lands scam
-
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారు.. చివరకు
'అమరావతి రాజదాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చింది.. ఇదంతా తనకు అంతర్జాతీయగా ఉన్న పలుకుబడివల్లే .."అని 2014-2019 మధ్య ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పదే, పదే చెప్పుకున్న మాటలు. ఆయనకు మాటలకు తగినట్లే సింగపూర్ దేశ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ తరచు అమరావతి రావడం, చంద్రబాబుతో ముచ్చట్లు పెట్టుకోవడం, ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ ను ఆరంభించడానికి ఒప్పందం చేసుకోవడం గమనించిన పలువురు నిజంగానే ఏపీ మీద, ఎపి రాజధాని మీద అభిమానంతోనే సింగపూర్ మంత్రి తరచు వస్తున్నారేమోలే అని అనుకునేవారు. కాని అప్పట్లోనే నిశితంగా పరిశీలన చేసే కొందరు మాత్రం ఇందులో ఏదో మోసం ఉందని అనేవారు. వారి మాటలను తోసిపుచ్చుతూ వారిని అమరావతి యజ్ఞాన్ని పాడుచేసే రాక్షసులు మాదిరి అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శిస్తుండేవారు. ఈశ్వరన్ లాగానే బిడిశెట్టి అనే మిత్రుడు కూడా చంద్రబాబుకు ఉన్నారు. ✍️ ఆయనకు కూడా ఏదో మెడికల్ హబ్ పెడతారని చెప్పి అమరావతిలో వంద ఎకరాల భూమిని తక్కువ ధరకు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. విశేషం ఏమిటంటే చంద్రబాబు మిత్రులు ఇద్దరూ అవినీతి , హవాలా కేసులలో చిక్కుకోవడం. ఈశ్వరన్ అవినీతి కేసులో చిక్కి సింగపూర్ లో అరెస్టు అవడం తదుపరి మంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. బిడి శెట్టిని దుబాయి జైలులో అక్కడి ప్రభుత్వం పెట్టింది. మరో ఆసక్తికరపరిణామం ఏమిటంటే ఏపీలో చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, రాజదాని కేసులు మొదలైనవాటిలో ఇరుకున్నారు. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి 53 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ముగ్గురు మిత్రులు అవినీతి ఊబిలో ఉన్నారన్నమాట. సింగపూర్ లో ఈశ్వరన్ పై మొత్తం 27 అభియోగాలు వచ్చాయి. ✍️చంద్రబాబుకు సన్నిహితులైన ఈశ్వరన్ ,బిడి శెట్టి వంటివారు అరెస్టు అవడంంతో తెలుగుదేశం పార్టీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. వీరి అరెస్టుపై చంద్రబాబు స్పందించలేదు. కనీసం ఈశ్వరన్ కు సానుభూతి కూడా తెలపలేదు. అదే వైసిపికి సంబంధించినవారికి తెలిసినవారెవరైనా ఇతర దేశాలలో కేసులలో చిక్కితే ఇదే చంద్రబాబు కొండెక్కి అరిచేవారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ కేసులలో కొందరు అధికారులను పెడితే అదంతా జగన్ తో సంబంధాల వల్లే అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు తన మిత్రుల అరెస్టుపై కిక్కురుమనలేకపోతున్నారు. ఈశ్వరన్, శెట్టిల పై వచ్చిన అవినీతి కేసుల గురించి ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు కుక్కిన పేల మాదిరి నోరు మెదపలేదు. సింగపూర్ దేశ ప్రభుత్వం వారు మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇస్తున్నారని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారు. ✍️తీరా చూస్తే అది అసత్యమని ఆ తర్వాత తేలింది. సింగపూర్ కు చెందిన కొన్ని ప్రైవేటు కంపెనీలతో కన్సార్టియమ్ ఏర్పాటు చేసి ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ తయారు చేయాలని సంకల్పించారు. మామూలుగా అయితే దానిని తప్పు పట్టనక్కర్లేదు. కాని అవేదో సింగపూర్ దేశ ప్రభుత్వ కంపెనీలే వచ్చి ఈ వెంచర్ ను ఆరంభిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుండేవారు. దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు బాకాలు ఊదుతుండేవి. తీరా చూస్తే అవి ప్రైవేటు కంపెనీలని తదుపరి వెల్లడైంది. సింగపూర్ ప్రభుత్వంతో ఆ సందర్భంలో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అందరిని విస్తుపరచింది. సింగపూర్ కంపెనీలు 300 కోట్ల రూపాయలను పెట్టుబడి పెడితే, ఏపీ ప్రభుత్వం సుమారు 5600 కోట్ల రూపాయల మేర వ్యయం చేసి ఆ వెంచర్ కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడానికి అంగీకరించింది. ✍️ కంపెనీతో ఏదైనా తేడా వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలన్న కండిషన్ పెట్టారు. స్విస్ చాలెంజ్ పద్దతిన ఈ వెంచర్ కు భూమి కేటాయించినట్లు అప్పట్లో ప్రకటించారు. దీనిపై అప్పట్లో హైకోర్టు తప్పుపడితే, మళ్లీ చట్టాన్ని మార్చి మరీ తాము అనుకున్న స్కీమును చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసింది. విశేషం ఏమిటంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కంపెనీకి 56 శాతం వాటా ఇచ్చి, ఏపీ ప్రభుత్వం మాత్రం మైనర్ వాటాదారుగా ఒప్పుకోవడం. ఈ వ్యవహారంపై ఎందరు అభ్యంతరం చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదు. ఏకంగా 1600 ఎకరాల భూమిని ఇందుకోసం కేటాయించారు. ✍️నిజానికి ఇలాంటి స్కీములు అమలు చేయడానికి ముందుగా వాస్తవ పరిస్థితిని సర్వే చేసి డిమాడ్ నిర్ణయించుకుంటారు. అవేవి లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్ ఏర్పాటు చేయడం అంటే, చుట్టుపక్కల ఉన్న తమ భూముల విలువలను పెంచుకోవడానికే అన్నది బహిరంగ రహస్యం. ఈ వివాదాస్పద నిర్ణయం పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చే టైమ్ కి చంద్రబాబు ప్రభుత్వం ఓటమిపాలైంది. కొత్తగా వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని విషయాలను పరిశీలించడంతో ,తమ లొసుగులు బయటపడుతున్నాయని భావించిన సింగపూర్ కంపెనీల కన్సార్షియం తమ ఒప్పందాన్ని రద్దు చేసుకుని వెళ్లిపోతామని ప్రభుత్వానికి తెలియచేసింది.దాంతో ఆ కధ ముగిసింది. చంద్రబాబు,ఈశ్వరన్ కలిసి చేపట్టిన రియల్ ఎస్టేట్ వెంచర్ భాగోతం అంతా బట్టబయలైంది. ఆ తర్వాత కాలంలో ఈశ్వరన్ పై అవినీతి కేసులు వచ్చాయి. ✍️సింగపూర్ దేశం ఇలాంటి అవినీతి వ్యవహారాలను అసలు అంగీకరించదు.అందువల్లే ఆయనను పదవినుంచి తప్పించడమే కాకుండా ఆ కేసుల విచారణకుఆదేశాలు ఇచ్చారు. ఈ నేపధ్యంలో చంద్రబాబుకు సింగపూర్ లో కూడా బినామీ లావాదేవీలు ఉన్నాయని, వాటికి ఈశ్వరన్ సహకారం ఉండి ఉంటుందని, అందువల్లే ఆయనకు ఏపీలో లాభం చేకూర్చే యత్నం చేశారని వివిధ రాజకీయ పక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈశ్వరన్ కు సంబంధించిన అన్ని లావాదేవీలను పరిశీలిస్తే ఇలాంటి స్కామ్ లు ఏవైనా ఉంటే బయటపడవచ్చన్న భావన కూడా ఉంది. అమరావతి రాజధానిని ప్రైవేటు రియల్ ఎస్టేట్ వెంచర్ గా చంద్రబాబు మార్చారనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ అవసరం ఉండదు. ✍️ అవసరం లేకపోయినా 34 వేల ఎకరాల భూమి సేకరించడం, వారికి ఏటా సుమారు 250 కోట్ల రూపాయల కౌలు చెల్లించవలసి రావడం, వారికి అభివృద్ది చేసిన ప్లాట్లు ఇవ్వడానికి లక్ష కోట్ల రూపాయల వ్యయం చేయాల్సి ఉండడం ..ఇవన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాని ఫలితంగానే అమరావతి ప్రాంతంతో సహా రాష్ట్రం అంతా తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అయితే కొద్ది రోజుల క్రితం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు భోగి మంటలు వేసుకుని, మళ్లీ అమరావతిలోనే లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. తద్వారా ఏపీ వ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాల ప్రజలకు నష్టం చేయబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. ✍️రాష్ట్ర ప్రజల సొత్తు అంతటిని ఒక్క అమరావతిలోనే ఖర్చు చేస్తామని చంద్రబాబు, పవన్ లు చెబితే మళ్లీ ఇతర ప్రాంతాలలో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని విషయంలో తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి కుల రాజధాని అని, ఇక్కడ శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చినవారెవరైనా నివసించే పరిస్థితి ఉందా అని అడిగేవారు.కాని ఆశ్చర్యంగా ఏ రకమైన ఒప్పందం కుదిరిందో తెలియదు కాని చంద్రబాబు తో ఆయన కూడా మిలాఖత్ అయిపోయారు. ✍️ఇన్ సైడ్ ట్రేడింగ్ ,అస్సైన్డ్ భూముల స్కామ్ మొదలైనవి ఉండనే ఉన్నాయి. సింగపూర్ మంత్రి ఈశ్వరన్ కు అమరావతి అవినీతితో కూడా ఏమైనా సంబంధం ఉందా? చంద్రబాబుకు, ఆయనకు మద్య ఉన్న లావాదేవీలు ఏమిటి? అన్నవాటిపై విచారణ జరగలేదు. మొత్తం మీద అమరావతి అంటే అదొక అవినీతి కేంద్రం అన్న భావన ఏర్పడిన నేపధ్యంలో ఈశ్వరన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అలాగే శెట్టి గోల్ మాల్ వెల్లడైంది. వీటిపై చంద్రబాబు వివరణ ఇచ్చి, ఆ తర్వాత అమరావతి గురించి మాట్లాడితే జనం అప్పుడు ఆయన చెప్పిన మాటలలోని విశ్వసనీయత గురించి ఆలోచిస్తారు. లేకుంటే కచ్చితంగా ఈ అవినీతి ఊబిలో చంద్రబాబు బృందానికి కూడా ఏదో లింక్ ఉందని అనుమానిస్తారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా: సీఐడీ విచారణలో నారాయణ తీరు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం హయాంలో జరిగిన అమరావతి భూముల కుంభకోణం కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. అసైన్డ్ భూములు, బినామీ పేర్లతో భూములు కొనుగోలు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ రూపొందించడంలో అక్రమాలపై సీఐడీ అధికారులు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని సమాచారం. తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా అనే రీతిలో నారాయణ వ్యవహరించారని తెలిసింది. ఈ మేరకు సీఐడీ అధికారులు నారాయణ, ఆయన భార్య పి.రమాదేవి, నారాయణ విద్యా సంస్థల ఆర్థిక వ్యవహారాల కోసం ఏర్పాటు చేసిన ఎన్ స్పైరా సంస్థలో కీలక స్థానంలో ఉన్న పొత్తూరి ప్రమీల అనే ఉద్యోగిని హైదరాబాద్‌లో సోమవారం వేర్వేరుగా విచారించారు. నారాయణ విద్యా సంస్థలు, ఎన్ స్పైరా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు నిధుల బదలాయింపుపై సీఐడీ అధికారులు నారాయణను ప్రశ్నించారు. ఇక ఆ నిధులతో బినామీల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన రికార్డులు చూపిస్తూ పలు ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. అలాగే నారాయణ బినామీల పేరిట కొనుగోలు చేసిన భూముల సమీపంలోనే స్టార్టప్ సిటీ వచ్చేలా సీఆర్డీఏ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించిన ఉదంతంపైన కూడా వివరాలు అడిగారు. ఆ సమయంలో మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ మాస్టర్ ప్లాన్‌ను ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. అలాగే నారాయణ విద్యా సంస్థలు, చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, వారి సన్నిహితుడు లింగమనేని కుటుంబానికి చెందిన సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చేలా నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడటంపై కూడా సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కానీ నారాయణ ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీఐడీ విచారణకు ఏమాత్రం సహకరించకూడదని ఆయన ముందుగానే ఓ నిర్ధారణకు వచ్చినట్టుగా వ్యవహరించారని సమాచారం. అలాగే నారాయణ భార్య రమాదేవి, పొత్తూరి ప్రమీల కూడా విచారణకు ఏమాత్రం సహకరించ లేదు. నారాయణ కుమార్తెను ఇంటి వద్దే విచారించండి అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరు కావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ నారాయణ కుమార్తె సింధూర, ఆమె భర్త పునీత్, అతడి సోదరుడు వరుణ్ కుమార్, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ బాబీలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి సోమవారం విచారణ జరిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, సింధూరను ఆమె ఇంటి వద్దే ఈ నెల 20న విచారించాలని సీఐడీని ఆదేశించారు. అలాగే అదే రోజున సీఐడీ ముందు హాజరు కావాలని పునీత్, వరుణ్‌లకు సైతం ఆదేశాలు జారీ చేశారు. ఇక అంజనీ కుమార్‌ను అదే రోజున న్యాయవాది సమక్షంలో విచారించాలని సీఐడీకి సూచించారు. -
మాజీ మంత్రి నారాయణను ప్రశ్నిస్తున్న సీఐడీ అధికారులు
-
అమరావతి భూముల కేసును కొట్టేసిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: అమరావతి భూముల కుంభకోణంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనం సోమవారం సుదీర్ఘంగా విచారించింది. చివరకు పిటిషన్లో యోగ్యతలు లేవని కొట్టివేసింది. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తన వాదనలు వినిపిస్తూ.. అధికారిక రహస్యాల ఉల్లంఘనకు సంబంధించిన సెక్షన్ 418ను హైకోర్టు విస్మరించిందని తెలిపారు. కొనుగోలుదారులకు భూములు ఎందుకు కొంటున్నారో తెలుసని అమ్మకందారులకు మాత్రం తెలియదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆస్తుల బదిలీ (టీపీ) చట్టం సెక్షన్ 55ను ప్రస్తావిస్తూ.. భూమి కొనుగోలు సమయంలో అమ్మకందారుడికి కొనుగోలుదారుడు ఎందుకు కొంటున్నారనే అంశాన్ని వివరించాల్సి ఉందన్నారు. హైకోర్టు అనేక అంశాలు విస్మరించిందని, నోటీసులు జారీ చేసి విచారణకు అనుమతి ఇవ్వాలని కోరారు. హైకోర్టు ప్రాథమిక దశలోనే దీనిని కొట్టేసిందని వివరించారు. హైకోర్టు తీర్పు ప్రతిని చదువుతూ.. భూములు కొనుగోలు చేయడం రాజ్యాంగ హక్కుగా హైకోర్టు పేర్కొందని, న్యాయమూర్తికి ఓ చీటింగ్ కేసులో రాజ్యాంగ హక్కు ఎలా కనిపించిందో అర్థం కాలేదన్నారు. ప్రైవేటు వ్యక్తుల భూముల కొనుగోళ్లు, అమ్మకాలలో క్రిమినల్ చట్టాలు ఎలా వర్తింపజేస్తారని హైకోర్టు ప్రశ్నించిందని, విచారణ చేసినప్పుడే కదా అవన్నీ బయటపడేదని దవే వాదించారు. ఇవన్నీ విస్మరించిన హైకోర్టు ప్రాథమిక దశలోనే కేసును కొట్టేసిందని పేర్కొన్నారు. రాజధాని ఆ ప్రాంతంలో వస్తుందన్న విషయాన్ని కప్పిపుచ్చి భూములు కొనుగోలు చేశారని ఫిర్యాదుదారుడు ఎస్.సురేష్ తరఫు సీనియర్ న్యాయవాది పారస్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఓ తెలుగు (సాక్షి కాదు), ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా అమరావతి భూముల స్పెక్యులేషన్‌కు తెరపడిందంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదన్నారు. సీఆర్డీఏ కూడా 2014 డిసెంబర్ 30న నోటిఫికేషన్ ఇచ్చిందని పారస్ తెలిపారు. ప్రతివాదుల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, సిద్ధార్థ లూత్రా కూడా వాదనలు వినిపించారు. వాదనల అనంతరం అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని ధర్మాసనం ప్రకటించింది. -
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ హయాంలో రాజధాని అమరావతిలో వేల ఎకరాల భూ దోపిడీకి పాల్పడటంపై సీబీఐతో దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేసింది. పార్టీ ఎంపీలు ఆదివారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నానిర్వహించి ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, ఎంపీలు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వల్లభనేని బాలశౌరి, బీవీ సత్యవతి, తలారి రంగయ్య, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, గోరంట్ల మాధవ్, బెల్లాన చంద్రశేఖర్ తదితరులు ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. రూ.40 వేల కోట్లకుపైగా దోపిడీ: ఎంపీ కోటగిరి శ్రీధర్ ► ప్రతి ఇంటికీ పథకాల లబ్ధి చేకూరుస్తూ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ 15 నెలలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తోంది. వలంటీర్ వ్యవస్థ ద్వారా పాలనను సామాన్యుడి చెంతకే చేర్చింది. మేం రాజకీయాల్లోకి వచ్చి మొట్టమొదటిసారిగా ఎంపీగా గెలిచాం. వైఎస్సార్సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నాం. ప్రజలంతా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు. ► 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు అనుభవం ఏపాటిదో ఇప్పుడు కనబడుతోంది. ఆ అనుభవం మతవిద్వేషాలను రెచ్చగొడుతోంది. బీజేపీలో ఉన్న తన సన్నిహితులతో రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నారు. అమరావతిలో 4 వేల ఎకరాలను తన సొంత మనుషులకు, అప్పటి అడ్వొకేట్ జనరల్‌కు, జడ్జిల కుటుంబ సభ్యులకు పంచిపెట్టారు. భూముల కుంభకోణంలో రూ. 40 వేల కోట్ల మేర దోపిడీ జరిగింది. ఎవరికి ఎన్ని భూములు ఉన్నాయి? ఎక్కడ కొన్నారు? రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని సీబీఐ దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలి. ► చంద్రబాబు అధికారంలో ఉండగా వైఎస్సార్సీపీ నుంచి ముగ్గురు ఎంపీలను తీసుకెళితే ఎన్నికల్లో ఆయనకు ముగ్గురే మిగిలారు. వచ్చే ఎన్నికల్లో మీకు ఒక్క ఎంపీ మాత్రమే మిగులుతారు. ► రికార్డు స్థాయిలో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించి అత్యధిక సీట్లు గెల్చుకున్నా.. ప్రతి విషయానికి కోర్టులు అడ్డుపడుతున్నాయి. వైఎస్సార్ సీపీ సామాన్యుడి కోసం పుట్టిన పార్టీ. అభివృద్ధి పనులతో ప్రజల మనసులను గెలుచుకుంటాం. ప్రజలు అంతా గమనిస్తున్నారు: మోపిదేవి వెంకట రమణారావు ► అమరావతిలో భూముల అక్రమాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో నిలదీశారు. వీటిని వెలుగులోకి తెచ్చేందుకు అధికారంలోకి వచ్చాక కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. దర్యాప్తుల్లో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ► వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలియకూడదని సాక్షాత్తూ న్యాయస్థానం నిబంధన విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతవరకు సమంజసం? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే స్టే, సామాన్యుడు ఇంగ్లిష్ అభ్యసించేందుకు అవకాశం కల్పిస్తే దానిపై స్టే, రాజధాని భూముల కుంభకోణంపై దర్యాప్తుజరగకుండా స్టే.. ఇలా ఏ పనిచేసినా స్టే వస్తోంది. ఏపీలో జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు. తప్పు చేయబట్టే అడ్డుకుంటున్నారు: వల్లభనేని బాలశౌరి చంద్రబాబు మొదటి నుంచి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ బతుకుతున్నారు. ఓటుకు కోట్లు కేసు నుంచి అన్ని స్కాముల్లో ఇదే వైఖరి. ఏ తప్పు చేయనప్పుడు, దర్యాప్తు నిలిపివేయమని అడగాల్సిన పని ఏముంది? తప్పు చేశారు కాబట్టే అడ్డుకుంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఇది ఎన్నో రోజులు కుదరదు. రాష్ట్ర ప్రజలకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దర్యాప్తు జరిపే వరకు పార్లమెంటులో నిరసన వ్యక్తంచేస్తూనే ఉంటాం. -
మీ గ్యాగ్ ఆర్డర్‌ను సవరించండి
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఇద్దరు కుమార్తెలపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లోని వివరాలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాలో ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ హైకోర్టులో ఓ అనుబంధ పిటిషన్ దాఖలైంది. తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది గలేటి మమత రాణి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అంతేకాక.. అమరావతి భూ కుంభకోణం కేసులో తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ దమ్మాలపాటి శ్రీనివాస్ దాఖలు చేసిన వ్యాజ్యంలో తమను ప్రతివాదిగా చేర్చుకుని, తమ వాదనలు వినాలని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో కోర్టును కోరారు. ఆంక్షలతో పౌరుల హక్కులకు భంగం అధికరణ–19 ప్రకారం.. ‘భావ ప్రకటన స్వేచ్ఛ’ అత్యంత పవిత్రమైన హక్కుగా రాజ్యాంగం గుర్తించిందని మమత రాణి తన అనుబంధ పిటిషన్లో పేర్కొన్నారు. ఆ పవిత్ర హక్కులో మీడియా హక్కులు కూడా మిళతమై ఉన్నాయన్నారు. ఈ హక్కులను కాలరాసే విధంగా పూర్తిస్థాయి ఆంక్షలు విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడంవల్ల రాజ్యాంగంలోని అధికరణ–19(1) (ఏ) ద్వారా పౌరులకు సంక్రమించిన హక్కులకు భంగం కలిగించడమేనని ఆమె వివరించారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు రాజ్యాంగం ప్రకారం అపరిమితమైనది కాదని.. అధికరణ–19(2) కింద రాజ్యాంగం ఆ హక్కుపై కొన్ని పరిమితులు విధిస్తోందని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, ఈ కేసులో పూర్తిస్థాయి నిషిద్ధ ఉత్తర్వులు జారీచేయడం భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులకు విఘాతం కలిగించడమే అవుతుందని.. న్యాయస్థానాలు ఇలా చేయడానికి వీల్లేదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును పలు న్యాయస్థానాల తీర్పులు సమర్థించాయని వివరించారు. ప్రజాస్వామ్య మనుగడకు మీడియా హక్కులు ఎంతో అవసరమని ఆమె తెలిపారు. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఉత్తర్వులవల్ల తన హక్కులు ఎంతో ప్రభావితం అయ్యాయన్నారు. అందువల్ల ఈ కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలను వినాలని ఆమె కోర్టును కోరారు. అలాగే, ఈ ఏడాది జనవరి 10న ‘అనురాధా భాసిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును మమత రాణి తన వ్యాజ్యంలో ప్రస్తావించారు. పత్రికా స్వేచ్ఛపై జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఏం చెప్పిందంటే.. ప్రజాస్వామ్యంలో పత్రికలు స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితులు ఉండాలి. స్వేచ్ఛాయుత హక్కు రాజ్యాంగం ప్రసాదించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఈ హక్కులను ప్రభుత్వాలతో సహా అందరూ గౌరవించాలి. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో పత్రికల ప్రాచుర్యం ఎంతగానో పెరిగింది. పత్రికలను అడ్డుకుంటే సమాచార వ్యాప్తికి అడ్డుకట్ట వేసినట్లే. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ, ఇంటర్నెట్ వినియోగం వంటి స్వేచ్ఛలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంది. రాజ్యాంగంలోని అధికరణ–19 ప్రకారం.. ప్రాథమిక హక్కుల్లో ఇంటర్నెట్ సౌకర్యం ఒకటి. దీని ద్వారా అతి ఎక్కువ మందికి తక్కువ కాలంలో సమాచారాన్ని చేరవేసే సౌలభ్యం ఉంది. దాన్ని మేం కాదనడంలేదు. వివిధ సాకులు, కారణాలు చూపి, ఆ సౌలభ్యాన్ని కాలరాయడానికి వీల్లేదు. పత్రికా స్వేచ్ఛను కూడా ప్రభుత్వాలు కాపాడాలి. జర్నలిస్టులు తమ విధులను నిర్వర్తించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. -
రాణి భూములు ఫర్ సేల్!
పెళ్లకూరు: పేదలకు దక్కాల్సిన ప్రభుత్వ భూములను అధికారులు చేతివాటంతో స్థానికేతరులకు అప్పగించేందుకు అధికారపార్టీకి చెందిన ఓ నేత కనుసన్నల్లో ఇక్కడి వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు అందరూ సూత్రధారులై ‘రాణి భూములు’ విక్రయానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మండల కేంద్రం పెళ్లకూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1/1 నుంచి 1/5లో 310 ఎకరాల సీలింగ్ భూములు ఉన్నాయి. ఈ భూములన్నీ స్థానికులైన నిరుపేదలకు చెందాలని అప్పట్లో వెంకటగిరి రాణి సామ్రాజ్యలక్ష్మి వీలునామా రాసినట్లు సమాచారం. అయితే శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఓజిలి మండలాలకు చెందిన మైనంపాటి మునెయ్య, వేము కృష్ణయ్య, గెడ్డాం జ్ఞానమ్మ, కోవి వెంకటసుబ్బయ్య అనే స్థానికేతరులు 19.50 ఎకరాలను ఆక్రమించుకొని చాలా కాలంగా సాగు చేస్తున్నారు. ఇక్కడ స్థానికేతరులు సాగుచేస్తున్న 19.50 ఎకరాలు కూడా పేదలకే పంపిణీ చేయాల్సిఉంది. అయితే అప్పట్లో స్థానికేతరులు తాము సాగుచేస్తున్న భూములపై తమకే హక్కు ఉందంటూ సూళ్లూరుపేట కోర్టులో రిట్ వేశారు. పెళ్లకూరులోని ప్రభుత్వ భూములు స్థానిక పేదలకే చెందాలని స్థానికేతరులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. కొంతకాలానికి సాగుదారుల్లో ముగ్గురు చనిపోవడంతో వారి వారసులు మళ్లీ నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించారు. అక్కడ స్థానికేతరులైన భూస్వాములకు కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో అప్పటి కలెక్టర్ ఎం.జానకిని కలిసి తమకు భూములు పంపిణీ చేసి పట్టాలు మంజూరు చేయాలని స్థానికేతరులు కోరారు. అయితే కలెక్టర్ జానకి అప్పటి తహసీల్దార్ కేఎం రోజ్‌మాండ్‌ను తన కార్యాలయానికి పిలిపించుకొని 19.50 ఎకరాలకు సంబంధించి హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. కానీ తహసీల్దార్ రోజ్‌మాండ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయకుండానే బదిలీపై వెళ్లిపోయారు. గ్రామంలో కొందరు దళిత నాయకులు ఇటీవల స్థానిక తహసీల్దార్ నాగరాజలక్ష్మిని కలిసి హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని రాత పూర్వకంగా విన్నవించారు. కానీ ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం తరపున హైకోర్టులో రిట్ దాఖలు చేయకుండా నెల్లూరు ఏటీసీ కోర్టు ఆదేశాలను అమలు చేసేందుకు భారీ కుంభకోణానికి ఎత్తుగడ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఎకరానికి రూ.35 వేలు స్థానికేతరులైన భూస్వాముల ఆధీనంలో ఉన్న 19.50 ఎకరాల భూములకు పట్టాలు మంజూరు చేసేందుకు ఒక్కో ఎకరానికి రూ.35 వేల చొప్పున రెవెన్యూ యంత్రాంగం భేరం కుదుర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత కలెక్టర్‌కు తెలియజేయకుండానే ఇక్కడి వీఆర్వో నుంచి తహసీల్దార్ వరకు భారీ మొత్తంలో ముడుపులు తీసుకొని వేగంగా సర్వే పనులు పూర్తి చేయడం గమనార్హం. నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలను తక్షణమే అమలు చేసేందుకు ఇక్కడ రెవెన్యూ అధికారులకు, స్థానికేతరులకు మధ్య అధికారపార్టీకి చెందిన ఓనాయకుడు పావులు కదుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే జూన్ 15న ఇక్కడి 19.50 ఎకరాల భూములు సర్వేకి చలానా చెల్లించగా రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు 17వ తేదీ ఆదివారం అయినప్పటికీ క్షేత్రస్థాయి రెవెన్యూ సిబ్బంది భూములను వేగవంతంగా సర్వే చేయడం గమనార్హం. సర్వే పనులు పూర్తి చేసి దానికి సంబంధించిన నమూనా రూపొందించడంతో స్థానికేతరుల నుంచి ఇక్కడి రెవెన్యూ అధికారులకు అడ్వాన్స్ పేమెంట్ రూ.5 లక్షలు అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలకు తూట్లు అప్పటి కలెక్టర్ ఎం.జానకి ఆదేశాలను పట్టించుకోకుండా ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం స్థానికేతరులైన భూస్వాములకు భూములు అప్పగించేందుకు వేగవంతంగా ఫైళ్లు కదపడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు అప్పీలేట్ ట్రిబ్యునల్ కోర్టు స్థానికేతరులకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును అమలు చేయాలని ప్రస్తుత కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కూడా ఎలాంటి ఆదేశాలు జారీ చేయకుండానే ఇక్కడి రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కోనేరు రంగారావు కమిటీ ప్రకారం మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల లోపు పట్టాలు మంజూరు చేయకూడదనే నిబంధనలు ఇక్కడ నీరుగారుతున్నాయి. కోర్టులో వ్యాజ్యం నడిపిన స్థానికేతరులు ప్రస్తుతం ముగ్గురు మృతిచెందారు. కానీ వాళ్ల వారసుల పేరుతో ఒక్కొక్కరి 5 ఎకరాల చొప్పున పట్టాలు మంజూరు చేసేందుకు ఇక్కడి రెవెన్యూ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించడంపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. సెంటు భూమి లేదు గ్రామంలో మాకు సెంటు భూమి లేదు. ప్రతి రోజూ వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. కలెక్టర్ స్పందించి పేదలకు భూములు ఇప్పించాలి.– మేక వెంకటమ్మ, పెళ్లకూరు -
శంకరమఠం భూములు మాయం
-
శంషాబాద్‌లోనూ ‘భూ మాయ’!
200 కోట్ల విలువ చేసే 317 ఎకరాల ప్రభుత్వ భూమికి ‘గోల్డ్‌స్టోన్’ ఎసరు ♦ శంషాబాద్ మండలం ఘాంసిమియాగూడలో అక్రమ దందా ♦ మియాపూర్ భూముల తరహాలో కాజేసేందుకు భారీ స్కెచ్ ♦ సర్కారు 40 ఏళ్ల కిందే రైతులకు అసైన్ చేసిన భూములు ♦ నిజాం వారసుల భూమిగా పేర్కొంటూ గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు జీపీఏ ♦ అనంతరం గోల్డ్‌స్టోన్ అనుబంధ కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ శంషాబాద్ రూరల్ (రాజేంద్రనగర్) హైదరాబాద్ మహానగరం చుట్టూ రంగారెడ్డి జిల్లా పరిధిలో జరిగిన కోట్లాది రూపాయల భూముల కుంభకోణంలో మరో అక్రమం వెలుగులోకి వస్తోంది. హైదరాబాద్‌కు తలమానికమైన శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని ఘాంసిమియాగూడలో ఏకంగా 317 ఎకరాల సర్కారు భూములు అన్యాక్రాంత మయ్యాయి. దీని వెనుక కూడా మియాపూర్ భూ కుంభకోణం ప్రధాన నిందితుడు గోల్డ్‌స్టోన్ సంస్థ యజమాని ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతో విలువైన భూములు.. శంషాబాద్ మండలంలోని ఘాంసిమియాగూడలోని సర్వే నంబర్–4లో 317.23 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూములను నాలుగు దశాబ్దాల కింద అప్పటి సర్కారు 62 మంది రైతులకు పంపిణీ (అసైన్మెంట్) చేసింది. ఈ ప్రాంతం జీవో 111 పరిధిలో ఉన్నప్పటికీ.. శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్), ప్రతిష్టాత్మక ఐఎంటీ కళాశాలకు సమీపంలో ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అంతేగాకుండా బెంగళూరు జాతీయ రహదారికి చేరువలో ఉండడం.. ఓఆర్ఆర్ను, జాతీయ రహదారిని కలుపుతూ ఏర్పాటు చేసిన పీ–వన్ రోడ్డు ఈ భూముల పక్క నుంచే వెళ్లింది. దీంతో ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షలకుపైగా పలుకుతోంది. సుమారు రూ.200 కోట్లు విలువ చేసే ఈ భూములను కాజేయడానికి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పావులు కదిపారు. మియాపూర్ భూముల తరహాలోనే.. 317 ఎకరాల భూములను చేజిక్కించుకునేందుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పక్కా స్కెచ్ వేశారు. ఈ భూములను మియాపూర్ కుంభకోణం తరహాలో నవాబుల వారసులకు చెందిన ‘పైగా’భూములుగా చూపారు. నవాబుల వారసులుగా పేర్కొన్న వారి నుంచి గోల్డ్‌స్టోన్ ప్రసాద్ పేరిట జీపీఏ చేసుకున్నారు. తర్వాత ఈ భూములను గోల్డ్‌స్టోన్ అనుబంధ కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాదు అప్పటికే ఈ భూములను సాగుచేస్తున్న అసైన్డ్ రైతులకు ఎంతో కొంత ముట్టజెబుతూ, బెదిరిస్తూ వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఇప్పటికే వంద ఎకరాలు స్వాధీనం.. ఘాంసిమియాగూడ్లోని ఈ భూములను చాలా ఏళ్లుగా అసైన్డ్ రైతులు సాగుచేస్తున్నారు. దీంతో భూముల స్వాధీనం కోసం గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టారు. తప్పుడు పత్రాలతో కోర్టులకు వెళ్లి.. తనకు అనుకూలంగా తీర్పు సంపాదించారు. దాంతో కోర్టు ఉత్తర్వుల మేరకు భూముల స్వాధీనానికి ఇక్కడి ఆర్డీవో ఎనిమిదేళ్ల కింద రైతులకు నోటీసులు పంపారు. అయితే రైతులెవరూ పెద్దగా స్పందించకపోవడంతో ఆర్డీవో స్థాయిలో గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దాంతో ఈ భూములను స్వాధీనం చేసుకునే పనిని వేగవంతం చేశారు. రైతులను పంపించివేయడానికి కొందరికి ఎంతో కొంత సొమ్ము ముట్టజెప్పడం, మరికొందరిని బెదిరించడం ద్వారా తమ దారికి తెచ్చుకున్నారు. ఇలా దాదాపు వంద ఎకరాలను రైతుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూముల చుట్టూ కంచె వేసి.. ఓ గెస్ట్‌హౌస్ కూడా నిర్మించారు. గోల్డ్‌స్టోన్ ప్రసాద్, ఆయన కంపెనీల డైరెక్టర్లు అప్పుడప్పుడు ఆ గెస్ట్‌హౌస్‌కు వచ్చి వెళుతుంటారని తెలిసింది. మిగిలింది కొంత భూమే! 317 ఎకరాల భూములను 62 మంది రైతులకు అసైన్ చేయగా.. దాదాపు 95 శాతం మంది తమ భూములను కొన్నేళ్ల కిందే అమ్మేసుకున్నారు. ఇప్పుడు కేవలం 30 ఎకరాల వరకు భూమి మాత్రమే అసైన్డ్ రైతుల ఆధీనంలో ఉంది. మిగతా భూమిలో 100 ఎకరాలకుపైగా గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ఆధీనంలోకి వెళ్లిపోగా.. మరికొంత భూమి రైతుల నుంచి కొనుగోలు చేసిన వారి స్వాధీనంలో ఉంది. ఇలా రైతుల నుంచి కొనుగోలు చేసినవారి వద్ద ఉన్న భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒత్తిళ్లు, బెదిరింపుల కారణంగా వారిలో చాలా మంది ఎంతోకొంత సొమ్ము తీసుకుని అప్పగించేశారు. ఇలా అప్పగించేసినవారిలో ఒక ప్రముఖ సినీ హాస్యనటుడు కూడా ఉన్నారు. ఈ హాస్యనటుడు ఘాంసిమియాగూడలో 19 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల వద్ద కొనుగోలు చేశారు. కానీ చివరికి కొంత డబ్బు తీసుకుని గోల్డ్‌స్టోన్ ప్రసాద్‌కు ఇచ్చేశారు. మరోవైపు ఈ సర్వే నంబర్లోని కొన్ని భూములను ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుని.. ఐదెకరాల స్థలంలో గ్రామస్తులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది. కానీ ఆ భూములను కొనుగోలు చేసినవారు కోర్టుకు వెళ్లడంతో లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వలేకపోయారు. హైకోర్టును ఆశ్రయించాం.. ‘‘ఘాంసిమియాగూడలోని సర్వే నంబర్4లో ఉన్న భూములు ప్రభుత్వ భూములుగానే రికార్డుల్లో కొనసాగుతున్నాయి. ఈ వివాదంపై మార్చిలో హైకోర్టులో పిల్ వేయడం జరిగింది..’’ – శంషాబాద్ తహసీల్దార్ సురేశ్‌కుమార్