కబాబ్..ప్రస్తుత కాలంలో ఆహార ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం. వెజ్, నాన్‌వెజ్, అనేక రకాలుగా కబాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచ కబాబ్ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..
ప్రపంచ కబాబ్ దినోత్సవం 2024: కబాబ్ డే అనేది కబాబ్‌ల రుచికరమైన సంప్రదాయాన్ని గౌరవించడానికి జూలై రెండవ శుక్రవారం ప్రపంచ కబాబ్ డే జరుపుకుంటారు. అరబిక్ పదం ‘కబాబ్’ అంటే ‘కాల్చినది’ లేదా ‘వేయించినది’ అని అర్థం. కబాబ్‌లు మధ్ యప్రాచ్యం, మధ్యధరా దక్షిణాసియా వంటకాలలో ఇది చాలా పాపులర్. ఆ తరువాత ఇది భారతదేశం, టర్కీ ,పర్షియాలో ప్రసిద్ధి చెందింది.
నాన్-వెజ్ కబాబ్స్‌ను చికెన్, మటన్, తదితర మాంసాన్ని కొన్ని గంటలపాటు వివిధ రకాలైన మసాలా దినుసులలో మెరినేట్ చేసిన తర్వాత స్కేవర్లపై నిప్పు మీద కాల్చి స్మోకీ ఫ్లేవర్లతో తయారు చేస్తారు. శాకాహారులు సోయాబీన్ కబాబ్‌లు లేదా పనీర్, తదితర కబాబ్‌లను తయారు చేసుకోవచ్చు
పాపులర్ కబాబ్స్
అత్యంత ప్రసిద్ధ కబాబ్‌లలో టర్కీకి చెందిన డోనర్ కబాబ్ ఒకటి. భారతదేశానికి గలౌటీ కబాబ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 'గలూటి' అంటే నోటిలో కరిగిపోయేది అని అర్థం. 17వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్‌లో న ఔద్ నవాబ్ వజీర్ మీర్జా అసద్-ఉద్-దౌలా కోసం దీన్ని తయారు చేశారట. నవాబుకు వయసు పెరిగేకొద్దీ, పళ్ళు రాలడం ప్రారంభించడంతో, ఇష్టమైన రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదించేందుకు దీన్ని కనిపెట్టారు. మరో ప్రసిద్ధ కబాబ్ రకంలెబనాన్‌కు చెందిన షవర్మా, అలాగే పాకిస్తాన్ నుండి సీక్ కబాబ్ ఇతర పాపులర్ కబాబ్స్.
Comments
Please login to add a commentAdd a comment