సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడుతున్నవారిలో 80 శాతం మంది డీ విటమిన్ లోపం కలిగి ఉన్నారని తేలింది. ఈ విషయంపై జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (జామా) అధ్యయనం చేసింది. ఈ వివరాలను తాజాగా విడుదల చేసింది. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు విటమిన్ డీ లోపం ఉన్నవారికి కరోనా సోకే ప్రమాదం ఎక్కువున్నట్లు గుర్తించారు. విటమిన్ డీ వల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి బాగా పెరుగుతుంది. ఈ లోపం ఉన్న వారిలో రోగనిరోధకశక్తి తగ్గిపోవడంతో కరోనా సోకే అవకాశమెక్కువ. విటమిన్ డీ మందుల వల్ల శ్వాసకోçశ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయని తేల్చారు.
కరోనా చికిత్సలో విటమిన్ డీ మాత్రలు
విటమిన్ డీ లోపం సర్వసాధారణం. ఇది దాదాపు సగం జనాభాను ప్రభావితం చేస్తుంది. సూర్యరశ్మి తగ్గిన వ్యక్తులలో అధికంగా ఈ లోపం ఉంటుంది. ఇళ్లలో ఉండేవారు, వైద్య సిబ్బంది సహా ఎండ తగలకుండా ఉద్యోగ, వ్యాపారాలు చేసేవారిలో విట మిన్ డీ లోపం ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత మొదలై ఇన్నాళ్లైనా ఇంతవరకు వ్యాధి నిరోధక వ్యాక్సిన్ కానీ మందులు కానీ అందుబాటులోకి రాలేదు. అం దుకే వైరస్ బారినపడిన వారికి డాక్టర్లు రోగనిరోధకశక్తి పెంచే విట మిన్లు, బలవర్ధ్థకమైన ఆహారం ఇవ్వడం ద్వారా చికిత్స అందజేస్తున్నారు. ప్రస్తుతం కరోనా బారిన పడనివారు ముందు జాగ్రత్తగా విటమిన్ డీ, సీ ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు. అవి లభించే ప్రత్యేక ఆహారం తీసుకుంటున్నారు. విటమిన్ డీ చికిత్స కరోనాను నివారించడానికి, చికిత్సకు ఒక వ్యూహంగా నిపుణులు గుర్తించారు. విటమిన్ డీ.. వైరల్, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని
వారు కనుగొన్నారు.
మరికొన్ని ముఖ్యాంశాలు
►కరోనా పరీక్షలప్పుడు విటమిన్ డీ తక్కువుండే వారికి పాజిటివ్ వచ్చే చాన్స్ ఎక్కువ. ఊబకాయం, షుగర్ వంటి అనారోగ్యాల కారణంగా విటమిన్ డీ లోపం పెరిగే చాన్స్ ఉంది.
►వైరల్ ఇన్ఫెక్షన్లను విటమిన్ డీ తగ్గించగలదు. వీటిలో కరోనా కూడా ఒకటి.
►విటమిన్ డీ రోగనిరోధకశక్తిని కల్పిస్తుంది. కాబట్టి కరోనా సంక్రమణను తగ్గిస్తుంది.
►విటమిన్ డీ డెన్డ్రిటిక్ కణాలు టీ కణాలపై ప్రభావం చూపడం వల్ల రోగనిరోధక పనితీరును మాడ్యులేట్ చేస్తుంది. తద్వారా కరోనా వ్యాప్తిని తగ్గించవచ్చు.
కరోనాను 'ఢీ'కొట్టండి
Published Mon, Sep 7 2020 1:54 AM | Last Updated on Mon, Sep 7 2020 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment