Possession of land
-
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
ఎంపీ సంతోష్‌పై కబ్జా కేసు
బంజారాహిల్స్ (హైదరాబాద్): బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌పై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆక్రమించారని వచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఈ కేసు రిజిస్టర్ కాగా... విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14లోని సర్వే నెంబర్ 129/54, ప్లాట్ నంబర్–4లో నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్‌కు (ఎన్‌ఈసీఎల్) 1350 గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని 2010లో కరణ్ దూబే అనే వ్యక్తి నుంచి ఎన్‌ఈసీఎల్ కొనుగోలు చేసింది. 2023 నవంబర్ 2 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదిగానే రిజిస్ట్రేషన్ల శాఖ రికార్డుల్లో ఉండటంతో పాటు ఈ మేరకు ఈసీ కూడా జారీ అయింది. 2023 వరకు ఈ స్థలం ఎన్‌ఈసీఎల్‌కు చెందినదే అని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని ఇతర పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇటీవల ఈ స్థలంలో రెండు రూమ్‌లు నిర్మించినట్లుగా గుర్తించిన ఎన్‌ఈసీఎల్ ప్రతినిధి చింతా మాధవ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము జీహెచ్ఎంసీలో విచారించగా ఈ స్థలాన్ని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఫోర్జరీ డాక్యుమెంట్లతో కబ్జా చేసినట్లుగా తెలిసిందన్నారు. సంతోష్ కుమార్‌తో పాటు లింగారెడ్డి శ్రీధర్ అనే వ్యక్తి కూడా ఈ ఫోర్జరీ డాక్యుమెంట్ల తయారీ, బోగస్ ఇంటి నంబర్లను తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడని ఆరోపించారు. విషయం తెలిసిన వెంటనే తాము బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారించామని, ఈ నేపథ్యంలోనే జోగినపల్లి సంతోష్‌కుమార్, లింగారెడ్డి శ్రీధర్‌లు ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఈ స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా తేలిందని చింతా మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలాన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా అందులోకి అక్రమంగా ప్రవేశించి రెండు గదులు నిర్మించడం, జీహెచ్ఎంసీలో ఫోర్జరీ డాక్యుమెంట్లు దాఖలు చేసి బోగస్ ఇంటి నెంబర్లను తీసుకున్న జోగినపల్లి సంతోష్ కుమార్, లింగారెడ్డి శ్రీధర్లపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని ఆధారంగా పోలీసులు వీరిపై క్రిమినల్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే మైనంపల్లి నుంచి ప్రాణహాని ఉంది
పంజగుట్ట: ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వల్ల తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తమకు రక్షణ కల్పించాలని ఇటీవల అజ్ఞాతంలోకి వెళ్లి వార్తల్లో నిలిచిన రియల్టర్ ముక్కెర తిరుపతిరెడ్డి కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం చేయడంలేదన్నారు. అల్వాల్ హిల్స్, హైటెన్షన్ రోడ్డులో తనపేరుమీద, తన భార్య, భార్య సోదరి పేరుపై మొత్తం 3.31 ఎకరాల భూమి ఉందని, దీని పక్కనే మైనంపల్లికి చెందిన 1.9 ఎకరాల భూమి ఉందని, దీన్ని ఆధారంగా చేసుకుని తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నాడని ఆరోపించారు. మైనంపల్లి అనుచరులు తనను చంపేందుకు యత్నిస్తున్నారని, అందుకే తాను అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్, డీసీపీని కలిసి తనకు ప్రాణాపాయం ఉందని వివరించినట్లు తెలిపారు. సమావేశంలో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు హరీష్ రెడ్డి, బీజేవైఎం జాతీయ కోశాధికారి సాయి ప్రసాద్, బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వినర్ ఆర్.కె.శ్రీనివాస్, బీజేపీ మౌలాలి కార్పొరేటర్ సునీతా యాదవ్, బీజేపీ నాయకులు జి.కె.హనుమంతరావు, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. -
‘ఈటల బావమరది సూరి బెదిరించారు’
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్ సంస్థ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66.01 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిందని జిల్లా కలెక్టర్ హరీశ్.. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికలో తేల్చిచెప్పారు. హకీంపేటలోని సర్వే నం.97, అచ్చంపేటలోని సర్వే నం. 77, 78, 79, 80, 81, 82, 103లో ఆక్రమించిన అసైన్డ్ భూముల్లో పౌల్ట్రీ షెడ్లు, భవనాలు, రోడ్డును జమున హేచరీస్ నిర్మించిందని నిర్ధారించారు. తెలంగాణ అసైన్డ్ భూముల(పీఓటీ) చట్టం–1977 కింద సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనల మేరకు ఇతర చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఈటల భూకబ్జా ఆరోపణలపై శనివారం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఆగమేఘాల మీద విచారణ జరిపి అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రాథమిక నివేదికను పంపించారు. త్వరలో తుది నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం అనధికారికంగా బయటకు వచ్చిన ప్రాథమిక నివేదికలోని ముఖ్యాంశాలు.. ఖజానాకు భారీ నష్టం... అసైన్డ్ భూముల్లో కచ్చా రోడ్డును వేశారని, దీనికోసం చాలా చెట్లను అనుమతి లేకుండా నరికారని మెదక్ డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) నివేదిక సమర్పించారు. నరికివేసిన చెట్ల సంఖ్యను తక్షణమే మదించి అటవీ సంరక్షణ చట్టం–1980 కింద బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ వ్యవసాయేతర భూ మార్పిడి(నాలా) చట్టం–2006 కింద అనుమతి తీసుకోకుండానే పట్టా భూముల్లో జమున హేచరీస్ భారీ పౌల్ట్రీ షెడ్డు, ప్లాట్ ఫారాలు, భవనాలు, రోడ్డు నిర్మించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. జరిగిన నష్టాన్ని నాలా చట్టంలోని సెక్షన్ 4 కింద మదించి రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్ యాక్టు) కింద పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో జమున హేచరీస్ కబ్జా చేసిన ప్రభుత్వ, సీలింగ్ అసైన్డ్, పట్టా భూముల జాబితాను పట్టిక రూపంలో జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. గ్రామం, సర్వే నంబర్, మొత్తం భూవిస్తీర్ణం, జమున హేచరీస్ అధీనంతలోని భూవిస్తీర్ణం, కబ్జా చేసిన భూ విస్తీర్ణం వివరాలను పట్టికలో పొందుపరిచారు. జమునా హేచరీస్ అధీనంలోని 55.26 ఎకరాల పట్టా భూములు సైతం విచారణ(ఎగ్జామిషన్)లో ఉన్నట్టు ఈ పట్టికలో పేర్కొనడం గమనార్హం. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో జమునా హేచరీస్ అధీనంలోని పట్టాభూములు, సీలింగ్ అసైన్డ్ భూములకు సంబంధించిన నక్షాను సైతం నివేదికతో కలెక్టర్ జతచేశారు. ఈటల బావమరది సూరి బెదిరింపులు... ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో ఆయన బావమరిది సూరి అలియాస్ సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈటల, సూరి తమను బెదిరించి భూ కబ్జాకు పాల్పడ్డారని పలువురు ఇచ్చిన వాంగ్మూలాన్ని జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే తమ భూములను కబ్జా చేశారని చాకలి బుచ్చమ్మ(1.30 ఎకరాలు), చాకలి పరుశురాం/నాగులు (1.20 ఎకరాలు), బానాపురం రాములు(3 ఎకరాలు), ఎరుకల ఎల్లయ్య(3 ఎకరాలు) స్టేట్మెంట్ ఇవ్వగా, అసలు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే తమ భూమి లాక్కున్నారని బానాపురం దుర్గయ్య(3 ఎకరాలు), చాకలి లింగయ్య(1.2 ఎకరాలు), చాకలి క్రిష్ణ(1.2 ఎకరాలు) స్టేట్మెంట్ ఇచ్చారు. రికార్డుల ప్రకారం ఈ భూములన్నీ అసైన్డ్ భూములని కలెక్టర్ నిర్ధారించారు. తమ భూములను ఈటల కబ్జా చేసి రోడ్డు, పౌల్ట్రీ షెడ్లు, ప్రహరీ నిర్మించారని కొందరు చెప్పగా, తమ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలించుకుపోయారని మరికొందరు పేర్కొన్నారు. 20 మంది ఫిర్యాదు... బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తమకు 1994లో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్, ఆయన సంబంధీకులు కబ్జా చేసి పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని, తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని బెదిరించారని చాకలి లింగయ్య, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో విచారణ జరిపి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగిందని నివేదకలో కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు 20 మంది తమ భూములను జమున హేచరీస్ కబ్జా చేసిందని విచారణ సందర్భంగా ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
టీడీపీ నేత గుట్టు రట్టు..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: చేతిలో అధికారం.. అందుకు సహకరించే ప్రజాప్రతినిధుల అండతో లక్షల రూపాయల విలువైన భూమిని ఆక్రమించుకుని దర్జాగా అనుభవిస్తున్న పచ్చనేత భరతం పట్టింది ‘సాక్షి’ కథనం. అప్పటి వరకు తనకు ఎదురే లేదంటూ బాహుదా నది పరివాహక ప్రాంతాన్ని అనుభవిస్తున్న ఆ నేత మెడలు వంచి రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని స్వాధీనపరచుకున్నా రు. వివరాల్లోకి వెళితే.. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి పంచాయతీకి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ కుమారుడు దూపాన సూర్యనారాయణ స్థానిక బాహుదానది పరివాక ప్రాంతంలో గల 4ఎకరాల 80 సెంట్ల భూమిని గత కొన్నేళ్ల నుంచి తన ఆదీనంలోకి తీసుకొని అనుభవిస్తున్నాడు. సుమారు రూ.50లక్షల రూపాయలు విలువైన ఈ భూమిని గతంలో మశాఖపురం గ్రామానికి చెందిన ఓ మాజీ సైనిక ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించింది. అయితే విలువైన ఆ భూమిపై కన్నేసిన టీడీపీ నేత ఆ భూ మిని ఆక్రమించుకోవాలన్న దురుద్దేశంతో కల్ల బొల్లి మాటలు చెప్పి విలువైన స్థలాన్ని సొంతం చేసుకున్నాడు. పదేళ్ల పాటు వారి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో అధికారులు సైతం ఆ స్థలం వైపు కన్నెత్తి చూడలేకపోయారు. ‘ఆక్రమణలో పోరంబోకు’ అన్న శీర్షికన సెప్టెంబర్ 24న సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంతో అటు రెవెన్యూ అధికారులు, ఇటు టీడీపీ నేతలు ఉలిక్కి పడ్డారు. విలువైన భూమిని దక్కించుకోవాలన్న పట్టుదలతో ఆ టీడీపీ నేత శతవిధాలా ప్రయత్నాలు సాగించిన కుట్రను ‘సాక్షి’ గుట్టురట్టు చేసింది. స్థానిక తహసీల్దార్ పర్రి అమల ఆక్రమణ భూమిని సెపె్టంబర్ 24న స్వయంగా పరిశీలించి సర్వే నిర్వహించారు. ముందస్తుగా ఆ భూమిని తన భూమిగా నిరూపించుకోవాలని పదిహేను రోజుల క్రితం ఫామ్–7 రూపంలో టీడీపీ నేత దూపాన సూర్యనారాయణకు అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో శుక్రవారం ఫామ్–6 రూపంలో 4ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వ ఆస్థిగా నిర్ధారిస్తూ రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. తహసీల్దార్ పర్రి అమల శుక్రవారం సాయంత్రం ఆక్రమణ స్థలం వద్దకు వెళ్లి ‘ప్రభుత్వ భూమి’గా నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. -
నిర్వేదం...
భూ పరిహారం అందించలేదని రైతు ఆత్మహత్యాయత్నం పోలీసుల ఎదుటే విషం తీసుకుని అఘాయిత్యం కాలువ పనులను అడ్డుకున్న రైతులు నేటికీ పూర్తిగా అందని సింగటాలూరు ఎత్తిపోతల పథకం భూముల పరిహారం గదగ్ : తాలూకాలో సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం వెంటనే తగిన భూ పరిహారం అందించాలని ఒత్తిడి చేస్తూ పోలీసుల ఎదుటే ఓ రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేసిన ఘటన శుక్రవారం సంచలనం రేపింది. తాలూకాలోని అడవి సోమాపుర గ్రామం వద్ద కాలువ నిర్మిస్తున్న స్థలంలో అధికారులు, పోలీసుల ఎదుటే రామణ్ణ హొసళ్లి అనే రైతు విషం తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అతనిని గదగ్ రూరల్ పోలీసు స్టేషన్ ఎస్ఐ జూలకట్టి అడ్డుకొని విషం బాటిల్‌ను లాక్కొన్నాడు. గదగ్, కొప్పళ, బళ్లారి జిల్లాలో రైతుల పొలాలకు సాగునీరందించే సింగటాలూరు ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. కాలువ నిర్మాణ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. సింగటాలూరు ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వం రైతుల పొలాలను స్వాధీనం చేసుకుంది. అయితే భూములు కోల్పోయిన వారి లో కొందరు రైతులకు మాత్రమే పరిహారం లభించింది. ఇంకా కొందరికి పరిహారం లభించలేదు. మరికొందరు పరిహా రం లభించినా తగినంత పరిహారం లభించలేదని ఆరోపిస్తూ పథకం పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. పథకం పనులు పూర్తయినా భూములు కోల్పోయిన వారికి పరిహారం లభించక పోవ డంతో కోపోద్రిక్తులైన రైతులు అడవి సోమాపురం వద్ద జరుగుతున్న కాలువ పనులను శుక్రవారం అడ్డుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి అధికారులు, గదగ్ రూరల్ పోలీసులు చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులతో చర్చిస్తుండగా, పనులు చేపట్టేందుకు ప్రయత్నించినా జేసీబీ డ్రైవర్‌పై రైతులు చేయి చేసుకోబోగా, పోలీసులు అడ్డుకొని శాంతియుతంగా సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.