Japanese Company Created Detailed Wireframe Car, Is It Real Or Fake? - Sakshi
Sakshi News home page

Wireframe Car Real Or Fake: వైరల్‌గా మారిన వెరైటీ కారు.. గ్రాఫిక్స్‌ కాదు, నిజమేనట

Published Wed, Jul 19 2023 11:44 AM | Last Updated on Wed, Jul 19 2023 12:51 PM

Japanese Company Creates Wireframe Car But Its Real - Sakshi

చల్‌నేకీ నహీ హై యే గాడీ... వైరింగ్‌తో ఉన్న బాడీ.. వేగంలో చేయదు దాడి.. వేడెక్కి ఆగదు ఓడి..! మరైతే ఈ ఫొటోలో కనిపిస్తున్నదేంటీ? కారే! కానీ రోడ్డు మీదకొచ్చి షికారు చేయదు. ఆగ్మెంటెడ్‌ రియాలిటీగా కనిపించే వాహనం. వైర్‌తో ఫ్రేమ్‌ చేసిన ఈ కారు ‘యమగుచి సీసాకుషో’ అనే జపాన్‌ కంపెనీ సృష్టి. తమ కంపెనీ సామర్థ్యాన్ని, సాంకేతికతను జగమంతటికీ తెలియజేయాలని ఈ కారును తయారుచేసింది.

మొదట ఒక కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి.. లేజర్‌ కట్టర్‌ల సాయంతో ప్రత్యేకమైన మెటల్‌ షీట్‌లను తయారు చేశారు. ఆ షీట్‌లను చిన్న చిన్న కడ్డీలుగా కత్తిరించి, వాటి చుట్టూ మెటల్‌ వైర్లతో ఫినిషింగ్‌ ఇచ్చారు. తర్వాత వాటన్నింటినీ కారు డిజైన్‌ ఆధారంగా వెల్డింగ్‌ చేశారు.

అలా 2016లో మొదలైన ఈ కారు తయారీ ఇప్పటికి పూర్తయింది. దీని ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో.. వైరల్‌ అయింది. పలు ప్రముఖ టీవీ చానళ్లలో ఈ కారు గురించి ప్రత్యేక కథనాలను ప్రసారం చేస్తున్నా .. ఇప్పటికీ చాలామంది ఇది నిజమైన కారు కాదు, గ్రాఫిక్స్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement