పోలీసు భూమిపై మాజీ పోలీస్‌ భార్య కన్ను  | TDP Mandra Sivananda Reddy Wife Umadevi On Land Grabbing Case | Sakshi
Sakshi News home page

పోలీసు భూమిపై మాజీ పోలీస్‌ భార్య కన్ను 

Published Wed, Apr 3 2024 5:00 AM | Last Updated on Wed, Apr 3 2024 5:00 AM

TDP Mandra Sivananda Reddy Wife Umadevi On Land Grabbing Case - Sakshi

గ్రేహౌండ్స్‌ స్థలం కాజేయడానికి యత్నించిన శివానందరెడ్డి భార్య 

సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి పక్కా స్కెచ్‌ 

రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్‌లో కేసు  

నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షిట్‌ దాఖలు  

అది ప్రభుత్వ భూమే అని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు  

మంచిరేవులలోని ఆ భూమి విలువ రూ.2,500 కోట్ల పైనే 

సాక్షి, హైదరాబాద్‌: అసైన్డ్‌ ల్యాండ్స్‌ స్కామ్, ప్రీలాంచ్‌ ఆఫర్స్‌ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్‌ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు.

దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్‌ ఫైల్‌ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్‌ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్‌ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్‌ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్‌ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్‌ ఆధీనంలోనే ఉంది. అ

స్టే ఉత్తర్వులు ఉన్నా.. 
కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్‌ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్‌ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్‌ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్‌ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు.

ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్‌ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్‌ రెవెన్యూ అధికారులు హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్‌ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్‌ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది.   

అరెస్టులు వద్దు 
మరోవైపు బుద్వేల్‌ అస్సైన్డ్‌ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్‌ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్‌(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement