kabab special
-
World Kebab Day 2024 నోరూరించే కబాబ్స్ , స్మోకీ , జ్యూసీ.. వీటికథ పెద్దదే!
కబాబ్..ప్రస్తుత కాలంలో ఆహార ప్రియులకు పరిచయం అవసరం లేని వంటకం. వెజ్, నాన్‌వెజ్, అనేక రకాలుగా కబాబ్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ప్రియుల హృదయాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. ప్రపంచ కబాబ్ దినోత్సవం సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..ప్రపంచ కబాబ్ దినోత్సవం 2024: కబాబ్ డే అనేది కబాబ్‌ల రుచికరమైన సంప్రదాయాన్ని గౌరవించడానికి జూలై రెండవ శుక్రవారం ప్రపంచ కబాబ్ డే జరుపుకుంటారు. అరబిక్ పదం ‘కబాబ్’ అంటే ‘కాల్చినది’ లేదా ‘వేయించినది’ అని అర్థం. కబాబ్‌లు మధ్ యప్రాచ్యం, మధ్యధరా దక్షిణాసియా వంటకాలలో ఇది చాలా పాపులర్. ఆ తరువాత ఇది భారతదేశం, టర్కీ ,పర్షియాలో ప్రసిద్ధి చెందింది.నాన్-వెజ్ కబాబ్స్‌ను చికెన్, మటన్, తదితర మాంసాన్ని కొన్ని గంటలపాటు వివిధ రకాలైన మసాలా దినుసులలో మెరినేట్ చేసిన తర్వాత స్కేవర్లపై నిప్పు మీద కాల్చి స్మోకీ ఫ్లేవర్లతో తయారు చేస్తారు. శాకాహారులు సోయాబీన్ కబాబ్‌లు లేదా పనీర్, తదితర కబాబ్‌లను తయారు చేసుకోవచ్చుపాపులర్ కబాబ్స్ అత్యంత ప్రసిద్ధ కబాబ్‌లలో టర్కీకి చెందిన డోనర్ కబాబ్ ఒకటి. భారతదేశానికి గలౌటీ కబాబ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 'గలూటి' అంటే నోటిలో కరిగిపోయేది అని అర్థం. 17వ శతాబ్దంలో ఉత్తరప్రదేశ్‌లో న ఔద్ నవాబ్ వజీర్ మీర్జా అసద్-ఉద్-దౌలా కోసం దీన్ని తయారు చేశారట. నవాబుకు వయసు పెరిగేకొద్దీ, పళ్ళు రాలడం ప్రారంభించడంతో, ఇష్టమైన రుచికరమైన పదార్థాన్ని ఆస్వాదించేందుకు దీన్ని కనిపెట్టారు. మరో ప్రసిద్ధ కబాబ్ రకంలెబనాన్కు చెందిన షవర్మా, అలాగే పాకిస్తాన్ నుండి సీక్ కబాబ్ ఇతర పాపులర్ కబాబ్స్. -
యువకుల వీరంగం.. కబాబ్‌లో చికెన్ ముక్క తక్కువొచ్చిందని!
సాక్షి, బెంగళూరు: చికెన్ కబాబ్‌లో ఒక ముక్క తక్కువ వచ్చిందని హోటల్ యాజమానిపై ఇష్టం వచ్చిన్నట్లు దాడి చేశారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన బెంగళూరులోని కోణనకుంట పోలీసుస్టేషన్లో జరిగింది. బాబు అనే వ్యక్తి ఈశ్వరలేఔట్‌లో హోటల్ నడుపుతున్నాడు. బుధవారం అర్ధరాత్రి అదే ప్రాంతానికి చెందిన అభి, మని అనే ఇద్దరు యువకులు రూ.120 చెల్లించి ఒక ప్లేట్ చికన్ కబాబ్ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లి పార్శిల్ తెరిచి చూడగా అక్కడ 9 కబాబ్ పీస్‌లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక ప్లేట్‌కు 10 ముక్కలు ఇస్తారు. దీంతో 9 ముక్కలు మాత్రమే ఉన్నాయంటూ గురువారం ఉదయం హోటల్ వద్దకు వెళ్లి యజమానితో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి గొడవ పెద్దదవడంతో.. బాబుపై ఇద్దరూ దాడికి దిగారు. యమజాని ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ చితకబాదారు. అనంతరం అక్కడినుంచి పరారయ్యారు. తీవ్రగాయాలైన బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అభి, మనులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: హోటల్లో నాగుపాము హల్చల్.. భయంతో కస్టమర్ల పరుగులు -
Recipe: ఇవన్నీ కలిపి బోన్‌లెస్ చికెన్ ముక్కల్ని బొగ్గు మీద కాల్చి తింటే!
చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ బోర్ కొట్టాయా? అయితే బోన్‌లెస్ చికెన్ ముక్కలతో ఇలా ఇండోనేషియన్ వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి! ఇండోనేషియన్ సటే తయారీకి కావలసిన పదార్థాలు ►బోన్‌లెస్ చికెన్ ముక్కలు – కేజీ ►కబాబ్ స్టిక్స్ – ఆరు (చల్లటి నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి ►కీరా – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి ►ఆయిల్– వేయించడానికి సరిపడా. మ్యారినేషన్ కోసం ►నూనె – మూడు టేబుల్ స్పూన్లు ►నిమ్మగడ్డి – రెండు రెమ్మలు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ధనియాల పొడి – టీస్పూను ►కారం – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు తయారీ... ►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి.. మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాల. ►నానిన చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్‌కు గుచ్చి బొగ్గు మీద కాల్చాలి. ►రెండు పక్కల కాలిన తరువాత కొద్దిగా ఆయిల్ రాసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►కీరా, ఉల్లిపాయ ముక్కలు, ఏదైనా సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Chha Gosht Recipe: అరకేజీ మటన్‌తో ఇలా ఘుమఘుమలాడే వంటకం తయారు చేసుకోండి! -
కబాబ్ స్పెషల్..