వియన్నా: ఆస్ట్రియాలోని వియన్నా నగరంలో గత అక్టోబర్‌లో జరిగిన రెండు గంటల ప్రపంచ మారథాన్‌లో కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కిప్చోజ్ విజయం సాధించారు. సుదూర మారథాన్‌లో ఓ అథ్లెట్ విజయం సాధించడం ప్రపంచంలోనే మొదటిసారి. అందుకు కారణం ఆయన కాదు. ఆయన ధరించిన ‘నైక్ స్మార్ట్ షూ’యే కారణం. ఆ తర్వాత అనతి కాలంలోనే ఈ బూట్లపై వివాదం మొదలయింది. అథ్లెట్లు ఈ బూట్లు ధరించకుండా నిషేధం విధించాలని ప్రపంచ అథ్లెటిక్స్ సంఘం డిమాండ్ చేస్తోంది.
షూస్ అడుగు భాగాన కార్బన్ ఫైబర్ ప్లేట్‌కు ఫోమ్ కుషన్ జతచేసి కుట్టడం వల్ల అది స్ప్రింగ్‌లాగా పనిచేస్తుంది. వాటిని ధరించడం వల్ల పరుగెత్తుతున్నప్పుడు గాల్లో ఎగురుతున్నట్లు ఉంటుంది. వీటిని ఇప్పుడు అథ్లెట్స్‌కు ట్రెయినర్స్‌గాను పిలుస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ‘కెంట్ అథ్లెటిక్స్ క్లబ్’లో 90 శాతం మంది అథ్లెటిక్స్ ఇప్పుడు ఈ షూస్‌నే వాడుతున్నారని మిడిల్ డిస్టెన్స్ రన్నర్ ఓవెన్ హింద్ తెలిపారు. బూట్లకు స్ప్రింగ్ యాక్షన్ ఉండడం వల్ల అడుగు దూరంగా పడడంతో ఎక్కువ దూరం ఎక్కువ ప్రయాసం లేకుండా పరుగెత్తవచ్చని ఆయన తెలిపారు.
ఒక తెలుపు రంగులోనే కాకుండా రకరకాల రంగుల్లో ఇవి లభిస్తుండడం వల్ల కూడా అథ్లెటిక్స్‌ను, రన్నర్లకు ఈ షూస్ ఎక్కువ ఆకర్షిస్తున్నాయి. ధర తెలిస్తే మాత్రం కాళ్లు వణకడం ఖాయం. కనీస ధర 240 పౌండ్లు (దాదాపు 22 వేల రూపాయలు)గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment