న్యూస్‌మేకర్
‘విందు భోజనం అంటే సరైన సమయంలో సరైన పదార్థం అందించడమే’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. అన్య జాతులకు ప్రవేశం లేని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్ వంటశాలలో ప్రవేశం సాధించిన మొదటి మహిళ ఆమె. తొలి శ్వేత జాతీయేతర మహిళ కూడా! 30 ఏళ్లు వైట్‌హౌస్‌లో పని చేశాక తన 61వ ఏట జూలై 31న ఆమె రిటైర్ అయ్యారు. ఎందరో దేశాధినేతలకు తన చేతి వంట తినిపించిన క్రిస్ కమర్‌ఫోర్డ్ పరిచయం.
‘అమెరికాకు అనేక మంది రాయబారులు ఉంటారు. కాని క్రిస్ కమర్‌ఫోర్డ్ షెఫ్‌గా ఉండక శాకపాకాల రాయబారి వలే అలాంటి పనే చేశారు. అమెరికా రుచులను ప్రపంచనేతలకు పంచి ఎలా ఉత్సవభరితం చేయవచ్చో చూపించారు’ అని క్రిస్ కమర్‌ఫోర్డ్ రిటైర్‌మెంట్ సందర్భంగా ఆమె సమకాలిక షెఫ్ ఒకరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు జో బైడన్ సతీమణి జిల్ బైడన్ ‘క్రిస్ కమర్‌ఫోర్డ్ తన టీమ్‌తో కలిసి ప్రేమ, ఆ΄్యాయతలతో కూడిన రుచులతో మా ఆత్మలను నింపారు’ అని వీడ్కోలు సందేశంలో పేర్కొంది. క్రిస్ కమర్‌ఫోర్డ్ విజయగాథ...
ఫిలిప్పైన్స్ నుంచి
క్రిస్ కమర్‌ఫోర్డ్‌ది ఫిలిప్పైన్స్. మనీలాలో బాల్యం గడిచింది. గ్రాడ్యుయేషన్ అయ్యాక ఫుడ్ టెక్నాలజీలో పి.జి. చేయాలనుకుంది. ‘నాకు సైన్స్ ఇష్టం. ఫుడ్ టెక్నాలజీలో పరిశోధన చేయాలనుకున్నాను. కాని మా నాన్న నువ్వు కలనరీ ఇన్‌స్టిట్యూట్‌లో చదివితే ఇంకా రాణిస్తావు అన్నాడు. నేను మా నాన్న సలహాను పాటించడం వల్లే పాకశాస్త్రం తెలుసుకొని వైట్‌హౌస్ దాకా వచ్చాను. కాబట్టి పెద్దల మాట వినండి’ అంటుంది క్రిస్ కమర్‌ఫోర్డ్. తన 23వ ఏట అమెరికా వలస వచ్చిన క్రిస్ మొదట షికాగో, తర్వాత న్యూయార్క్ రెస్టరెంట్‌లలో పని చేసింది. వైట్‌హౌస్‌లో వంటశాలలో మహిళలను తీసుకోక΄ోయినా, శ్వేతజాతీయేతర మహిళలను తీసుకునే అవకాశం అసలు లేక΄ోయినా 1995లో నాటి ఎగ్జిక్యూటివ్ షెఫ్ వాల్టర్ స్టాన్లీ ఆమెను అసిస్టెంట్ షెఫ్‌గా తీసుకున్నాడు.
మన్‌మోహన్ సింగ్‌తో ప్రమోషన్
నాటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ 2005లో అమెరికా సందర్శించినప్పుడు వైట్ హౌస్‌లో భారీ విందు జరిగింది. దానికి కావలసిన వంటా వార్పు అంతా క్రిస్ చూసింది. విందుకు హాజరైన వారంతా ఆహా ఓహో అన్నారు. క్రిస్ ప్రతిభ గమనించిన జార్జ్‌బుష్ సతీమణి లారా బుష్ ఆమెకు ఎగ్జిక్యూటివ్ షెఫ్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ వైట్‌హౌస్‌లోని సకల వంటా వార్పులకు సర్వోన్నత అధికారి. ఆమె పర్యవేక్షణలోనే దేశాధినేతలు వచ్చినప్పుడు వైట్‌హౌస్‌లో ఇచ్చే గౌరవ విందు, హాలిడే ఫంక్షన్లు, రిసెప్షన్లు, అధికారిక విందులు జరుగుతాయి.
ఆహారమే ఆరోగ్యం
‘దేశ భవిష్యత్తు నిర్మించడమంటే నేటి బాలలకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడమే’ అంటుంది క్రిస్. ‘పాకశాస్త్రం తెలిసిన వారు ఏది ఉత్తమమైన ఆహారమో ఏది ΄ûష్టికతతో నిండినదో తర్వాతి తరాలకు తెలియ చేయాలి. పిల్లలు మెచ్చుకునే రీతిలో ఆరోగ్యకరమైన వంటలు చేయగలగాలి. వారిని కూరగాయలతో గడపనివ్వాలి. కూరగాయల మడులకు తీసుకెళ్లాలి. వంట పట్ల అభిరుచి, అవగాహన కలిగించాలి’ అంటుందామె.
వంట ఒక సవాలు
వైట్ హౌస్‌లో వంట ఒక సవాలు. జపాన్ దేశాధినేత వచ్చినప్పుడు ఒక మెనూ, కెన్యా అధ్యక్షుడు వచ్చినప్పుడు ఒక మెనూ, భారత ప్రధాని వచ్చినప్పుడు మరో మెనూ తయారు చేయాలి. ఒకోసారి ఆయా దేశాలకు చెందిన వంటవాళ్లను రప్పించి వారితో కలిసి వండాలి. ‘ప్రతి విందుకు నాలుగు రోజుల ముందు నుంచే సిద్ధమవుతాం. సలాడ్‌లు తాజాగా ఉండేందుకు ఆ రోజున వైట్‌హౌస్‌లోని తోట నుంచి ఆకులు, దుంపలు సేకరిస్తాం. పండిన కూరగాయలు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. వైట్ హౌస్‌లో ఉపయోగానికి రాక΄ోతే అవసరమైనవారికి పంపించేస్తాను’ అంది క్రిస్.
Comments
Please login to add a commentAdd a comment