
కాలిఫోర్నియా: కరోనా వైరస్ ఎంతటి ప్రభావం చూపుతుందో తెలిపే చిత్రమిది. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన మైక్ షూల్జ్‌కు ఇటీవల కరోనా సోకింది. ఆరు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత ఆరోగ్యవంతుడయ్యాడు కానీ, అప్పటివరకూ ఇష్టపడి పెంచుకున్న కండలు కాస్తా కరిగిపోయాయి. ఆసుపత్రిలో చేరే సమయానికి షూల్జ్ బరువు 86 కిలోలు కాగా.. డిశ్చార్జ్ అయ్యేటప్పటికి అది 63 కిలోలకు తగ్గిపోయింది. అంతేకాదు.. ఫొటో కోసం కాసేపు నిలబడేంత శక్తి కూడా లేకపోయిందని షూల్జ్ వాపోయాడు. ‘‘చికిత్స తరువాత నన్ను నేను గుర్తించలేకపోయానంటే నమ్మండి’’అన్నాడు. ఆరు వారాలపాటు వెంటిలేటర్‌లో ఉన్న తాను ఊపిరి తీసుకునేందుకు కృత్రిమ గొట్టాన్ని వాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు షూల్జ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 40 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు. (కరోనా: ‘మహా’ భయం!)
Comments
Please login to add a commentAdd a comment