సామాన్యంగా జనాలకు ముఖ్యంగా సెలబ్రిటీలకు వృద్ధాప్యం అంటే చాలా భయం. వయసు మీదపడుతున్న కొద్ది.. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్, ఎక్సర్‌సైజ్, సర్జరీలు, స్టెరాయిడ్స్ వాడటం వంటివి చేస్తుంటారు. ఎన్ని చేసినా ఓ వయసు వచ్చే వరకు మాత్రమే. ఆ తర్వాత ఆటోమెటిగ్గా మనకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కానీ కొందరు మాత్రం వ్యాయమాన్ని తమ జీవితంలో భాగం చేసుకుంటారు. ఏళ్ల తరబడి దాన్ని అలానే కొనసాగిస్తారు. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే ఇది చదవాల్సిందే.
తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో తెగ వైరలవుతోంది. ఇది చూసిన జనాలు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఇదేలా సాధ్యం అయ్యింది అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకునేముందు ఓ సారి పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా పరిశీలించండి. అతడిని చూడగానే మంచి బాడీబిల్డర్‌లా ఉన్నాడు.. ఏవైనా పోటీలకు సిద్ధం అవుతున్నాడేమో అనిపిస్తుంది. వయసు అంటే మహా అయితే 30-35 మధ్యన ఉంటుంది అనిపిస్తుంది కదా.
(చదవండి: Science Facts: ఎక్సర్‌సైజ్ చేస్తే దేహాకృతి మారుతుందా? ఎంతవరకు నిజం..)
అదుగో అక్కడే మీరు తప్పులో కాలేశారు. అతడి అసలు వయసు తెలిస్తే మీరు ఓ నిమిషం పాటు షాక్‌కు గురవుతారు. ఎందుకంటే అతడు 72 ఏళ్ల వ్యక్తి. కానీ చూడ్డానికి మాత్రం 30 ఏళ్ల పడుచు కుర్రాడిలా ఉన్నాడు. వామ్మో ఫించను తీసుకోవాల్సిన వయసులో ఈ బాడీ బిల్డింగ్ ఏంట్రా సామీ అనిపిస్తుంది కదా.
ఫోటోలోని వ్యక్తి పేరు జిన్మిన్ యాంగ్. గత 30 ఏళ్ల నుంచి క్రమం బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. 2019లో ఇతడికి సంబంధించిన ఓ వీడియో కూడా తెగ వైరలయ్యింది. దానిలో అతడు తన వయసు 30 సంవత్సరాలు అని చెప్తే జనాలు ఈజీగా నమ్మేశారు. మరి జిన్మిన్ ఇంత యవ్వనంగా కనిపించడానికి ఏం చేస్తున్నాడంటే..
(చదవండి: దేహంలో చెత్త లేకుండా చూసుకోవాలి: రకుల్)
జిన్మిన్ గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు.. మంచి జీవన విధానాలు పాటిస్తాడు. బాడీబిల్డింగ్ కోసం ప్రతి రోజు 6-8 గుడ్లు, దోసకాయలు, చికెన్, టమాటాలు, ఓట్‌మీల్ తీసుకుంటాడు. ఇతడి ఫిట్‌నెస్‌కి ఇటు సామాన్యులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫిదా అయ్యాయి. తమ ఉత్పత్తులకు అతడిని ప్రచారకర్తగా నియమించుకుంటున్నారు.
చదవండి: డాక్టర్లు హెచ్చరించినా సిద్ధార్థ్ శుక్లా పట్టించుకోలేదా?
Comments
Please login to add a commentAdd a comment