
సైదాబాద్: హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్‌సదన్ డివిజన్‌లోని సుబ్రమణ్యనగర్‌లో పర్యటించారు.
ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment