ప్రతీకాత్మక చిత్రం
కాలిఫోర్నియా : బరువు తగ్గటానికి, ఆరోగ్యంగా ఉండటానికి గంటల తరబడి వ్యాయామాలు చేయక్కర్లేదు. మన జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేస్తే బరువు అదుపులో ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యకరమైన శరీరం కోసం మనం చేయాల్సిందల్లా ఒక రోజులో మనం తీసుకునే ఆహారాన్ని 10గంటల లోపుగా అంటే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి తీసుకునే ఆహారాన్ని పదిగంటల సమయంలోపే తీసుకుంటే బరువు అదుపులో ఉండటమే కాకుండా జీవక్రియకు సంబంధించిన అనారోగ్య సమస్యల నుంచి సైతం విముక్తి పొందవచ్చు. కాలిఫోర్నియాకు చెందిన ‘షాల్క్ ఇన్‌స్టిట్యూట్ ’వెలువరిచిన ‘‘సెల్ మెటబాలిజం’’ జర్నల్‌లో ఇలాంటి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
మనలో చాలా మంది ఉదయం ఒక కప్పు కాఫీతో రోజును ప్రారంభించి 14-15గంటల తర్వాత రాత్రి చిరుతిళ్లతో రోజును ముగిస్తూ ఉంటారు. కొన్నిసార్లు పనిగంటల కారణంగా ఆహారం తీసుకునే వేళల్లో మార్పులు సంభవిస్తుంటాయి. అలా కాకుండా 24గంటలు కలిగిన ఒక రోజులో మనం తీసుకునే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర, రాత్రి ఆహారాలను కేవలం 10 గంటల కాలంలో తీసుకుని మిగిలిన 14 గంటలు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి లభించటమే కాకుండా అంతర్గత మరమ్మత్తులకు అవకాశం ఉంటుంది. తద్వారా బరువు అదుపులో ఉండటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
Comments
Please login to add a commentAdd a comment