- ∙ఐసీడీఎస్ ఆర్‌జేడీ చక్రధర్‌రావు
పోషకాహారంతోనే ఆరోగ్యం
Published Thu, Sep 8 2016 12:55 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM
గూడూరు : గర్భిణులు, బాలింతలు పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ ఆర్‌జేడీ చక్రధర్‌రావు అన్నారు. జాతీయ పోషకాహార వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక బాలసదనంలో ఐసీడీఎస్ సీడీపీఓ పావని అధ్యక్షతన బుధవారం అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సదస్సులో ఆర్‌జేడీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ శిశువు దశలో పౌష్టికాహారం అందజేసినప్పుడే ఎదుగుదల సాధ్యమవుతుందని తెలిపారు.
సర్పంచ్ వాంకుడోతు మోతీలాల్‌నాయక్, పీహెచ్‌సీ వైద్యుడు అంబరీష్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బాలసదనం సూపరింటెండెంట్ కన్న రాధ, సూపర్‌వైజర్లు తేజాబాయి, కళావతి, శారద, సంధ్య, లలిత, రాంలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement