ఎమోషనల్ ఎటాచ్మెంట్ ఉంటే చాలు
లండన్: సాధారణంగా ఉద్యోగ బాధ్యతలు అంటే కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అది ప్రభుత్వ ఉద్యోగం కాకుండా ప్రైవేటు కొలువైతే ఇక ఆ ఇబ్బంది చెప్పలేనంతగా పీలవుతారు. అసలు అలాంటి ఇబ్బందే కలగకుండా, ఆ ఫీలింగే రాకుండా ఉంటూ చక్కగా ఆరోగ్యంగా బతికేయొచ్చంటున్నారు కొందరు అధ్యయనకారులు. అది ఎలాగని అనుకుంటున్నారా.. మరేం లేదు మనం ఏపని చేస్తున్నామో దానికి మన ఎమోషన్ ను ఎటాచ్ చేస్తే సరిపోతుందన్నమాట.
ఇంకా చెప్పాలంటే ఆ పనిని బాగా ప్రేమించాలన్నమాట. అలా చేయడం ద్వారా సంతోషం, చక్కటి ఆరోగ్యంతో పాటు సదరు సంస్థ నిర్దేశిత లక్ష్యాలను కూడా తేలికగా అధిగమించవచ్చని కొపెన్ హాగన్ లోని నేషనల్ రిసెర్చ్ సెంటర్ ఫర్ వర్కింగ్ ఎన్విరాన్ మెంట్ సెంటర్ తెలిపింది. ఇందుకోసం వారు ఆరు వేలమందిని కొన్ని గ్రూపులగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు.