కొన్నిసార్లు ఎలాంటి వ్యాయామాలు చేసినా.. మంచి ఫలితం ఉండదు. శారీరక శ్రమ తప్ప పడుతున్న కష్టమంతా వృధా అనిపిస్తుంది. అలాంటి వాళ్ల కోసం ఈ మూడు వ్యాయమాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. చాలా సులభంగా బరువు తగ్గుతారు. అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం తోపాటు మంచి ఫిట్‌నెస్‌గా ఉంటారు అంటున్నారు ఫిట్‌నెస్ ట్రైనర్ అలీ కబ్బా. ఇంతకీ ఏంటా ఆ వ్యాయామాలు అంటే..
ఈ మూడు వ్యాయమాలు జస్ట్ 20 నిమిషాలు కనీసం కొన్ని పర్యాయాలు చొప్పున చేస్తే చాలు చక్కటి ఫలితం చాలా త్వరిగతగతిన కనిపిస్తుంది. దీనికి కావల్సిందల్లా కెటిల్‌బెల్స్, రోయింగ్ మెషిన్ ఉంటే చాలు.
ఎలా చెయ్యాలంటే..?
- ముందుగా రోయింగ్ మెషిన్ పై మీరు కూర్చొని ముందుకు వెనక్కు రోప్‌ని పట్టుకుని వెళ్తుంటే అది మీ కండరాలను ఫిట్‌గా ఉంచడానికి ఉపయోగపడటమే గాక కాళ్లకి చేతులకి మంచి వ్యాయామంగా ఉంటుంది. మొత్తం బాడీ అంతా కదలుతుంది కాబట్టి కేలరీలు కూడా స్పీడ్‌గా తగ్గుతాయి. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. కాళ్లు, చేతులు, భుజాలు బలోపేతం అవుతాయి.
- ఇక రెండోది కెటిల్ బాల్స్‌తో పుష్ అప్‌లు బాడీ ఫ్లాట్‌గా ఉండేలా చేస్తుంది. బెల్లీ ఫ్యాట్ కరిగి పొట్ట ఫ్లాట్‌గా ఉంటుంది. బాడీ మొత్తం బ్యాలెన్సింగ్ చేసే వ్యాయామం కాబట్టి తొందరగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది. ఒక వేళ కెటిల్ బాల్స్‌తో చేయడం కష్టమైతే అవి లేకుండా ఒట్టిగా నేలపైనే అయినా ట్రై చేయండి సరిపోతుంది.
- తదుపరి ఈ కెటిల్ బాల్స్‌ని పట్టుకుని పైకిలేపి వదలడం. దీనికి ముందుగా నుంచొని ముందుకు వంగి కాళ్లని ఏ మాత్రం వంచకుండా ఆ బాల్స్‌ని కింద నుంచి పైకి తీయడం, దించడం ఇలా ఓ 5 నిమిషాలు చేస్తే..భుజాలు, నడుం మంచిగా బలోపేతం అవుతాయి. మీ కటి భాగంలో కొవ్వు కరిగి తొడలు సన్నబడతాయి. ఈ మూడింటిని క్రమం తప్పకుండా కనీసం ఓ 20 నిమిషాలు చేస్తే ఫిట్‌గా ఉండటమే గాక బరువు తగ్గి నాజూగ్గా ఉండటం పక్కా అని చెబుతున్నారు బాడీ ట్రైయినర్ అలీ కబ్బా.
(చదవండి: చపాతీలు డయాబెటిక్ రోగులకు మేలు! వెలుగులోకి షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment