Shocking: Human Sweat Infused Rice Balls In The Armpits Of Cute Japanese Girls At High Price | Sakshi
Sakshi News home page

ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం

May 3 2024 10:33 AM | Updated on May 3 2024 11:11 AM

Human sweat infused rice balls in the armpits of cute Japanese girls at high price

అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో రైస్ బాల్స్ డిష్

ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్న జపనీస్ స్నాక్

సాధారణ రైస్ బాల్స్ కంటే 10 రెట్లు ఎక్కువకు అమ్ముతున్న వైనం

ఆరోగ్యానికి మంచిదంటూ  పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్‌.  జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్‌ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్‌గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి  జనం. అసలు స్టోరీ ఏంటంటే..

ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం  ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా.  ఇంతకీ ఈ  స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.

జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్‌ బాల్‌ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే  లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. 

ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్‌పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్‌లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్‌ఫోక్షన్స్‌ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్‌ట్‌తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్‌పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.

ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోందీరైస్‌ బాల్‌! కొందరు పాజిటివ్‌గా కమెంట్‌ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు.  మొత్తం మీద రైస్‌బాల్‌ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.

కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్‌ అంటే  ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్  కథనం ప్రకారం  చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement