చలికాలంలో గాలిలోని తేమ తక్కువ. ఈ కారణంగా మనకు అనేక సమస్యలు వస్తుంటాయి. మరీ ఎక్కువ ఇబ్బందిపెట్టే సమస్య జుట్టు రాలడం సమస్య . విపరీతైమన చుండ్రుతో జుట్టు రాలిపోతుంది. హెయిర్ అంతా పొడబారి నిర్జీవంగా కాంతి విహీనంగా మారిపోతుంది. సో... ఈ వింటర్‌లో జుట్టుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల జుట్టుకు హాని కలుగుతుంది తెలుసా? మరి జుట్టు పట్టుకుచ్చులా ఆరోగ్యంగా, ఒత్తుగా ఉండాలంటే ఏం చేయాలి?
వింటర్‌లో అందరినీ వేధించే సమస్య హెయిర్‌లాస్, విపరీతమైన చుండ్రు. దీంతోపాటు జుట్టుచిట్టిపోవడం, పొడిగా ఉండటం చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కనుక చలికాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలసిందే. చర్మంగానీ, జుట్టుకానీ డీహైడ్రేషన్ బారిన పడకుండా తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి. కానీ చలికాలంలో చాలా తక్కువ నీటిని తాగుతాం ఈ కారణంగా సమస్యలు మరింత విజృంభిస్తాయి. తల పొడిబారిపోతుంది. తేమలేక జుట్టు రాలి పోతుంటుంది. చుండ్రు చేరుతుంది. ఆ ఇరిటేషన్, దురద బాగా వేధిస్తుంది. మరి చుండ్రును ఎదుర్కోవాలంటే జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం.
అలాగే పోషకాహారంతో పాటు, తాజా కూరలు, పండ్లు, తీసుకోవాలి. వీటన్నింటికంటే చాలా ప్రధానమైనవి విటమిన్ డి, విటమిన్ బి, విటమిన్ ఇ అండ్ విటమిన్ సి. అంతేకాదు తరచుగా జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా తగినంత న్యూటియంట్స్ శరీరానికి అందవు. ఫలితంగా జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. దీంతో సహజమైన, మెరుపును కోల్పోవడంతో పాటు జుట్టు రాలిపోవడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా జంక్ ఫుడ్‌కి నో చెప్పాలి.
ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ డీ, నూట్రిషనల్ ఈస్ట్, బ్రస్సెల్ మొలకలు, బయోటిన్, అవకాడో, సీఫుడ్ ద్వారా లభించే సిలీనియం, జింక్, ఐరన్, మాంగనీస్ ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ చాలా అవసరం. విటమిటన్ డీ ఎంత పుష్కలంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు. విటమిన్ డీ ని డైరెక్టు సన్ ద్వారా గానీ, సప్లిమెంట్ రూపంలో గానీ, ఆహార పదార్థాల ద్వారా గానీ తీసుకోవాలి. మరోవైపు జుట్టు, చర్మం కాంతివంతంగా ఉండటంలో విటమిన్ డి- బయోటిన్ ది కీలకమైన పాత్ర. కార్బోహైడ్రేట్, లిపిడ్ జీవక్రియలో ప్రత్యేక పాత్ర విటమిన్ హెచ్ లేదా బయోటిన్‌ది అని చెప్పొచ్చు. బయోటిన్ లోపిస్తే జుట్టు, గోర్లు, చర్మం కాంతి విహీనంగా మారిపోతాయి. జుట్టు పెళుసుగా మారుతుంది, గోర్లు ఎక్స్‌ఫోలియేట్ అవుతాయి.
చలికి తట్టుకోలేక వేడి వేడి నీళ్లతో తల స్నానం చేస్తుంటాం. నిజానికి ఇది చాలా పెద్దపొరపాటు. వేడి నీటితో జుట్టు మరింత డ్రై అవుతుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు హడావిడిగా దువ్వుకూడదు. తడిగా ఉన్నజుట్టు బలహీనంగా ఉండి, సులువుగా ఊడిపోతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు. పల్చటి, మెత్తటి కాటన్ క్లాత్‌తో జుట్టును ఆర బెట్టుకోవడం మంచిది. దీంతోపాటు ఇంట్లోనే తయారుచేసిన హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్, రైస్ వాటర్ ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
తల స్నానానికిముందు శుద్ధమైన కొబ్బరినూనెతో మసాజ్ చేసుకుంటే కుదుళ్లు గట్టిపడతాయి. ఇంకా ఆలివ్ ఆయిల్, నిమ్మకాయ మిశ్రమం, అలోవేరా, ఉల్లిపాయ రసం, కరివేపాకులు వేసి మరగించిన నూనె, బియ్యం గంజి, మందార ఆకుల మిశ్రమాన్ని స్కాల్ఫ్‌కి పట్టేలా మర్దన చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్‌తో పోలిస్తే ఈజీగా దొరికే రైస్ వాటర్‌లో అమినో యాసిడ్స్, విటమిన్ బి, విటమిన్ ఇ , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి చిట్కాలు జుట్టుకు మంచి టానిక్‌లా పనిచేస్తాయి. ఎక్కువ స్ట్రాంగ్ ఉండే షాంపూలకు దూరంగా ఉండండి. ఆర్గానిక్, లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment