హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా భాగ్యనగర్ బాడీబిల్డింగ్ అసోసియేషన్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్‌ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రెసిడెంట్ కె సంపత్ రెడ్డి మాట్లాడుతూ., పురుషుల ఫిజిక్, బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలు జరిగాయని తెలిపారు.
టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు అందుకుంటారన్నారు. 55 కిలోలు, 55–60 కిలోలు, 60–65 కిలోలు, 65–70 కిలోలు 70–75 కిలోలు, 75–80 కిలోలు, 80–85 తదితర విభాగాల్లో బాడీబిల్డింగ్ పోటీలు, 85 కిలోల పైన పురుషుల ఫిజిక్ పోటీలు 170 సెంటీమీటర్ల లోపు, 170 సెంటీమీటర్ల పైన తదితర విభాగాల్లో నిర్వహించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment