body building
-
ఫిట్.. బాడీ సెట్..
కండలు తిరిగే దేహం అంటే యువతకు యమ క్రేజ్ ఉంటుంది. దీనికోసం జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేస్తూ చెమటలు చిందిస్తుంటారు. కొందరు రెగ్యులర్‌గా వెళ్లి సిక్స్ ప్యాక్ వచ్చేంత వరకూ కష్టపడుతుంటారు. కండలు పెరిగేందుకు ప్రొటీన్ పౌడర్ వంటివి తీసుకుంటుంటారు. వీటివల్ల దుష్పరిణామాలు చాలానే ఉంటాయి. అయితే అథ్లెటిక్ బాడీ అంటే గత కొంతకాలంగా యువతలో క్రేజ్ పెరిగిపోతోంది. విల్లులా దేహాన్ని మలుచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ దేహాన్నే మీసోమార్ఫ్ దేహం అని అంటుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రౌండ్స్‌లో పరుగులు పెడుతూ.. వ్యాయామాలు చేస్తున్నారు. దీంతో ఫిట్నెస్తో పాటు మానసిక ఉల్లాసం, చక్కటి దేహాన్ని సొంతం చేసుకుంటున్నారు. నగరంలో చాలా ప్రాంతాల్లోని గ్రౌండ్స్‌లో యువత ఇటీవల ఫిట్నెస్ కోసం వ్యాయామాలు, కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. దీనికి పోటీ పరీక్షలైన ఆర్మీ, పోలీసులు, ఆరీ్పఎఫ్ వంటి నియామకాలు ఒక కారణమైతే.. స్పోర్ట్స్‌పై ఇంట్రెస్ట్‌తో కొందరు.. ఫిట్నెస్ మీద పెరిగిన అవగాహనతో మరికొందరు వ్యాయామాల భాటపడుతున్నారు. దీంతో ఉదయాన్నే లేచి గ్రౌండ్లో పరుగులు పెడుతున్నారు. అయితే గ్రౌండ్లో కసరత్తుల వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి..? ఎలాంటి కసరత్తులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి..? ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం..శరీర భాగాలపై సమానంగా.. జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయడం కన్నా రోజూ రన్నింగ్ చేయడం వల్ల శరీరం ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. జిమ్‌లో ఒకే శరీర అవయవంపై మాత్రమే వర్క్‌లోడ్ పడుతుంటుంది. అదే గ్రౌండ్లో వర్కవుట్స్ వల్ల శరీరంలోని అన్ని భాగాలపై ఒకే విధంగా పనిచేస్తుంది. హెవీ వర్కవుట్స్ చేయడం వల్ల కండరాలకు గాయమయ్యే ప్రమాదం ఉంటుంది. అది దీర్ఘకాలికంగా ఉండే అవకాశాలూ ఎక్కువే. అయితే గ్రౌండ్లో వర్కవుట్స్ ద్వారా వచ్చిన ఫలితాలు చాలా కాలం వరకూ ఉంటాయి. అంటే కొంత కాలం కసరత్తులు ఆపేసినా కూడా పెద్దగా శరీరంలో మార్పులు రావు. అదే జిమ్ మధ్యలో ఆపేస్తే శరీరం మొత్తం మారిపోతుంది.ట్రైనింగ్ పద్ధతులు.. గ్రౌండ్లో చేసేందుకు సాధారణంగా పలు రకాల ట్రైనింగ్ పద్ధతులు ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, సర్క్యూట్ ట్రైనింగ్, ఇంటర్వెల్ ట్రైనింగ్, రెప్యుటేషన్ ట్రైనింగ్, క్రాస్ కంట్రీ ట్రైనింగ్ అనే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఎలాంటి ఖర్చూ లేకుండా చక్కటి శరీరాకృతి పొందవచ్చు. బర్ఫీ, జంపింగ్ జాక్స్ వంటి ఎక్సర్సైజ్ల ద్వారా శరీరం మొత్తంపై ప్రభావం పడుతుంది. వీటి వల్ల కొవ్వు తగ్గి బరువు తగ్గుతుంది. రన్నింగ్‌తో జీవక్రియలు మెరుగుపడటమే కాకుండా, శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్రౌండ్లో వర్కవుట్స్ చేసే వాళ్లు తప్పనిసరిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం తప్పనిసరి. దీంతో రన్నింగ్ చేసే స్టామినా పెరుగుతుంది.ఎత్తు పెరిగే అవకాశం.. గ్రౌండ్లో కసరత్తులు, రన్నింగ్ చేయడం వల్ల 18 ఏళ్ల లోపు పిల్లల్లో ఎత్తు పెరుగుతారని చెబుతున్నారు. అదే ఆ వయసులో ఉన్న వారు జిమ్ చేస్తే ఎత్తు పెరగడం ఆగిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌లో ఉండే పరికరాలు అందరూ వాడటం వల్ల కొన్ని చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూల్‌డౌన్ పద్ధతులు తప్పనిసరి.. గ్రౌండ్లో రన్నింగ్ లేదా కసరత్తులు చేసిన తర్వాత బాడీ కూల్‌డౌన్, స్ట్రెచ్ ఎక్సర్సైజులు తప్పనిసరిగా చేయాలి. ఇది అలసిపోయిన కండరాలను యథాస్థితికి తీసుకొచ్చేందుకు పనికొస్తుంది. 30 ఏళ్లు దాటిన వాళ్లు ఎక్కువ కఠినమైన ఎక్సర్సైజులు చేయకపోవడం మంచిది. కండరాలపై స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. నిపుణుల పర్యవేక్షణలోనే కసరత్తులు చేయడం మంచిది. – కె.ధర్మేందర్, ఫిజికల్ డైరెక్టర్డైట్ చాలా ముఖ్యం.. గ్రౌండ్లో వర్కవుట్ చేసే వారికి డైట్ చాలా ముఖ్యం. శరీర తీరు, బరువు, చేసే వర్కవుట్‌ను బట్టి ఆహారం తీసుకోవాలి. కార్బొహైడ్రేట్స్ఉన్న ఆహారపదార్థాలు తగ్గించాలి. ప్రొటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కండరాలు పెరుగుతాయి. ఫైబర్ ఉన్న ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరిగి, బరువు పెరగదు. నీరు కూడా అధికంగా తీసుకుంటుండాలి. వర్కవుట్ కన్నా ముందు కనీసం ఒక లీటర్ నీళ్లు (గోరు వెచ్చటి నీరు) తాగాలి. – వసుధ, క్లినికల్ న్యూట్రిషనిస్టు -
జిమ్ లో స్టెరాయిడ్స్ వాడుతున్నారా?
-
కరణ్ జోహార్ ఫేస్ చేసిన బాడీ డిస్మోర్ఫియా అంటే..?ఎందువల్ల వస్తుంది?
మనిషికి ఆత్మనూన్యతకు మించిన ప్రమాదకరమైన జబ్బు మరొకటి లేదు. కొందరూ దీన్ని అధిగమించేలా తమ సామర్థ్యం, తెలివితేటలతో ఆకర్షిస్తారు. కానీ చాలామంది చింతిస్తూ కూర్చొండిపోతారు. తమలోని లోపాలనే పెద్దవిగా చూసుకుని బాధపడితుంటారు. నిజానికి వాటిని ఇతరులు కూడా గుర్తించకపోవచ్చు. కానీ వీళ్లు మాత్రం తాము అందరికంటే విభిన్నంగా, అసహ్యంగా ఉన్నానే భావనలో ఉండిపోతారు. ఇలాంటి ఆత్మనూన్యతకు సంబంధించిన రుగ్మతను ఎదుర్కొన్నాడు బాలీవుడ్ సినీ నిర్మాత కరణ్ జోహార్. అతడు ఎదుర్కొన్న పరిస్థితిని వైద్య పరిభాషలో ఏమంటారంటే..కరణ్ జోహర్ ఎదుర్కొన్న పరిస్థితిని బాడీ డిస్మోర్ఫియా అంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న వాళ్లు నలుగురిలోకి రావడానికి ఇష్టపడరు. తమ రూపాన్ని పదే పదే అద్దంలో చూసుకుని కుంగిపోతుంటారు. అందంగా ఉండేందుకు మంచి ప్రయత్నాలు కూడా చేస్తారు. అయినప్పటికీ ఏదో లోపం ఉందనుకుంటూ బాధపడిపోతుంటారు. ఇక్కడ కరణ్ జోహార్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. ఇతరులు ఎవ్వరూ తన శరీరాన్ని గమనించకూడదనుకునేవాడట. దీని నుంచి బయటపడేందుకు అతడు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అసలు ఏంటీ బాడీ డిస్మోర్ఫియా? అందుకు గల కారణాలు గురించి సవివరంగా చూద్దాం.బాడీ డిస్మోర్ఫియా అంటే ఏమిటి?నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బాడీ డైస్మోర్ఫిక్ డిజార్డర్ లేదా బీడీడీ అనేది ఒక మానసిక ఆరోగ్య పరిస్థితి. ఇక్కడ ఒక వ్యక్తి శరీరాకృతి తీరులోని లోపాల గురించి చింతిస్తూ ఎక్కువ సమయం గడుపుతుంటాడు. ఈలోపాలు ఎదుటివాళ్లకు కనిపించవు లేదా గుర్తించబవు. ఇది ముఖ్యంగా టీనేజర్లు, యువకులలో సాధారణమని వైద్యులు చెబుతున్నారు. ఇది పురుషులు, మహిళలు ఇద్దరిని ప్రభావితం చేస్తుందట. అంతేగాదు పెద్దలలో 2.4% మందిని ప్రభావితం చేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ఎక్కువగా యుక్తవయసు, వయోజన వయసులో ఈ విధమైన భావన మొదలవుతుందని చెబుతున్నారు. చాలా వరకు ఈ విధమైన పరిస్థితి 18 ఏళ్ల కంటే ముందునుంచి వారిలో చిన్నగా వారిపై వారికి అభద్రతా భావం కలగడం మొదలవ్వుతుందని తెలిపారు వైద్యులు.ఈ వ్యాధి సంకేతాలు, లక్షణాలు..శరీరంలో లోపాల గురించి ఆలోచిస్తూ ఎక్కువ సమయం గడపడం, ఇతరులకు అది ముఖ్యమైనది కాదని లేదా గనించనప్పటికీ.రూపాన్ని పదేపదే చూసుకుంటూ ఒత్తిడికి గురవ్వుతుండటంహెయిర్స్టైల్, బట్టల మార్పు వంటివి తరుచుగా మర్చేయడంతరుచుగా సెల్ఫీలు తీసుకోవడం, శరీరంలోని కొన్ని ప్రాంతాను దాచేయత్నం చేయడంవారి శరీరం లేదా స్వరూపంలో నచ్చని దాన్నే ఇతరులు తదేకంగా చూస్తున్నారని లేదా ఎగతాళి చేస్తున్నారని భావించడంతమ శరీరంపై అసహ్యం లేదా సిగ్గుతో కుంగిపోవడంవస్త్రాధారణకు సరిపోనని భావించడంఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మాత్రం స్నేహితులు, కుటుంబ సభ్యలుతో గడపడం, వంటివి చేస్తే స్వీయ హాని లేదా ఆత్మహత్య వంటి ఆలోచనల నుంచి బయటపడగలుగుతారు. ఎందువల్ల అంటే..జెనిటిక్ సమస్యతల్లిదండ్రులు లేదా తోబుట్టువులు ఈ పరిస్థితితో బాధపడుతుంటే..మెదడు నిర్మాణం, రసాయనిక చర్యలు, కార్యాచరణ వ్యత్యాసాలుబాల్యంలో నిర్లక్ష్యానికి గురవ్వడంపరిణామాలు..బాడీ డిస్మోర్ఫియాతో బాధపడుతున్న వారికి మానసిక ఆరోగ్యో సమస్యలు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఆందోళన రుగ్మతలుడిప్రెషన్, ఒత్తిడితినే రుగ్మతలుఅబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువ.(చదవండి: రాజ్యసభ ప్రసంగంలో సుధామూర్తి ప్రస్తావించిన సర్వైకల్ వ్యాక్సినేషన్ ఎందుకు? మంచిదేనా?) -
జస్ట్ ఈమూడు వ్యాయామాలు చేయండి! బరువు తగ్గడం ఖాయం!
కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా.. మంచి ఫలితం ఉండదు. శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం తోపాటు మంచి ఫిట్నెస్గా ఉంటారు అంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ అలీ కబ్బా. ఇంతకీ ఏంటా ఆ వ్యాయామాలు అంటే.. ఈ మూడు వ్యాయమాలు జస్ట్ 20 నిమిషాలు కనీసం కొన్ని పర్యాయాలు చొప్పున చేస్తే చాలు చక్కటి ఫలితం చాలా త్వరిగతగతిన కనిపిస్తుంది. దీనికి కావల్సిందల్లా కెటిల్‌బెల్స్, రోయింగ్ మెషిన్ ఉంటే చాలు. ఎలా చెయ్యాలంటే..? ముందుగా రోయింగ్ మెషిన్ పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్ని పట్టుకుని వెళ్తుంటే అది మీ కండరాలను ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడటమే గాక కాళ్లకి చేతులకి మంచి వ్యాయామంగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా కదలుతుంది కాబట్టి కేలరీలు కూడా స్పీడ్‌గా తగ్గుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి. ఇక రెండోది కెటిల్ బాల్స్‌తో పుష్ అప్లు బాడీ ఫ్లాట్‌గా ఉండేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్‌గా ఉంటుంది. బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం కాబట్టి తొందరగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఒక వేళ కెటిల్ బాల్స్‌తో చేయడం కష్టమైతే అవి లేకుండా ఒట్టిగా నేలపైనే అయినా ట్రై చేయండి సరిపోతుంది. తదుపరి ఈ కెటిల్ బాల్స్‌ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్‌ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా ఓ 5 నిమిషాలు చేస్తే..భుజాలు, నడుం మంచిగా బలోపేతం అవుతాయి. మీ కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడతాయి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనీసం ఓ 20 నిమిషాలు చేస్తే ఫిట్‌గా ఉండటమే గాక బరువు తగ్గి నాజూగ్గా ఉండటం పక్కా అని చెబుతున్నారు బాడీ ట్రైయినర్ అలీ కబ్బా. View this post on Instagram A post shared by Ali Kabba - Personal Trainer (@amt.fitness) (చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా విజేతగా రాహుల్..
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా భాగ్యనగర్ బాడీబిల్డింగ్ అసోసియేషన్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్‌ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రెసిడెంట్ కె సంపత్ రెడ్డి మాట్లాడుతూ., పురుషుల ఫిజిక్, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో పోటీలు జరిగాయని తెలిపారు. టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు అందుకుంటారన్నారు. 55 కిలోలు, 55–60 కిలోలు, 60–65 కిలోలు, 65–70 కిలోలు 70–75 కిలోలు, 75–80 కిలోలు, 80–85 తదితర విభాగాల్లో బాడీబిల్డింగ్ పోటీలు, 85 కిలోల పైన పురుషుల ఫిజిక్ పోటీలు 170 సెంటీమీటర్ల లోపు, 170 సెంటీమీటర్ల పైన తదితర విభాగాల్లో నిర్వహించామన్నారు. -
అతని వయసు 90..బాడీ పరంగా యువకుడే! ఎలాగంటే..
వయసులో అతను వృద్ధుడే కానీ బాడీ పరంగా ఉక్కులాంటి దేహం. యువ బాడీబిల్డర్లకు ఏ మాత్రం తీసిపోని దేహదారుఢ్యం అతని సొంతం. తొమ్మిది పదుల వయసులో ఓ వీల్‌చైర్‌కే పరిమితమై.. మనుషులను గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. అతను మాత్రం చాలా యాక్టివిగ్ అచ్చం యువకుడిలో ఉండే నూతనోత్సహాం అతనిలో ఉంది. ఇంతకీ అతను ఎవరూ? ఆ వయసులో కూడా అంత చురుగ్గా ఎలా ఉన్నాడంటే.. జిమ్ అరింగ్టన్ అనే వ్యక్తి ఓ బాడీ బిల్డర్. అతను వయసులో ఉన్నపుడే ఎలాంటి బాడీని మెయింటేన్ చేశాడో అలానే వృద్ధాప్యంలో కూడా మెయింటేన్ చేసి అబ్బురపర్చాడు. 90ల వయసులో కూడా బాడీ బిల్డర్ మాదిరి తన కండలు, బాడీ తీరు మారకపోవడవం విశేషం. క్రమం తప్పకుండా చేసే జిమ్, తీసుకునే ఫుడ్ డైట్ కారణంగా అతను అలా బాడీని కంటిన్యూ చేయగలిగాడు. దీంతో అతను అత్యంత వృద్ధ బాడీ బిల్డర్‌గా రికార్డు నెలకొల్పోడు. తనకు చిన్నప్పటి నుంచి బాడీ బిల్డింగ్ మీద మక్కువ ఉండేదని, ఇదే తన ఆరోగ్యాన్ని మంచిగా కాపాడుకునేలా చేసిందని ఆనందంగా చెబుతున్నడు అరింగ్టన్. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డు అతని హెల్త్ సీక్రెట్‌కి సంబంధించిన వీడియోని నెట్టింట పోస్ట్ చేసింది. అందులో తన ఆరోగ్య రహస్యం, బాడీని అలా మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిట్కాలను పంచుకున్నాడు అరింగ్టన్. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ వయసులో కూడా బాడీని ఫిట్‌గా ఉంచి అందరికి స్ఫూర్తిగా నిలిచారంటూ అరింగ్టన్పై ప్రశంసల జల్లు కురిపించారు. (చదవండి: వ్యాధుల నిర్థారణ వైఫల్యతతో..ఏటా 8 లక్షల ప్రాణాలు బలి) -
73 ఏళ్ల వయసులో బాడీబిల్డింగ్.. ఈయన గురించి తెలుసుకోవాల్సిందే
‘ఓల్డ్ ఈజ్ గోల్డ్’ అని అందరికి తెలిసిందే. కానీ, గోల్డ్ ఓల్డ్‌గా ఎన్నటికీ మారదన్నట్లు మనిషికి వయసు పైబడినంత మాత్రాన సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. ఇదే విషయాన్ని నిజం చేస్తూ ఎంతోమంది వృద్ధులు లేటు వయసులోనూ వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తున్నారు. అలాంటి వారిలో కేరళకు చెందిన వేంకటేష్ ప్రభు కూడా ఒకరు. ప్రస్తుతం సింగపూర్‌లో స్థిరపడ్డ ప్రభు.. పదవీ విరమణ పొందిన తర్వాత అందరిలా ఇంట్లో ఖాళీగా కూర్చోవాలనుకోలేదు. అది గ్రహించిన అతడి కూతురు ఇచ్చిన సలహా మేరకు 58 ఏళ్ల వయసులో పరుగు ప్రారంభించాడు. ఇక అప్పటి నుంచి ప్రభు పరుగు ఆగలేదు. కేవలం 15 సంవత్సరాల్లోనే 50 మారథాన్లను పూర్తి చేశాడు. 73 ఏళ్ల వయసులోనూ ఆగకుండా 21 కిలోమీటర్లు పరుగెత్తి అందరినీ ఆశ్చర్యపరచాడు. అంతేకాదు, ఈ వయసులోనూ బాడీబిల్డర్‌లా బరువులెత్తగలడు. ప్రస్తుతం సొంతంగా ఓ ఫిట్నెస్ సెంటర్‌ని ప్రారంభించి, తనలాంటి ఎంతోమంది వయో వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు. ఇంతకీ, తన ఆరోగ్య రహస్యం ఏమిటని అడిగితే ‘ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూండటం, మంచి ఆహారం తీసుకోవడమే’ అంటాడు ఈ తాత. -
లారీ బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే..
సాక్షి, కృష్ణాడెస్క్: వాణిజ్య రాజధానిగా పేరొందిన బెజవాడ లారీల బాడీ బిల్డింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. లారీలకు బాడీలు తయారు చేసే నిపుణులు ఇక్కడే ఉన్నారు. కొత్తగా లారీ కొనుగోలు చేస్తే దానికి బాడీ కట్టివ్వాలంటే విజయవాడ రావాల్సిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో లారీలను ఆటోనగర్ తీసుకొస్తారు. ఒకప్పుడు యజమానులు ఆరు టైర్ల లారీలకే పరిమితమయ్యేవారు. కానీ నేడు మారిన పరిస్థితుల నేపథ్యంలో 16 టైర్ల లారీలపై మక్కువ కనబరుస్తున్నారు. వాటిని ఎక్కడ కొనుగోలు చేసినా బాడీలు కట్టించడానికి మాత్రం విజయవాడ తేవాల్సిందే. కరోనా విలయతాండవం తర్వాత కొన్ని రంగాల్లో పరిస్థితులు చక్కదిద్దుకున్నాయి. విజయవాడలోని జవహర్ ఆటోనగర్ కార్మికులు చేతి నిండా పనులతో ఉపాధి పొందుతున్నారు. ఎంతో ప్రసిద్ధి చెందిన ఆటోనగర్‌లో ప్రస్తుతం లారీల బాడీ బిల్డింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకప్పుడు ఆరుటైర్లు ఉంటే ఎంతో గొప్పగా భావించే లారీల యజమానులు ఇప్పుడు 16 టైర్ల లారీలను కొనుగోలు చేసి వాటికి బాడీలు కట్టిస్తున్నారు. వీటికి మెయింటెనెన్స్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతే కాకుండా 35 టన్నుల వరకు లోడు వేసుకునే అవకాశం ఉందని చెప్పారు. ఆరు టైర్ల వాహనాలకు ప్రతి 18 వేల కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్చాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. 16 టైర్ల వాహనాలకు (లారీ) ఇంజిన్ ఆయిల్ 80 వేల కిలోమీటర్లకు మారిస్తే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. దీంతో ఈ లారీలనే ఎక్కువ కొనుగోలు చేస్తున్నామని యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం లారీలన్నీ కర్నూలు జిల్లా బేతంచర్ల, నెల్లూరు, వైజాగ్, గుంటూరు, పొన్నూరు, తదితర ప్రాంతాల నుంచి ఆటోనగర్‌కు వస్తున్నాయి. 10 నుంచి 15 రోజుల్లో లారీ బాడీ బిల్డింగ్ పనులు పూర్తి చేస్తున్నారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో బాడీలు కడుతున్నారు. ఎంతో మంది వృత్తి నిపుణులు... ఒక్కో లారీ బాడీ బిల్డింగ్ చేయడానికి 11 రకాల వృత్తి నైపుణ్యాలు కలిగిన కారి్మకులు అవసరం. కార్పెంటరీ, టింకరింగ్, కమ్మరం, పౌండ్రి, పెయింటర్, ఎల్రక్టీíÙయన్, అద్దాలు, సట్లు, స్టిక్కరింగ్, టైర్లు తదితర పనుల్లో స్కిల్ వర్కర్లు అందుబాటులో ఉంటారు. సుమారు రెండు వారాల పాటు వీరంతా శ్రమిస్తే గానీ 16 టైర్ల లారీలకు బాడీ బిల్డింగ్ పూర్తి కాదు. ఆటోనగర్‌లో సుమారు వెయ్యి మందికిపైగానే కారి్మకులు ఉన్నారు. వీరంతా లారీల బాడీల తయారీ పనుల్లో పాలుపంచుకుంటారు. ఆటోనగర్‌లో లారీ బాడీ బిల్డింగ్ యూనిట్లు ►కరోనాకి ముందు: 200 ►కరోనా తర్వాత : 100 ►ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్నవి : 50 ►16 టైర్ల లారీకి బాడీ బిల్డింగ్ పూర్తి చేయడానికి పట్టే సమయం: 10 నుంచి 15 రోజులు ►ఒక్క లారీ బాడీ బిల్డింగ్‌కి అయ్యే ఖర్చు రూ.4.80 లక్షలు ►ఒక్కో కార్మికుడికి రోజు కూలీ: రూ.1,000 నుంచి రూ.1,200 ►ఆటోనగర్ నుంచి పని పూర్తి చేసి బయటకు పంపే లారీల సంఖ్య రోజుకు: 50 ►వర్క్ బిజీగా ఉండే మాసాలు (సీజన్) : జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రియల్ (సీజన్లో ఈ ప్రాంతంలో లాడ్జిలు, హోటళ్లు బిజీ బిజీగా ఉంటాయి) చదవండి: పుట్టపర్తి: వస్తే.. వెళ్లలేమప్పా!.. విదేశీ అతిథుల మన్ననలు.. ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం 16 టైర్ల బాడీ బిల్డింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తాం. ఎక్కడా లోటు లేకుండా పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తి చేసి యజమానులకు అప్పగిస్తాం. గత మూడు నెలల నుంచి ఆటోనగర్‌కు 16 టైర్ల లారీలు వస్తున్నాయి. ఈ లారీలో 35 టన్నుల లోడింగ్ చేసుకునే అవకాశం ఉంది. బాడుగ కూడా ఎక్కువ వస్తుంది. ఆయా కంపెనీలకు చెందిన వారు 16 టైర్ల లారీలకు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో ఎంతో మంది వీటిని కొనుగోలు చేసి బాడీ బిల్డింగ్ కోసం బెజవాడ వస్తున్నారు. కరోనా తర్వాత కార్మికులకు చేతి నిండా పని దొరుకుతుంది. –సంపర మల్లేశ్వరరావు, షెడ్ యజమాని -
పడుచు కుర్రాడనుకుంటున్నారా.. అసలు వయసు తెలిస్తే.. షాకవుతారు
సామాన్యంగా జనాలకు ముఖ్యంగా సెలబ్రిటీలకు వృద్ధాప్యం అంటే చాలా భయం. వయసు మీదపడుతున్న కొద్ది.. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, ఎక్సర్సైజ్, సర్జరీలు, స్టెరాయిడ్స్ వాడటం వంటివి చేస్తుంటారు. ఎన్ని చేసినా ఓ వయసు వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత ఆటోమెటిగ్గా మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ కొందరు మాత్రం వ్యాయమాన్ని తమ జీవితంలో భాగం చేసుకుంటారు. ఏళ్ల తరబడి దాన్ని అలానే కొనసాగిస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇదేలా సాధ్యం అయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకునేముందు ఓ సారి పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి. అతడిని చూడగానే మంచి బాడీబిల్డర్‌లా ఉన్నాడు.. ఏవైనా పోటీలకు సిద్ధం అవుతున్నాడేమో అనిపిస్తుంది. వయసు అంటే మహా అయితే 30-35 మధ్యన ఉంటుంది అనిపిస్తుంది కదా. (చదవండి: Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..) అదుగో అక్కడే మీరు తప్పులో కాలేశారు. అతడి అసలు వయసు తెలిస్తే మీరు ఓ నిమిషం పాటు షాక్‌కు గురవుతారు. ఎందుకంటే అతడు 72 ఏళ్ల వ్యక్తి. కానీ చూడ్డానికి మాత్రం 30 ఏళ్ల పడుచు కుర్రాడిలా ఉన్నాడు. వామ్మో ఫించను తీసుకోవాల్సిన వయసులో ఈ బాడీ బిల్డింగ్ ఏంట్రా సామీ అనిపిస్తుంది కదా. ఫోటోలోని వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. గత 30 ఏళ్ల నుంచి క్రమం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. 2019లో ఇతడికి సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలయ్యింది. దానిలో అతడు తన వయసు 30 సంవత్సరాలు అని చెప్తే జనాలు ఈజీగా నమ్మేశారు. మరి జిన్మిన్ ఇంత యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నాడంటే.. (చదవండి: దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్) జిన్మిన్ గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. మంచి జీవన విధానాలు పాటిస్తాడు. బాడీబిల్డింగ్ కోసం ప్రతి రోజు 6-8 గుడ్లు, దోసకాయలు, చికెన్, టమాటాలు, ఓట్మీల్ తీసుకుంటాడు. ఇతడి ఫిట్నెస్కి ఇటు సామాన్యులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫిదా అయ్యాయి. తమ ఉత్పత్తులకు అతడిని ప్రచారకర్తగా నియమించుకుంటున్నారు. చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా? -
Science Facts: ఎక్సర్సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..
Can You Change Your Body Shape With Daily Exercises: నిద్రలేచి అద్దంలో చూసుకునే వాళ్లు ఎంతమంది ఉంటారో కానీ బయటకు వెళ్లడానికి తయారైన తర్వాత అద్దంలో చూసుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ‘పట్టుచీరల షోరూమ్ ముందు హోర్డింగ్‌లో ఉన్న మోడల్ కట్టుకుంటే అంత అందంగా అమరిన చీర తనకెందుకు ఆ స్థాయిలో నప్పడం లేదు. మూడు నెలలుగా ఎక్సర్సైజ్ చేస్తున్నా ఫలితం అంతంత మాత్రమే’ అని ఓ యువతి అసంతృప్తిగా ముఖం పెట్టడం సహజమే. అలాగే స్లిమ్ ఫిట్ షర్ట్‌ను ధరించిన మోడల్‌ను చూసి మనసు పడి ఆ చొక్కా కొనుక్కున్న ఓ కుర్రాడు కూడా అద్దంలో చూసుకుంటూ ‘మోడల్ ఉన్నంత స్మార్ట్‌గా లేను’ అనుకోవడమూ, మరుసటి రోజు నుంచే వ్యాయామం మొదలు పెట్టడం కూడా సర్వసాధారణమే. ఎక్సర్సైజ్ దేహాకృతిని మారుస్తుంది. నిజమే, అయితే ఎక్సర్సైజ్ ఎన్ని రోజులు చేస్తే ప్రకటనలో ఉన్న మోడల్ దేహాకృతి వస్తుంది..? ఇది జెనెటిక్స్ నిర్ణయం... మనిషి దేహాకృతిని ప్రధానంగా జెనెటిక్స్ నిర్దేశిస్తాయి. బొద్దుగా లేదా బక్క పలుచగా ఉండడం వంటి లక్షణాలు పిల్లలకు వారసత్వంగా సంక్రమిస్తాయి. అలా సంక్రమించిన లక్షణాలను మన జీవనశైలి ప్రభావితం చేస్తుంది. ఆహారవిహారాల ప్రభావంతో సన్నని వాళ్లు కూడా అధిక బరువుకు లోనవుతుంటారు. బొద్దు వాళ్లు ఏకంగా ఒబేసిటీ బారిన పడుతుంటారు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల దేహంలో కొవ్వు కరిగి కండరాలు చక్కని షేప్‌లో రూపుదిద్దుకుంటాయి. అందులో సందేహం లేదు. చదవండి: Science Facts: చీమల రక్తం అందుకే ఎర్రగా ఉండదట..! అయితే నడుము భాగం సన్నగా ఉండడం లేదా వెడల్పుగా ఉండడం, భుజాలు విశాలంగా ఉండడం లేదా కుంచించుకు పోయినట్లు ఉండడం వంటివి వారసత్వంగా వస్తాయి. వ్యాయామం వల్ల దేహ నిర్మాణరీతిలో ఎటువంటి మార్పు రాదు. ఈ అంశం మీద ఏకంగా 24 అధ్యయనాలు జరిగాయి. మూడు వేలమందికి పైగా ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల చొప్పున పన్నెండు వారాలపాటు వ్యాయామం చేస్తే... ఒకరి దేహం స్పందించినట్లు మరొక దేహం స్పందించలేదు. మనిషి ఎత్తు, బరువు, వయసు, ఆహారవిహారాలు, నిద్ర వంటి వాటన్నింటినీ ఆరోగ్యవంతంగా క్రమబద్ధం చేసుకుంటూ వ్యాయామాన్ని కొనసాగించాలి. వ్యాయామం దేహాన్ని శక్తిమంతంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది. దేహం అంతర్గత అవయవాల పనితీరు మెరుగ్గా ఉంటుంది. సమగ్ర ఆరోగ్యం వ్యాయామం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వ్యాయామం మంచిదే. అలాగే దేహాకృతి మీద ధ్యాస ఉండడం కూడా ఆరోగ్యకరమే. అయితే మనదేహం మరొకరి దేహాకృతిలాగా మారిపోవాలనుకోవడం ఆరోగ్యకరం కాదు. అది సాధ్యం కాదు. చదవండి: Covid Taste Test: తెలుసా..! కాఫీతో కోవిడ్ టెస్ట్ చేయొచ్చు... ఎలాగంటే.. -
కసరత్తు ఎక్కువైతే..ప్రమాదమేనా ?
-
దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్
‘‘మన దేశంలో హెల్త్, ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. మన దేహం దేవాలయం లాంటిది. ఇంట్లో చెత్త లేకుండా చూసుకుంటాం. మరి దేహంలో కూడా చెత్త లేకుండా చూసుకోవాలి’’ అని హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. ఫిట్నెస్, యోగా, ఆహారపు అలవాట్లపై రకుల్ మాట్లాడుతూ– ‘‘వ్యాయామం, యోగాను కలిపి చేయడం చాలా మంచిది. వ్యాయామం ఫిట్నెస్ ఇస్తే, యోగా పాజిటివ్ దృక్పథాన్ని కల్పిస్తుంది. నాకు నచ్చిన ఫుడ్‌ని ఫుల్‌గా తింటాను, కానీ యోగా–జిమ్ చేస్తాను. కనీసం రోజుకు 5 నిమిషాలు ఫిట్నెస్, యోగా ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలి. ఒకర్ని చూసి వ్యాయామాలు చేయడం, ఆహారపు అలవాట్లు మార్చుకోవడం చేయొద్దు. మీ శరీరానికి తగ్గదే తినండి, అలాంటి వ్యాయామాలే చేయండి. శరీరం మాత్రమే కాదు.. మనసు కూడా లైట్‌గా ఉండాలి. ఆరోగ్యం కోసం కొంతమంది అదే పనిగా సలాడ్స్ తింటారు. అది మంచిది కాదు. కొన్ని వండుకొని తినాలి. ఇంకా చెప్పాలంటే మన అమ్మమ్మల కాలం నాటి భోజనాలకి వెళ్లిపోవాలి. అదే సరైన పద్ధతి. తాత–అమ్మమ్మల కాలం నాటి వంటకాల వల్ల ఒంట్లో కొవ్వు చేరదు. ఫిట్నెస్ను లైఫ్ స్టయిల్‌గా చూడాలి. అది మన జీవితంలో భాగమైనప్పుడు ఆరోగ్యంగా ఉంటాం’’ అన్నారు. -
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసింది
ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసిందంటూ.. మనం తరచుగా వింటుంటాం. ఇప్పుడు ఈ వార్త చదివితే అది నిజమేననిపిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటిని నడిపే యజమానులు మరో పని దొరక్క దిక్కులేనివారుగా మిగిలిపోయారు. అయితే జపాన్‌కు చెందిన 41 ఏళ్ల మసనోరి సుగిరా మాత్రం కుంగిపోలేదు. హోటల్ బిజినెస్ నిర్వహించే సుగిరా స్వతహాగా మంచి బాడీ బిల్డర్. జపాన్‌లో కరోనా సంక్షోభం కాస్త తగ్గిన తర్వాత తన బుర్రకు పదును పెట్టాడు. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయించే అంశమై పరిశీలించాడు. అనుకుందే తడవుగా సుగిరా బాడీ బిల్డింగ్ చేసే సమయంలో ఫిట్నెస్ సెంటర్లో తనకు పరిచయమైన స్నేహితులకు విషయం చెప్పాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని భావించిన వారు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆ ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. సుగిరా హోటల్ వ్యాపారాన్ని తిరిగి గాడిన పడేలా చేసింది. (చదవండి :నువ్వు నిజంగా దేవుడివి సామి) ఇంతటితో ఇది ఆగిపోలేదు. వ్యపారాన్ని విస్తరించి ఫుడ్ డెలవరీకి మరింత మంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు. ఫుడ్ ఆర్డర్ రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్ ధరించి ఆహారం తీసుకెళ్తారు. వినియోగదారుడికి ఫుడ్ ఇచ్చి, వెంటనే సూట్ విప్పి దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారు. 7వేల యెన్ల ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మాత్రమే దేహదారుడ్య ప్రదర్శన అవకాశం కల్పించాడు. ఇదేదో కొత్తగా ఉందని భావించిన కస్టమర్లు ఈ హోటల్ నుంచే ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్రస్తుత సుగిరా నెలకు 1.5 మిలియన్ యెన్స్ (మన కరెన్సీలో రూ. 10 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.(చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు) This sushi restaurant in Japan is using bodybuilders to deliver food to its customers https://t.co/sm7p9BVG5C pic.twitter.com/sIi5qLLSTj — Reuters (@Reuters) September 5, 2020 -
కండలపై ఇష్టం... కిడ్నీకి కష్టం!
సలీం (పేరు మార్చాం) 24 ఏళ్ల ఈ యువకుడు హైదరాబాద్‌లోని ఒక జిమ్‌లో కోచ్‌గా పనిచేస్తున్నాడు. అథ్లెటిక్ లుక్ కోసం అతను నోటి నుంచి తీసుకునే సహజ సిద్ధమైన ఆహారాన్ని పూర్తిగా మానేశాడు. గ్రోత్ హార్మోన్ ఇంజెక్షన్లు, మల్టీ విటమిన్లు కలిగిన అధిక ప్రోటీన్ తీసుకున్నాడు. మూడు నెలలు గడిచాక అతను పూర్తిగా నీరసించిపోయాడు. పరీక్షలు చేయించగా, కిడ్నీలు ఫెయిల్ అయినట్లు నిర్ధారించారు. శ్రీనివాస్... ఇతనో సాఫ్ట్వేర్ ఇంజనీర్... వయస్సు 50 ఏళ్లు. బరువు తగ్గడం, కండరాలు పెంచడం కోసం ఇతను విచక్షణారహితంగా స్టెరాయిడ్స్ సప్లిమెంట్లు వాడాడు. రెండు నెలల తర్వాత అతను బరువు తగ్గినా, కిడ్నీలు దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. సాక్షి, హైదరాబాద్: సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్, బరువు తగ్గడం... ఇలాంటి లక్ష్యాలతో అనేకమంది యువకులు జిమ్‌లలో చేరుతుంటారు. లక్ష్యం మంచిదే, వాటికోసం ఎక్కువ నెలల సమయం తీసుకోవాలి. కానీ రాత్రికి రాత్రే సిక్స్ ప్యాక్ సాధించాలని, కండలు పెంచాలని, కేజీల కొద్దీ బరువు తగ్గాలని కోరుకుంటున్నారు. దీనికోసం జిమ్‌లలో వ్యాయామాలు చేస్తూ, వైద్యులను సంప్రదించకుండానే ఇష్టారాజ్యంగా స్టెరాయిడ్స్ వాడడం, ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకోవడంతో రోగులుగా మారుతున్నారు. కొందరైతే కిడ్నీలు ఫెయిలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొన్ని జిమ్ సెంటర్లు స్వల్ప సమయంలోనే బరువు తగ్గిస్తామని ప్రకటనలు గుప్పిస్తున్నాయి. మూడు నాలుగు నెలల్లో సిక్స్ ప్యాక్ సాధించేలా శిక్షణ ఇస్తామని చెబుతున్నాయి. దీనికోసం కొన్ని జిమ్ సెంటర్లు ప్రోటీన్ పౌడర్లను, స్టెరాయిడ్స్‌ను అనధికారికంగా అలవాటు చేస్తున్నాయి. 10 మందిలో ఒకరు స్టెరాయిడ్స్ వినియోగం రాష్ట్రంలో జిమ్‌లకు వెళుతున్న ప్రతీ పది మంది లో ఒకరు స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్లు, ప్రొటీన్లు వాడుతున్నారని నెఫ్రాలజిస్టులు అంచనా వేస్తున్నారు. ఇక వెయిట్ లిఫ్టర్లు, బాడీ బిల్డర్లలో 40 శాతం మంది వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారని తేలింది. సహజ సిద్ధంగా చికెన్, మటన్, గుడ్లు వంటి వాటి ద్వారా ప్రొటీన్లు పొందవచ్చు. కానీ చాలామంది అలా చేయడం లేదు. తక్కువ సమయంలో శరీర సౌష్టవాన్ని సాధించాలన్న దురాశతో మోతాదుకు మించి ప్రొటీన్ పౌడర్లు, స్టెరాయిడ్లు వంటి వాటిని వాడుతుండటం వల్లే సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు ఎక్కువసేపు జిమ్‌లో గడిపి శక్తికి మించి బరువులెత్తడం, ఆ తర్వాత ఒళ్లు నొప్పులంటూ పెయిన్ కిల్లర్స్ వాడటం వల్ల కిడ్నీపై ప్రభావం చూపిస్తుందని వైద్యులు అంటున్నారు. అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్స్‌ను తరచుగా బాడీబిల్డర్లు, వెయిట్‌లిఫ్టర్లు ఆహార పదార్ధాలుగా ఉపయోగిస్తున్నారని ‘బీఎంసీ నెఫ్రాలజీ’అనే బ్రిటిష్ జర్నల్ తాజాగా ప్రచురించింది. హైదరాబాద్‌లోని జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 2,400 కేలరీల ఆహారం తీసుకోవాలి. జిమ్‌లకు వెళ్లే వారు ప్రొటీన్ పౌడర్ల ద్వారా రోజుకు 80 నుంచి 100 గ్రాములకు మించి ప్రోటీన్లు తీసుకుంటున్నారు. ఫలితంగా కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయని ఎన్ఐఎన్ వర్గాలు చెబుతున్నాయి. అత్యాశ వల్లే సమస్యలు సిక్స్ ప్యాక్, బాడీ బిల్డింగ్ కోసం అనేక మంది యువకులు జిమ్‌లకు వెళుతున్నారు. వాటిని సాధించాలంటే రెండు మూడేళ్ల సమయం తీసుకోవాలి. క్రమశిక్షణతో ఒక ప్రణాళిక ప్రకారం చేయాలి. కానీ మూడు నెలల్లోనే సాధించాలన్న భావనతో అనేక మంది యువకులు ప్రాణాల మీదకు తెచ్చు కుంటున్నారు. స్టెరాయిడ్స్, ప్రొటీన్లు, పెయిన్ కిల్లర్స్‌ను మోతాదుకు మించి అవగాహనా రాహిత్యంతో వాడుతున్నారు. సాధారణంగా ప్రోటీన్లు చికెన్, మటన్ ద్వారా పొందవచ్చు. కానీ అవసరానికిమించి ప్రొటీన్ పౌడర్లు వా డుతుండటంతో కిడ్నీలపై భారం పడుతుంది. – డాక్టర్ టి.గంగాధర్, నెఫ్రాలజిస్టు, నిమ్స్ న్యూట్రా విజిలెన్స్ లేనేలేదు మార్కెట్లోకి ప్రొటీన్ ప్రొడక్టులు విపరీతంగా వస్తున్నాయి. స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ ఇలా అవసరానికి తగ్గట్లు ఉత్పత్తులు వస్తున్నాయి. వాటిమీద నియంత్రణ లేనేలేదు. పైగా క్లినికల్ టెస్టెడ్ అంటూ వాటిపై ముద్రించుకుంటున్నాయి. అంతేకాదు ఎన్ఐఎన్ రికమండెడ్ అని కూడా కొన్ని వస్తున్నాయి. ఎన్ఐఎన్ ఏ సంస్థకూ రికమండ్ చేయలేదనే విషయం స్పష్టం చేస్తున్నాను. వీటిని వాడడం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి. ప్రోటీన్ ఉత్పత్తులను నియంత్రించేందుకు ‘న్యూట్రా విజిలెన్స్’ అవసరముంది. – డాక్టర్ బి.దినేశ్‌కుమార్, శాస్త్రవేత్త, ఎన్ఐఎన్, హైదరాబాద్ -
మా అమ్మ పులి
పుట్టిన బిడ్డను ఆకాశంలోకి ఎత్తి గర్వంగా ప్రపంచానికిచూపించుకుంటుంది తల్లి.అలాంటప్పుడు..బిడ్డ పుట్టాక, కడుపు మీద పడిన చారలు మాత్రంగర్వకారణం కాకుండా ఎలా ఉంటాయి?!జీవితంలోని కొన్ని మచ్చలు.. ఒక్కోసారి కొన్ని గాయాలు..అవి వదలే గుర్తులు, ఆనవాళ్లు.. గర్వించదగ్గవే అయి ఉంటాయి.ఒక మొటిమ.. ఒక మచ్చ.. ఒక చార..ఏదైనా మన ఆత్మవిశ్వాసానికే ఆనవాలు కావాలి.బిడ్డ పులిబిడ్డ అయితే.. తల్లి మీద ఉన్న చారలు పులిచారలే కదా!అప్పుడు.. ఏ బిడ్డ అనుకోదూ.. ‘మా అమ్మ పులి’ అని! టీన్స్‌లోకి అడుగుపెట్టిన అమ్మాయికి ఉదయం నిద్రలోంచి లేవగానే అద్దం చూసుకోవాలంటే భయం! బుగ్గ మీద కొత్త మొటిమ ముత్యంలా మెరుస్తూ ఎక్కడ కనపడ్తుందోనని!ఇరవై ఏళ్ల అమ్మాయి పార్టీకి రెడీ అయ్యి... విరబోసుకున్న జుట్టుతో చెంపల మీది యాక్నేను దాచేందుకు నానా తంటాలు పడ్తూంటుంది!నెలరోజుల్లో మొహాన్ని తెల్లగా మార్చేసే క్రీమ్‌లతో కుస్తీ పడ్తూంటుంది ఓ నల్ల కలువ!చీర కుచ్చిళ్లు దోపుకుంటున్న ఓ బిడ్డ తల్లికి తన నాభి మీది స్ట్రెచ్ మార్క్స్ నిలువుటద్దంలో ప్రస్ఫుటంగా కనిపించేసరికి ఆందోళన ఆవహించేస్తుంది.మొటిమలు.. యాక్నే.. నలుపు రంగు.. స్ట్రెచ్ మార్క్స్.. ఎట్సెట్రా.. స్త్రీకి అవమానాన్ని, ఆత్మన్యూనతను కలిగించేలా తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మార్కెట్ చేస్తుంటాయి. కాస్మోటిక్స్‌ను ఉత్పత్తి సంస్థలు! ఇది ఎవరికి తెలియని విషయమేమీ కాదు.. ‘కాస్మోటిక్ ఇండస్ట్రీస్ మార్కెటింగ్ కాన్సిపరసీస్లో ఇదీ ఒకటి’ అని! అందుకే..