చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ బోర్ కొట్టాయా? అయితే బోన్‌లెస్ చికెన్ ముక్కలతో ఇలా ఇండోనేషియన్ వంటకాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి!
ఇండోనేషియన్ సటే
తయారీకి కావలసిన పదార్థాలు
►బోన్‌లెస్ చికెన్ ముక్కలు – కేజీ
►కబాబ్ స్టిక్స్ – ఆరు (చల్లటి నీటిలో రెండు గంటలపాటు నానబెట్టుకోవాలి
►కీరా – ఒకటి, ఉల్లిపాయ – ఒకటి
►ఆయిల్– వేయించడానికి సరిపడా.
మ్యారినేషన్ కోసం
►నూనె – మూడు టేబుల్ స్పూన్లు
►నిమ్మగడ్డి – రెండు రెమ్మలు
►వెల్లుల్లి రెబ్బలు – రెండు
►పసుపు – రెండు టీస్పూన్లు
►ధనియాల పొడి – టీస్పూను
►కారం – టీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►తేనె – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ...
►చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి.. మ్యారినేషన్ కోసం తీసుకున్న పదార్థాలన్నీ వేసి కలిపి ఆరుగంటలపాటు నానబెట్టుకోవాల.
►నానిన చికెన్ ముక్కలను కబాబ్ స్టిక్స్‌కు గుచ్చి బొగ్గు మీద కాల్చాలి.
►రెండు పక్కల కాలిన తరువాత కొద్దిగా ఆయిల్ రాసి మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
►కీరా, ఉల్లిపాయ ముక్కలు, ఏదైనా సాస్‌తో వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Mutton Chha Gosht Recipe: అరకేజీ మటన్‌తో ఇలా ఘుమఘుమలాడే వంటకం తయారు చేసుకోండి!
Comments
Please login to add a commentAdd a comment