
మనిషికి ఆత్మనూన్యతకు మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకటి లేదు. కొందరూ దీన్ని అధిగమించేలా తమ సామర్థ్యం, తెలివితేటలతో ఆకర్షిస్తారు. కానీ చాలామంది చింతిస్తూ కూర్చొండిపోతారు. తమలోని లోపాలనే పెద్దవిగా చూసుకుని బాధపడితుంటారు. నిజానికి వాటిని ఇతరులు కూడా గుర్తించకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం తాము అందరికంటే విభిన్నంగా, అసహ్యంగా ఉన్నానే భావనలో ఉండిపోతారు. ఇలాంటి ఆత్మనూన్యతకు సంబంధించిన రుగ్మతను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్. అతడు ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో ఏమంటారంటే..
కరణ్ జోహర్ ఎదుర్కొన్న పరిస్థితిని బాడీ డిస్మోర్ఫియా అంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ రూపాన్ని పదే పదే అద్దంలో చూసుకుని కుంగిపోతుంటారు. అందంగా ఉండేందుకు మంచి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ ఏదో లోపం ఉందనుకుంటూ బాధపడిపోతుంటారు. ఇక్కడ కరణ్ జోహార్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. ఇతరులు ఎవ్వరూ తన శరీరాన్ని గమనించకూడదనుకునేవాడట. దీని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏంటీ బాడీ డిస్మోర్ఫియా? అందుకు గల కారణాలు గురించి సవివరంగా చూద్దాం.
బాడీ డిస్మోర్ఫియా అంటే ఏమిటి?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లేదా బీడీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈలోపాలు ఎదుటివాళ్లకు కనిపించవు లేదా గుర్తించబవు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుందట.
అంతేగాదు పెద్దలలో 2.4% మందిని ప్రభావితం చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా యుక్తవయసు, వయోజన వయసులో ఈ విధమైన భావన మొదలవుతుందని చెబుతున్నారు. చాలా వరకు ఈ విధమైన పరిస్థితి 18 ఏళ్ల కంటే ముందునుంచి వారిలో చిన్నగా వారిపై వారికి అభద్రతా భావం కలగడం మొదలవ్వుతుందని తెలిపారు వైద్యులు.
ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు..
శరీరంలో లోపాల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపడం, ఇతరులకు అది ముఖ్యమైనది కాదని లేదా గనించనప్పటికీ.
రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటం
హెయిర్‌స్టైల్, బట్టల మార్పు వంటివి తరుచుగా మర్చేయడం
తరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడం
వారి శరీరం లేదా స్వరూపంలో నచ్చని దాన్నే ఇతరులు తదేకంగా చూస్తున్నారని లేదా ఎగతాళి చేస్తున్నారని భావించడం
తమ శరీరంపై అసహ్యం లేదా సిగ్గుతో కుంగిపోవడం
వస్త్రాధారణకు సరిపోనని భావించడం
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యలుతో గడపడం, వంటివి చేస్తే స్వీయ హాని లేదా ఆత్మహత్య వంటి ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు.
ఎందువల్ల అంటే..
జెనిటిక్ సమస్య
తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఈ పరిస్థితితో బాధపడుతుంటే..
మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలు, కార్యాచరణ వ్యత్యాసాలు
బాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడం
పరిణామాలు..
బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్యో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆందోళన రుగ్మతలు
డిప్రెషన్, ఒత్తిడి
తినే రుగ్మతలు
అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ.
(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?)