క్రీమ్స్ కన్నా అత్యుత్తమ ప్రొడక్ట్ మన ఆత్మవిశ్వాసమే అని చాటిన మహిళల గురించి తెలుసుకోవాలి. సెల్ఫ్‌కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ కాబట్టి! స్ట్రెచ్ మార్క్స్‌ను పైటతో కప్పేసుకోకుండా.. కుచ్చిళ్లతో దోపేయకుండా.. తన బిడ్డ జ్ఞాపకంగా గర్వంగా భావిస్తూన్న ఓ తల్లిని ఇప్పుడు పరిచయం చేసుకుందాం! తను సాధించిన విజయంతో ఈ స్ట్రెచ్‌మార్క్స్‌ను ప్రైడ్‌గా భావించే క్యాంపెయిన్లాంటిది ఆ మహిళ మొదలుపెట్టారు. ఆమె పేరు మమతా సనత్‌కుమార్. వయసు 27 ఏళ్లు. బెంగళూరు నివాసి. బాడీ బిల్డర్. ఆమెకు అయిదేళ్ల కూతురు. పూర్విక. బాధ్యతల బరువు మమతది సాధారణ మధ్యతరగతి కుటుంబం. భర్త ఉద్యోగి. తను ఇంటి బాధ్యతలు చూసుకునేది. ప్రెగ్నెన్సీ ఆమెను తొంభై కిలోల బరువుకు చేర్చింది. డెలివరీ తర్వాత కూడా తగ్గలేదు. బిడ్డకు మూడో యేడు వచ్చాక.. పాపను నర్సరీలో జాయిన్ చేసి తను జిమ్‌లో చేరింది. ఆ వర్కవుట్స్‌తో 62 కేజీలకు తగ్గింది. అది ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. వర్కవుట్స్‌ను మరింత పెంచింది. ఈ క్రమంలోనే భర్త ఉద్యోగం పోయింది. ఆ కోపం, బాధతో చీటికిమాటికి మమతతో గొడవపడేవాడు. ఇంట్లో అశాంతి బిడ్డ మీద పడకుండా చాలా సహనంగా ఉండేది మమత. తను ఉద్యోగం చేయాలనే నిర్ణయాన్నీ తీసుకుంది. జిమ్‌లో వర్కవుట్లు ఆమెకు కొత్త అవకాశాన్ని చూపించాయి. బాడీబిల్డర్‌గా. కసరత్తు..! బాడీ బిల్డింగ్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది మమత. అయితే ఇంట్లో వాళ్లంతా.. ఆమె తల్లిదండ్రులు సహా మమతను వ్యతిరేకించారు. బయట కూడా సానుకూల వాతావరణమేమీ కనిపించలేదు ఆమెకు. బాడీబిల్డింగ్ పూర్తిగా పురుషుల రంగం అవడం, మమతది గ్రామీణ (బసవపుర గ్రామం) నేపథ్యం కావడం వంటివన్నీ ఆమెకు అడ్డంకులుగానే మారాయి. అయినా పట్టు వీడలేదు. బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరవడం, పాల్గొనడం స్టార్ట్ చేసింది. బాడీ బిల్డర్‌గా తన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేది. దాంతో ఆ ఫోటోలు తీసేయమని ఇంట్లో వాళ్ల దగ్గర్నుంచి ఒత్తిడి, హెచ్చరికలు కూడా! కాని ఆమె సాహసానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు. అడ్మైర్ అవుతూ కామెంట్లు పెట్టేవారు. ‘‘గృహిణి నుంచి బాడీబిల్డింగ్కు మళ్లారు.. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తోందా?’’ అని ప్రశ్నలు. ఇంట్లోవాళ్ల సపోర్ట్ లేకుంటే వచ్చేదాన్నే కాను.. వాళ్లు నాకెప్పుడూ నో చెప్పలేదు’’ అంటూ సమాధానాలు ఇచ్చేది. ఇవన్నీ చదివిన భర్త.. వారించడం మానేశాడు. తల్లిదండ్రులూ మిన్నకుండిపోయారు. అదే ఆమె తొలి గెలుపు అయింది. రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్లింది. బరిలో.. జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఆమెకు స్పాన్సర్స్ దొరకలేదు. అలా అనేకంటే స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు అనడం సబబేమో! ధైర్యం ఆమె గుణం. కాబట్టి బెంబేలెత్తలేదు. సొంతంగా జిమ్ పెట్టుకుంది. ట్రైనర్‌గా కొలువు తీసుకుంది. బాడీబిల్డింగ్‌లో అమ్మాయిలను ట్రైన్ చేయడం మొదలుపెట్టింది. బిడ్డ తల్లులూ రావడం ప్రారంభించారు. అప్పుడే తల్లులు తమ స్ట్రెచ్ మార్క్స్ పట్ల ఇబ్బందిగా ఫీలవడం గమనించింది మమత. ఆ టాబూని తుడిచేయాలనుకుంది. తన బాడీబిల్డింగ్ పోజులను.. స్ట్రెచ్ మార్క్స్ స్పష్టంగా కనపడేలా ఫోటోలు తీసి.. ‘‘స్ట్రెచ్ మార్క్స్.. వట్టి చారలు కావు. ఎక్స్ట్రా స్కిన్ అంతకన్నా కాదు! మనల్ని నిర్వచించే గీతలు! మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపి విజయం వైపు నెట్టే స్ట్రింగ్స్! ఇంత పాజిటివ్‌గా చూడలేకపోతే.. అవి ఏర్పడ్డానికి పడ్డ కష్టాన్ని, వెంట్ త్రూ అయిన వైనాన్ని గుర్తుపెట్టుకుందాం, మనలో భాగంగా సొంతం చేసుకుందాం! వేలాడే చర్మం మీది చారలుగా చూసి కుంగిపోకుండా.. శారీరక ధృడత్వంతో మానసికంగా బలపడి.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడమే! మనల్ని మనం ప్రేమించుకోవాలి.. సొంతం చేసుకోవాలి.. స్ట్రెచ్మార్క్స్తో సహా!’’ అంటూ కామెంట్ రాసి మరీ ఆ ఫోటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ప్రారంభించింది మమత. మజిల్ మామ్..! ఈ పోస్ట్‌లు ఎంత ప్రాచుర్యం పొందాయంటే.. స్ట్రెచ్‌మార్క్స్‌ను ఓన్ చేసుకునే ఓ ప్రచారంలా భావించేంతగా! దాంతో మమతా చాలా ఫేమస్ అయిపోయింది ‘‘మజిల్ మామ్’’గా! ఇప్పటికీ రోజుకు పది గంటలు జిమ్‌లో చెమటోడుస్తుంది. ట్రైన్ అవుతూ.. ట్రైన్ చేస్తూ! గుడ్ న్యూస్ ఏంటంటే.. 2017లో ఆరంభమైన ఆమె ఈ ప్రయాణానికి ఇప్పుడు స్పాన్సరర్స్ వచ్చారు. ఓ పోటీలో.. గెలిచి ట్రోఫీ అందుకుంటున్నప్పుడు.. ఆడియెన్స్‌లోంచి తన అయిదేళ్ల (ఇప్పుడు పూర్విక వయసు) కూతురు ‘‘మమ్మీ.. ’’ అంటూ స్టేజ్ మీదకు వచ్చి ఆమె మెడకు అల్లుకుపోతుంటే ఆడియెన్స్ అంతా ‘‘మజిల్ మామ్ (సంతూర్ మామ్ స్టయిల్లో)’’ అంటూ చప్పట్లు కొట్టారట. ‘‘నా ఇన్సిపిరేషన్, నాకు ప్రేరణ లడ్డూ (కూతురి ముద్దు పేరు)నే. నా తపనంతా నేనూ తనకు ఇన్సిపిరేషన్‌గా నిలబడాలనే. నా ప్రొఫెషన్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాను. ఇంట్లో మాత్రం నా బిడ్డకు బానిసనే. తనే నా బలం.. బలహీనత’’ అంటుంది మమత. ఒక్కో గెలుపుతో ఇంట్లో వాళ్ల పూర్తి సపోర్ట్‌ను సాధించింది. ఇప్పుడు భర్తకూ ఉద్యోగం దొరికింది. ట్రైనింగ్.. పోటీలు.. బిడ్డ పెంపకం.. స్ట్రెచ్ మార్క్స్ క్యాంపెయిన్‌తో క్షణం తీరకలేకుండా సాగిపోతోంది ఈ మజిల్ మామ్. – శరాది -
11 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గురువారం దీనికి సంబంధించి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు షెడ్యూల్ జారీచేసింది. ఈ నెల 11 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. గత డిసెంబర్లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలపై కోర్టులో వ్యాజ్యం దాఖలవ్వడంతో వాయిదా పడుతూ వచ్చింది. నాలుగు రోజుల క్రితం సంబంధిత పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బోర్డు అధికారులు నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. దేహదారుఢ్య పరీక్ష నిర్వహణకు 40 రోజుల పాటు నిర్విరామ షెడ్యూల్ ఉంటుందని, ఈ నెల 11 నుంచి టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపారు. గత షెడ్యూల్లో ఉన్న హైదరాబాద్ గోషామహల్ స్టేడియం, వరంగల్ కాకతీయ వర్సిటీ గ్రౌండ్‌ను ఫిజికల్ టెస్టుల నిర్వహణ జాబితా నుంచి తొలగించామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 3 గ్రౌండ్లు..:ప్రస్తుతం ఫిజికల్ టెస్టులను హైదరాబాద్‌లోని మూడు గ్రౌండ్లు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లోని హెడ్‌క్వార్టర్స్ గ్రౌండులో నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇకపోతే గతంలో డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు కాకుండా మళ్లీ కొత్తగా రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు సంబంధిత అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే 9393711110 లేదా 9391005006 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. అలాగే టupఞౌట్టః్టట pటb. జీn మెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. -
కండలు తిరిగిన కెరీర్
ఇంజనీరో, డాక్టరో అంతకీ కాదంటే ఇంకేదైనా గ్లామర్ రంగాన్నో అమ్మాయిలు ఎంచుకుంటే ముచ్చటపడేవారే. అదే కనుక అమ్మాయి క్రీడల్లో, మరీ ముఖ్యంగా బాడీ బిల్డింగ్ లాంటి కఠినమైన ఏ రంగాన్నో ఎంచుకుంటే ముఖం చిట్లించుకుంటారు. అందుకేనేమో తెలుగు రాష్ట్రాల్లో మహిళా బాడీ బిల్డర్లు దాదాపుగా కనిపించరు. ఈ నేపథ్యంలో వడ్డించిన విస్తరిలాంటి జీవితం ఉన్నా.. వ్యయప్రయాసలను భరిస్తూ బాడీ బిల్డింగ్ రంగాన్ని ఎంచుకున్న కీర్తి చెన్నా (25) ఇటీవలే ‘మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ టైటిల్’ని గెల్చుకున్నారు. జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ మన దగ్గర మహిళా బాడీ బిల్డింగ్‌కు కొత్త ఊపిరి పోస్తున్నారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.... మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్. అమ్మ గృహిణి. నా సోదరి సహా ఫ్యామిలీలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. నేను కాస్మొటాలజీ కోర్సు చేశాను. అయితే ఎవరూ ఎంచుకోని రంగాన్ని ఎంచుకోవాలని దృఢంగా అనిపించింది. అదే సమయంలో జస్ట్ హెల్త్ కోసం జిమ్‌లో చేరాలనుకున్నా. కాని ఏ జిమ్‌లో చూసినా మహిళా ట్రైనర్లు కనిపించలేదు. అంటే.. బాడీ బిల్డింగ్, ఫిట్నెస్ అనేవి పురుషులకు సంబంధించినవిగా మాత్రమే పరిగణన పొందుతున్నాయని అర్థమైంది. అప్పుడే అనుకున్నాను.. నేనెందుకు బాడీ బిల్డర్‌ని కాకూడదని. అలా రెండేళ్ల క్రితం నా ఫిజిక్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంట్లో ఒప్పించడం కష్టమే! నా శరీరాన్ని పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునేందుకు బాడీ బిల్డింగ్‌లోకి వెళదామని నిర్ణయించుకున్నా. అయితే అమ్మానాన్నకు నేను బాడీ బిల్డింగ్‌లోకి వెళ్లడం అంత ఇష్టం లేదు. ఈ రంగంలోకి అమ్మాయిలు వెళ్లడాన్ని కుటుంబం ఇష్టపడటం అనేది అంత సులభ సాధ్యం కాదు. అబ్బాయిల్లా మజిల్ బిల్డ్ అవడం చూసి కంగారు పడటం సహజమే. ఇద్దరం కూతుళ్లమే కాబట్టి నన్ను అబ్బాయిగా అనుకోండి అని చెప్పా. తర్వాత నా పట్టుదల, కొన్ని చాంపియన్‌షిప్స్‌లో గెలవడం... వీటితో ఇంట్లోవాళ్లు కూడా అర్థం చేసుకున్నారు. దీన్నేదో నేను ఆషామాషీగా తీసుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయిలో నన్ను ప్రూవ్ చేసుకుని మా కుటుంబాన్ని మెప్పించాలనుకుంటున్నా. కఠిన శ్రమ...కాస్ట్లీ రొటీన్ అబ్బాయిలకు కాస్త వెయిట్ లిఫ్ట్ చేస్తే మజిల్ వచ్చేస్తుంది. ఈజీగా షేప్ అప్ అవుతుంది. కాని మహిళలకు అలా కాదు. మరోవైపు బాడీ బిల్డింగ్ అంటే వ్యయ ప్రయాసలు ఎక్కువే. మంచి జిమ్‌లో రెండు పూటలా వర్కవుట్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కలిపి రెండు గంటల చొప్పున చేస్తున్నాను. అయితే పోటీల సమయంలో ఈ వ్యవధి మరింత పెరుగుతుంది. ఉదయం 45 నిమిషాలపాటు కార్డియో, సాయంత్రం వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను. జంక్ ఫుడ్ అసలు తినకూడదు. కూరగాయలు, స్టీమ్ ఫుడ్, బాయిల్డ్ చికెన్, సాల్మన్డ్ ఫిష్, ఎగ్‌వైట్స్ తీసుకుంటాను. అమ్మాయిగానే ఉండాలి ఒక అమ్మాయి మాత్రమే మరో అమ్మాయి శారీరక తత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలదు. నాకైతే మహిళల కోసం మహిళల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి జిమ్ ప్రారంభించాలని ఉంది. బాడీ బిల్డింగ్ రంగంలోకి రావాలనుకునే, మంచి ఫిట్నెస్ సాధించాలనుకునే మహిళలకు స్ఫూర్తి కావాలని ఉంది. అమ్మాయిగా మెలితిరిగిన మజిల్‌తో ఉండటం నాకో ప్యాషన్. అదే సమయంలో అమ్మాయికి మాత్రమే స్వంతమైన రూపం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎమ్‌టివి విజె జాకీ నాకు స్ఫూర్తి. కాంపిటీషన్ టైమ్‌లో ఒకలా, మిగిలిన సమయంలో ఒకలా ఫిజిక్‌ని మార్పు చేర్పులు చేసుకుంటూ వెళ్లొచ్చు. ఏదేమైనా... నా విజయాలకు మంచి స్పందన వస్తోంది. మంచి గౌరవం కూడా లభిస్తోంది. ఇటీవలే నాకు స్పాన్సర్ కూడా దొరికారు. ప్రత్యర్థులు అవసరం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రస్తుతం మహిళా బాడీ బిల్డర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. దాదాపుగా ఎవరూ లేరనే చెప్పాలి. అదే ఉత్తరాది రాష్ట్రాలు, బెంగళూర్ నుంచి బాగా ఉన్నారు. మహారాష్ట్రలో అయితే ఇంటింటికీ ఫిమేల్ అథ్లెట్ అన్నట్టు ఉన్నారు. రీజనల్గా నాకు సరైన ప్రత్యర్థులు లేకపోవడం ఒకింత నిరుత్సాహానికి గురి చేస్తోంది. త్వరలో మహారాష్ట్రలో జరుగనున్న పోటీల్లో పార్టిసిపేట్ చేయనున్నాను మరిన్ని అంతర్జాతీయ పోటీలకు సిద్ధమవుతున్నాను’’ అంటూ వివరించారు కీర్తి. – ఎస్.సత్యబాబు -
మిస్టర్ కేరళ
బాడీ బిల్డింగ్, మజిల్ టోనింగ్, వెయిట్ ట్రైనింగ్... ఇవన్నీ మగవాళ్లకు పరిమితమైన కీర్తి కిరీటాలుగానే ఉండేవి డెబ్భైలలో. వీటన్నిటి మీదా ‘పురుషులకు మాత్రమే’ అనే కనిపించని రాజముద్ర ఒకటి ఉండేది. క్రమంగా ఒక్కో ముద్రా చెరిగిపోతోంది. ఈ కేరళ అమ్మాయి కూడా అలాంటి ఒక ముద్రను చెరిపేసింది. ‘మిస్టర్ కేరళ’ పురస్కారాన్ని అందుకుంది! మజీజియా భానుకి 23 ఏళ్లు. కోళికోడ్ జిల్లా, ఓర్కాట్టెరి గ్రామంలో ఉంటుంది వీళ్ల కుటుంబం. డెంటల్ కోర్సులో అండర్ గ్రాడ్యుయేషన్ చేసింది భాను. కుటుంబంలో ఎవరూ బాడీ బిల్డర్లు లేరు. ‘జస్ట్ ఆసక్తి కలిగింది, పేరెంట్స్ గో ఎహెడ్’ అన్నారు. టైటిల్ గెలుచుకున్నాను’ అని నవ్వుతూ అంటోంది భాను. కోచ్ దగ్గర శిక్షణ ఏమీ తీసుకోకుండానే గత ఏడాది జిల్లా స్థాయి పోటీల్లో గెలిచింది. రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధమయ్యే క్రమంలో కోచ్ దగ్గర మెళకువలు నేర్చుకుంది. అయితే ఆమె రాష్ట్రస్థాయి చాంపియన్ షిప్‌తో ఆగిపోవడం లేదు. ‘‘జాతీయ స్థాయి పోటీలకూ సిద్ధమే’’ అంటోంది. పవర్ లిఫ్టింగ్ పోటీలలో కూడా భానుకు అనేక అవార్డులు వచ్చాయి. పోటీల కోసం ఇస్లాం సంప్రదాయాన్ని తానేమీ ధిక్కరించడం లేదని, మత విశ్వాసాలను గౌరవిస్తూ ఒంటి నిండా దుస్తులు ధరిస్తున్నాననీ కూడా చెబుతోంది మజీజియా భాను. అయితే, మహిళా విజేతకు ‘మిస్టర్ కేరళ’ అనే టైటిల్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమెన్ కేటగిరీ బాడీ బిల్డింగ్ పోటీలలో గెలిచిన మహిళకు.. ‘మిస్టర్ కేరళ’ అనే టైటిల్‌ని ఇవ్వడం మహిళలను కించపరచడమేనని స్త్రీవాదులు కొందరు అంటున్నారు. ‘‘బాడీ బిల్డింగ్ పోటీల కోసంనేనేమీ ఇస్లాం సంప్రదాయాలను ధిక్కరించడం లేదు. మత విశ్వాసాలను గౌరవిస్తూ, ఒంటి నిండా దుస్తులు ««ధరించి మాత్రమే బరిలోకి దిగుతున్నాను’’ అంటోంది మజీజియా భాను. – మంజీర -
జిమ్‌జిమ్ జిగాజిగా
బాడీ బిల్డింగ్‌పై ఆసక్తి చూపుతున్న యువత మహిళలు, పెద్దవాళ్లు సైతం వ్యాయామంపై శ్రద్ధ జిల్లాలో పెరుగుతున్న జిమ్‌ల సంఖ్య నేటి ఉరుకుల పరుగుల జీవితంలో తిన్నది ఒంట బట్టాలన్నా.. ఒంట బట్టింది.. కండగ మారాలన్న జిమ్‌కు వెళ్లాలి. గంటల తరబడి కసరత్తులు చేస్తూ చెమటలు చిందించాలి. అప్పుడే ఆరోగ్యానికి ఆరోగ్యం.. కండకు కండ.. అందుకే ఏనాడో ఓ మహాకవి అన్నాడు.. ’తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడేను మనిషోయ్..’ అని.. భీమవరం జిల్లా వ్యాప్తంగా దేహదారుఢ్యం, ఆరోగ్య రక్షణపై ఇటీవల అన్నివర్గాల ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. నియమిత ఆహారం భుజిస్తూ వాకింగ్, రన్నింగ్, షటిల్ ప్రాక్టీసు వంటి వాటితో పాటు అనేక మంది జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. మరికొంతమంది యువకులు దేహదారుఢ్యాన్ని పెంచుకుని ఉద్యోగావకాశాల కోసం బాడీబిల్డింగ్‌లో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిజికల్ ఫిటినెస్, ఫిటినెస్ మోడలింగ్ కోసం ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లోనూ జిమ్‌ల నిర్వహణ పెరుగుతోంది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఇటీవల కాలంలో మహిళలు కూడా జిమ్ గుమ్మం తొక్కుతున్నారంటే వీటి ప్రాధాన్యం అర్థం చేసుకోవచ్చు. మహిళలు ఊబకాయం తగ్గడానికి, ప్రసవానంతరం ఉదరభాగం తగ్గించుకోవడానికి, కండరాలు గట్టిపడడానికి జిమ్‌ల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లాలో 50 వరకు జిమ్‌లు జిల్లావ్యాప్తంగా ఏలూరు నగరంలో దాదాపు 15 జిమ్‌లు నిర్వహిస్తుంటే భీమవరంలో 7, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, ఆకివీడు, తణుకు, పట్టణాల్లో రెండేసి జిమ్‌లు, ఉండి, వీరవాసరం, పెన్నాడ, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. 80 మంది బాడీబిల్డర్లు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 80 మంది బాడీబిల్డర్లు ఉన్నారు. వీరంతా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించి తమ సత్తాచాటారు. వీరిలో 30 మంది బాడీ బిల్డర్లు భీమవరం పట్టణంలో షేక్ ఖాశీం నిర్వహిస్తోన్న అలర్ట్ జిమ్‌లో శిక్షణ పొందుతున్నవారే కావడం విశేషం. వీరిలో ఎక్కువ మంది బాడీబిల్డింగ్‌పై ఉన్న మక్కువతో ప్రత్యేక శిక్షణ పొందుతుండగా మరికొంతమంది ఉద్యోగాల్లో బాడీబిల్డర్స్కు ప్రత్యేకంగా రెండు శాతం రిజర్వేషన్లు కేటాయించడంతో నిరుద్యోగులు బాడీబిల్డింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహించి పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వడం విశేషం. ప్రత్యేక పోషకాహారం తప్పనిసరి బాడీబిల్డింగ్‌లో పోటీలంటే మామూలు విషయం కాదు. దీనిలో శిక్షణ పొందేవారు ప్రత్యేక పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో కూడినదైనా కొంతమంది యువకులు తల్లిదండ్రులపై ఆధారపడకుండా ఎక్కడో ఒక చోట పనిచేసుకుంటూ దానిపై వచ్చే ఆదాయంతో ఆహారానికి ఖర్చు చేస్తున్నారు. ప్రధానంగా బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరయ్యేవారు పోటీలకు ముందుగా రోజుకు 20 కోడి గుడ్లు, అర లీటరు పాలు, అరకిలో చికెన్ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. ఫిట్నెస్ కోసమైతే రోజుకు నాలుగు గుడ్లు, గ్లాసు పాలు, డ్రైప్రూట్స్, చిలకడదుంపలు, సోయాబీన్స్, శెనగలు, పెసలు, బొబ్బర్లు, ఉడకబెట్టిన చికెన్, మొలకెత్తిన విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి. ప్రత్యేక ఆహారానికి రోజుకు రూ.200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి ఆసక్తి బాడీ బిల్డింగ్ వైపు మళ్లడానికి నా తండ్రి షేక్ మీరా సాహెబ్ స్ఫూర్తి. నా చిన్నతనంలో ఆయన ఎక్సెర్సైజ్లు చేస్తుండగా చూస్తూ స్ఫూర్తిని పొందా. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో మిస్టర్ ఆంధ్రా కైవసం చేసుకున్నా. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఆలిండియా బాడీ బాల్డింగ్ పోటీల్లో బెస్ట్ ఆఫ్ సిక్స్‌లో స్థానాన్ని సొంతం చేసుకున్నా. మిస్టర్ ఆంధ్రా టైటిల్ నాలుగు పర్యాయాలు గెలుచుకున్నా. బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ పోటీల్లో జడ్జిగా వ్యవహరించా. ప్రస్తుతం ఆంధ్రా బాడీ బిల్డింగ్ అసోసియేషన్‌కు జాయింట్ సెక్రటరీగా, జిల్లా కార్యదర్శిగాను కొనసాగుతున్నాను. బాడీబిల్డింగ్‌లో మరింత మందిని తీర్చిదిద్దాలనే జిమ్ నిర్వహిస్తున్నా. : షేక్ ఖాసీం, అలర్ట్ జిమ్ నిర్వాహకుడు, భీమవరం హోటల్లో పనిచేస్తూ శిక్షణ నేýను పదో తరగతి వరకు చదువుకున్నా. ఐదేళ్లుగా జిమ్‌లో శిక్షణ పొందుతున్నా. ప్రస్తుతం ఒక హోటల్లో పనిచేస్తూ ఖాళీ సమయంలో శిక్షణ పొంది బాడీ బిల్డింగ్ పోటీల్లో మిస్టర్ ఆంధ్ర వంటి టైటిళ్లు సాధించాను. : ముడి చిన్నా, భీమవరం ఐదుసార్లు ప్రథమస్థానంలో నిలిచా ఎనిమిదేళ్ల క్రితం ఒరిస్సా నుంచి జీవనోపాధి కోసం ఇక్కడికి వచ్చా. ఒక హోటల్లో చెప్గా పనిచేస్తూ బాడీబిల్డింగ్‌లో శిక్షణ పొందుతున్నా. 85 కిలోల విభాగంలో ఏలూరు, భీమవరం, పాలకొల్లులో నిర్వహించిన పోటీల్లో ఐదు సార్లు జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచా. ఎండీ సలీమ్, ఒడిశా బాడీబిల్డింగ్ అంటే ఎంతో ఇష్టం బాడీబిల్డింగ్ అంటే ఎంతో ఇష్టం. గత ఏడాదిగా అలర్ట్ జిమ్‌లో శిక్షణ పొందుతున్నా. కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ను ఆదర్శంగా తీసుకుని కండలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నా. విజయవాడ, భీమవరం జరిగిన పోటీల్లో బహుమతులు పొందా. రియాజ్ ఉద్దీన్ ఆహ్మద్, భీమవరం ఉద్యోగం సంపాదించడమే లక్ష్యం పదో తరతగతి వరకు చదువుకున్నా. ఆర్థిక స్థోమత లేక చదువును కొనసాగించలేకపోయా. బాడీ బిల్డింగ్ ద్వారా రిజర్వేషన్ ఖాతాలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంలో జిమ్‌లో చేరా. ప్రస్తుతం కారు డ్రైవర్‌గా పనిచేస్తూ వస్తోన్న సొమ్ముతో బాడీబిల్డింగ్ కోసం రోజుకు రూ.100 ఖర్చు చేస్తున్నా. : కె.సతీష్, మహాదేవపట్నం -
ఉత్సాహంగా బాడీబిల్డింగ్ పోటీలు
బాలాజీచెరువు (కాకినాడ) : స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలో సోమవారం బాడీబిల్డింగ్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ‘మిస్టర్ కాకినాడ’ పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పలువురు యువకులు పాల్గొని, తమ శరీర దారుఢ్యాన్ని ప్రదర్శించారు. విజేతకు రూ.5 వేల ప్రైజ్‌మనీ, ప్రసంసాపత్రం అందజేస్తామని నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సన్యాసినాయుడు తెలిపారు. -
నంద్యాలవాసికి ఏపీ చాంపియన్‌షిప్
- భీమవరంలో శరీర సౌష్టవ పోటీలు - నాల్గు విభాగాల్లో నంద్యాల వాసుల ప్రతిభ కర్నూలు (టౌన్) : రాష్ట్రస్థాయి బహిరంగ శరీర సౌష్టవ పోటీల్లో నంద్యాలకు చెందిన సుధీర్ (బంగారు పతకం ) ఏపీ చాంపియన్‌గా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ బాడి బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వతేదీన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్ కార్యదర్శి వెంకటేష్ సోమవారం విలేకరులకు తెలిపారు. 65 కేజీల విభాగంలో సుధీర్ చాంపియన్‌గా నిలిచాడన్నారు. అలాగే నంద్యాలకే చెందిన సురేష్, ఫయాజ్, కరీముల్లా వరుసగా 75 కేజీలు, 85 కేజీలు, 90 కేజీల విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారన్నారు. -
కండల రాణి
భారతదేశం పెద్ద పెద్ద బాడీబిల్డర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కాని మహిళా బాడీబిల్డర్లు అప్పట్లో లేరు. అయితే, ఇప్పుడు మహిళల బాడీబిల్డింగ్‌లో రైజింగ్‌స్టార్ ఆవిర్భవించారు. ఆమే నగరవాసి కిరణ్ డెంబ్లా. ఇటీవల హంగేరిలో జరిగిన ప్రపంచ మహిళల బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో 6వ స్థానాన్ని కైవసం చేసుకుని మనదేశంలోనూ మహిళా బాడీబిల్టర్లు ఉన్నారని చాటిచెప్పారు ఈ ఇద్దరు పిల్లల తల్లి. కండలక్వీన్గా మారి నగరంలో ఫిట్నెస్ ప్రపంచానికి సరికొత్త దారులు తెరిచారు. కేవలం మగవారే కాదు మగువలు కూడా ఫిట్నెస్ పరంగా అద్భుతాలు సృష్టించగలరని నిరూపించడంతోపాటు రకరకాల కారణాలతో వ్యాయామానికి దూరమవుతున్న మహిళల్లో చైతన్యం తేవాలనేదే తన ప్రయత్నం అంటారు కిరణ్. యోగా కావచ్చు.. జాగింగ్ కావచ్చు.. ఏరోబిక్స్ కావచ్చు.. ఏదైనా సరే మహిళ తలచుకుంటే అగ్రస్థానంలో నిలవగలదని పేర్కొన్నారామె. -
డోపీలు @ 500
న్యూఢిల్లీ: భారత్‌లో డోపింగ్‌కు పాల్పడుతున్న క్రీడాకారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ఈ సంఖ్య 500కు చేరడమే దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇందులో ఎక్కువగా వెయిట్‌లిఫ్టర్లు, ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఉన్నట్టు జాతీయ డోపింగ్ నిరోధక ఏజెన్సీ (నాడా) పేర్కొంది. ఈ రెండు క్రీడాంశాల తర్వాత కబడ్డీ (58), బాడీబిల్డింగ్ (51), పవర్‌లిఫ్టింగ్ (42), రెజ్లింగ్ (41), బాక్సింగ్ (36), జూడో (9)లలో డోపీలు ఉన్నారు. 2009 జనవరి నుంచి జూలై 2013 వరకు 500 మంది అథ్లెట్లు యాంటీ డోపింగ్ నిబంధనలను అతిక్రమించగా వీరిలో 423 మందిపై డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ తగిన చర్యలు తీసుకుంది. ఆర్టీఐ చట్టం కింద నాడా ఈ విషయాలను వెల్లడించింది. డోపింగ్ మోసాలకు పాల్పడుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య తెలిపింది. జూలై వరకు 52 మంది అథ్లెట్స్ సస్పెన్షన్‌తో భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ వీరిలో తొమ్మిది మందిపై నిషేధం ఎత్తివేయడంతో రెండో స్థానంలో ఉంది.