Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా? | Bigg Boss 5 Telugu: Uma Devi May Be Eliminated in The Second Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎలిమినేట్‌ అయ్యేది ఆమేనా?

Published Tue, Sep 14 2021 9:27 PM | Last Updated on Wed, Sep 15 2021 1:24 PM

Bigg Boss 5 Telugu: Uma Devi May Be Eliminated in The Second Week - Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ తొలివారాన్ని దిగ్విజయంగా ముగించుకుంది. ఫస్ట్‌వీక్‌లో ఊహించని విధంగా  సరయుని బయటకు పంచించేశాడు బిగ్‌బాస్‌. అందరిని దమ్‌దబ్‌ చేస్తానని హౌస్‌లోకి వెళ్లిన సరయు.. వారం రోజులకే ఎలిమినేట్‌ అయి బయటకు వచ్చింది. అయితే ఆమె ఓట్ల ప్రకారమే ఎలిమినేట్‌ అయినప్పటికీ.. ఓట్లు ఎక్కువ వేయించాలో, తక్కువ వేయించాలో అంతా బిగ్‌బాస్‌ చేతుల్లోనే ఉంటుందనేది నమ్మలేని నిజం. తను టార్గెట్‌ చేశాడంటే చాలు.. వాళ్లు హౌస్‌ బయట ఉండాల్సిందే. అదేలా అంటారా? సింపుల్‌ ఈ వారంలో ఎవరిని బయటకు పంపించాలని బిగ్‌బాస్‌ ఫిక్స్‌ అవుతాడో.. వారిని నెగెటివ్‌ వేలో స్క్రీన్‌పై చూపిస్తాడు. లేదంటే స్క్రీన్‌ స్పెస్‌ తగ్గించి, అంతా మర్చిపోయాలా చేస్తాడు. సరయు విషయంలో కూడా అదే జరిగిందని ఆమె సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఆమె సిగరెట్ తాగడం.. కాజల్‌తో గొడవ పెట్టుకోవడం లాంటి నెగెటివ్‌ సీన్స్‌ని జనాలకి చూపించి బయటకు పంపించేశాడని చెబుతున్నారు.
 

ఇక రెండో వారం బిగ్‌బాస్‌ గురి ‘కార్తీకదీపం’ఫేమ్‌ ఉమాదేవిపై ఉన్నట్లు తెలుస్తోంది.  ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంతా అంటున్నారు. సోషల్‌ మీడియాలో సైతం ఆమెనే ఎలిమినేట్‌ అవుతుందని పోస్ట్‌లు పెడుతున్నారు.
(చదవండి: బిగ్‌బాస్‌: మద్యం సేవిస్తా, నాన్‌వెజ్‌ తింటా, ఐలవ్‌ వైన్‌ : లహరి)

దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్ ను అనే ఆమె పొగరు, మాట తీరు, నాన్ వెజ్ రచ్చ కారణంగా ఆమెతో ఇంట్లో ఎవరూ సరిగ్గా మెలగలేకపోతున్నారు. ఇక బిగ్‌బాస్‌ కూడా ఈ వారం ఆమెనే ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆమె బూతులు మాట్లాడుతున్న సీన్స్‌, గొడవలు పడిన సీన్స్‌కు ఎక్కువ స్క్రీన్‌ స్పెస్‌ ఇస్తున్నాడు. గత రెండు సీజన్‌లో కూడా కరాటే కల్యాణి, హేమల విషయంలో ఇదే జరిగింది. అయితే ఎలిమినేషన్‌కి మరో ఆరు రోజులు ఉన్నాయి కాబట్టి, ఆ లోపు ఉమ బూతులు తగ్గించుకొని, చక్కగా గేమ్‌ ఆడితే..  బిగ్‌బాస్‌ ఆమెకు పాజిటివ్‌ స్క్రీన్‌ స్పెస్‌ ఇస్తే.. లెక్కలు తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అంతా ఊహించినట్లుగా ఉమా దేవి ఎలిమినేట్‌ అవుతుందా? లేదా? తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement