umadevi
-
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్‌సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్‌లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా?
సాక్షి ప్రతినిధి, కడప: ‘ఎంత కాలమైనా పల్లకీ మోసే బోయీలుగానే మిగిలిపోవాలా.. నాయకత్వ పగ్గాలు పుచ్చుకునే అర్హత మాలో ఎవరికీ లేదా.. నాన్ లోకల్ అభ్యర్థిని మాపై రుద్దుతారా’ అని కడప టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ విజయం కోసం కలిసికట్టుగా పని చేస్తామని, మాలో ఒకరికి టికెట్ కేటాయించాలని కోరుతూనే, నాన్‌లోకల్ అభ్యర్థికి సహకరించబోమని తెగేసి చెబుతున్నారు. వెరసి తెలుగుతమ్ముళ్ల మధ్య ఉన్న కోల్డ్‌వార్ తెరపైకి వచ్చింది. ఇన్చార్జితో ప్రమేయం లేకుండా ఆ ముగ్గురు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా చంద్రబాబు విడుదల కావాలని దేవునికడప శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో 101 టెంకాయలు కొట్టారు. టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి తన కోడలు, కార్పొరేటర్ ఉమాదేవికి నియోజకవర్గ ఇన్చార్జి అభ్యర్థిత్వం కోసం పోటీ పడ్డారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి సతీమణి మాధవీరెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. అప్పటికే పలుమార్లు అధినేత చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమై స్థానికులకు అవకాశం కల్పించాలని కడప నేతలు కోరారు. గతంలో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన దుర్గాప్రసాద్, అమీర్‌బాబుకు అవకాశం కల్పించాలని, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తే కార్పొరేటర్ ఉమాదేవికి ఇన్చార్జి పదవి ఇవ్వాలని విన్నవించారు. మాలో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు. వీరి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోకుండా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డికి కడప పట్టం కట్టడాన్ని.. ఆ ముగ్గురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వకుంటే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. అభ్యర్థిగా స్థానికులనే నిర్ణయించాలని కడప గడపలో తెలుగు తమ్ముళ్లు పట్టుబట్టుతున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తల ప్రమేయం లేకుండా నాన్‌లోకల్ అభ్యర్థిని పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికల్లో ఏమి చేయగరలని వాదిస్తున్నారు. అదే విషయాన్ని అధినేత చంద్రబాబుకే తేల్చి చెప్పామని టీడీపీ విజయం సాధించాలంటే లోకల్ వారిని పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇన్చార్జి మాధవీరెడ్డితో కలిసి పని చేసే పరిస్థితే లేదని తేల్చి చెబుతున్నారు. ఆ మేరకు ఆమెతో ప్రమేయం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ చేపట్టారు. ఈ వ్యవహారం వినాయక ఉత్సవాల నుంచి కొనసాగుతోంది. టీడీపీ నేతలు లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్, అమీర్‌బాబు ముగ్గురు కలిసికట్టుగా వినాయక మండపాలను సందర్శిస్తూ పూజలు చేపట్టారు. మాధవీరెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు సైతం దూరంగా ఉండిపోయారు. తాజాగా ఆదివారం ఆ ముగ్గురు నేతలతోపాటు మరి కొందరు డివిజన్లు ఇన్చార్జిలతో కలిసి దేవునికడపలో 101 టెంకాయలు కొట్టారు. సోమవారం నుంచి పాతబస్టాండ్ సమీపంలో నిరసన టెంట్ ఏర్పాటు చేసి, వేరుగా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించారు. లోకల్ నాయకుల్ని అందర్నీ కలుపుకొని కార్యక్రమాలకు వెళ్లాలనే దిశగా ఆ ముగ్గురు అడుగులు వేస్తున్నారు. నాన్ లోకల్ అభ్యర్థికి ఇప్పటి నుంచే పోటీగా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. వాసు ఏకపక్ష వైఖరి సహించం ‘టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుగోలుగా వెళ్లలేదు. పొలిట్‌బ్యూరో సభ్యుడు జిల్లాలోని టీడీపీ నేతల మన్ననలు పొందలేదు. పైగా వర్గ విభేదాలకు ఆస్కారం ఇచ్చేలా చర్యలుండిపోయాయి. వాసు ఏకపక్ష వైఖరి నేపథ్యంలో అభ్యర్థిగా మాధవీరెడ్డి నియామకాన్ని అడ్డుకునే చర్యలకు దిగినట్లు’ ఆ ముగ్గురు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ ఆమెకే టీడీపీ టికెట్ కేటాయిస్తే ఓడగొట్టి తీరుతామని ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఇదే విషయాన్ని కార్యకర్తలకు, ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. -
8 వారాల్లో సమీక్షించండి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో పదోన్నతులపై 8 వారాల్లో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 2018లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ ఆదేశాలను అమలు చేయకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలపై ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావలీ శుక్రవారం విచారణ చేపట్టారు. విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది ఉమాదేవి వాదనలు వినిపిస్తూ పదోన్నతుల సమీక్షకు ఆరు నెలల సమయాన్ని కోరారు. పిటిషనర్ తరఫున న్యాయవాది మహమ్మద్ అదనాన్ వాదనలు వినిపిస్తూ.. ఇంకా ఆరు మాసాలు గడువు కోరడం సరికాదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి, జూనియర్ లైన్‌మన్ స్థాయి నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయి వరకు కల్పించిన పదోన్నతులన్నింటినీ సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు సమీక్షించాలన్నారు. నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించి ఎనిమిది వారాల్లో హైకోర్టుకు నివేదిక సమర్పించాలని మధ్యంతర ఉత్తర్వులను జారీ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోడెపాక కుమారస్వామి, వైస్ చైర్మన్ ఆర్.సుధాకర్ రెడ్డి, కన్వీనర్ ముత్యం వెంకన్నగౌడ్, కో–కన్వినర్ సి.భానుప్రకాశ్ తదితరులు హర్షం వ్యక్తంచేశారు. వెంటనే కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
అంగన్వాడీల్లో ‘మునగ’ మెనూ
సాక్షి, అమరావతి: పోషక విలువలు అత్యధికంగా ఉండే మునగను ఆహారంలో తీసుకోవడం ద్వారా చేకూరే లాభాలను వివరిస్తూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఆవరణలో, ఇళ్ల వద్ద మునగ చెట్ల పెంపకం చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. మునగ చెట్లను పెంచి వాటి నుంచి సేకరించిన ఆకును వారంలో రెండు రోజులపాటు అంగన్వాడీ మెనూలో చేర్చారు. మునగ ఆకు పప్పు, మునగాకు కూర ఇలా ఏదో ఒక రూపంలో అందిస్తుండటంతో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు విలువైన పౌష్టికాహారం అందుతోంది. మునగాకుతో మేలు ఇలా.. మునగ ఆకు ద్వారా లభించే ఐరన్ గర్భిణులు, బాలింతల్లో రక్త హీనత నివారించేందుకు దోహదం చేస్తుంది. మునగ ఆకులో ఉండే విటమిన్ ఏ కారణంగా కంటిచూపు మెరుగు పడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండే మునగ ఆకు గర్భిణుల్లో పిండం ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదం చేయడంతోపాటు సుఖ ప్రసవం జరిగేలా ఉపకరిస్తుంది. బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మునగ ఆకును ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి కొవ్వు పెరుగుతుంది. థైరాయిడ్ లాంటి అనేక సమస్యలు దరి చేరకుండా చేస్తుంది. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా.. రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ ద్వారా పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందచేస్తోంది. గర్భిణులు, బాలింతలు, మూడు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు కలిపి దాదాపు 36 లక్షల మందికి అంగన్వాడీల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజూ తల్లులకు 200 మిల్లీ లీటర్లు, పిల్లలకు 100 మిల్లీ లీటర్ల చొప్పున పాలు అందిస్తున్నారు. మునగ పొడితో మొదటి ముద్ద అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారాన్ని అందించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా 1,475 అంగన్వాడీల్లో మునగ చెట్ల పెంపకం చేపట్టాం. వారంలో రెండు రోజులపాటు మునగ ఆకుతో చేసిన కూర, పప్పు అందిస్తున్నాం. గర్భిణులు, బాలింతలు ప్రతి రోజూ ఆహారంలో మొదటి ముద్ద మునగ ఆకు పొడితో తీసుకునేలా ప్రోత్సహిస్తున్నాం. –ఉమాదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్టీఆర్ జిల్లా. -
Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
బిగ్‌బాస్ ఐదో సీజన్ తొలివారాన్ని దిగ్విజయంగా ముగించుకుంది. ఫస్ట్‌వీక్‌లో ఊహించని విధంగా సరయుని బయటకు పంచించేశాడు బిగ్‌బాస్. అందరిని దమ్దబ్ చేస్తానని హౌస్‌లోకి వెళ్లిన సరయు.. వారం రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. అయితే ఆమె ఓట్ల ప్రకారమే ఎలిమినేట్ అయినప్పటికీ.. ఓట్లు ఎక్కువ వేయించాలో, తక్కువ వేయించాలో అంతా బిగ్‌బాస్ చేతుల్లోనే ఉంటుందనేది నమ్మలేని నిజం. తను టార్గెట్ చేశాడంటే చాలు.. వాళ్లు హౌస్ బయట ఉండాల్సిందే. అదేలా అంటారా? సింపుల్ ఈ వారంలో ఎవరిని బయటకు పంపించాలని బిగ్‌బాస్ ఫిక్స్ అవుతాడో.. వారిని నెగెటివ్ వేలో స్క్రీన్‌పై చూపిస్తాడు. లేదంటే స్క్రీన్ స్పెస్ తగ్గించి, అంతా మర్చిపోయాలా చేస్తాడు. సరయు విషయంలో కూడా అదే జరిగిందని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఆమె సిగరెట్ తాగడం.. కాజల్‌తో గొడవ పెట్టుకోవడం లాంటి నెగెటివ్ సీన్స్‌ని జనాలకి చూపించి బయటకు పంపించేశాడని చెబుతున్నారు. ఇక రెండో వారం బిగ్‌బాస్ గురి ‘కార్తీకదీపం’ఫేమ్ ఉమాదేవిపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంతా అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆమెనే ఎలిమినేట్ అవుతుందని పోస్ట్‌లు పెడుతున్నారు. (చదవండి: బిగ్‌బాస్: మద్యం సేవిస్తా, నాన్‌వెజ్ తింటా, ఐలవ్ వైన్ : లహరి) దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్ ను అనే ఆమె పొగరు, మాట తీరు, నాన్ వెజ్ రచ్చ కారణంగా ఆమెతో ఇంట్లో ఎవరూ సరిగ్గా మెలగలేకపోతున్నారు. ఇక బిగ్‌బాస్ కూడా ఈ వారం ఆమెనే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె బూతులు మాట్లాడుతున్న సీన్స్, గొడవలు పడిన సీన్స్‌కు ఎక్కువ స్క్రీన్ స్పెస్ ఇస్తున్నాడు. గత రెండు సీజన్లో కూడా కరాటే కల్యాణి, హేమల విషయంలో ఇదే జరిగింది. అయితే ఎలిమినేషన్‌కి మరో ఆరు రోజులు ఉన్నాయి కాబట్టి, ఆ లోపు ఉమ బూతులు తగ్గించుకొని, చక్కగా గేమ్ ఆడితే.. బిగ్‌బాస్ ఆమెకు పాజిటివ్ స్క్రీన్ స్పెస్ ఇస్తే.. లెక్కలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అంతా ఊహించినట్లుగా ఉమా దేవి ఎలిమినేట్ అవుతుందా? లేదా? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. -
తమ్ముడు మందలించాడని..
చీడికాడ (మాడుగుల): మండలంలోని ఖండివరంలో మనస్తాపానికి గురైన యువతి శనివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్ఐ యల్.సురేష్‌కుమార్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆయన కథనం మేరకు వివరాలిలావున్నాయి. గ్రామానికి చెంది న బంగారు ఉమాదేవి(19) శుక్రవారం నాగుల చవితి సందర్భంగా షాపింగ్ నిమిత్తం చోడ వరం వెళ్లింది. ఆమె ఆలస్యంగా ఇంటికి రావడంతో ఆమె తమ్ముడు సాయికుమార్ మందలించాడన్నా రు. శనివారం ఉద యం చూడగా ఆమె చున్నీ తో ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించడంతో సాయికుమార్ పోలీసులకు సమాచా రం ఇచ్చారన్నారు. తమ్ముడు మందలించాడని మనస్తాపంతోనే ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని ఆయన వివరించారు. -
సత్తాచాటుతున్న ఉమాదేవి
ఏలూరు రూరల్: ఆమె బౌలింగ్ ప్రారంభిస్తే ప్రత్యర్థులకు హడలే. బాల్ గింగిరాలు తిరుగుతూ వస్తుంటే ఎంతటి బ్యాట్స్ఉమెన్ అయినా చిత్తు కావల్సిందే. ఆమే దేవరపల్లికి చెందిన మహిళా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.ఉమాదేవి. ఆరేళ్లగా క్రికెట్ సాధన చేస్తున్న ఈమె ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపిస్తోంది. దేవరపల్లి డిగ్రీ కళాశాలలో సెకండియర్ చదువుతున్న ఈమె ఆంధ్ర మహిళ కుంబ్లేగా అందరిచే కితాబు అందుకుంటోంది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఈమె నిరంతర సాధన చేసి క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతోంది. తోటి క్రీడాకారిణిల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈనెల 4వ తేదీ నుంచి 13 వరకూ గుంటూరులో ఏసీఓ మహిళ అకాడమీలో అండర్–19 జోనల్‌స్థాయి మ్యాచ్‌లు జరిగాయి. ఈ పోటీల్లో జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఉమాదేవి నార్త్‌జోన్ జట్టును తన బౌలింగ్ ప్రతిభతో కుప్పకూల్చింది. 4 వికెట్లు తీసి జిల్లా జట్టును విజయపథంలో నడిపించింది. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. ఇప్పటికే జాతీయస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో పాల్గొంది. మూడేళ్లుగా అండర్–16, 19 పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. నేడు అండర్–19లో కేరళ, తమిళనాడు, గోవా, కర్ణాటక, హైదరాబాద్ తదితర జట్లతో తలపడి జాతీయ జట్టు సెలక్టర్ల దృష్టిలో పడేందుకు కృషి చేస్తోంది. ఈమె ప్రతిభను గుర్తించిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోకరాజు రామరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా నెలకు రూ.4 వేలు ఉపకార వేతనం అందిస్తున్నారు. సహాయ కార్యదర్శులు ఎం. వగేష్‌కుమార్ ఉమాదేవికి సహకారం అందిస్తున్నారు. కోచ్ ఎస్. రమాదేవి వద్ద శిక్షణ పొందుతున్న ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, రత్నకుమారి వ్యవసాయం చేస్తున్నారు. -
వసంతకుమార్ సతీమణి మృతికి కాంగ్రెస్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ సతీమణి ఉమాదేవి(63) మృతి పట్ల ఏపీసీసీ అధ్యక్షులు రఘవీరారెడ్డి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల వారి కుటుండ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. -
చందానగర్‌లో దారుణ హత్య
హైదరాబాద్: చందానగర్‌లో దారుణ హత్య జరిగింది. అక్కడి లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఇంటి యజమానిని పనిమనిషి హత్య చేసింది. నగలకోసమే ఆమె ఈ పనిచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. చందానగర్ లోని లక్ష్మీ విహార్ ఫేజ్-2లో ఉమాదేవి(65) అనే వృద్ధురాలు ఉంటోంది. ఆ ఇంట్లో పక్కనే మరో ఇంట్లో ఉంటున్న వసుంధర అనే మహిళ పనిమనిషిగా చేస్తోంది. ఆ వృద్ధురాలి నగలపై కన్నేసిన ఆమె ఉమాదేవీని కత్తితో పొడిచి తలుపులు వేసుకొంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించటంతో నిందితురాలు కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. పనిమనిషిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. -
నటి రాధ నుంచి నా భర్తను విడిపించండి
తమిళసినిమా: నటి రాధ బారి నుంచి తన భర్తను విడిపించాలని కోరుతూ స్థానిక కోడంబాక్కమ్, కామయరాజర్ కాలనీకి చెందిన ఉమాదేవి అనే మహిళ గురువారం చెన్నై పోలీస్‌కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తన భర్త మునివేల్ సుందరాట్రావెల్స్ చిత్ర నాయకి రాధతో కొన్ని నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిపింది. ఈ విషయమై తాను స్థానిక విరుగమ్‌బాక్కమ్, టీ.నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాన ంది. దీంతో పోలీసులు తన భర్తను, నటి రాధను పిలిపించి విచారించి అనంతరం తన భర్తను తనతో పంపించార ని తెలిపింది. అయితే అప్పటి నుంచి నటి రాధ తన భర్తకు తరచూ ఫోన్ చేస్తూ తమ కుటుంబ సంతోషాన్ని దూరం చేస్తోందని అంది.అదే విధంగా తనకు వేరే వ్యక్తితో సంబంధం కలుపుతూ అసభ్యంగా మాట్లాడుతోందని చెప్పింది. తనను తన కూతురిని బెదిరిస్తోందిని పేర్కొంది. దీంతో తన కూతురు ఆమెకు భయపడి నాలుగు రోజులుగా కాలేజ్‌కు కూడా వెళ్లడం లేదని తెలిపింది. కొన్ని రోజులుగా తన భర్త కూడా కనిపించడం లేదని చెప్పింది. నటి రాధ నుంచి తన కుటుంబాన్ని కాపాడాలని, తన భర్తను ఆమె బారి నుంచి విడిపించి తనకు అప్పగించాలని ఫిర్యాదు పత్రంలో పేర్కొంది. ఉమాదేవి ఫిర్యాదును పరిశీలించిన పోలీస్‌కమిషనర్ టీకే.రాజేంద్రన్ వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదును టీ.నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌కు పంపారు. దీంతో అక్కడి పోలీసులు ఒకటి రెండు రోజుల్లో నటి రాధను పిలిపించి విచారించే అవకాశం ఉంది. నటి రాధ ఇంతకు ముందొకసారి తనను ఒక వ్యాపారవేత్త మోసం చేశారని పోలీసులను ఆశ్రయించిందన్నది గమనార్హం. -
అనాథ బాలల మధ్య బర్త్‌డే
సికింద్రాబాద్: టీపీసీసీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, మాజీ కార్పోరేటర్ ఆదం ఉమాదేవి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పలువురు కాంగ్రెస్ నాయకులు, ఆదం అభిమానులు ఆమె నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీతాఫల్‌మండిలోని రెయిన్బో అనాథ ఆశ్రమానికి వెళ్లిన ఆదం ఉమాదేవి, పీసీసీ నాయకుడు ఆదం సంతోష్‌కుమార్‌లు అక్కడి చిన్నారులకు అన్నదానం చేశారు. అనాధ బాలల మధ్య ఉమాదేవి కేక్‌కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదం కుటుంబం ప్రజాసేవకే అంకితమైందని చెప్పారు. భవిష్యత్తులో సైతం సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు..
ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం భారీ రాయితీలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అమలు చేసే ప్రత్యేక కార్యక్రమాల్లో జిల్లాకు భారీ వాటా దక్కనుంది. వీటి అమలుతో ఎక్కువ విస్తీర్ణంలో పూలు, పండ్లు, కూరగాయల పంటలు సాగు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు కావాలంటే ఉద్యాన పంటలే మేలని ప్రభుత్వం భావిస్తోందని, ఈ దిశగా ఆలోచన చేసి భారీ రాయితీలతో గ్రీన్హౌస్ పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా ఉద్యానశాఖ సహాయ సంచాలకులు డి.ఉమాదేవి పేర్కొన్నారు. గతంలో కంటే నాలుగోవంతు రాయితీ పెంచడమే కాకుండా, పరిమితులను సైతం భారీగా పెంచిదని, ఈ పథకం ద్వారా జిల్లా రైతాంగం ఎక్కువగా లబ్ధి పొందుతుందని అన్నారు. ఈ మేరకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు ఉమాదేవి వెల్లడించారు. శుక్రవారం ఆమె ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్యాన శాఖ చేపడుతున్న కార్యక్రమాలు, రైతులకు పలు సలహాలను వివరించారు. రంగారెడ్డి జిల్లా: ఉద్యాన సాగు సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలు పొందేలా రూపొందించిన గ్రీన్హౌస్ పథకంలో భాగంగా రైతులకు భారీగా రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో ఉద్యాన శాఖ చేపడుతున్న పలు కార్యక్రమాలు, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహం, అవగాహన సదస్సులు, పంటల సాగులో శిక్షణ, జాగ్రత్తలు, పద్ధతులు తదితర అంశాలపై ఆ శాఖ సహాయ సంచాలకులు ఉమాదేవి ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ప్రయోగాత్మక పద్ధతులు అవలంబించాలి ప్రస్తుతం కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఆయా కుటుంబాలకు చెందిన భూ విస్తీర్ణం విభజించాల్సివస్తోంది. ఈ క్రమంలో ఒక్కో కుటుంబానికి వచ్చే విస్తీర్ణం తగ్గడంతో వారు పాత పద్ధతులతోనే పంటలు సాగు చేస్తున్నారు. గతంలో వేసే వ్యవసాయ పంటలైన వరి, జొన్న, ఆముదంలాంటివే వేస్తున్నారు. దీంతో రైతులు లాభాల్లో కాకుండా నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితిని అధిగమించాలంటే ఉద్యాన పంటలు సాగు చేయడమే మేలు. పండ్ల రకాల్లో జామ, బొప్పాయి, అరటి, దానిమ్మ పంటలు మన భూములకు మేలు. నీటి లభ్యతను బట్టి ఎంచుకోవాలి. అదేవిధంగా కూరగాయలు, పూల తోటల్లోనూ లాభాలు ఆశాజనకంగా ఉన్నాయి. విత్తనాలపై ఇప్పటికే ఉద్యానశాఖ రాయితీలు అందజేస్తోంది. పూలు, కూరగాయల సాగుపై ఒక్కో రైతులకు రెండు హెక్టార్లు, పండ్ల తోటలపై ఒక హెక్టారుకు మించకుండా ఈ రాయితీలు వర్తిస్తాయి. గ్రీన్‌హౌస్‌లతో భారీగా దిగుబడులు.. ఉద్యాన పంటల సాగుకు గ్రీన్హౌస్ విధానం ఎంతో మేలు. ఈ పథకంపై ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. గతంలో ఒక్కో రైతుకు గరిష్టంగా అర ఎకరా విస్తీర్ణం వరకే అనుమతి ఇచ్చేవారు. తాజాగా ఒక్కో రైతుకు గరిష్టంగా మూడు ఎకరాల వరకు రాయితీ ప్రకటించింది. గతంలో 50 శాతం మాత్రమే రాయితీ ఇస్తుండగా.. ప్రస్తుతం రాయితీని ఏకంగా 75శాతానికి పెంచింది. దీంతో జిల్లాలో రెట్టింపు మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. సాధారణ పద్ధతుల కంటే గ్రీన్హౌస్ విధానంలో ఉద్యాన పంటలు సాగు చేస్తే కనీసం రెండింతలు ఎక్కువ దిగుబడి వస్తుంది. మార్కెటింగ్‌కు అనుకూలం.. నైసర్గిక స్వరూపం దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి రాజధానికి సులువుగా చేరుకునేలా రహదారులున్నాయి. దూరం కూడా పెద్దగా లేకపోవడంతో రైతులు పండించే ఉద్యాన దిగుబడులు నేరుగా నగరానికి తరలించవచ్చు. కొందరు రైతులు గ్రూపుగా చేరుకుంటే సొంతంగా వాహనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. నగరంలో ప్రస్తుతం ఉద్యాన పంటలకు డిమాండ్ అధికంగా ఉంది. కానీ దిగుబడుల్లో దాదాపు 80శాతం ఇతర రాష్ట్రాలనుంచే వస్తున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే జిల్లాలో ఉద్యాన పంటల సాగు పెంచాల్సిన ఆవశ్యకత ఉంది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో చలికాలంలో ఉద్యాన పంటల దిగుబడులు భారీగా పతనమవుతాయి. ఈ సమయంలో ఆయా రాష్ట్రాలకు సైతం మనం కూరగాయలు, పూలను ఎగుమతి చేయవచ్చు. ఈ ఎగుమతులకు సైతం జిల్లా రైతాంగానికి అనుకూలంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది. ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఇప్పటికే చేవెళ్ల, శామీర్‌పేట్ మండలాల రైతులు ఉద్యాన పంటల దిగుమతులను ఇతర రాష్ట్రాలు, అరబ్బు దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. రవాణా చార్జీల్లో ప్రభుత్వం కొంత రాయితీ సైతం కల్పిస్తోంది. శిక్షణ, అవగాహన సదస్సులు.. ఉద్యాన పంటల సాగు పెంచే క్రమంలో రైతులను మరింత చైతన్యం చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా రైతులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వడంతో పాటు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లాలో 28 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కూరగాయలు సాగవుతున్నాయి. ఈ విస్తీర్ణాన్ని కనీసం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రైతులు కూడా ఆసక్తి చూపుతున్నారు. త్వరలో శాఖాపరంగా లక్ష్యాలు ఖరారైన తర్వాత కార్యాచరణ చేపడతాం. -
పారాణి ఆరకనే
పారాణింకా ఆరనే లేదు..తోరణాల కళ వాడనే లేదు..పెళ్లి పందిరి తీయనే లేదు.. పెళ్లి కూతురుగా కళకళలాడిన ఓ నవ వధువుకు అప్పుడే నూరేళ్లు నిండాయి. పున్నమి రువ్విన వెన్నెల నవ్వకు అమావాస్య చీకట్లు కమ్మేశాయి. కన్నవారికి గుండెకోత మిగిల్చిన ఈ విషాద సంఘటన చెన్నూరులో ‘శని’వారం చోటు చేసుకుంది. చెన్నూరు : చెన్నూరులోని బ్రాహ్మణవీధికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు పూసపాటి ఉమాదేవి కుమార్తె వినీల(23) వివాహం ఓ ప్రైవేటు కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసే జయకృష్ణతో మే 24న అంగరంగ వైభవంగా జరిగింది. దాంపత్య జీవితంపైన, కాబోయే భర్తపై ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టిన వినీల మూడుముళ్లు పడగానే ఎంతో ఇష్టంగా అత్తారింట మహాలక్ష్మిలా అడుగుపెట్టింది. అప్పటి నుంచి వారి దాంపత్య జీవనం అన్యోన్నంగా సాగిపోతోంది. పుట్టింటికని వచ్చి... ఆ నవ వధువుకు ఏం కష్టమొచ్చిందో.. ఏమో గానీ మూడ్రోజుల కిందట పుట్టింటికి వచ్చింది. శనివారం అమ్మ పాఠశాలకు వెళ్లగా.. అమ్మమ్మ, అన్న బయట ఉండగా.. ఇంట్లో ఒంటరిగా ఉన్న వినీల బెడ్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. ఆ తరువాత ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని వేలాడింది. సకాలంలో ఎవరూ గమనించకపోవడంతో ఆమె ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. ఎంతసేపటికీ వినీల బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ ఎంత పిలిచినా వినీల నుంచి సమాధానం లేదు. దీంతో ఆందోళనతో ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగులగొట్టి చూడగా అక్కడి దృశ్యం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. ఫ్యాన్‌కు వేలాడుతున్న వినీలను కిందకు దించి చూడగా అప్పటికే ఆమె శ్వాస ఆగిపోయి ఉండడాన్ని గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే అమ్మ, అన్న, బంధువులు ఇంటికి చేరుకున్నారు. తమ బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వినీలను చూసేందుకు వచ్చిన స్నేహితులు, స్థానికులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. రంగంలోకి దిగిన తహశీల్దార్, ఎస్ఐ వినీల ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే చెన్నూరు తహశీల్దార్ శాంతమ్మ, ఎస్ఐ హనుమంతు తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి తల్లి ఉమాదేవి, బంధువులు, ఆమె భర్త జయకృష్ణ, స్థానికులను విచారణ జరిపారు. పెళ్లై రెండు నెలలు కూడా పూర్తి కాలేదని వారు చెప్పారు. అయితే ఆమెకు అప్పుడప్పుడు కడుపునొప్పి వచ్చేదని, వైద్యం కూడా చేయించుకునేదని తెలిపారు. దీనిపై ఎస్ఐ స్పందిస్తూ.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. -
వెంటాడిన మృత్యువు
చింత లేకుండా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని చూసి విధికి కన్నుకుట్టింది. కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులను లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. ఇద్దరు పిల్లలను దిక్కులేని అనాథలను చేసింది. గుంటూరు రూరల్ మండలం బుడంపాడు వద్ద ఆదివారం జరిగిన ఈ ఘటన తెనాలి పట్టణంలోని ముత్తెంశెట్టిపాలెంలో విషాదం నింపింది. చేబ్రోలు/తెనాలిరూరల్/గుంటూరు రూరల్, న్యూస్‌లైన్ :శ్రీరామ్.. మనసున్న మంచి మనిషి. పేద విద్యార్థులకు చేతనైన సాయమందించడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, అనాథ శవాలను తరలించడం వంటి సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుండేవారు. అందుకే ఆయన కుటుంబమంటే చుట్టుపక్కల వారికి ఎంతో అభిమానం. తెనాలిలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న మాసకమల్లి శ్రీరామ్దీక్షితులు(45) స్థానిక ముత్తెంశెట్టిపాలెంలోని ఓ అద్దె ఇంట్లో ఆరేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్య ఉమాదేవి(40) స్థానిక ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. వీరికి శ్రావ్య(16), సాయిదుర్గా శైలేష్ (13) ఇద్దరు పిల్లలు. శైలేష్ స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతుండగా శ్రావ్య గుంటూరులోని ప్రయివేటు కళాశాలలో ఇంటర్ చదువుతోంది. వీరి సంసారం చీకూచింతా లేకుండా హాయిగా సాగిపోతోంది. అది చూసి విధికి కన్నుకుట్టింది. ఆదివారం సెలవు కావడంతో తల్లిదండ్రులు శ్రావ్యను చూసి వద్దామనుకున్నారు. కుమారుడు శైలేష్‌తో కలిసి దంపతులు ద్విచక్రవాహనంపై గుంటూరు బయలుదేరారు. ఎక్కడో కర్ణాటక నుంచి నారాకోడూరు సమీపంలోని స్పిన్నింగ్ మిల్లుకు సరుకు తరలిస్తున్న టిప్పర్ లారీ మృత్యువులా వీరిని వెంటాడింది. అతివేగంగా వస్తున్న టిప్పర్ గుంటూరు రూరల్ మండలం బుడంపాడు సమీపంలో వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. అదుపు తప్పిన టిప్పర్ రోడ్డు పక్కన చింత చెట్టును ఢీకొని ఆగిపోయింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ అక్కడిక క్కడే ప్రాణాలు విడిచారు. శైలేష్ తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికులు అతడిని వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనతో బుడంపాడు- నారాకోడూరు మధ్య ట్రాఫిక్ జాం అయింది. సుమారు నాలుగు కి.మీ పొడువున భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. లారీ ఢీకొనడంతో మృతుల ద్విచక్ర వాహనంతో పాటు వ్యవసాయ పనుల కోసం వచ్చిన రైతు రోడ్డు పక్కన ఉంచిన మరో ద్విచక్రవాహనం కూడా నుజ్జునుజ్జు అయింది. ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ.. ప్రమాద విషయం తెలుసుకున్న చేబ్రోలు ఎస్ఐ డి.వినోద్‌కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఆ తర్వాత గుంటూరు సౌత్ జోన్ డీఎస్పీ నరసింహ స్థానికుల నుంచి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు. గుంటూరు రూరల్ సీఐ వై.శ్రీనివారావు లారీని అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాపట్ల మండలంలో ఉండే కొద్దిమంది దూరపు బంధువులు మినహా శ్రీరామ్ కుటుంబాని పెద్దగా చుట్టాలు లేరు. తల్లిదండ్రులిరువురూ మృతి చెందడంతో శ్రావ్య, శైలేష్ దిక్కులేనివారయ్యారు. ప్రస్తుతం శైలేష్ గుంటూరులోని ఓ ప్రభుత్వాస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నాడు. -
ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్ సీడీపీవో
శ్రీకాకుళం కలెక్టరేట్/టెక్కలి, న్యూస్‌లైన్: ఏసీబీ వలలో మరో అవినీతి చేప చిక్కింది. గత రెండు నెల ల్లో శ్రీకాకుళం టౌన్లో ట్రాఫిక్ పోలీస్ విభాగంలో ఇద్దరు కానిస్టేబుళ్లు, శ్రీకాకుళం, పాలకొండ మున్సి పల్ కమిషనర్లు ఇద్దరు అవినీతికి పాల్పడి ఏసీబీకి చిక్కారు. తాజాగా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పని చేస్తున్న కోటబొమ్మాళి సీడీపీవో కె.ఉమాదేవి లంచం తీసుకుంటూ ఏసీబీకి శుక్రవారం చిక్కారు. ఆమెతో పాటు భర్త కొండయ్యరాజు కూడా అవినీతిలో భాగస్వామ్యం కావడంతో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయంలో ఆమెకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో ఉమాదేవి అవినీతిపై ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయ నగరం సీఐలు ఆజాద్, లక్ష్మణ్‌జీ, రమేష్‌లు ఆపరేషన్ నిర్వహించారు. ఇలా పట్టుబడ్డారు కోటబొమ్మాళి ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఉన్న కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యం, పప్పు, ఇతర ఆహార పదార్థాలను స్వరాజ్మ్యాజిక్ వాహనంలో రవాణా చేసేందుకు నెలకు రూ 21,500 వంతున చెల్లించేందుకు కోటబొమ్మాళికి చెందిన తంగుడు సునీల్‌కుమార్‌తో సీడీపీవో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎనిమిది నెలలుగా ఆయన సరుకులను రవాణా చేస్తున్నారు. అయితే, అద్దెను బడ్జెట్ ఉన్నమేరకు రెండు నెలల కోసారి చెల్లించాలి. సీడీపీవో ఎనిమిది నెలలుగా అద్దె చెల్లించకుండా తిప్పుతున్నారు. దీంతో అద్దెబకాయి రూ.లక్షా 72 వేలకు చేరుకుంది. బిల్లు చెల్లించాలంటే కొంత ఖర్చు అవుతుందని చెబుతూ ఆమె వాయిదాలు వేస్తూ వచ్చారు. కార్యాలయం చుట్టూ తిరిగి విసిగిపోయిన సునీల్‌కుమార్ ఖర్చులు చెల్లిస్తానని చెప్పడంతో సీడీపీవో మొదట రూ.24 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు రూ.15 వేలకు ఒప్పందం కుదిరింది. పలుమార్లు బిల్లుల కోసం తిరిగితిరిగి విసిగిపోయిన సునీల్ ఈ నెల 19న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పథకం ప్రకారం పౌడర్ చల్లిన రూ 15 వేలును ఆయనకు ఇచ్చారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలోని విశాఖ-బి కాలనీలో ఉన్న సీడీపీవో ఉమాదేవి ఇంటికి వెళ్లి ఆయన నగదును అంద జేశారు. తీసుకున్న నగదును భద్రపరచాలంటూ ఉమాదేవి తన భర్త కొండయ్యరాజుకు అందజేసింది. ఆయన భద్రపరిచేందుకు ముందే ఏసీబీ అధికారులు ఇంట్లోకి చొరబడి కొండయ్యరాజును, ఉమాదేవిని పట్టుకున్నారు. కొండయ్యరాజు కూడా వైద్య ఆరోగ్య శాఖలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి కావడంతో ఇద్దరిపైనా కేసు నమోదుచేశారు. అక్కడి నుంచి కోటబొమ్మాళి సీడీపీవో కార్యాలయానికి వారిని తీసు కెళ్లి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సీడీపీవో పట్టుబడ్డ వార్త జిల్లా వ్యాప్తంగా దావానంలా వ్యాపిం చడంతో నియోజకవర్గంలోని ఐసీడీఎస్ సిబ్బందికి ముచ్చెమటలు పట్టాయి. ఇటీవల అంగన్వాడీలో అక్రమాలపై ‘సాక్షి’లో వరుసగా కథనాలు ప్రచురి తమైన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అవినీతి పరులు పట్టబడడంతో అందరిలోనూ ఇదే చర్చ సాగింది. ఫిర్యాదు మేరకే దాడులు సీడీపీవో అవినీతిపై వచ్చిన ఫిర్యాదు మేరకే దాడులు చేశామని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. రెండు రోజుల్లో రూపొందించిన పథకం ప్రకారం పౌడర్ చల్లిన డబ్బును సునీల్‌కుమార్ చేత పంపించామని, ఆమె తీసుకొని భర్త ద్వారా భద్రపరుస్తుండగా పట్టుకున్నట్టు వెల్లడించారు. ఏ ప్రభుత్వ శాఖలోనైనా అవినీతి, లంచగొండి తనం జరిగితే తమ దృష్టికి తేవాలని కోరారు.