్, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్నారన్నారు. ఎటువంటి వ్యాధులనైనా కొద్దిపాటి శారీరక వ్యాయామంతో దూరం చేసుకోవచ్చన్నారు. మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈనెల 12న విజయవాడ నుంచి పింక్‌థాన్(మహిళలు మాత్రమే చేసే పరుగు) ప్రారంభించానన్నారు. రోజుకు సరాసరి యాభై కిలోమీటర్ల చొప్పున వారంరోజుల పాటు పింక్‌థాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 18 కల్లా విశాఖ చేరుకుంటానన్నారు. ఈనెల 20న అక్కడ విజయా మెడికల్స్ ఆధ్వర్యంలో జరిగే అవగాహనా కార్యక్రమంలో పాల్గొంటానన్నారు. కాగా తనతో పాటు 10 కిలోమీటర్లు పింక్‌థా¯ŒSలో పాల్గొన్న వారికి ఉచితంగా పలు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పించడంతోపాటు వ్యాయామం ద్వారా కలిగే ప్రయోజనాలను చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమం చేపట్టానన్నారు. అంనతరం విశాఖకు పింక్ థా¯ŒSను కొనసాగించారు. -
క్రీడలతోనే మానసిక వికాసం
– డీఎస్పీ కృష్ణమూర్తి – అండర్–19 చెస్ విజేతలు అభిరాం, శ్రేష్ణనాదకర్ణి మహబూబ్‌నగర్ క్రీడలు : క్రీడలతో మానసిక వికాసంతోపాటు దేహదారుఢ్యంగా ఉండొచ్చని డీఎస్పీ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రాజేంద్రనగర్‌లోని న్యూరిషి పాఠశాలలో జిల్లాస్థాయి అండర్–19 చెస్ టోర్నీ కమ్ సెలక్షన్స్ నిర్వహించారు. బహుమతుల ప్రదానోత్సవానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందన్నారు. క్రీడల్లో రాణించేవారు చదువులో కూడా ముందుంటారని తెలిపారు. నైపుణ్యంగల క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తాను మొదటగా ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేసినట్లు గుర్తుచేశారు. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ మద్ది అనంతరెడ్డి మాట్లాడుతూ ఆటల్లో గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. చెస్ మేదస్సుకు సంబంధించిదని, దీంట్లో ఎత్తు, పైఎత్తులు ఉంటాయని తెలిపారు. జిల్లా క్రీడాకారులు చెస్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ప్యాట్రన్ లయన్ నటరాజ్, కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. చెస్ టోర్నీ ఫలితాలు జిల్లాస్థాయి అండర్–19 టోర్నీకి జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొన్నారు. బాలుర విభాగంలో అభిరాం (అలంపూర్) ప్రథమ, వికాస్ (కల్వకుర్తి), ఆదిత్య (వనపర్తి), సుచంద్రపాల్ (కల్వకుర్తి), బాలికల విభాగంలో శ్రేష్ణనాదకర్ణి ప్రథమ, స్రవంతి (మహబూబ్‌నగర్), మోనిక (గట్టు), అనిత (వనపర్తి) మిగతా స్థానాల్లో నిలిచారు. వీరు ఖమ్మంలో ఈ నెల 3నుంచి 5 వరకు జరిగే అండర్–19 రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొంటారని జిల్లా చెస్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. -
ఆయిల్ ఫ్రీడమ్
అనారోగ్యం నుంచి ఫ్రీడమ్ కావాలి. అజీర్తి నుంచి ఫ్రీడమ్ కావాలి. స్థూలకాయం నుంచి ఫ్రీడమ్ కావాలి. బద్దకం నుంచి ఫ్రీడమ్ కావాలి. ఐ వాంట్ గుడ్ హెల్త్ ! నాకు ఆయిల్ నుంచి ఫ్రీడమ్ కావాలి. ఓహో! వెరీ సింపుల్!! ఓ ఉడుకు ఉడికించండి. ఆరోగ్యాన్ని వడ్డించండి!! వెజ్ క్రంచీ క్రిస్పీ కట్లెట్ కావలసినవి: బంగాళదుంపలు-6 (ఉడికించి చిదమాలి) బీన్స్ - 6 (తరిగి ఉడికించాలి) బీట్రూట్ (మీడియం) - 1 (తురమాలి) పచ్చిబఠాణి-అరకప్పు (ఉడికించి చిదమాలి) జీలకర్ర పొడి - అర టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం- ఒక టీ స్పూన్ పచ్చిమిర్చి - 2 (సన్నగా తరగాలి) కారం - ఒక టీ స్పూన్; ఉప్పు - తగినంత గరం మసాలా- ఒక టీ స్పూన్ జీడిపప్పు-10 (వేయించి పలుకులు చేయాలి) కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు కార్న్‌ఫ్లేక్స్ - 2 కప్పులు (పొడి చేయాలి) నిమ్మరసం - ఒక టీ స్పూన్ తయారీ: ఉడికించిన బంగాళదుంపలో బీన్స్, బఠాణి, బీట్రూట్ తురుము, జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్రపొడి, అల్లం, నిమ్మరసం వేసి బాగా కలపాలి. పై మిశ్రమాన్ని పెద్ద గోళీ అంత తీసుకుని గుండ్రంగా చేసి కార్న్‌ఫ్లేక్స్ పొడిలో అద్దాలి. కట్లెట్ ఆకారం వచ్చేలా మెల్లగా వత్తాలి. ఇలా మిశ్రమం మొత్తాన్ని చేసుకుని ఒక ప్లేట్లో సర్ది ఒవెన్‌లో 120 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఏడు నిమిషాల సేపు ఉంచాలి. కట్లెట్లను తిరగవేసి మరో ఏడు నిమిషాలు ఉంచాలి. గమనిక: ఒవెన్‌కు బదులు మందపాటి పెనాన్ని వేడి చేసి కట్లెట్లను సర్ది సన్న మంట మీద నూనె వేయకుండా కాల్చుకోవచ్చు. బేబీ కార్న్ పాలక్ కావలసినవి: పాలకూర- ఒక కట్ట బేబీకార్న్- ఆరు; జీలకర్ర- అర టీ స్పూన్ అల్లం, వెల్లుల్లి పేస్లు- అర టీ స్పూన్ ధనియాల పొడి- ఒక టీ స్పూన్ నిమ్మరసం- అర టీ స్పూన్, ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్: ఉప్పు - తగినంత, ఎండు మిర్చి- 2, మీగడ- రెండు టేబుల్ స్పూన్లు (కావాలనుకుంటేనే) తయారీ: బేబీ కార్న్‌ను గుండ్రంగా తరిగి పావు టీ స్పూన్ ఉప్పు కలిపి, కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. పాలకూర శుభ్రంగా కడిగి వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. నీటిలో నుంచి తీసి చల్లార్చి మెత్తగా గ్రైండ్ చేయాలి. నాన్‌స్టిక్ పెనంలో జీలకర్ర వేసి అవి పేలిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసి సన్నమంట మీద రెండు నిమిషాల సేపు వేయించాలి. ఇప్పుడు పాలకూర పేస్టు, బేబీకార్న్ ముక్కలు (ఉడికించిన నీటితో సహా), ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల సేపు ఉడికించాలి. మంట తీసేసిన తరవాత నిమ్మరసం వేసి కలిపి మూతపెట్టాలి. చివరగా మీగడ కలుపుకోవచ్చు. ఖాళీ పెనంలో ఎండుమిర్చి, ఉల్లిపాయ వేయించి గార్నిష్ చేయాలి. గమనిక: బేబీ కార్న్ బదులు పనీర్‌తోనూ చేసుకోవచ్చు. పనీర్‌ని ఉడికించనవసరం లేదు. బ్రౌన్ రైస్ రిసోట్టో కావలసినవి: ముడిబియ్యం (బ్రౌన్ రైస్) - 2 కప్పులు (కడిగి మునిగేలా నీటిని పోసి అరగంట సేపు నానబెట్టి, వడపోయాలి) వెల్లుల్లి రేక - 1 (సన్నగా తరగాలి) తరిగిన ఉల్లిపాయ - 1/3 కప్పు వెజిటబుల్ స్టాక్ - 6 కప్పులు (నీటిలో క్యారట్, ఆనియన్, బఠాణి, క్యాలిఫ్లవర్ అన్నీ కలిపి వందగ్రాములు ఉడికించాలి) కొత్తిమీర- రెండు రెమ్మలు; మిరియాల పొడి- ఒక టీ స్పూన్ చీజ్ - అర కప్పు (సన్నగా తరగాలి) బిర్యానీ ఆకు - ఒకటి; ఉప్పు- తగినంత తయారీ: ఒవెన్‌ను 220 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి అందులో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలను రోస్ట్ చేయాలి. వెడల్పాటి పాత్ర వంటి పెనంలో బియ్యం వేసి ఒక మోస్తరుగా వేడి చేసిన తర్వాత అందులో బియ్యం నానబెట్టిన నీటిని పోసి, బిర్యానీ ఆకు, చీజ్ తరుగు, ఉల్లి, వెల్లుల్లి పలుకులు, ఉప్పు వేసి ఉడికించాలి. 8-10 నిమిషాలలో తేమ ఆవిరవుతుంది. ఇప్పుడు కూరగాయలు ఉడికించిన నీటిని కలపాలి. అడుగు పట్టకుండా తేమ ఆవిరయ్యే వరకు రెండు-మూడు సార్లుగా కలపాలి. బియ్యం ఉడికిన తర్వాత మంట ఆపేసి మిరియాల పొడి చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మెత్తగా కావాలనుకుంటే మరో కప్పు నీటిని వేడి చేసి చివరగా కలుపుకోవచ్చు. క్యారట్ కుకుంబర్ సూప్ కావలసినవి: పెద్ద కీరకాయలు- 2 (చెక్కు తీసి తరగాలి) క్యారట్లు (చిన్నవి)- 2 (చెక్కు తీసి తరగాలి) ఉల్లిపాయ (పెద్దది) - 1 (తరగాలి) నీరు - 7 కప్పులు, ఉప్పు - తగినంత క్రీమ్ - 2 కప్పులు (కావాలనుకుంటేనే వేసుకోవాలి) తయారీ: కూరగాయ ముక్కలలో నీటిని పోసి ఉడికించి మూతపెట్టాలి. 20 నిమిషాల తర్వాత మొత్తాన్ని బ్లెండ్ చేయాలి. ఇందులో ఉప్పు కలిపి సన్నమంట మీద ఉడికించాలి. క్రీమ్ వేసి లేదా అలాగే సర్వ్ చేయాలి. వెజిటబుల్ స్టాక్ ఇది కూరగాయలు ఉడికించిన నీరు. క్యారట్, బీన్స్, బఠాణి, క్యాలిఫ్లవర్ వంటివి కొద్ది కొద్దిగా మిగిలిపోయి ఉన్నప్పుడు వాటికి ఓ ఉల్లిపాయను చేర్చి ఉడికించి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. దీనిని సూప్, ఇతర కూరల్లోనూ వాడుకోవచ్చు. ఈ స్టాక్ నాలుగైదు రోజుల వరకు తాజాగా ఉంటుంది. చెఫ్: అరుణ్ కుమార్ హోటల్: తాజ్ వివంతా, బేగంపేట, హైదరాబాద్ -
వృద్ధాప్యం ఇక రానే రాదు!
సెనిసెంట్ కణాల తొలగింపుతో ఆయుష్షు, ఆరోగ్యం సొంతం! ఎలుకలపై జరిపిన ప్రయోగం సక్సెస్ బతికినన్ని రోజులూ ఎలాంటి రోగాలు లేకుండా ఆనందంగా గడవాలనేది దాదాపు ప్రతీ వ్యక్తి కోరిక. నేటి టెక్నాలజీ యుగంలో ప్రాణాంతకమైన వ్యాధులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయిలో వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. కానీ చత్వారం, కీళ్లనొప్పులు, మతిమరుపు.. శరీర పటుత్వం తగ్గడం వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా చేయలేకపోతున్నాం. వీటిని సైతం రూపుమాపి మనిషిని నిత్య యవ్వనుడిగా ఉంచేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో శాస్త్రవేత్తలు కీలకమైన విజయాలు సాధించారు. - సాక్షి, హైదరాబాద్ మన శరీరం వివిధ రకాల కణాలతో నిండి ఉంటుంది. ఒకటి రెండుగా... ఆ రెండు నాలుగుగా విభజితమై.. బహుకణాలుగా మారి అవయవాలు ఏర్పడ్డాయని మనకు తెలుసు. అయితే ఈ శరీర కణాలు మనం జీవించినంతకాలం విభజితం కావు. కొన్నాళ్లకు అలసిపోయి విభజన సాధ్యం కాదని ఆగిపోతాయి. ఒక కణం దాదాపు 60 సార్లు విభజితమవుతుందని ఓ అంచనా. విభజితం ఆగిపోయిన కణాలను సినసెన్స్ కణాలంటారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో ఈ కణాలూ పెరుగుతాయి. యుక్త వయసులో శరీర వ్యాధి నిరోధక వ్యవస్థ ఈ రకం కణాలను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. వృద్ధాప్యంలో వ్యాధి నిరోధక వ్యవస్థ మందగించడంతో వృథా కణాలు శరీరంలో పేరుకుపోతాయి. చర్మంలో పేరుకుపోయే కణాలు ముడుతలకు కారణమైతే... మిగిలిన కణజాలాలు, అవయవాల్లోనివి రకరకాల ఇన్ఫ్లమేషన్లకు కారణమవుతాయి. దీంతో రకరకాల సమస్యలు, వ్యాధులు చుట్టుముడతాయి. ఏదో ఒక మందును వాడి ఈ వృథా కణాలన్నింటినీ లేదా ఎక్కువవాటిని శరీరం నుంచి తొలగిస్తే....? ఎలుకల ఆయుష్షు పెరిగింది సెనిసెంట్ కణాలను శరీరం నుంచి తొలగించడం ద్వారా ఆయుష్షును పెంచవచ్చని మేయో క్లినిక్ శాస్త్రవేత్త వాన్ డ్యూరసెన్ తాజాగా నిరూపించారు. శరీరంలోని అన్ని రకాల కణాలను గుర్తించగలిగే విధం గా జన్యుమార్పిడి చేసిన ఎలుకలకు వారానికి రెండుసార్లు చొప్పున 6 నెలల పాటు ఒక రసాయనాన్ని ఎక్కించినప్పుడు వాటి ఆయుష్షు దాదాపు 25% పెరిగింది. వయసుతోపాటు వచ్చే మార్పుల వేగం గణనీయంగా తగ్గింది. సాధారణ ఎలుకలతో పోలిస్తే వీటి మూత్రపిండాలు, గుండె మెరుగ్గా పనిచేసినట్లు గుర్తించారు. ఈ కణాలు తగ్గిన ఎలుకలు ఎంతో చురుకుగా కని పించాయి. అయితే ఈ విధానం మనుషుల్లోనూ పనిచేస్తుందా? సాధ్యమే అంటున్నారు డ్యూరసెన్. ఈ కణాలను తొలగించేందుకు వాడే మందుల తయారీకి ఓ కంపెనీని ఏర్పాటు చేశారు. ఇతర మార్గాలూ ఉన్నాయ్.. ఆయుష్షు పెంచేందుకు సెనిసెంట్ కణాలను తొలగించడం ఒక్కటే మార్గం కాదు. కొన్ని రకాల జన్యువులను తొలగించడం ద్వారా, కేలరీలను తగ్గించడం ద్వారా ఆయుష్షు పెంచవచ్చు. ఈ పద్ధతులు మనుషులకు అంత ఆచరణయోగ్యం కాదని నార్త్ కారొలినా స్కూల్ ఆఫ్ మెడిసన్ జన్యుశాస్త్రవేత్త నెడ్ షార్ప్లెస్ చెప్పారు. ఈ కణాల తొలగింపు ద్వారా ఆయుష్షు పెంచడం ఇదే తొలిసారి అని అన్నారు. డ్యూరసెన్ కంపెనీ సెనిసెంట్ కణాలను సమర్థంగా తొలగించేందుకు తగిన విధానాన్ని, రసాయనాన్ని తయారు చేస్తే త్వరలో మంచి ఆరోగ్యంతో కష్టాల్లేని వృద్ధాప్యాన్ని అనుభవించవచ్చునేమో! -
ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉంటే చాలు
లండన్: సాధారణంగా ఉద్యోగ బాధ్యతలు అంటే కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేటు కొలువైతే ఇక ఆ ఇబ్బంది చెప్పలేనంతగా పీలవుతారు. అసలు అలాంటి ఇబ్బందే కలగకుండా, ఆ ఫీలింగే రాకుండా ఉంటూ చక్కగా ఆరోగ్యంగా బతికేయొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. అది ఎలాగని అనుకుంటున్నారా.. మరేం లేదు మనం ఏపని చేస్తున్నామో దానికి మన ఎమోషన్ ను ఎటాచ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఆ పనిని బాగా ప్రేమించాలన్నమాట. అలా చేయడం ద్వారా సంతోషం, చక్కటి ఆరోగ్యంతో పాటు సదరు సంస్థ నిర్దేశిత లక్ష్యాలను కూడా తేలికగా అధిగమించవచ్చని కొపెన్ హాగన్ లోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ సెంటర్ తెలిపింది. ఇందుకోసం వారు ఆరు వేలమందిని కొన్ని గ్రూపులగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. -
‘బేబీ క్రై సుమో’