hi-tech
-
మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా విజేతగా రాహుల్..
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా భాగ్యనగర్ బాడీబిల్డింగ్ అసోసియేషన్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్‌ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రెసిడెంట్ కె సంపత్ రెడ్డి మాట్లాడుతూ., పురుషుల ఫిజిక్, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో పోటీలు జరిగాయని తెలిపారు. టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు అందుకుంటారన్నారు. 55 కిలోలు, 55–60 కిలోలు, 60–65 కిలోలు, 65–70 కిలోలు 70–75 కిలోలు, 75–80 కిలోలు, 80–85 తదితర విభాగాల్లో బాడీబిల్డింగ్ పోటీలు, 85 కిలోల పైన పురుషుల ఫిజిక్ పోటీలు 170 సెంటీమీటర్ల లోపు, 170 సెంటీమీటర్ల పైన తదితర విభాగాల్లో నిర్వహించామన్నారు. -
అదిరిపోయే ‘స్మార్ట్ షూస్’
వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో గత అక్టోబర్‌లో జరిగిన రెండు గంటల ప్రపంచ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోజ్ విజయం సాధించారు. సుదూర మారథాన్‌లో ఓ అథ్లెట్ విజయం సాధించడం ప్రపంచంలోనే మొదటిసారి. అందుకు కారణం ఆయన కాదు. ఆయన ధరించిన ‘నైక్ స్మార్ట్ షూ’యే కారణం. ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ బూట్లపై వివాదం మొదలయింది. అథ్లెట్లు ఈ బూట్లు ధరించకుండా నిషేధం విధించాలని ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం డిమాండ్ చేస్తోంది. షూస్ అడుగు భాగాన కార్బన్ ఫైబర్ ప్లేట్‌కు ఫోమ్ కుషన్ జతచేసి కుట్టడం వల్ల అది స్ప్రింగ్‌లాగా పనిచేస్తుంది. వాటిని ధరించడం వల్ల పరుగెత్తుతున్నప్పుడు గాల్లో ఎగురుతున్నట్లు ఉంటుంది. వీటిని ఇప్పుడు అథ్లెట్స్‌కు ట్రెయినర్స్గాను పిలుస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ‘కెంట్ అథ్లెటిక్స్ క్లబ్’లో 90 శాతం మంది అథ్లెటిక్స్ ఇప్పుడు ఈ షూస్నే వాడుతున్నారని మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఓవెన్ హింద్ తెలిపారు. బూట్లకు స్ప్రింగ్ యాక్షన్ ఉండడం వల్ల అడుగు దూరంగా పడడంతో ఎక్కువ దూరం ఎక్కువ ప్రయాసం లేకుండా పరుగెత్తవచ్చని ఆయన తెలిపారు. ఒక తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో ఇవి లభిస్తుండడం వల్ల కూడా అథ్లెటిక్స్ను, రన్నర్లకు ఈ షూస్ ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ధర తెలిస్తే మాత్రం కాళ్లు వణకడం ఖాయం. కనీస ధర 240 పౌండ్లు (దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది. -
పోలీసుల అదుపులో ఏటీఎం దొంగలు
-
తపాలాలో బహుముఖ సేవలు
తిరుపతి అర్బన్: తపాలా సేవలంటే ఒకప్పుడు కేవలం ఉత్తరాలు, మనీ ఆర్డర్ల బట్వాడాకే పరిమితం అయ్యేవి. కానీ కాలానుగుణంగా భారత ప్రభుత్వ శాఖల్లో భాగమైన తపాలాలో కూడా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎన్నెన్నో స్కీములు అమలులోకి వచ్చాయి. అందులో భాగంగా ఇప్పుడు తపాలా కార్యాలయాలు కూడా బ్యాంకులులాగా సేవలందిస్తున్నాయి. అలాగే ఇల్లు మారినప్పుడు, ఇతర గృహోపకరణాలు రవాణా చేయాలనేవారికి తపాలా ‘లాజిస్టిక్’ పథకం ద్వారా పూర్తి బీమా సౌకర్యంతో కూడిన పథకం అమలులో ఉంది. ఇదే పథకం ద్వారా రైతుల ఉత్పత్తులను కూడా మార్కెట్లకు తరలించుకునే సౌల భ్యం అందుబాటులో ఉంది. వివిధ తపాలా బీమా పథకాలు, చిన్నారుల కోసం కిడ్డీబ్యాంక్ సేవలు, బాలికల కోసం సంక్షేమ కార్యక్రమాలు...ఇలా ఎన్నెన్నో వినూత్న పథకాలను అమలు చేస్తున్నారు. వాట న్నిటిని గురించి ‘సాక్షి’ పాఠకులకు తెలియజేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నుంచి ఒక్కో పథకం గురించి వివరించనున్నాం. టీటీడీ ఆశీర్వచనం ఆశీర్వచనం పథకాన్ని టీటీడీ సహకారంతో తపాలా శాఖ గత ఏడేళ్లుగా నిర్వహిస్తోంది.టీటీడీ అమలు చేస్తున్న వివిధ పథకాలతో పాటు శ్రీవారి హుండీకి విరాళాలు ఇవ్వాలనుకునే భక్తులు దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా మనీ ఆర్డర్ ద్వారా పంపవచ్చు. అలా టీటీడీకి విరాళాలు పంపిన భక్తులకు టీటీడీ వారి రశీదు, శ్రీదేవి-భూదేవి సమేత శ్రీవారి ఫొటో, శ్రీవారి ఆలయం ద్వారా పంపిణీ జరిగే అక్షింతలను కవర్లో పెట్టి పోస్టుమేన్ ద్వారా భక్తుల చిరునామాకు అందిస్తారు. అందుకోసం తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయంలో ఓ ప్రత్యేక విభాగం నడుస్తోంది. దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చు. -
మ్యాక్స్‌క్యూర్ వైద్యుల ఘనత
* విజయవంతంగా మోకాలి చిప్పల మార్పిడి * సర్జరీ పూర్తికాగానే నడక ప్రారంభించిన పేషెంట్ హైదరాబాద్: మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వ్యక్తికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేసిన హైదరాబాద్ మాదాపూర్‌కు చెందిన మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. కంప్యూటర్ అసిస్టెడ్ నావి గేషన్ సిస్టంతో శస్త్ర చికిత్స చేసి 3 గంటల వ్యవధిలోనే పేషెంట్ నడిచేలా చేశారు. వనస్థలిపురానికి చెందిన మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సభ్యుడు పి.సుధాకర్‌రావు (74) ఏడాదిన్నర నుంచి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం పలువురు వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. మందులు వాడితే నొప్పి తగ్గకపోగా మరింత పెరిగింది. దీంతో ఇటీవల మ్యాక్స్ క్యూర్ ఆస్పత్రిలోని ప్రముఖ హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కృష్ణకిరణ్‌ను ఆయన సంప్రదించారు. సుధాకర్‌రావుకు సిటీస్కాన్ తీయించగా రెండు మోకాలి చిప్పల మధ్యలోని కార్టిలేజ్ (గుజ్జు) పూర్తిగా అరిగిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో మోకాలి చిప్పల మార్పిడి శస్త్రచికిత్స ఒక్కటే దీనికి పరిష్కారమని వైద్యులు ఆయనకు సూచించారు. గత శుక్రవారం ఉదయం కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సుధాకర్‌రావుకు శస్త్రచికిత్స ప్రారంభించారు. చిన్న గాటుతో మోకాలి చిప్పల చుట్టూ ఉన్న కండరాన్ని కత్తిరించకుండా అరిగిపోయిన చిప్పలను తొలగిం చారు. వాటి స్థానంలో కృత్రిమ మోకాలి చిప్పలను విజయవంతంగా అమర్చారు. శస్త్ర చికిత్స చేసిన 3 గంటల వ్యవధిలోనే 74 ఏళ్ల సుధాకర్‌రావు ఎవరి సహాయం లేకుండా బెడ్ మీద నుంచి లేచి నడవడం విశేషం. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణకిరణ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సిస్టంతో సర్జరీ చేయడం వల్ల రక్తస్రావం లేకుండా, తక్కువ నొప్పితో చికిత్స చేయవచ్చని తెలిపారు. -
టాబ్లెట్ భాగ్య
దేశంలోనే తొలిసారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీ ప్రారంభించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : రైతులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసే దిశగా వారికి టాబ్లెట్లను అందజేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. శనివారమిక్కడి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం కృష్ణాలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ-ట్యాబ్‌లను సిద్ధరామయ్య ఆవిష్కరించారు. దేశంలోనే మొట్టమొదటి సారిగా రైతుల ముంగిట్లోకి టెక్నాలజీని తీసుకెళ్లేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రయోగాత్మకంగా బాగల్‌కోట, విజయపుర జిల్లాలోని 1,500గ్రామాల్లోని రైతులకు టాబ్లెట్లను అందజేయనున్నారు. టాబ్లెట్లలో ఏయే సౌకర్యాలు.... రైతులకు అందజేయనున్న ఈ టాబ్లెట్‌లో 8జీబీ మెమొరీ, 1జీబీ ర్యామ్, వైఫై, అత్యాధునిక కెమెరా సౌకర్యాలను పొందుపరిచారు. టాబ్లెట్లకు నెట్వర్క్ సౌకర్యాన్ని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా మూడు నెలల పాటు టాబ్లెట్‌కు ఎయిర్టెల్ సంస్థ ఉచిత డాటా సౌకర్యాన్ని అందించనుంది. మూడు నెలల అనంతరం రైతులు ఇంటర్నెట్ సౌకర్యం కోసం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ టాబ్లెట్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన అన్ని వివరాలను రైతులు తెలుసుకోవచ్చు. ఏయే పంటలకు ఎలాంటి రసాయనాలు వాడాలి, వాతావరణ పరిస్థితులు, వర్ష సూచనలు, ఏయే పంటలకు ఎలాంటి చీడలు పట్టే అవకాశం ఉంది? వాటి నివారణ మార్గాలేంటి తదితర అన్ని వివరాలను ఈ టాబ్లెట్‌లో పొందుపరిచారు. టాబ్లెట్ నుంచే సహాయవాణి కేంద్రానికి సమాచారం.... ఈటాబ్లెట్లో ఏర్పాటు చేసిన ఓ బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు రైతుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయవాణి కేంద్రానికి సందేశం వెళుతుంది. ఈ టాబ్లెట్‌లోని కెమెరా సహాయంతో పంట పరిస్థితిని ఫొటోలు తీసి సహాయవాణి కేంద్రానికి పంపవచ్చు. అనంతరం సహాయవాణి కేంద్రంలోని వ్యవసాయ రంగ నిపుణులు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలను అందజేస్తారు. అంతేకాదు అవసరమైతే రైతు వ్యవసాయ క్షేత్రాన్ని స్వయంగా సందర్శించి పంటకు సంబంధించిన అనుమానాలను నివృత్తి చేస్తారు. అత్యాధునిక టెక్నాలజీని చేరువ చేసేలా : ఎస్.ఆర్.పాటిల్ కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీబీటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ....అత్యాధునిక టెక్నాలజీని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సైతం చేరువ చేసేలా దేశంలోనే మొట్టమొదటి సారిగా ఈ పధకాన్ని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని రెండుజిల్లాలోని 1,500 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించామని, ఈ పథకం సత్ఫలితాలను ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. -
బండిపోయినా.. ఫికర్ మత్
ఎస్వీటీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా క్షణాల్లో పట్టివేత చోరీ వాహనాన్ని గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ప్రయోగాత్మకంగా సీఐ, ఎస్ఐ సెల్ఫోన్లకు ఈ సౌకర్యం త్వరలో అందుబాటులోకి సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనం చోరీకి గురైందా?... బేఫికర్ (నిశ్చింతగా) ఉండండి. ఆ బండి రోడ్డెక్కితే చాలు క్షణాల్లో పట్టుకునే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నగర పోలీసులకు త్వరలో అందుబాటులోకి రానుంది. కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు బషీర్‌బాగ్‌లోని పోలీసు హెడ్‌క్వార్టర్ కార్యాలయంలో ఇం దుకు సంబంధించిన కసరత్తు వేగంగా జరుగుతోంది. నేరాల నివారణకు సోషల్ మీడియా ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్న నగర పోలీసులు... ఇక వాహన చోరుల భరతం పట్టేందుకు సిద్ధమౌతున్నారు. వీరి ఆట కట్టించేందుకు స్టోలెన్ వెహికిల్ ట్రాకింగ్ సిస్టం (ఎస్వీటీఎస్) పద్ధతికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎస్వీటీఎస్ యాప్‌ను ఇన్స్పెక్టర్, ఎస్ఐ స్థాయి అధికారులకు త్వరలో అందుబాటులోకి తేనున్నారు. వాహన తనిఖీల సమయంలో తనిఖీ అధికారి వద్ద ఉన్న సెల్ఫోన్లోనే తనిఖీ చేస్తున్న వాహనం చోరీ వాహనమా? కాదా అనేది తెలుసుకొనేందుకు ఎస్వీటీఎస్ యాప్ ఉపయోగపడుతుంది. వాహనం రిజిస్ట్రేషన్, ఇంజిన్ , ఛాసిస్ నెంబర్లలో ఏదో ఒకటి యాప్‌లో ఎంటర్ చేయగానే.. అది చోరీ అయిన వాహనం అయితే.. ఫలానా స్టేషన్లో, ఫలానా క్రైంనెంబర్తో కేసు రిజిస్టర్ అయిందని క్షణాల్లో పోలీసు అధికారి సెల్‌కు మెసేజ్ వచ్చేస్తుంది. వెంటనే పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడంతో పాటు దాన్ని నడుపుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. నడిరోడ్డుపైనే ఎఫ్ఐఆర్.... వాహనం చోరీ అయ్యిందని బాధితుడు ఠాణాకు వస్తే కొంతమంది ఎస్ఐలు కేసు నమోదు చేయడానికి వెనకాడతారు. కేవలం జీడీ బుక్‌లో వివరాలు రాసుకొని పంపేస్తారు. ఎక్కువగా కేసులు నమోదైతే అధికారుల నుంచి చివాట్లు తప్పవనే భయమే ఇందుకు కారణం. అయితే ఎస్వీటీఎస్ యాప్ విధానం అందుబాటులోకిస్తే కేసు నమోదుకు భయపడాల్సిన అవసరమే ఉండదు. ఎందుకంటే ఎంత త్వరగా కేసు నమోదు చేస్తే అంతే త్వరగా దాన్ని పట్టుకునే ఆయుధం ఇప్పుడు పోలీసుల వద్ద ఉంది. నడిరోడ్డుపై విధుల్లో ఉన్న సమయంలో తన వాహనం పోయిందని బాధితుడు వచ్చి ఫిర్యాదు చేసినా వెంటనే ఎస్ఐలు తాము నిల్చున్న చోటి నుంచే చోరీ వాహనం వివరాలను తన సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో పెడితే చాలు.. అన్ని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ ఠాణాల సిబ్బందితో పాటు సీసీఎస్ పోలీసులకు కూడా ఈ వివరాలు క్షణాల్లో చేరుతాయి. తనిఖీలలో కీలకం.... శాంత భద్రతల పోలీసులుగాని, ట్రాఫిక్ పోలీసులు గాని ప్రతి నగరంలో ఎక్కడో ఒకచోట వాహన తనిఖీలు చేయడం పరిపాటే. ఆ సమయంలో వాహనదారుడు తన వాహనం వివరాలు చెప్పేందుకు తడపడితే.. ఎస్ఐ తన వద్ద ఉన్న సెల్‌ఫోన్‌లోని ఎస్వీటీఎస్ యాప్‌లో సదరు రిజిస్ట్రేషన్, ఇంజిన్ నెంబర్లలో ఏదో ఒకటి టైప్ చేస్తే.. క్షణాల్లో ఆ వాహనం చరిత్ర మొత్తం తెలిసి పోతుంది. గతంలో వాహనదారుడి వద్ద వాహనానికి సంబంధించిన పేపర్లు లేకపోతే కేవలం చలానా కట్టించుకుని వదిలేవారు. నగరంలో చోరీ చేసిన వాహనాలను నిందితులు ఇతర జిల్లాలలో విక్రయిస్తున్నారు. వాటిని రికవరీ చేయడం సాధ్యం కావడంలేదు. కాగా, నగర పోలీసుల చేతికి త్వరలో వస్తున్న ఎస్వీటీఎస్ యాప్‌ను తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల పోలీసులకు కూడా అందుబాటులోకి తెచ్చే ఆలోనచలో నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉన్నారు. ఈ యాప్ తెలంగాణలోని పోలీసులందరికీ అందుబాటులోకి తెస్తే చోరీ అయిన వాహనం ఎక్కడ తిరుగుతున్నా పట్టుకొనే వీలుకలుగుతుంది. డేటా సేకరణలో సిబ్బంది బిజీ... ఎస్వీటీఎస్ యాప్‌ను నడిపించేందుకు పోలీసు కమిషనర్ కార్యాలయంలో ప్రత్యేక సర్వర్‌తో పాటు సిబ్బందిని నియమించారు. వీరు నగరంలోని అన్ని ఠాణాల్లో చోరీ అయిన వాహనాల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. సేకరించిన వివరాలను సర్వర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలన్నీ పోలీసు సిబ్బంది సెల్ఫోన్లో ఉన్న ఎస్వీటీఎస్ యాప్‌కు చేరతాయి. ఈ ఏడాది నగరంలో సుమారు 2500 వాహనాలు చోరీకి గురయ్యాయి. మరో వెయ్యి వాహనాలు గుర్తింపునకు నోచుకోక ఠాణాలలో మగ్గుతున్నాయి. వీటి పూర్తి వివరాలు ప్రస్తుతం సర్వర్‌లో అప్లోడ్ చేశారు. -
విమానాశ్రయానికి ‘భద్రత’ ఉందా?
పెను తుపాను వస్తే తప్పని ఇబ్బందులు అధునాతన టెర్మినల్ భవనం అవసరం ప్రత్యేక డిజైన్ సిద్ధం చేస్తున్న అధికారులు భూములిచ్చేందుకు ఒప్పుకోని రైతులు సాక్షి, విజయవాడ : హుదూద్ సృష్టించిన పెను విలయానికి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థ ఆధారంగా నిర్మించిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం విధ్వంసం కావడంతో... గన్నవరం విమానాశ్రయ పటిష్టతపైనా చర్చలు ఊపందుకున్నాయి. ఈ ఎయిర్‌పోర్టుకు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే సామర్థ్యం ఉందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. విశాఖలోని అంతర్జాతీయ విమానాశ్రయమే పెనుగాలుల నుంచి తప్పించుకోలేకపోయిందని, సాధారణ గన్నవరం ఎయిర్‌పోర్టు ఏలా తట్టుకుంటుందనే వాదన వినిపిస్తోంది. అయితే రాజధాని ఎయిర్‌పోర్టు కాబట్టి దీనిని మరింతగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఉంది. బ్రిటిష్ పరిపాలన సమయం నుంచే గన్నవరం విమానాశ్రయం ఉంది. అయితే 2000 సంవత్సరం వరకు కేవలం రన్వేగానే దీనిని వినియోగించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి మూడు ఎయిర్‌లైన్స్ నాలుగు నగరాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో ఐదేళ్ల నుంచే వాడకంలోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌పోర్టు టెర్మినల్ భవనం సాధారణ నిర్మాణం గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కేవలం రన్‌వే వాడకానికి వీలుగా నిర్మించారు. భవనంపై భాగం అంతా రేకులతో నిర్మితమై ఉంది. 574 ఎకరాల్లో ఉన్న ఎయిర్‌పోర్టులో 7,500 అడుగుల రన్‌వే ఉంది. విజయవాడ నుంచి నిత్యం హైదరాబాద్, మధురై, బెంగళూరు, ఢిల్లీ తదితర ప్రాంతాలకు విమాన రాకపోకలు సాగుతున్నాయి. తాజాగా విజయవాడ రాజధానిగా మారిన క్రమంలో విఐపీల రాకపోకలు అధికమయ్యాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెం దిన వారే అధికంగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాగే ముఖ్యమంత్రి నెలకు సగటున మూడుసార్లు వస్తున్నారు. ఈ క్రమంలో గన్నవరం విమానాశ్రయానికి ప్రాధాన్యత సంతరించుకుంది. సదుపాయాల లేమి... మారుతున్న అవసరాలకు అనుగుణంగా విమాన సర్వీసులు పెరిగాయి కాని సౌకర్యాలు మాత్రం అలానే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌లో కేవలం 70 మందికి మాత్రమే సీటింగ్ సౌకర్యం ఉంది. అలాగే 7,500 అడుగులు రన్‌వే ఉంది. అలాగే విమానాల పార్కింగ్ కోసం ప్రత్యేకమైన ఏరియా తక్కువే ఉంది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం ఎయిర్‌పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆలోక్ సిన్హా, ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులు గన్నవరం ఎయిర్‌పోర్టును సందర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో, విజయవాడ రాజధానిగా ప్రకటించనున్న క్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని అభివృద్ధి చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అయితే భూసేకరణ అసలు సమస్యగా మారింది. 480 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా వాటిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన 430 ఎకరాల భూమిని సుమారు 400 మంది రైతలు నుంచి సేకరించాల్సి ఉంది. ఇది పూర్తి అయితేనే విస్తరణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే గన్నవరం భూముల ధరలు కోట్లకు చేరిన క్రమంలో రైతులు భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. తుపానుల ముప్పు తక్కువే - రాజ్‌కిషోర్, డెరైక్టర్ విశాఖ విమానాశ్రయం సముద్రానికి అతి దగ్గరగా ఉండటం వల్ల కొంత నష్టం వాటిల్లిందని, అయితే గన్నవరానికి అలాంటి ఇబ్బంది ఉండదని గన్నవరం విమానాశ్రయం డెరైక్టర్ రాజ్‌కిషోర్ సాక్షికి తెలిపారు. సముద్రానికి , నదికి దూరంగా జాతీయ రహదారి సమీపంలో ఉండటంతో ఇబ్బంది ఉండదని చెప్పారు. అయితే ప్లానింగ్ విభాగం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన టెర్మినల్ డిజైన్‌కు రూపకల్పన చేస్తుందని ఆయన చెప్పారు. -
బంజారాహిల్స్‌లో హైటెక్ వ్యభిచారం
-
5 వేలు ఇస్తే ఇంటర్ ఎగ్జామ్ పాస్
-
పక్కా ‘ట్రాక్’పై నిఘా
సైబరాబాద్‌లో జీపీఎస్ ఆధారంగా పనిచేసే ‘వీటీఎస్’ పోలీసు వాహనాల కదలికలపై కన్ను చాలావరకు తగ్గనున్న రెస్పాన్స్ టైమ్ నాలుగింటిలో ప్రయోగాత్మకంగా అమలు త్వరలో మరో 70 వెహికల్స్‌లో ఏర్పాటు సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా సేవలందించేందుకు సైబరాబాద్ కమిషనరేట్ రంగం సిద్ధం చేస్తోంది. జీఐఎస్, జీపీఎస్ టెక్నాలజీతో పనిచేసే వెహికల్ ట్రాకింగ్ సిస్టం (వీటీఎస్)ను ప్రవేశపెట్టబోతోంది. బాధితుల కాల్స్‌కు త్వరి తంగా రెస్పాన్స్ ఇచ్చేందుకు, పోలీసు గస్తీ వాహనాల కదలికలపై నిఘా ఉంచేం దుకు ఉపయోగపడే ఈ వ్యవస్థతో పలు అవస్థలు తప్పనున్నాయి. దీన్ని ఇప్పటికే ప్రయోగాత్మకంగా నాలుగు వాహనాల్లో ప్రవేశపెట్టారు. ఈ నెలాఖరుకు కమిషనరేట్‌లోని 70 గస్తీ వాహనాల్లో ఏర్పాటు చేయనున్నారు. గస్తీ వాహనాలపై నిఘా సైతం... ఈ వ్యవస్థతో పోలీసు వాహనాల గస్తీ సైతం పక్కాగా జరిగేలా నిఘా ఉంచే అవకాశముంది. {పస్తుతం ఈ వాహనాల గస్తీపై పలు ఫిర్యాదులు అందుతున్నాయి. తాజా ట్రాకింగ్ సిస్టం వల్ల ఏదైనా వాహనం ఎక్కడ గస్తీ నిర్వహిస్తోందన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు. వాహనాన్ని ఘటనాస్థలికి పంపేటప్పుడు దాన్లో ఉన్న ఇంధనం సరి పోతుందా? లేదా? అనేదీ ముందుగానే తెలుసుకోవచ్చు. ఒక్కో వాహనానికి నెలకు ఎంత డీజిల్ కేటాయించారు, దాని మైలేజ్ ఎంత? అది ఎన్ని కి.మీ. గస్తీ తిరిగింది? ఇంకా ఎంత డీజిల్ ఉంది? తదితర విషయాలనూ ఇది విశ్లేషిస్తుంది. ఓఆర్ఆర్ పెట్రోలింగ్ వాహనాలకూ.. ‘రెస్పాన్స్ టైమ్ తగ్గించడంతోపాటు గస్తీ వాహనాలపై నిఘా ఉంచడానికి వీటీఎస్ ఉపకరిస్తుంది. దీన్ని మొదటి దశలో 70 పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేస్తున్నాం. ఇటీవలే ఓఆర్ఆర్పై తనిఖీలు చేపట్టేందుకు అందుబాటులోకి తెచ్చిన ఐదు వెహికల్స్కూ ఏర్పాటు చేస్తాం. ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుంది. ఈ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కంట్రోల్ రూమ్‌లో తెరపై కనిపించడంతోపాటు సర్వర్లోనూ డంప్ అవుతుంది. దానిలోకి లాగిన్ అయిన ఏ అధికారైనా ఎక్కడి నుంచైనా ఈ సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది.’ - అవినాష్ మహంతి, ట్రాఫిక్ డీసీపీ, సైబరాబాద్ వేగంగా స్పందించడమే ప్రధాన లక్ష్యం ఇబ్బందులు, సమస్యల్లో ఉన్న బాధితులు కంట్రోల్‌రూమ్‌కు ఫోన్ చేసి సాయం కోరగలరు తప్ప.. అన్ని సందర్భాల్లో వారి వివరాలు చెప్పే స్థితిలో ఉండరు. ఈ నేపథ్యంలో కంట్రోల్‌రూమ్‌కు వచ్చిన కాల్‌ను బట్టి అది ఏ ప్రాంతం నుంచి వస్తోందనేది సాంకేతికంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. సమాచారం అందగానే ఎంత వేగంగా పోలీసులు స్పందించగలిగితే బాధితులకు అంత ఊరట లభిస్తుంది. ఈ రెస్పాన్స్ టైమ్ తగ్గించాలంటే రక్షక్, మొబైల్ వాహనాలు ఎక్కడున్నాయో వేగంగా తెలుసుకోవాలి. దీనికోసం ఆ వాహనాల్లో జీఐఎస్ (గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్), జీపీఎస్ (గ్లోబల్ పోజిషనింగ్ సిస్టమ్) ఏర్పాటు చేస్తారు. వీటిని కంట్రోల్‌రూమ్‌లో ఉండే వీడియో వాల్‌కు అనుసంధానిస్తారు. ఫలితంగా ఓ వాహనం ఏ ప్రాంతంలో ఉందనేది స్క్రీన్‌పై గుర్తుల రూపంలో కనిపిస్తుంది. ఫోన్ వచ్చిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వాహనానికి వైర్లెస్ సెట్‌తో సమాచారమిచ్చి అటు మళ్లిస్తారు. ఈ వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ కాంట్రాక్టును ఓ సంస్థ దక్కించుకుంది. ప్రయోగాత్మకంగా 4 వాహనాల్లో ఏర్పాటు చేసి సమస్యల్ని అధ్యయనం చేస్తోంది.