సాక్షి, హైదరాబాద్: హైకోర్టు తీర్పు నేపథ్యంలో పోలీస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రెండో దశను నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. గురువారం దీనికి సంబంధించి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు షెడ్యూల్ జారీచేసింది. ఈ నెల 11 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాస్‌రావు తెలిపారు. గత డిసెంబర్‌లో నిర్వహించాల్సిన ఈ ప్రక్రియ ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంలోని ఆరు ప్రశ్నలపై కోర్టులో వ్యాజ్యం దాఖలవ్వడంతో వాయిదా పడుతూ వచ్చింది. నాలుగు రోజుల క్రితం సంబంధిత పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడంతో బోర్డు అధికారులు నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. దేహదారుఢ్య పరీక్ష నిర్వహణకు 40 రోజుల పాటు నిర్విరామ షెడ్యూల్ ఉంటుందని, ఈ నెల 11 నుంచి టెస్టులు నిర్వహించనున్నట్టు తెలిపారు. గత షెడ్యూల్‌లో ఉన్న హైదరాబాద్ గోషామహల్ స్టేడియం, వరంగల్ కాకతీయ వర్సిటీ గ్రౌండ్‌ను ఫిజికల్ టెస్టుల నిర్వహణ జాబితా నుంచి తొలగించామని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో 3 గ్రౌండ్లు..:ప్రస్తుతం ఫిజికల్ టెస్టులను హైదరాబాద్‌లోని మూడు గ్రౌండ్లు, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లా కేంద్రాల్లోని హెడ్‌క్వార్టర్స్ గ్రౌండులో నిర్వహించనున్నట్టు బోర్డు చైర్మన్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇకపోతే గతంలో డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డులు కాకుండా మళ్లీ కొత్తగా రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ అర్ధరాత్రి వరకు సంబంధిత అభ్యర్థులు అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్‌లో ఏవైనా సాంకేతిక సమస్యలుంటే 9393711110 లేదా 9391005006 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. అలాగే టupఞౌట్టః్టట pటb. జీn మెయిల్‌కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.
11 నుంచి ‘పోలీస్’ దేహదారుఢ్య పరీక్షలు
Published Fri, Feb 1 2019 12:17 AM | Last Updated on Fri, Feb 1 2019 12:17 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment