ఒక ఐడియా అతని జీవితాన్ని మార్చేసిందంటూ.. మనం తరచుగా వింటుంటాం. ఇప్పుడు ఈ వార్త చదివితే అది నిజమేననిపిస్తుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. వాటిని నడిపే యజమానులు మరో పని దొరక్క దిక్కులేనివారుగా మిగిలిపోయారు. అయితే జపాన్‌కు చెందిన 41 ఏళ్ల మసనోరి సుగిరా మాత్రం కుంగిపోలేదు. హోటల్ బిజినెస్ నిర్వహించే సుగిరా స్వతహాగా మంచి బాడీ బిల్డర్. జపాన్‌లో కరోనా సంక్షోభం కాస్త తగ్గిన తర్వాత తన బుర్రకు పదును పెట్టాడు.
బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయించే అంశమై పరిశీలించాడు. అనుకుందే తడవుగా సుగిరా బాడీ బిల్డింగ్ చేసే సమయంలో ఫిట్‌నెస్ సెంటర్‌లో తనకు పరిచయమైన స్నేహితులకు విషయం చెప్పాడు. స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడని భావించిన వారు ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆ ఒక్క ఐడియా అతని జీవితాన్నే మార్చేసింది. బాడీ బిల్డర్స్‌తో ఫుడ్ డెలివరీ చేయిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంది. సుగిరా హోటల్ వ్యాపారాన్ని తిరిగి గాడిన పడేలా చేసింది. (చదవండి :నువ్వు నిజంగా దేవుడివి సామి)
ఇంతటితో ఇది ఆగిపోలేదు. వ్యపారాన్ని విస్తరించి ఫుడ్ డెలవరీకి మరింత మంది బాడీ బిల్డర్లను పనిలో పెట్టుకున్నాడు. ఫుడ్ ఆర్డర్ రాగానే ఈ బాడీబిల్డర్లు సూట్ ధరించి ఆహారం తీసుకెళ్తారు. వినియోగదారుడికి ఫుడ్ ఇచ్చి, వెంటనే సూట్ విప్పి దేహదారుఢ్య ప్రదర్శన చేస్తారు. 7వేల యెన్‌ల ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు మాత్రమే దేహదారుడ్య ప్రదర్శన అవకాశం కల్పించాడు. ఇదేదో కొత్తగా ఉందని భావించిన కస్టమర్లు ఈ హోటల్ నుంచే ఎక్కువగా ఆర్డర్స్ ఇస్తున్నారు. ప్రస్తుత సుగిరా నెలకు 1.5 మిలియన్ యెన్స్ (మన కరెన్సీలో రూ. 10 లక్షలకు పైగా) సంపాదిస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.(చదవండి : అద్భుతం.. బ్లాక్ పాంథర్‌ను దించేశాడు)
This sushi restaurant in Japan is using bodybuilders to deliver food to its customers https://t.co/sm7p9BVG5C pic.twitter.com/sIi5qLLSTj
— Reuters (@Reuters) September 5, 2020
Comments
Please login to add a commentAdd a comment